చీకటి రోజులలోని గానాలు - బి.అనురాధ‌

చీకటి

బి.అనురాధ రాసిన ఈ వ్యాసం అరుణతార డిశంబర్ సంచికలో ప్రచురించబడినది

నవంబర్‌ 24న హైదరాబాద్‌ లో పురుషోత్తం సంస్మరణ సభకు ముఖ్య వక్తగా విచ్చేసిన ముంబై హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ కోస్లే పాటిల్‌ తన ఉపన్యాసం ప్రారంబిస్తూ ʹʹదేశమంతా ఒక నిర్బంధ వాతావరణం నిండిపోయి ఉంది. అలాంటి సమయంలో ఈ సభకు వచ్చిన మీ అందరికీ అభినందనలు. ఈ సభకు వచ్చినందుకు మనల్ని అరెస్టు చేయడానికి బయట పోలీసు వ్యానులు ఆగివున్నా ఆశ్చర్యపోనక్కర్లేదుʹʹ, అన్నారు. అంతేకాదు ʹʹబిజేపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక ఇవే చివరి ఎన్నికలవుతాయిʹʹ, అనికూడా అన్నారు. న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసి, హైకోర్టులో ఎన్నో తీర్పులు చెప్పిన జడ్జిగా ఆయన అంచనాలకు చాలా విలువుంటుంది. బిజేపి లోనే పనిచేసిన అరుణ్‌ శౌరీ కూడా సరిగ్గా ఇదే మాట అన్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న అరెస్టులను ఈ నేపథ్యంలో చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.

ఈ అరెస్టులు జరుగుతున్న తొలి నాళ్లలో కొంత మందికైనా నిప్పులేందే పొగ రాదుకదా అనో, ఏవో ఉత్తరాలు రాసే ఉంటారు, దాన్లోకి కొన్ని చేర్చిఉండొచ్చు అనో కొన్ని శంకలు కలిగాయి. కానీ పరిస్థితి దిగజారుతూ పోయాక కానీ చాలా మందికి విషయం అర్థం కాలేదు. ʹఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్స్‌ʹ అధ్యక్షుడు జస్టిస్‌ సురేష్‌ తమ కోశాధికారి అరుణ్‌ ఫెరేరా అరెస్టుని ఖండిస్తే ఆయనని కూడా విచారిస్తామని, అవసరమైతే ఆయనను సైతం అరెస్టు చేయడానికి వెనుకాడమని పోలీసులు ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకొనేముందు ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మనకి చాలా విషయాలు అర్థం చేసుకోవడం తేలిక. ʹʹనరేంద్రమోడీని హత్య చేయదానికి ప్రయత్నం చేయడంʹʹ అనే కాకమ్మ కథ చాలా పురాతనమైనది, పునరావతమౌతూ వస్తున్నది. అంటే ఆయన గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కథ మొదలైంది. దానికి నేపథ్యం గుజరాత్‌ మారణకాండ. ఈ విషయాలు అందరికీ తెలిసినవే అయినా ఒకసారి గుర్తుచేసుకోవడం అవసరం. కేశుభాయ్‌ పటేల్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో హరేన్‌ పాండ్యా హోం మంత్రిగా వ్యవహరించారు. నరేంద్ర మోడి ముఖ్య మంత్రి అయిన తరవాత ఆయనను రెవెన్యూ శాఖకి మార్చి అమిత్‌ షాని హోం మంత్రిగా నియమించుకున్నారు. 2002 లో గుజరాత్‌ మారణకాండ జరిగినపుడు నరేంద్రమోడీ ఇంట్లో జరిగిన అత్యవసర సమావేశంలో ʹʹగోద్రాకి ప్రతీకారంగా హిందువులు తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తారని, వాటిని చూసిచూడనట్టుండాలనిʹʹ ఆయన సిబిఐనీ, ఉన్నత పోలీసు అధికారులనీ ఆదేశించారని 2002 లోనే హరేన్‌ పాండ్యా అవుట్‌ లుక్‌ పత్రికకి తెలియజేశారు. తన పేరు కనక బయటికి వస్తే తనని చంపేయడం ఖాయం అని కూడా చెప్పారు. ఈ విషయాలు ఔట్‌ లుక్‌ పత్రిక రికార్డు కూడా చేసింది. అంతే కాదు ఆయన కన్సర్న్డ్‌ సిటిజెన్‌ ట్రిబ్యునల్‌ కి వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆయన పేరును రహస్యంగా ఉంచే ఈ విషయాలు బయటికి తెచ్చినప్పటికీ ఆయన 2003 మార్చ్‌ లో హత్యకు గురయ్యారు. కొంతమందిని అరెస్టు చేసి శిక్షలు కూడా వేశారు కానీ, అవన్నీ తప్పుడు కేసులనీ వాళ్ళు నిర్దోషులనీ హైకోర్టు కేసు కొట్టి వేసింది. మొత్తంగా హరేన్‌ పాండ్యా విషయంలో మోడి షా లపై తీవ్ర అభియోగాలు వచ్చాయి.

