పుణెలో రెండు రోజులు


పుణెలో రెండు రోజులు

పుణెలో

వారంరోజుల పోలీసు కస్టడీ తర్వాత సోమవార‍ం పోలీసులు (26వ తేదీ) నాడు విప్లవరచయిత వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెజ్, అరుణ్ ఫరేరాలను పూణే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ సందర్భంగా వరవరరావును కలవడానికి పూణే వెళ్ళిన వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై రాసినది మీకోసం...

మిత్రులారా, నవంబర్ 17న వరవరరావుగారిని అరెస్టు చేసి (నిజానికది చట్టబద్ధమైన ʹఅరెస్టుʹ కూడ కాదు, వారంట్ లేకుండా, వారంట్ అవసరమే లేదని బహిరంగంగా చెప్పారు గనుక అది ఎత్తుకుపోవడం మాత్రమే) తీసుకు పోతున్నప్పుడు, పుణె పోలీసు అధికారి ʹఏం కంగారు పడకండి, మేం జాగ్రత్తగా చూసుకుంటాం, మీరు కస్టడీలో కూడ కలవవచ్చుʹ అని ఏదో దయ తలుస్తున్నట్టు అన్నాడు. అప్పటికి వివి తమ అదుపులోనే లేరు, పోలీసు కస్టడీకి తీసుకోవాలంటే జడ్జి ముందర మొదట పోలీసులు అప్లికేషన్ పెట్టాలి, దాని మీద వాదనలు జరగాలి, ఆ వాదనల తర్వాత జడ్జి నిర్ణయం ప్రకటించాలి – ఈ ప్రక్రియ అంతా ఏమీ లేకుండానే జడ్జి నిర్ణయాన్ని పోలీసు అధికారే ప్రకటించాడన్నమాట! వివిని తమ కస్టడీలోకి తీసుకోబోతున్నట్టు జోస్యం చెప్పాడన్నమాట! నిజంగానే వరవరరావు తరఫు న్యాయవాది వాదనలన్నిటినీ పెడచెవిన పెట్టి జడ్జి వారం రోజుల పోలీసు కస్టడీ అనుమతించారు. కోర్టు అనుమతితో అలా పోలీసు కస్టడీలో ఉన్నవారికి తమ న్యాయవాదిని పక్కన ఉంచుకునే హక్కు, ఏ ప్రశ్నకూ జవాబు చెప్పకుండా మౌనంగా ఉండే హక్కుతో పాటు కుటుంబ సభ్యులను కలిసే హక్కు కూడ ఉంటుంది. కాని ఆ పోలీసు అధికారి అదేదో తాను దయతో మెహర్బానీ చేస్తున్నట్టు అన్నాడు.

పోలీసు కస్టడీ ఆదివారానికి ముగిసి, సోమవారం నాడు మళ్లీ కోర్టుకు తీసుకువస్తారు గనుక ఆదివారం నాడు కస్టడీలో, సోమవారం నాడు కోర్టులో వివిని కలవవచ్చునని అక్కయ్య (వివి సహచరి హేమలత), డా. ఉదయ (వివి మనుమరాలు), నేను పుణె వెళ్లాం.

ఆదివారం మధ్యాహ్నం ఒక గంటకు పైగా కస్టడీలోనూ, సోమవారం సాయంత్రం మరొక గంటకు పైగా కోర్టులోనూ వివిని కలుసుకున్నాం. కోర్టులో ఇంకొక మూడు, నాలుగు గంటల పాటు వాదనలు జరుగుతుండగా, నిందితుల బోనులో కూచున్న వివి, సురేంద్ర గాడ్లింగ్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెజ్, అరుణ్ ఫరేరాలను కలిశాం.

వరవరరావు గారి ఆరోగ్యం బాగుంది. మొదటిరోజు లాకప్ లో గాలి సరిగ్గా ఆడక, బిపి పెరిగింది గనుక వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారట. మర్నాటి నుంచి ఆ సమస్య లేదు. ఉపాహారం, భోజనం, చాయ్, నిద్ర వంటి సౌకర్యాలు బాగానే ఉన్నాయట. కాకపోతే, ప్రశ్నల వేధింపు వల్ల అలసట, ఒత్తిడి వల్ల రోజూ బిపి ఎక్కువగానే నమోదయిందట. ఆ వారం రోజుల్లోనూ తనకున్న మౌనంగా ఉండే హక్కు, సమాధానాలు నిరాకరించే హక్కులను వినియోగించుకుంటున్నానని చెప్పి వివి ఎక్కువసేపు మౌనంగానే ఉన్నారట.

