మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3


మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3

మావోయిస్టు

ఇంటర్యూ పార్ట్ - 3

16. విప్లవ ప్రజాకమిటీల ద్వారా ఏర్పడే ప్రజల రాజ్యాధికారం ఏ విధంగా ఉంటుంది?

ఇది జనతా ప్రజాస్వామిక రాజ్యాంగం పునాదిపైన ఏర్పడి, దానికి అనుగుణంగా అన్ని స్థాయిలలో ప్రజల పరిపాలనా కౌన్సిల్స్‌ ఏర్పాటు చేస్తుంది. ఎన్నికయ్యే ప్రతినిధులను వెనక్కిపిలిచే అధికారంతో సహా రాజ్యాధికారంపై ప్రజలకు పూర్తి నియంత్రణ ఉంటుంది. దేశంలోని ఎవరిపట్ల తెగ, కుల, మత, జాతి, లింగ, భాష, ప్రాంతాల పరంగా, విద్య, పదవి, హోదాలపరంగా రాజ్యం వివక్ష చూపదు. కార్మికవర్గ నాయకత్వంలో జనతా ప్రజాస్వామిక నియంతృత్వం క్రింద సోషలిజానికి మారే పరిణామ క్రమంలో ఉండే సమాజపు ఆర్థిక వ్యవస్థ ఇది.

విశాల శ్రామిక ప్రజానీకపు అన్ని రకాల స్వేచ్ఛలకు, హక్కులకు, ప్రజాస్వామ్యానికి జనతా ప్రజాస్వామిక ప్రభుత్వం హామీ ఇస్తుంది. అన్ని సమయాల్లోను ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. అన్ని రకాల వివక్షతలను రద్దు చేయడానికి, పితృస్వామ్యాన్ని, పురుషాధిక్యతను అంతం చేయడానికి పూనుకుంటుంది. కార్మికులందరికీ సామాజిక భద్రతను, సురక్షితమైన పనిపరిస్థితులను, కనీస సౌకర్యాలను కల్పిస్తుంది. జనతన సర్కార్‌ ఏర్పడినచోట అందరికి భూమి, ఇల్లు, కనీస ఉపాధికి గ్యారంటీ ఏర్పరుస్తుంది. విద్య, వైద్యం, అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రజల భాష, సంస్కృతుల వికాసానికి తోడ్పడుతున్నది. ప్రజలకు చెందిన ప్రకృతి సహజ వనరుల పరిరక్షణకు బాధ్యతపడుతుంది.

యావత్తు విప్లవ కాలంలోనూ ప్రజలను ప్రజా సైన్యంలో చేరడానికి ప్రత్యేకంగా ఉత్సాహవంతులను చేస్తూ ప్రోత్సహిస్తుంది. ప్రజా సైన్యానికి అవసరమైన వనరుల పట్ల ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.

భారతదేశంలో ఇప్పటిదాకా ఏర్పడ్డ రాజ్యాధికారాలన్నిటితో పోలిస్తే ఈ విప్లవ ప్రజాకౌన్సిళ్లు, వాటి ఆర్‌పీసీలు అత్యున్నతమైన, నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థలు. ఇవి నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో, తమ ప్రాంతమంతటా కార్మికవర్గ నాయకత్వంలో కార్మిక-కర్షక మైత్రి పునాదిగా సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వ్యతిరేక శక్తులన్నిటి ఉమ్మడి నియంతృత్వాన్ని స్థాపించే దిశగా పనిచేస్తాయి.

17. అసలు ఏది ప్రజా ప్రభుత్వం? ప్రజా ప్రభుత్వం ఏం చేయాలి?

ఎవరి శ్రమ వల్ల సమాజ చలనానికి వీలు కలుగుతుందో, సమాజ సంపద పోగుపడడానికి అవకాశం వస్తుందో వారే ప్రజలు. ఇతరుల శ్రమ ఫలితాన్ని అనుభవించేవారు ప్రజలు కాజాలరు. శ్రామికులకు ఓటు హక్కు ఇచ్చినప్పటికీ వారి నిజమైన ప్రతినిధులు అధికారానికి వచ్చే అవకాశం ఈ వ్యవస్థలో లేనందువల్ల అలా ఏర్పడేవి ప్రజా ప్రభుత్వాలు కాజాలవు. బూటకపు ఎన్నికల ద్వారా మౌలిక మార్పులు రావు. మౌలిక సమస్యలు పరిష్కారం కావు. ఇవి ప్రజా ప్రభుత్వాలు కాజాలవు.