తరవాత 2004 లో ఇష్రాత్‌ జహాన్‌ అనే 19యేళ్ళ కాలేజ్‌ అమ్మాయి, జావేద్‌ గులాం షేక్‌, అంజాద్‌ అలీ రాణా, జీషన్‌ జోహార్‌ లతో కలిసి మోడి ని చంపేందుకు కుట్ర చేయగా వాళ్ళతో జరిగిన పోలీసుల కాల్పుల్లో వాళ్ళు చనిపోయారని ప్రకటించింది. వీళ్ళంతా లష్కర్‌-ఎ-తోయిబా సభ్యులని ఆరోపించింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని వాళ్ళ కుటుంబ సభ్యులూ, పౌర, ప్రజాస్వామిక హక్కుల సంస్థలతో పాటు లష్కర్‌-ఎ-తోయిబా కూడా ఖండించింది. డిజిపి వంజారా నాయకత్వంలో కొందరు పోలీసు అధికారులు వాళ్ళను హత్య చేసి ఎన్‌కౌంటర్‌ కథలల్లారని కేసు నడిచింది. తనను వాడుకొని మోసం చేసారంటూ వంజారా మోడీ, అమిత్‌ షాల పైన తీవ్రమైన అభియోగాలు కూడా చేశాడు. మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఇతన్ని విడుదల చేశారు. ఆ తరవాత 2005లో సోహ్రాబుద్దీన్‌ అనే యువకుడిని అమిత్‌ షాని హత్య చేయడానికి పథకం వేశాడంటూ హత్య చేసి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు. అతని భార్య ఆరోజు నుండి కనపడకుండా పోయింది. ఆ హత్యకు సాక్షిగా ఉన్న తులసీరాం ప్రజాపతి మరికొన్ని నెలల తరవాత మరొక బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురయ్యాడు. ఇది కూడా బూటకం అనే విషయం బాగా బయటపడడంతో చాలా కాలం కేసు నడిచింది. 2014లో సిబిఐ కోర్టు లో విచారణకు వచ్చింది. అప్పుడు దానికి నేతత్వం వహిస్తున్న జడ్జి లోయ అమిత్‌ షాని ఈ కేసు విషయమై కోర్టులో హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. ఆయనకి అమిత్‌ షా 100 కోట్లు ఇవ్వజూపగా తిరస్కరించారని ఒక వార్తా కథనం. అయితే అమిత షా హాజరుకావలిసి ఉన్న కోర్టు తేదీ కంటే కొంచెం ముందు ఒక సహ న్యాయవాది కుమార్తె పెళ్ళికి నాగపూర్‌ వెళ్ళిన లోయా అనుమానాస్పద స్థితిలో మరణించారు. తరవాత చార్జ్‌ పుచ్చుకున్న జడ్జి కేసును కొట్టివేశారు. లోయా కుటుంబ సభ్యులు కారవాన్‌ పత్రికకు కొద్ది కాలం క్రితం లోయా మరణం సహజం కాదని అనేక విషయాలు వెల్లడించి తీవ్ర బెందిరింపులు ఎదుర్కొని మౌనంగా అయిపోయారు. వార్తను బయటకు తెచ్చిన కారవాన్‌ సంపాదకులు హార్తోష్‌ సింగ్‌ బాల్‌ తన ఉద్యోగం కోల్పోయారు. ʹగుజరాత్‌ ఫైల్స్‌ʹ చదివితే ఇష్రాత్‌ జహాన్‌, సోహ్రాబుద్దీన్‌ ల హత్యల విషయాన్ని గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాణాలకు తెగించి పరిశోధన చేసి ఆ పుస్తకం రాసిన జర్నలిస్టు రాణా అయ్యూబ్‌ తీవ్ర బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అంతే కాదు ఆమె ఫోటోతో మార్ఫిన్‌ చేసిన ఒక అశ్లీల వీడియో ని తయారుచేసి ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ళు విపరీతంగా సర్కులేట్‌ చేయడమే కాదు ఆమెను ట్విట్టర్‌ లోనూ, ఫేస్‌ బుక్‌ లోనూ తీవ్రంగా వేధించి దూషిస్తున్నారు. ఆమె మానసికంగా కుంగిపోయి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పనులు చేయడానికి ఎంతమందిని నియమించిందో వాళ్లెలా పనిచేస్తారో స్వాతి చతుర్వేది రాసిన ʹʹనేనొక అంతర్జాల పోకిరీనిʹʹ చదివితే తెలుసుకోవచ్చు.

