చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు


చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు

చీకటి

బీమాకోరేగావ్ ఘటన నేపథ్యంలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారనే తప్పుడు ఆరోపణలతో పూణే పోలీసులు వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసిన సంగతి యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుప్రీం ఆదేశాలతో కొన్ని వారాలు గృహనిర్బంధంలో ఉన్నా.. ఆ తర్వాత కింది కోర్టులు అరెస్టులపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో విప్లవ రచయిత వరవరరావు, న్యాయవాది సుధా భరద్వాజ్, హక్కుల కార్యకర్తలు వెర్నోన్ గున్జాల్వేస్, అరుణ్ ఫెరీరాలను పూణే పోలీసులు అరెస్టు చేసి తీసుకొని వెళ్లారు.

మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని వరవరరావు ఇంటి నుంచి పూణే పోలీసులు అదుపులోనికి తీసుకునే సమయానికే ఆయన తీవ్రమైన వ్యాదులతో బాధపడుతున్నారు. పోలీసు కస్టడీకి వెళ్లడానికి రెండు రోజుల ముందు ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఈ సమయంలో జైలులో ఉండటం మంచిది కాదు మీరు హాస్పిటల్‌లో జాయిన్ అవమని వీవీకి సలహా కూడా ఇచ్చారు. కాని ఆయన జైలుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు.

పూణే పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి పూణే లోని సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత ఆయనను జైలుకు తరలించి ఇరుకు గదిలో ఒంటరిగా ఉంచారు. అయితే ఎలాంటి గాలి సోకని ప్రదేశంలో అప్పటికే ఆస్తమా పేషెంట్ అయిన వీవీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరికూడా కష్టంగా తీసుకునే పరిస్థితి ఎదురైంది. దీంతో పోలీసులు వెంటనే పూణేలోని సస్సోన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అరెస్టుకు ముందు ఆసుపత్రికి వెళ్లమని చెప్పినా.. నా కంటే తీవ్రమైన వ్యాదులతో బాధపడుతూ.. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబానే జైలులో ఉండగా లేనిది నేనెందుకు ఆసుపత్రిలో ఉండాలని వ్యాఖ్యానించారు.

రాజ్యం ఎన్ని హింసలు పెడుతున్న పీడిత ప్రజల పక్షాన ఉన్న వీవీ.. తన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని తెలిసినా జైలుకే వెళ్లడానికి మొగ్గు చూపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. పోరాటాలు చేసే వాళ్లు జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉండాలనే సందేశం ప్రజల్లోకి వెళ్లింది.

Keywords : varavararao, vv, arrest, pune police, breathing problem, వరవరరావు, పూణే పోలీసు, జైలు, ఇరుకు గది,
(2019-08-22 17:11:48)



No. of visitors : 1139

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


చీకటి