మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి


మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి

మావోయిస్టు

సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల లక్ష్మణ్ రావు) పదవీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియరైన బసవరాజు (నంబాళ్ల కేశవరావు)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు మావోయిస్టు​ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన గణపతి వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర కమిటీ తెలిపింది. నవంబర్ 10 వతేదీన విడుదల చేసిన ఈ లేఖ ఈ రోజు మీడియాకు చేరింది.

అభయ్ మీడియాకు పంపిన లేఖ పూర్తి పాఠం

సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గణపతి తన బాధ్యతల నుండి స్వచ్ఛందంగావిరమించుకోవడంతో,

కామ్రేడ్ బసవరాజును నూతన ప్రధానకార్యదర్శిగా కేంద్రకమిటీ ఎన్నుకొన్నది

కామ్రేడ్ గణపతి గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతున్న తన అనారోగ్య పరిస్థితినీ, పెరిగిన వయసును దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, కేంద్రకమిటీని మరింత పటిష్టం చేసే లక్షాన్ని కలిగి ఉంటూ ముందుచూపుతో తాను ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి స్వచ్ఛందంగా విరమించుకొని తన స్థానంలో మరొక కామ్రేడ్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని చేసిన ప్రతిపాదనపై కేంద్రకమిటీ 5వ సమావేశం క్షుణ్ణంగా చర్చించింది. ఆయన స్థానంలో కామ్రేడ్ బసవరాజు (నంబళ్ళ‌ కేశవరావు)ను నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నది.

1992 జూన్లో కామ్రేడ్ గణపతి సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యారు. అప్పడు పార్టీకి అది చాలా కష్టకాలమనే చెప్పుకోవాలి. 1991 నాటికి ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం పార్టీ పైన రెండో వరుస దమనకాండను ప్రారంభించింది. ఆ సమయంలో సాయుధ పోరాటాన్ని పురోగమింపజేయడానికి చేపట్టాల్సిన ఎత్తుగడలకు సంబంధించిన పలు సవాళ్లను పార్టీ ఎదుర్కొంటున్నది. పార్టీ ఎదుర్కొంటున్న ఆ సవాళ్లను, అప్పటి కేంద్రకమిటీకి కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య తన కమిటీకి నాయకత్వం వహిస్తూ పరిష్కరించగలిగే పరిస్థితిలో లేడు అటువంటి పరిస్థితుల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను మొత్తం పార్టీ కేడర్ల పైనా, ప్రజల పైనా ఆధారపడి పరిష్కరించడానికి బదులు, కొండపల్లి సీతారామయ్యతో పాటు మరొక కేంద్ర కమిటీ సభ్యుడు కుట్ర పద్ధతులు అనుసరించి పార్టీలో అంతర్గత సంక్షోభానికి కారణమైనారు. ఆ అవకాశవాద ముఠా పార్టీని చీల్చడానికి చేసిన ప్రయత్నాలను ఓడించేందుకు చేసిన సూత్రబద్ధ పోరాటంలో కొద్ది మంది అవకాశవాదులు మినహా మొత్తం పార్టీ సమైక్యంగా నిలబడింది. ఆ సందర్భంగా కేంద్రకమిటీలోని యువ నాయకత్వం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన పద్ధతులు, మొత్తం పార్టీకి మంచి ఎడ్యుకేషన్ కేంపెయిన్ లా ఉపకరించాయి. పార్టీ పని శైలిని సరిదిద్దాయి. మొత్తం పార్టీ సిద్ధాంత, రాజకీయ స్థాయినీ పెంపొందించాయి. ముఖ్యంగా కేంద్రకమిటీలో సమష్టి నాయకత్వాన్ని, టీం ఫంక్షనింగ్ ని అభివృద్ధి చేశాయి. కేంద్రకమిటీలోని విప్లవ నాయకత్వం చేపట్టిన ఆ మొత్తం కృషిలో కామేడ్ గణపతి ముందు పీఠిన‌ నిలిచి కీలకమైన పాత్ర పోషించాడు. ఆ క్రమంలో పార్టీ మొత్తం ఒక తాటిపై నిలబడి, కుట్రదారులను ఓడించి, తాను ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి లోబడి ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ పరిస్థితులలోనే సమిష్టి నాయకత్వంగా ఎదిగిన కేంద్రకమిటీకి, కామ్రేడ్ గణపతి, నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు.