ఆ తరవాత హేతువాదులు, జర్నలిస్టుల వంతు వచ్చింది. దబోల్కర్‌, పన్సారే, గౌరి లంకేష్‌ ల హత్యలు. ఇప్పుడు తాజాగా గౌరి లంకేష్‌ హత్యకు కుట్ర పన్నిన సనాతన సంస్థ లిస్టులో ఇంకా అనేక మంది ఉన్నారని మరికొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో దబోల్కర్‌ కుమార్తె ముక్తా దభోల్కర్‌ ఒకరు. కొన్నాళ్ళ క్రిందట జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌పై హత్యా యత్నం జరిగింది.

మరొక పక్క పోరాడే ప్రజల పక్షాన నిలిచినందుకు ప్రజాస్వామిక వాదులను చాలా కాలంగా జైళ్ళలో నిర్బంధిస్తూ ఉన్నప్పటికీ మూకుమ్మడిగా అనేక మందిని అనేక ప్రాంతాలనుండి ʹఅర్బన్‌ నక్సల్‌ʹ అని అరెస్టు చేయడం ప్రస్తుత కథ. గత కొంత కాలంగా ఈ అరెస్టుల గురించి వివరంగా మాట్లాడుకొన్నప్పటికీ, దీనిలోనూ ఒక లింకు మనకి కనిపిస్తుంది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ ని వ్యతిరేకించినందుకూ, ఆదివాసుల పక్షాన నిలిచినందుకు, సాయిబాబా, ప్రశాంత్‌ రాహి, హేమ్‌ మిశ్రా, మహేశ్‌ తిర్కీ, పాండు నరోటే లకు యావజ్జీవ శిక్ష వేశారు. ప్రశాంత్‌ రాహీ జార్ఖండ్‌ జైళ్ళలోని ఆదివాసుల విడుదల కోసం ఫాదర్‌ స్టాన్‌ స్వామితో కలిసి ఒక సంస్థ పెట్టి కషి చేసినందుకు ఆయనను జైలుపాలు చేశారు. ఇప్పుడు స్టాన్‌ స్వామి (85యేళ్ళు) ఇంటిలో సోదాలు చేసి వేధించారు.

బీమా కోరేగావ్‌ ర్యాలీ లో హింస కు అసలు కారకులైన శంభాజీ భిడే, మిళింద్‌ ఎక్బోటేలను స్వేచ్ఛగా వదిలేసి ఆ కేసుతో ఎవరి నంటే వారిని అరెస్టు చేయడం జనవరి 14 2018 న మొదలయ్యింది. మొట్టమొదటగా తెలంగాణా నుండి వలస పోయి ముంబైలో రిలయెన్స్‌ ఎనర్జీలో పనిచేస్తున్న సత్యనారాయణ, బాబు శంకర్‌, గుండె శంకరయ్య, మారంపల్లి రవి, సైదులు అనే కార్మికులను అరెస్టు చేశారు. వీళ్ళు బాంబే ఎలక్ట్రిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సభ్యులు కూడా. అప్పటినుండి వాళ్ళు జైల్లోనే మగ్గుతున్నారు. వాళ్ళకి బెయిల్‌ నిరాకరించారు. అంతే కాదు అదేరోజున మచ్చ ప్రభాకర్‌ అనే టీచరు ను కూడా అరెస్టు చేసి తరవాత వదిలిపెట్టారు. కానీ తరచూ వేధిస్తూనే ఉన్నారు. ఆయన ఆ వేధింపులు తాళలేక జనవరి 23 న ఆత్మహత్య చేసుకున్నారు.

