దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు


దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు

ఆమె ఒక యూపీఎస్‌సీ పరీక్షల్లో 125వ ర్యాంకు తెచ్చుకొని ఐపీఎస్‌గా ఎంపికైన యువ పోలీసు అధికారి. ఖాకీ చొక్కా తనపైకి వచ్చిందో లేదో దళితులు, ముస్లింల పట్ల తన ప్రవర్తన కౄరంగా మారిపోయింది. ఇది ఆమె స్వయంగా చెబుతుండగా ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్‌గావ్ ఏఎస్పీగా పని చేస్తున్న భాగ్యశ్రీ నవ్‌టకే దళితులపై కించపరిచేలా మాట్లాడింది. మరాఠీ భాషలో ఒక వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్న ఆ వీడియోలో ఇలా ఉంది. నిన్ను నేను ఒక నాలుగైదు సార్లే కొట్టాను. అదే దళితులనైతే ఏం చేస్తానో తెలుసా..? కాళ్లు చేతులు కట్టేసి చితక్కొడతాను అన్నది. అంతే కాదు ఎస్సీ, ఎస్టీలపై తప్పుడు కేసులు బనాయించి కొడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాను గతంలో 21 మంది దళితులపై తప్పుడు కేసులు నమోదు చేసి కొట్టానని.. ముస్లింలను కూడా తాను చావబాదినట్లు గొప్పగా చెప్పుకుంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెను ఔరంగాబాద్ బదిలీ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తన సర్వీసు ప్రారంభంలోనే ఇలా దళితులు, మైనార్టీలపై అకారణ దాడులు చేస్తున్న ఈ యువ ఐపీఎస్.. రానున్న రోజుల్లో ఇంకెన్ని అరాచకాలు చేస్తుందో మరి.


Keywords : ips,beed, maharastra, bhagyasri navtake, sc st, dalits, viral video, ఐపీఎస్, భాగ్యశ్రీ నవ్‌టకే, ఎస్సీ ఎస్టీ, దళితులు
(2018-12-16 08:03:07)



No. of visitors : 609

Suggested Posts


0 results

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


దళితులపై