1995లో అఖిల భారత ప్రత్యేక మహాసభ జరిపి పార్టీ పంథాను సంపద్వంతం చేసుకున్నాము. ఆ మహాసభ మాతన కేంద్రకమిటీని ఎన్నుకొన్నది. నూతనంగా ఎన్నికైన కేద్రకమిటీ కామ్రేడ్ గణపతిని తిరిగి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నది. 1998 ఆగస్టులో సీపీఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) సీపీఐ (ఎంఎల్) పార్టీ యూనిటీ విలీనమై నూతనంగా సీపీఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) గా ఆవిర్భవించింది. ఈ పరిణామంతో పార్టీ అనేక రాష్ట్రాలకు విస్తరించి అఖిల భారత స్వభావాన్ని మరింత సంతరించుకొంది. ఆ సందర్భంగా ఏర్పడిన నూతన కేంద్రకమిటీకి కూడా కామేడ్ గణపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నది. 2000 డిసెంబర్ 2 నాటికి మిలటరీ పంధాను అభివృద్ధి చేసుకొని ప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని నిర్మించుకొన్నాము. 2001లో జరిగిన మునుపటి సీపీఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) 9వ‌ కాంగ్రెస్.. పార్టీ రాజకీయ, సైనిక, నిర్మాణ పంథాను మరింత సంపద్వంతం చేసింది. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు దీర్ఘకాల ప్రజాయుదాన్ని అన్వయించడంలో భాగంగా ఆ మహాసభ గెరిల్లాబేస్ ల‌ నిర్మాణం వంటి పనులు చేసింది. సీఎంసీ నాయకత్వ కింద‌ ప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని నిర్మించడంతో పాటు, ప్రజాయుద్ధానికి, రాజ్యాధికారానికి మధ్య గల సంబంధాన్ని పార్టీ నొక్కి చెప్పింది. ఆ సందర్భంగా ఏర్పడిన‌ నూతన కేంద్రకమిటీ కూడా కామ్రేడ్ గణ‌పతినే మరోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నది.

2004 సెప్టెంబర్ 21న సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇడియా (ఎంసీసీఐ)లు విలీనమై సీపీఐ (మావోయిస్టు) ఏర్పడింది. సంపద్వంతమైన సైద్ధాంతిక, రాజకీయ పంథాపై ఆధాపడి జరిగిన ఈ విలీనంతో భారత విప్లవోద్యమం ఒక గొప్ప గెంతు సాధించింది. ఈ పరిణామం భారత విప్లవోద్యమ చరిత్రలోనే ఒక మైలురాయి వంటిది. ఈ పరిణామం పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు విస్త‌రింపజేసింది. రెండు పార్టీలకు చెందిన గెరిల్లా సైన్యాలు విలీనమై బలమైన ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంగా ఏర్పడింది. 2004 నాటికి దేశంలో చిన్న చిన్న పాయలుగా ఉన్న అనేక గ్రూపులు, వ్యక్తులు రెండు ప్రధాన విప్లవ స్రవంతులుగా ఉన్న ఎంసీసీ, సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ లో విలీనమైనాయి. ఈ రెండు ప్రధాన ప్రవాహాలు విలీనమై సీపీఐ (మావోయిస్టు) పార్టీగా - ఒక గొప్ప మహా స్రవంతిగా మారింది. ఇలా ఏర్పడిన సీపీఐ మావోయిస్టు పార్టీలో ఎంతో అనుభవం కలిగిన అనేక కీలకమైన బాధ్యతలు చేపట్టిన, నక్సల్బరీ తరం నాయకులు కూడా ఉన్నారు. అటువంటి నాయకులు, శ్రేణులు కలిగిన పార్టీ కేంద్రకమిటీ, కామ్రేడ్ గణపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నది. 2007లో జరిగిన ఐక్యతా కాంగ్రెస్, 9వ‌ కాంగ్రెస్ సందర్భంగా కూడా కేంద్రకమిటీ ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నది. ఐక్యతా కాంగ్రెస్‍, 9కాంగ్రెస్ అనంతరం, కేంద్రకమిటీ నాయకత్వంలో ఉద్యమం మరింత నూతన ఎత్తులకు ఎదిగింది. ఈ అభివృద్ధి క్రమంలోనే, 2018 చివరికి, సీపీఐ (ఎంఎల్) (నక్సల్బరీ), సీపీఐ (మావోయిస్టు) విలీనం కావడంతో భారతదేశ విప్లవ పార్టీల ఏకీకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయిందని చెప్పవచ్చు.