ఇలాంటి అనేక మంది కోసం కోర్టులో అనేక దశాబ్దాలుగా వాదిస్తున్నవారు సురేంద్ర గడ్లింగ్‌, సుధా భరద్వాజ్‌లు. అక్రమ కేసులు ఎదుర్కొని నిర్దోషిగా విడుదల కావడమే కాదు ఇప్పుడు తానే కోర్టులో వాదించడానికి న్యాయవాద వత్తి చేపట్టిన అరుణ్‌ ఫెరేరా వారికి తోడయ్యాడు. ఇప్పుడు వారినే అరెస్టు చేశారు. సాయిబాబా తదితరుల విడుదల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న వరవరరావుని మొన్నటి వరకూ గహ నిర్బంధంలో ఉంచి ఆయనను కూడా జైలుకి తరలించారు. ఆయన వయసుని, అనారోగ్యాన్ని పరిగణన లోకి తీసుకోకుండా వారం రోజులు పోలీసు కస్టడీ కూడా ఇచ్చారు. నిజానికి గహనిర్బంధంలో ఉన్నపుడే ఆయనను అవసరమైతే విచారణ చేయవచ్చని కోర్టు అనుమతిచ్చింది. అలా చేయకుండా ఆయనను అరెస్టు చేసేవరకూ ఆగి అప్పుడు విచారణ పేరుతో కస్టడీలోకి తీసుకోవడం కేవలం వేధించడానికి తప్ప మరొకటి కాదు. అరుణ్‌ మొదటిసారి అరెస్టయినపుడు పెట్టిన చిత్రహింసల గురించి, తన పై ప్రయోగించిన నార్కో టెస్టుల గురించి పోలీసులను బాగా ఎండగట్టినందుకు కక్ష సాధింపు చర్యగా తాజా అరెస్టు సందర్భంగా మళ్ళీ విచారణ పేరుతో కస్టడీలోకి తీసుకొని కొట్టారు.

బిజేపి ప్రభుత్వానికి ఏమీ తీసిపోని విధంగా తెలంగాణా ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య ను ఫేస్‌ బుక్‌ లో విపరీతంగా వేధించారు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా కేసు నమోదు చేయలేదు. అరుణోదయ విమల ʹʹఎవడురా గోరక్షకుల మంటూʹʹ పాట పాడినందుకు ఆమెను ఫేస్‌ బుక్‌లో విపరీతంగా వేధించారు. వోట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీయండి అంటూ తెలంగాణా ప్రజా ఫ్రంట్‌ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించ తలపెట్టగానే టిపిఎఫ్‌ నాయకుడు మెంచు రమేశ్‌, టివైఎఫ్‌ కి చెందిన మోహన్‌, రాజ్‌, పాండు, సంజీవ్‌, శ్రీనివాస్‌ లను అరెస్టుచేశారు. వీళ్ళంతా ఇటీవలే బెయిల్‌ పై విడుదలయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీలనైతే ఐటి దాడుల ఆయుధంతో వేధిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తుఫాన్‌ బాధితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఏబిఎంఎస్‌ నాయకులు అంజమ్మ, పిడిఎం కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పికేఎం కార్యకర్తలు నీలకంఠం, కోదండం, అరుణ లను అరెస్టు చేసి పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ పెట్టారు. 15రోజులకు కానీ బెయిల్‌ మంజూరు కాలేదు.

ఇలా హక్కుల కార్యకర్తలను నిర్బంధించి ఏ ప్రజాస్వామిక వ్యవస్థ తనపని తాను చేయకుండా బిజెపి ʹʹహిందూ మతోన్మాద రాజ్యాన్నిʹʹ తయారుచేసుకొంటోంది. నేర విచారణకు సంబందించిన అత్యున్నత సంస్థ సిబిఐ డైరెక్టర్లను కూడా మోడి షా తొత్తులుగా పనిచేసే వాళ్ళని నియమించుకుంది. సుప్రీం కోర్టుల న్యాయమూర్తులుగా కూడా తమకు అనుకూలమైన తీర్పులిచ్చేవారిని నియమించుకోవడమో లేక ఉన్నవారిపై విపరీత వత్తిడి తేవడమో చేస్తోంది. ఇటీవలే పదవీ విరమణ చేసిన దీపక్‌ మిశ్రాపై కూడా అలాంటి తీవ్ర వత్తిడిని ప్రయోగించి అనేక కేసులను ప్రభావితం చేసినట్టుగా స్వయంగా నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులే మీడియా ముందుకు వచ్చి చెప్పిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీల వైస్‌ చాన్సలర్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను నియమించడం ఇప్పుడు ఇక పాత విషయం అయిపోయింది.