తెలంగాణలో సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమంల గురించి, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, వికేంద్రీకరణలను ఆకాంక్షించేవారు. శ్రమను గౌరవించడం, పని పరిస్థితులు మెరుగుపరచడం, శ్రమకు తగ్గ ఫలితాన్నివ్వడం, జీవన ప్రమాణాలు అభివృద్ధి పరచడం. వ్యవసాయానికి అవసరమైన వసతులు కల్పించడం, సాగునీరు విద్యుత్‌ విత్తనాలు ఎరువులు అందుబాటులోకి తేవడం, కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం, రుణమాఫీ, ప్రైవేటు రుణాలపై నియంత్రణ, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాల పంపిణీ, కార్మిక హక్కులను కాపాడడం, రక్షణ చట్టాలు అమలు చేయడం, వలస కార్మికులకు రక్షణ కల్పించడం. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడడం, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించడం, భూసంస్కరణలు అమలు చేయడం, పేదలకు భూములు ఇవ్వడం లాంటివి చేయాలి.

ప్రజలు పోరాడి సాధించుకున్న భూములకు వారికే పట్టాలివ్వాలి. పోడుహక్కు గుర్తించి పట్టాలివ్వాలి. అన్యాక్రాంతమైన భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాలి. కార్పొరేట్లకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవాలి. కుల అణచివేతను అరికట్టాలి. అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించి అసమానతలను రూపుమాపాలి. అంటరాని తనం, వివక్షతను పోగొట్టాలి. కుల దురహంకారాన్ని రూపుమాపాలి. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. పరువుహత్యలను ఖండించాలి. మాన్యువల్‌ స్కా వెంజింగ్‌ (పాకీపని) నిషేధించాలి. రిజర్వేషన్లు సరిగా అమలు చేయాలి. ఆదివాసుల హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు జరిగేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలి. పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలి. చేతి వృత్తులకు రక్షణ కల్పించాలి. ప్రత్యేక నిధులు కేటాయించాలి. వికలాంగులకు ప్రత్యేక చట్టం, హక్కుల పరిరక్షణ, గౌరవ ప్రదమైన జీవితం అందించాలి.

మహిళల హక్కుల పరిరక్షణ, అత్యాచారాలు, వరకట్న హత్యలు, పితృస్వామిక అణచివేతలను అరికట్టాలి. సమాన హక్కులు కల్పించాలి. మహిళా సాధికారితకు తోడ్పాటునివ్వాలి. మైనారిటీలకు రక్షణ కల్పించాలి. మత సామరస్యానికి కృషి చేయాలి. సబార్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలి. బాలల హక్కుల పరిరక్షణ, ఉచిత విద్య నందించడం. అనాధ బాలలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. ప్రజల సంక్షేమం-ఉచిత విద్య, వైద్యం- అందించాలి. కార్పొరేట్‌ విద్య, వైద్యాలను వ్యతిరేకించాలి. యువతకు ఉద్యోగాలు కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. రాజకీయ వికేంద్రీకరణ జరగాలి. పరిపాలనలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలి. స్థానిక సంస్థల అధికారాలు పెంచాలి. మహిళలకు, దళితులకు, ఆదివాసులకు, మైనారిటీలకు అధికారంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించాలి. అన్ని రంగాల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. అవినీతి పరులకు రాజకీయనాయకులకు మధ్యనున్న ప్రజావ్యతిరేక సంబంధాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అటవి, గ్రామీణ ప్రాంతాలలో కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని ప్రజలందరికి ఉపయోగపడేలా కృషి చేయాలి. ప్రజల హక్కులకై జరిగే పోరాటాలపై అణచివేతను నిలిపివేయాలి. పోలీసు క్యాంపుల నిర్మాణాలకు, బూటకపు ఎదురుకాల్పులకు వ్యతిరేకంగా పోరాడాలి.

18. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం పట్ల విప్లవోద్యమ అవగాహనను వివరించండి?

ʹవిప్లవోద్యమం తెలంగాణ పునర్నిర్మాణం విషయంలో స్పష్టమైన అవగాహన కల్గి వుంది. 1996 నుండి విప్లవోద్యమం ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను ప్రజల ముందుంచింది. నూతనంగా ఏర్పడే రాష్ట్రం భౌగోళికమైనదే కాక అది ప్రజాస్వామికీకరింప బడాలనీ ప్రచారంచేసింది. అందుకు ప్రజల ముందు కనీస కార్యక్రమాన్ని ఉంచింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం పోరాటం ద్వారానే సాధించుకోగలమని స్పష్టంగా చెప్పింది. పార్లమెంటులో బిల్లు పెట్టాలని, తెలంగాణ వనరులను కాపాడుకోవాలని ముఖ్యమైన పిలుపులనిచ్చింది. ఈ కాలమంతటా విప్లవోద్యమం చూపించిన రాజకీయ దార్శనికత నిజమని రుజువయింది. కాబట్టి తెలంగాణ సమాజం ఈ రోజు తెలంగాణ పునర్నిర్మాణం ప్రజాస్వామికంగా ఉండాలని నినదిస్తున్నది.