1992 నుండి 2017 వరకు 25 సంవత్సరాల పాటు కామ్రేడ్ గణపతి కార్యదర్శి బాధ్యతలు నిర్వహించిన కాలమంతా ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేంద్ర నాయకత్వంలో పురోగమించింది, ఉద్భతమైన వర్గ పోరాటంలో పార్టీ రాటుదేలింది. శత్రువు చేపట్టిన ప్రతీఘాతుక విప్లవ దాడిని ఓడించేందుకు విప్లవ శ్రేణులకూ, విప్లవ ప్రజానీకానికి దృఢమైన కార్మికవర్గ నాయకత్వాన్ని అందించింది. కామ్రేడ్ గణపతి ఈ క్రమంలో పెరుగుతున్న తన అనారోగ్య సమస్యలను గుర్తించి, తద్వారా, పెరుగుతున్న, వయసు రీత్యా ఏర్పడుతున్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగి, కేంద్రకమిటీని మరింతగా పటిష్టం చేసే లక్ష్యంతో ఎప్పటిలాగే తన పూర్తి శక్తి సమర్ధతలను కేంద్రకమిటీతో పాటు మొత్తం పార్టీ అభివృద్ధి కోసం వెచ్చించేందుకు సిద్ధపడినాడు. దీంతో ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ బసవరాజు (నంబాళ్ళ‌ కేశవరావు)ను కేంద్రకమిటీ ఎన్నుకొంది, కామ్రేడ్ బసవరాజు మూడున్నర దశాబ్దాలకు పైగా పార్టీలో ముందుపీఠిన‌ నిలిచి వివిధ పార్టీ కమిటీల కార్యదర్శిగా, 27 యేండ్లకు పైగా కేంద్రకమిటీ సభ్యుడిగా, గత 18 యేండ్ల నుండి పొలిట్ బ్యూరో సభ్యుడిగా విజయవంతంగా నాయకత్వాన్ని అందించాడు. ముఖ్యంగా సైనిక రంగంలో కేంద్ర సైనిక కమీషన్ ఇన్ చార్జిగా ఉంటూ ప్రజాయుద్ధ పురోగమనంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా నిర్దిష్టంగా చెప్పుకోవాలంటే 1992 తర్వాత సనుష్టి నాయకత్వంగా ఎదిగిన కేంద్రకమిటీలో ఒక ముఖ్యుడుగా ఉంటూ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు.

పార్టీ కేంద్రకమిటీలో జరిగిన ఈ మార్పులు మొత్తం పార్టీ అభివృద్ధి క్రమంలో జరిగినవే, ఈ మార్పులు కేంద్రకమిటీకి మరింత శక్తినిస్తాయి. కేంద్రకమిటీ, పార్టీ నిర్మాణ సూత్రమైన కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్నీ, స్వయం విమర్శ-విమర్శ సూత్రాలను అమలు చేయడంలో ఏమాత్రం పట్టు సడలకుండా, దృఢంగా అమలు చేస్తూ సమష్టి నాయకత్వాన్నీ, కేంద్రీకృత నాయకత్వాన్నీ మొత్తం పార్టీ శ్రేణులకు, విప్లవ ప్రజానీకానికి అందిస్తుందనీ, శత్రువు ఫాసిస్టు తరహాలో, సమాధాన్ʹ పేరుతో నేడు చేపట్టిన వ్యూహాత్మక విప్లవ ప్రతీఘాతుక దాడిని ప్రజా పంథా, వర్గ పంథాపై ఆధారపడి ప్రజలను ప్రజా యుద్ధంలో సమీకరించి, ఓడించి. దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికి కార్మికవర్గ అగ్రగామిగా నిలిచి నాయకత్వం వహిస్తుందనీ యావత్ విప్లవ పార్టీ శ్రేణులకు, విప్లవ ప్రజానీకానికి కేంద్రకమిటీ హామీ ఇస్తున్నది

అభయ్ ,

అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిష్టు పార్టీ (మావోయిస్టు)


Keywords : గణపతి, బసవరాజ్, నంబళ్ళ కేశవరావు, maoists, ganapathi, basaraj, namballa keshavarao
(2019-04-19 23:36:29)No. of visitors : 1258

Suggested Posts


A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home Minister

When I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force....

జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ

మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని

జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖ

ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.....

మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు.

మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !

ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మున్నా స్మార‌కార్థం కుటుంబ స‌భ్యులు ప్ర‌కాశం జిల్లా ఆల‌కూర‌పాడులో నిర్మించిన స్తూపాన్ని తొల‌గించాలంటూ కొంది మందిని డ‌బ్బులు తీసుకొచ్చిన జ‌నాల‌తో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, టంగుటూరు త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చారు. మావోయిస్టులు హింస‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ద పోరాటంలో ప్రాణాలు కోల్

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

విప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము.

రాజుకుంటున్న మన్యం

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంది. ʹదేశ ఖనిజ సంపదను విదేశాలకు దోచి పెట్టే ఏ చర్యలను మేం ఒప్పుకోబోంʹ అంటూ ప్రకటించిన మావోయిస్టు పార్టీ బాక్సైట్ పోరాటాన్ని ఉదృతం చేసింది. మన్యం ప్రాంతంలో సభలు, సమావేశాలు....

ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

దోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు...

37 మంది మావోయిస్టులను విషంపెట్టి చంపారా ?

ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర విప్లవోధ్యమంపై కక్షగట్టిన కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి ఒడిగట్టాయని

Search Engine

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం
పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
అతడు ఓటేయలేదు..!
ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
more..


మావోయిస్టు