మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..


మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..

మత

మతాన్ని, రాజకీయాన్ని కలిపి దేశంలో పలు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. మరీ ముఖ్యంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ శతాబ్దాల తరబడి ప్రజలంతా ఆమోదించిన ఊర్ల పేర్లను మారుస్తూ.. అదే పెద్ద ఘనతగా చాటుకుంటున్నారు.

తాను పాలిస్తున్న యూపీలోని పలు నగరాలు ముస్లింలు మాట్లాడే ఉర్థూలో (వాస్తవానికి అవి పర్షియన్ పేర్లు) ఉన్నాయనే కారణంతో వాటిని హిందూయీకరణ చేస్తున్నారు. హిందుత్వ రాజకీయాలు చేసే యోగీ ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా తన మార్కు రాజకీయాలకు తెరతీశారు. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా, కరీంనగర్‌ను కరిపురంగా మారుస్తానంటూ వాగ్దానాలు చేశారు.

ఇవన్నీ ఒకవైపు ఉండగా.. ఇటీవల ఆయన హనుమంతుడి కులం ఏంటో చెప్పారు. హనుమంతుడు దళితుడని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో యూపీలో పలు వర్గాల నుంచి విమర్శలు తలెత్తాయి. అసలు హనుమంతుడి కులమేంటో యోగీ ఎలా చెబుతారని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

హనుమంతుడి కుల రాజకీయాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత శివపాల్ యాదవ్ వర్గీయులు వినూత్నంగా నిరసన తెలిపారు. నిజంగా హనుమంతుడు దళితుడు అయితే వారంలోపు కుల దృవీకరణ పత్రం జారీ చేయాలని డిమాండ్ చేశారు. శివపాల్ స్థాపించిన ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ తరపున వారణాసీ జిల్లా అధ్యక్షుడు హరీష్ మిశ్రా.. ఇప్పటికే ఈ విషయంపై వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు చేశారు.

బీజేపీ సీఎం యోగీ పేర్లు మార్చడమే కాదు ఇప్పుడు కులాలు కూడా నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కుల, మత రాజకీయాలు చేసే ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీ .. ప్రజలను ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ మభ్యపెడుతూనే ఉంటుందని పలువురు అంటున్నారు.

Keywords : యూపీ, హనుమంతుడు, యోగీ ఆదిత్యనాథ్, కుల ధృవీకరణ, శివపాల్ యాదవ్, UP, Yogi Adityanath, Hanuman, Caste Certificate
(2019-03-15 10:33:31)No. of visitors : 327

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


మత