సోమవారం ఈ కేసును విచారిస్తున్న జడ్జి కెడి వడనె ముందుకు మొదట తన బెయిల్ పిటిషన్ వాదించుకోవడానికి సురేంద్ర గాడ్లింగ్ ను తీసుకొచ్చారు. పన్నెండున్నర నుంచి రెండింటి దాకా దాదాపు గంట, గంటన్నర సురేంద్ర చేసిన వాదన వినడం ఒక అద్భుతం. చట్టబద్ధమైన అంశాలు, తర్కం, రాజకీయావగాహన, విశ్లేషణ, హాస్యం, దర్యాప్తు అధికారి మీద ఎత్తిపొడుపులు రంగరించి సురేంద్ర చేసిన ఆ వాదన నాకు కన్నబిరాన్ గారి వాదనలను గుర్తు తెచ్చింది. ఏమాత్రం కనీస ఆలోచనాశక్తి ఉన్నా ఆ వాదనల వెల్లువను, న్యాయబద్ధతను అంగీకరించవలసిందే. భోజన విరామ సమయం గడిచిపోయినా ఆ వాదన ముగియకపోవడంతో, జడ్జి దాన్ని వాయిదావేసి, భోజన విరామం ప్రకటించాడు.

విరామం తర్వాత, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెజ్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద చార్జి షీట్ వేయడానికి మరొక మూడు నెలల గడువు కావాలని కోరుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వలా పవార్ ఒక గంటపాటు తన వాదన వినిపించారు. ఎల్గార్ పరిషద్ నాటి నుంచీ, ముఖ్యంగా జూన్ నుంచీ పోలీసులు చెపుతూ వస్తున్న అబద్ధాలనే మరొకసారి వల్లెవేస్తూ, తమ దర్యాప్తు అధికారి ఎంత కష్టపడుతున్నాడో, ఇంకా దర్యాప్తు చేయవలసినవి ఎన్ని ఉన్నాయో చెపుతూ, కొత్త చార్జిషీట్ సమర్పించడానికి మూడు నెలలు వ్యవధి కావాలని ఆమె కోరారు.

తర్వాత ఆమె వాదనలను తుత్తునియలు చేస్తూ నలుగురు న్యాయవాదులు చేసిన వాదనల గురించి ఎంత రాసినా తక్కువే. విని తీరవలసిందే. వరవరరావు తరఫున రోహణ్ నహర్, వర్నన్ గోంజాల్వెస్ తరఫున రాహుల్ దేశముఖ్, సుధా భరద్వాజ్ తరఫున రాగిణి అహుజా, అరుణ్ ఫరేరా తానే స్వయంగా వాదనలు వినిపించారు. 90 రోజుల అదనపు వ్యవధి కోరుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన అభ్యర్థనలోని అసంగతాలు, చట్టవ్యతిరేక అంశాలు, అబద్ధాలు, ద్వంద్వప్రమాణాలు, పొసగని అంశాలు ఒక్కొక్కరూ ఒక్కొక్కటీ ఇంగ్లిష్ లోనూ, మరాఠీలోనూ అనర్గళంగా వివరిస్తుంటే ఈ రాజ్య దుర్మార్గం, అబద్ధం ప్రతి పదంలోనూ ప్రతి వాక్యంలోనూ బట్టబయలయ్యాయి. సత్యానికి ఉండే బలం మరొకసారి స్పష్టమైంది.

ఇలా మూడు గంటల పాటు వాదనలు జరిగిన తర్వాత, తన తీర్పు మరొక గంటన్నర తర్వాత ఎనిమిదింటికి వినిపిస్తానని జడ్జి బెంచి దిగిపోయారు. అప్పటికే అక్కడ ఉన్న నిందితుల కుటుంబ సభ్యులం వారితో మాట్లాడడానికి అనుమతించాలని కోరాం. అలా మరొక గంట, గంటన్నర మాట్లాడుకోవడానికి అవకాశం దొరికింది. చివరికి తాను చెప్పిన సమయానికి పావుగంట ముందే బెంచి మీదికి వచ్చిన జడ్జి, ʹచార్జిషీట్ సమర్పించడానికి ప్రాసిక్యూషన్ కు మరొక తొంబై రోజులు అనుమతిస్తున్నానుʹ అని ఏకవాక్య తీర్పు ప్రకటించి మళ్లీ దిగిపోయారు!

- ఎన్.వేణుగోపాల్

Keywords : varavararao, sudha bharadvaj, surendra gadling, arun ferrare, pune, police, maoists
(2019-06-17 19:17:28)



No. of visitors : 660

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

Search Engine

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
more..


పుణెలో