ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!


ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!

ఆనాటి

ఇవాళ దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. తెలంగాణలో టీఆర్ఎస్ తిరిగి అధికారాన్ని చేపట్టనుండగా.. చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. మీజోరాంలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు గతంలో జరిగిన ఎన్నికల సన్నివేశాన్ని గుర్తుతెస్తోందంటూ సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్. వేణుగోపాల్ అంటున్నారు. ఆ విషయాలు ఏమిటో ఆయన మాటల్లోనే...

---------------------------------------------------------------------------------

మిత్రులారా, దేశంలో సాగుతున్న పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాల మీద ఎంతమాత్రం విశ్వాసం లేనివాణ్ని. ఈ ఎన్నికలు నిజమైన ప్రజాభిమతానికీ, ప్రజా ప్రయోజనాలకూ, ఆకాంక్షలకూ వ్యక్తీకరణ కావని నా నమ్మకం. అందరూ దొంగలే అయిన చోట ఒక దొంగను ఎన్నుకోవడానికి, గొంతు కోసి చంపేవాడినో, నీట ముంచి చంపేవాడినో ఎంచుకోవడానికి ప్రజలకు దొరికే అవకాశం మాత్రమేనని నా విశ్వాసం. అందువల్ల ఒకరి గెలుపు గురించీ, మరొకరి ఓటమి గురించీ మాట్లాడడానికి ఏమీ లేదు. కాకపోతే చరిత్ర విద్యార్థిగా మూడు విషయాలు పంచుకోవాలని ఉంది:

ఒకటి, గత ఏడు దశాబ్దాల భారత పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో గెలిచినవాళ్లేమో ప్రజలు కోరుకున్నవారూ, ఓడినవాళ్లేమో ప్రజలు తిరస్కరించినవారూ అని ఎవరైనా అనుకుంటే అంతకన్న అమాయకమైన, హాస్యాస్పదమైన సంగతి మరొకటి ఉండదు. అటు గెలిచినవాళ్లూ, ఇటు ఓడినవాళ్లూ అందరూ కూడ ప్రజలకోసం ఇసుమంత చేసినవాళ్లూ, చేయదలచుకున్నవాళ్లూ కాదు. గెలిచినవాళ్లయినా, అప్పుడు ఓడి మరెప్పుడో గెలిచినవాళ్లయినా అందరికందరూ భూస్వాములకు, సామ్రాజ్యవాదులకు, సంపన్నులకు ఊడిగం చేసినవాళ్లే. ఆ పనిలో భాగంగా తమ బాగు చూసుకున్న దళారీలే. వాళ్ల విధానాలకూ, ఆచరణలకూ ఉప ఉత్పత్తి గానో, ముసుగు గానో, పుష్టిగా తింటున్న చెయ్యి విసిరితే రాలిపడిన ఎంగిలి మెతుకులుగానో మాత్రమే ప్రజలకు కాసిన్ని ʹఅభివృద్ధిʹ పథకాలూ, సంక్షేమ పథకాలూ, తాయిలాలూ అంది ఉండవచ్చు.

రెండు, నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రజా ఉద్యమ ఆకాంక్షలకూ, ప్రజా ప్రయోజనాలకూ వ్యతిరేకమైన ఎన్నో పనులు చేసిన పార్టీ ఒకవైపునా, అంతకుముందు అరవై ఏళ్లో, ముప్పై ఏళ్లో తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మరెన్నో పనులు చేసిన పార్టీలు మరొకవైపునా ఉన్నప్పుడు అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గొయ్యి కన్న ఎక్కువా కాదు, తక్కువా కాదు. అయ్యో తెలంగాణ నూతిలో పడ్డదే అని కుంగిపోవడమూ, గొయ్యిలో పడలేదని పొంగిపోవడమూ సమానంగా నిష్ప్రయోజకమే.

మూడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని రెండు ఎన్నికలను -- 1989, 1999 -- ఈ సమయంలో గుర్తు చేసుకోవలసి ఉంది. ఎన్ టి రామారావు రెండు సంవత్సరాల్లో రెండు సార్లు (1983, 1985) అఖండ విజయం సాధించి కూడ 1989లో చిత్తుగా ఓడిపోయారు. ఇక, ప్రపంచ బ్యాంకు పథకాలు ప్రారంభించి, ప్రజా ఉద్యమాల మీద క్రూరమైన నిర్బంధం సాగించి, తీవ్రమైన వ్యతిరేకతను మూటకట్టుకుని చంద్రబాబు నాయుడు 1999 ఎన్నికల్లో ఓడిపోతారనే అనిపించింది. అప్పటికి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి నాబోటివాళ్లం ఆయన విధానాలకు వ్యతిరేకంగా రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. కాని చంద్రబాబు నాయుడు 1999 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2004లో అలిపిరి హత్యాప్రయత్నపు సానుభూతి కూడ ఆయనను ఓటమి నుంచి కాపాడలేకపోయిందనేది వేరే కథ.

ఇవాళ్టి ఫలితాలు, 1989 కన్న 1999కి దగ్గరగా ఉన్నట్టున్నాయి.

ఎన్. వేణుగోపాల్
వీక్షణం సంపాదకులు.

Keywords : తెలంగాణ, ఎన్నికలు, పునరావృతం, telangana, Elections, Result
(2019-03-15 00:25:33)No. of visitors : 348

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


ఆనాటి