ʹతెలంగాణ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమయ్యేది కార్మిక వర్గం నాయకత్వంలో విప్లవకర వర్గాలైన రైతాంగం, కార్మికవర్గం, పెటీబూర్జువా, జాతీయ బూర్జువా వర్గాలు ఐక్యమై నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాయుధంగా విజయవంతం చేసుకోవడం ద్వారానేʹ, బడా భూస్వామ్య, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల దోపిడీ పాలనను కూలదోయడం ద్వారానేʹ వారి చేతుల్లో ఉన్న కోట్లాది రూపాయల ప్రజల సంపద, భూమి, ఫ్యాక్టరీలు, సహజవనరులు, పెట్టుబడి స్వాధీనం చేసుకోవడం ద్వారానేʹ వేల కోట్ల రూపాయల అప్పుల్ని రద్దు చేయడం ద్వారానే తెలంగాణ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయి. సామ్రాజ్యవాదులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము స్వతంత్రంగా నిలబడి దున్నేవారికే భూమి ప్రాతిపదికపై వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేయడం ద్వారానే, వ్యవసాయంపై ఆధారపడి పారిశ్రామిక అభివృద్ధిని కొనసాగించడం ద్వారానే, ప్రజల జీవన పరిస్థితుల్ని క్రమంగా మెరుగు పర్చడం ద్వారానే తెలంగాణ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల, మొత్తం దేశ ప్రజల మౌలిక సమస్యలు కూడ ఈ విధంగానే పరిష్కారమవుతాయని విప్లవోద్యమ కార్యక్రమం చెబుతున్నది.

19. ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ శక్తులకు పిలుపు.

ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం మొదలైన మలిదశ ఉద్యమం కొనసాగుతున్నది. భౌగోళిక తెలంగాణ సాధించినంత మాత్రాన సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్వాతంత్రం రాదు. సమాజం వర్గాలుగా ఉన్నంత వరకు, దోపిడీ వర్గాల పాలన కొనసాగినంతకాలం ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావు. భూమి, ఉపాధి వనరులు కొద్ది మంది చేతుల్లో ఉన్నంత వరకు అసమానతలు తొలగిపోవు. అందరికి తిండి, గూడు, గుడ్డ కావాలన్నా ప్రజలంతా ప్రజాస్వామిక హక్కులను సమానంగా అనుభవించాలన్నా ప్రాంతేతరుల పాలన పోవడం ఒక్కటేచాలదు. ఈ ప్రాంతంలోని దోపిడీ వర్గాల పాలన అంతం కావాలి. అప్పుడే దోపిడీ, అణచివేతలు లేని ప్రజలందరి ప్రజాస్వామిక పాలన సాధ్యం అవుతుంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధన లక్ష్యం. అందుకు అన్ని సెక్షన్ల ప్రజలు సమైక్యంగా పోరాడాలి.

ప్రజలు పోరాడి సాధించిన భౌగోళిక తెలంగాణను దళారీ టీఆర్‌ఎస్‌ పార్టీ పరాయి పాలకులకు ఒప్పచెబుతుంది. కాంగ్రెస్‌, టీడీపీతో సహా అన్నీ అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ప్రజా ఐక్య కార్యాచరణ ద్వారా పోరాడి ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలి. అదే తెలంగాణ పోరాట విద్రోహులకు హెచ్చరిక. దోపిడీ పాలకవర్గాల ప్రయోజనాలను నెరవేర్చే ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించి ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

20. ఎన్నికల సందర్భంగా ప్రజలకు మీ సందేశం ఏమిటి?

ముందస్తు ఎన్నికలను బహిష్కరించండి. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండి. సర్వసంపదలు సృష్టించే ప్రజలే చరిత్ర నిర్మాతలు. తెలంగాణ ప్రజలు నూతన చరిత్ర సృష్టించాలి.

Keywords : మావోయిస్టు పార్టీ,జగన్, తెలంగాణ, ఎన్నికలు
(2019-10-14 00:30:08)



No. of visitors : 413

Suggested Posts


ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1

ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో లాబీయింగ్ రాజకీయాలు నడిపిన కేసీఆర్.. ఆ తర్వాత కుటుంబ పాలన నడిపాడు. తన కుటుంబ పాలనను మరో ఐదేళ్లు పొడిగించుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ఆయన విమర్శించారు.

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2

ముందస్తు ఎన్నికలను బహిష్కరించండి. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండి. సర్వసంపదలు సృష్టించే ప్రజలే చరిత్ర నిర్మాతలు. తెలంగాణ ప్రజలు నూతన చరిత్ర సృష్టించాలి.

Search Engine

RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
more..


మావోయిస్టు