సోషల్‌ మీడియా లేకపోతే ప్రజాలకు నిజాలు తెలిసే అవకాశం ఉండేది కాదు. ప్రధాన స్రవంతి మీడియాని నయాన్నో భయాన్నో లొంగదీసుకున్నాక, ఇక అవి వార్తలు ప్రసారం చేయడం మానేసి గోబెల్స్‌ ప్రచారం తప్ప మరొకటి చేయడం లేదు. ఎన్నికల బహిష్కరణ కు పిలుపునిచ్చిన మావోయిస్టుపార్టీ వోటు వేస్తే వేళ్ళు తెగ్గోస్తానన్నదని ఒక తప్పుడు ప్రచారం మీడియా చేస్తే, అలాంటి వార్తలను చూసి నిజనిజాలు తెలుసుకోకుండానే గౌతమ్‌ నవలాఖా వంటి వారు కూడా స్వయంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రాజ్య స్వభావాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండానే విప్లవకారులను ఖండిస్తూ, విమర్శిస్తూ ఆవేశంగా వ్యాసాలమీద వ్యాసాలు రాసేస్తున్నారు.

బీమా కోరేగావ్‌ ర్యాలీ సందర్భంగా హింసకి ప్రేరేపించారని చెప్పి పెట్టిన కేసులో ఒక్క గౌతమ్‌ నవలఖా తప్ప మిగతా అందరినీ జైలులో పెట్టారు. 90 రోజుల్లోగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయకపోతే బెయిల్‌ మంజూరు చేయవలిసి ఉంది. కానీ ఉపా చట్టం కింద అరెస్టు చేసినవారి విషయంలో కొన్ని షరతులతో మరొక 90 రోజులు పొడిగించవచ్చు. కానీ ఆ షరతులను వేటినీ లెక్కలోకి తీసుకోకుండానే మరో 90 రోజుల సమయాన్ని హైకోర్టు జడ్జి మంజూరు చేశారు.ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి రామ జన్మ భూమిని మళ్ళీ ఎజెండా పైకి తెస్తున్నారు. జస్టిస్‌ కోస్లే పాటిల్‌ అన్నట్టు ʹʹపాకిస్తాన్‌, కాశ్మీర్‌, రామజన్మభూమి వంటివి ఎప్పటికీ రగులుకొంటూ ఉండాలనే పాలకవర్గాలు కోరుకొంటాయి. అవి పరిష్కారం కాకుండా చేయటమే వాళ్ళు చేసే రాజకీయం.ʹʹ

ఇలాంటి ఒక భయానక నిరాశపూరిత వాతావరణంలో మనకి స్పూర్తినిచ్చి నిలబెడుతున్నది, ప్రజా ప్రతిఘటన మాత్రమే. అడవుల్లోనూ, గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఎన్నో విధాలుగా ప్రజా ప్రతిఘటన వెల్లువెత్తుతోంది. తాజాగా దేశం నలువైపులనుండి రైతులు దేశరాజధానికి చేసిన కవాతు ఎంతో ఉత్తేజాన్ని నింపింది. వారికి మద్దతుగా ముంబైలో ఆటో డ్రైవర్లు క్యాంపెయిన్‌ చేసి ప్రజల దగ్గర సంతకాల సేకరణ చేయడం కొత్త ఆశలను కలిగిస్తోంది.

సాయిబాబా, ప్రశాంత్‌ రాహి, హేం మిశ్రా, మహేశ్‌ తిర్కీ, పాండు నరోటే, సత్యనారాయణ, బాబు శంకర్‌, గుండె శంకరయ్య, మారంపల్లి రవి, సైదులు రోనా విల్సన్‌, షోమ సేన్‌, సుధీర్‌ ధావలే, వెర్నన్‌ గోన్సాల్వేస్‌, అరుణ్‌ ఫెరేరా, సుధా భరద్వాజ్‌, వరవరరావులను విడుదల చేయాలని డిమాండు చేస్తూ దేశవ్యాప్తంగా సాగుతున్న పోరాటాలను మరింత బలంగా చేద్దాం. ఈ అరెస్టులకి మాత్రమే కాకుండా దేశంలో పెరుగుతున్న బ్రాహ్మణీయ ఫాసిజానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగుతున్నాయి. అవన్నీ సంఘటితమై ఒక బలమైన ప్రజాఉద్యమంగా రూపుదిద్దుకోవడంలో మనవంతు కర్తవ్యం నిర్వహిద్దాం.
- బి.అనురాధ‌

Keywords : bhema koregav, maoists, dalit, varavararao, sudha bharadvaj
(2024-04-24 18:51:13)



No. of visitors : 1213

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చీకటి