ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ


ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ

ʹఅఖ్లక్

బులంద్‌షహర్ రణరంగంగా మారింది. హిందుత్వ గూండాలు సృష్టించిన ఆగడాలతో ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్ మృతి చెందాడు. ఈ ఘటనపై చనిపోయిన పోలీసు అధికారి సుబోధ్ సోదరి పలు విషయాలు వెల్లడించారు. గోవధ చేశాడనే నెపంతో 2015లో అఖ్లక్ అనే ముస్లిం వ్యక్తిని హిందత్వ మూకలు హత్య చేశాయి. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేసింది మా సోదరుడు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ అని ఆమె స్పష్టం చేశారు. తన సోదరుడిని హిందుత్వ గూండాలే కావాలని హత్య చేశారని.. అఖ్లక్ హత్యను దర్యాప్తు చేసినందుకు పర్యవసానంగా ప్రతీకార హత్య చేశారని అతని సోదరి ఆరోపిస్తోంది. తమకు ఉద్యోగాలు, డబ్బులు కాదు కావల్సింది.. న్యాయం జరగాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను డిమాండ్ చేసింది.

సుబోధ్ హత్య జరిగిన తీరు చూస్తుంటేనే తాను చేసిన ఆరోపణలు అక్షర సత్యమని ఆమె చెబుతోంది. తొలుత బులంద్‌షహర్‌లో గోవధ జరిగిందనే వదంతులు వ్యాపించాయి. ఆ తర్వాత కొంత మంది పోలీసు ఔట్‌పోస్టుపై దాడి చేయడం ఆ తర్వాత సుబోధ్ కొంత మంది సిబ్బందితో అక్కడకు చేరుకోవడం జరిగిందని ఆమె అన్నారు. అక్కడ ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఆందోళనకారులు వైపు నుంచి ఒక తూటా వచ్చి సుబోధ్‌కు తగిలింది. ఆయనను అక్కడి నుంచి వ్యానులో ఆసుపత్రికి తరలించాలని చూస్తే.. వారిపై హిందూ ముఠాలు రాళ్లు రువ్వాయని.. అంతే కాకుండా కర్రలతో గాయపడిని సుబోధ్‌పై దాడి చేయడంతోనే తన సోదరుడు మృతి చెందాడని ఆమె స్పష్టం చేశారు.

అవును బీజేపీ ప్రభుత్వ హయాంలో హిందుత్వ గూండాల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ముఖ్యంగా గోరక్షణ పేరిట వారు సాగిస్తున్న దమనకాండ దేశ అస్థిత్వానికే ప్రమాదకంరగా మారింది. వదంతులు సృష్టించి.. సామూహిక అల్లర్లకు ప్రేరేపించడం హిందూ సంస్థలైన ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్ దల్ వంటి వాటకి పరిపాటిగా మారింది. గతంలో అఖ్లక్ హత్య కూడా ఇలాగే జరిగింది. ఇంటిలో లభ్యమైన మాంసం గోవుదే అని ఆరోపిస్తూ హిందూ గూండాలు విచక్షణా రహితంగా చితకబాదారు. అతను కాదని ఎంత వాదించినా వారు దాడి ఆపలేదు. దీంతో అఖ్లక్ మరణించాడు. ఇవాళ అఖ్లక్ కేసును దర్యాప్తు చేసిన అధికారిని హత్య చేశారంటే.. వీరి ఆగడాలు ఎక్కడ బయటపెడతాడనే అనుమానంతో అని తెలుస్తోంది. ఆనాడు అఖ్లక్ గోవద చేశాడంటు పిర్యాదు చేసిన భజరంగ్‌దల్ సంస్థకు చెందిన సభ్యులే నిన్నటి సుబోధ్ హత్యలో నిందుతులు కావడం గమనార్హం.

Images Courtesy : BBC Telugu News and ANI

Keywords : bulandhshahar, greater noida, akhlakh, gorakshakh, rss, bjp, inspector subodh, murder, lynching, బులంద్‌షహర్, అఖ్లక్, సుబోధ్, హత్య, హిందుత్వవాదులు
(2019-08-21 15:34:33)No. of visitors : 323

Suggested Posts


0 results

Search Engine

పోలీసుల దుర్మార్గం - వింటేనే ఒళ్లు జ‌ల‌ద‌రించే చిత్ర‌హింస‌లు
కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
more..


ʹఅఖ్లక్