సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి


సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి

సర్జికల్

దేశంలో రాజకీయాలంటేనే ఎంత భ్రష్టుపట్టిపోయాయో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. రూపాయి పని చేసి వంద రూపాయల ప్రచారం చేసుకోవడమే నేటి నయా రాజకీయం. అలాంటిది దేశభక్తితో ముడిపెట్టిన ఘనతను (అది నిజంగా ఘనతేనా అనేది వేరే విషయం) బీజేపీ లాంటి ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాలా...?

సర్జికల్ స్ట్రైక్స్.. ఉరీలో భారత సైన్యంపై జరిగిన దాడిలో 19 మంది సైనికులు మరణించారు. ఈ దాడి జరిగిన రెండు వారాల్లోనే.. అంటే 29 సెప్టెంబర్ 2016లో భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోనికి చొరబడి దాడులు చేశాయి. సర్జికల్ స్ట్రైక్స్‌గా దేశ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ఈ దాడులకు అప్పట్లో ఆమోదం తెలిపిన వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ హుడా. ఆ సర్జికల్ దాడులను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రస్తుతం హుడా రిటైర్ అయ్యారు.

ఇప్పుడు అదే హుడా సర్జికల్ స్ట్రైక్స్‌ ఎంత రాజకీయం అయిపోయాయో చెబుతున్నారు. రెండు రోజుల క్రితం చండీఘర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయాలకు ఎలా ఉపయోగించుకున్నారో చెప్పారు. సైన్యం ఇలాంటి ఆపరేషన్స్ చేయడం సాధారణమేనని.. ఇండో-పాక్ బార్డర్‌లో ఇలాంటి దాడులు చేయడానికి ఆర్మీ అధికారులు ప్రత్యేక దళాలకు అనుమతి ఇవ్వడం సహజమే అన్నారు.

కాని ఆర్మీ చేసే దాడులు విజయవంతం అయితే రాజకీయ నాయకులు వాటిని వారి ప్రయోజనం కోసం వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. సైన్యం చేసే ఆపరేషన్స్ రాజకీయ నాయకులు ఉపయోగించుకోవడం చాలా ప్రమాదకరమని ఆయన అంటున్నారు.

సైన్యం చేసే ఆపరేషన్స్ విజయవంత అయితే ప్రజల్లోకి తీసుకొని వెళ్లి అది తమ విజయమని రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత దేశ ప్రజల్లో సంతోషం, ఉత్సాహం ఉండటం సహజమే.. కాని ఇప్పటికీ దానిపై అతి ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.

మాజీ ఆర్మీ వ్యాఖ్యలతో దేశం యావత్తు విస్తుపోయింది. ఆర్మీలో సహజంగా జరిగే ప్రక్రియనే ప్రధాని మోడీ తన ఘనతగా చెప్పుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. మరో వైపు రాహుల్ గాంధీ ఆర్మీ మాజీ అధికారి వ్యాఖ్యలను సమర్థించారు. మిస్టర్ చత్తీస్ ( తన ఛాతి 36 అని మోడీ అన్నారని) ఇది నిజంగా మీ విజయమేనా అని ప్రశ్నించారు.

సైన్యంలో జరిగే విషయాలను హుడా నిజాయితిగా వెళ్లడించడం చాలా సంతోషమని రాహుల్ ఒక ట్వీట్ చేశారు.

ఏదేమైనా దేశ ప్రజల్లో దేశభక్తి, మతం అనే రెండు విషయాలపై విభజనలు సృష్టిస్తూ.. ప్రతీ విషయాన్ని ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలచుకుంటున్న మోడీ అండ్ టీంకి హుడా వ్యాఖ్యలు కంటకింపుగానే ఉండొచ్చు.

Keywords : surgical strikes,army general, hooda, narendra modi, uri attack, politicks, సర్జికల్ దాడులు, ఆర్మీ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, పాకిస్తాన్, రాజకీయం, హుడా
(2019-03-15 12:36:49)No. of visitors : 297

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


సర్జికల్