బ్యాన్డ్ థాట్ వెబ్ సైట్ పై నిషేధం ఫాసిస్టు చర్య - విరసం


బ్యాన్డ్ థాట్ వెబ్ సైట్ పై నిషేధం ఫాసిస్టు చర్య - విరసం

బ్యాన్డ్

(భారత ప్రభుత్వం బ్యాన్డ్ థాట్ వెబ్ సైటును నిషేధించడం పై విప్లవ రచయితల సంఘం మీడియా ప్రకటన పూర్తి పాఠం)

అంతర్జాల పత్రిక బ్యాన్డ్ థాట్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రత్యర్థి భావాలను చూసి నిరంతరం భయపడే ఫాసిస్టులు మాత్రమే ఇలాంటి పని చేస్తారు. సరిగ్గా ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీ ప్రభుత్వం ఇదే చేసింది. ప్రజాస్వామ్య స్పృహ ఉన్న పాలకులు ఎవరూ భిన్నాభిప్రాయాలకు భయపడరు. పత్రికలను నిషేధించరు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల పాలకులు తమకు భిన్నమైన రాజకీయాలను అణచివేస్తున్నారు. నిషేధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిషేధానికి, అణచివేతకు గురైన రాజకీయాల వేదికగా బ్యాన్డ్ థాట్ నెట్ ఏర్పడింది. భావాలను ఎవ్వరూ నిషేధించకూడదు, అణచివేత ద్వారా భావ ప్రచారాన్ని అడ్డుకోకూడదు.. ఇలాంటి ʹనిషేధితʹ భావాల కూడలిగా ఈ అంతర్జాల వేదికను నిర్వహిస్తున్నాం.. అని బ్యాన్డ్ థాట్ నెట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భారతదేశంలోని సీపీఐ మావోయిస్టు రాజకీయ సమాచారం కూడా ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు, హిందుత్వ, రాజ్యహింస, దళితులపై దాడులు వగైరా నిత్య రాజకీయాల్లోని ఎన్నో అంశాలపై ఆ పార్టీ పత్రికా ప్రకటనలు, అభిప్రాయాలు, సమాచారంతోపాటు నిషేధిత రాజకీయాలపట్ల ప్రజాస్వామిక వాదుల రచనలు, ప్రకటనలు కూడా ఇందులో అప్లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు గూగుల్లోకి వెళితే బ్యాన్డ్ థాట్ వెబ్సైట్ ఓపన్ అవుతుంది. అందులోని మిగతా అన్ని దేశాల విభాగాల్లోకి వెళ్లవచ్చు. ఒక్క సీసీఐ మావోయిస్టు విభాగాన్ని భారత కేంద్ర కమ్యూనికేషన్ శాఖ ఆదేశాలతో బ్లాక్ చేసినట్లు వస్తుంది.

నిజానికి ఈ విషయంలో మొదట భారత ప్రభుత్వం ఈ సైట్ నిర్వాహకులకు ఒక ఉత్తరం రాసింది. మీ సైట్లో నిషేధిత విషయాలు వస్తున్నాయని వివరణ కోరింది. ఈ సైట్ను అమెరికా నుంచి నిర్వహిస్తున్న బాధ్యులు దీనికి ఒక సమాధానం ఇచ్చారు. అదేమంటే.. అసలు భావాలను నిషేధించకూడదనే ప్రజాస్వామిక విలువ మీద మేం ఈ సైట్ నడుపుతున్నాం. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించిన రాజకీయాల వేదికగా ఇది ఉండాలనుకున్నాం. ప్రభుత్వాలు నిషేధించినందు వల్లే వాటిని ప్రచారంలో పెట్టేందుకు దీన్ని నడుపుతున్నాం. ఇలా దీన్ని నిర్వహించే హక్కు మాకు ఉంది. కాబట్టి భారతదేశంలో మీరు నిషేధించిన సీపీఐ మావోయిస్టు రాజకీయ సమాచారం, రచనలు ఇందులో ఇండకూడదని మీరు అనడంలో అర్థం లేదని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత భారత కేంద్ర కమ్యూనికేషన్ శాఖ ఈ సైట్లోని సీపీఐ మావోయిస్టు విభాగాన్ని బ్లాక్ చేసింది.

సీపీఐ మావోయిస్టు రాజకీయాలంటే భారత కేంద్ర ప్రభుత్వం ఎంత భయపడుతోందో ఈ చర్య తెలియజేస్తోంది. పాలకుల పిరికితనానికి ఇది నిదర్శనం. పాఠకులు ఈ వెబ్సైట్లోకి వెళ్లి అందులో ఉండే వివరాలు చదివి తమ వివేకంతో స్పందిస్తారని, దానికి చోటు ఉన్నప్పుడే ఈ సమాజం జీవించి ఉన్నట్లని పాలకులు అనుకోలేకపోయారు. ఇది సీపీఐ మావోయిస్టు రాజకీయాల మీద నిషేధమే కాదు.. దేశ పౌరుల వివేకాన్ని, చైతన్యవంతమైన రాజకీయ భాగస్వామ్యాన్ని కూడా నిషేధించినట్లు, అవమానించినట్లు.

రాజకీయాలను నిషేధించడమంటే విభిన్న రాజకీయాలు తెలుసుకునే పౌరుల స్వేచ్ఛను కూడా నిషేధించినట్లే. సీపీఐ మావోయిస్టు పార్టీకి తన రాజకీయాలను ప్రచారం చేసుకునే స్వచ్ఛ ఉంటుంది. వాటిని తెలుసుకునే స్వేచ్ఛ ఈ పౌరులందరికీ ఉంటుంది. వాటిని ప్రచారంలో పెట్టే స్వేచ్ఛ, హక్కు బ్యాన్డ్ థాట్ నిర్వాహకులకూ ఉంటుంది. ఈ హక్కును, స్వేచ్ఛను విప్లవ రచయితల సంఘం సంపూర్ణంగా బలపరుస్తోంది. ఈ రాజకీయ స్వేచ్ఛను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది.

ఈ దేశం ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాల్లాగే మావోయిస్టు రాజకీయాలు కూడా తెలుసుకునే స్వేచ్ఛ ఉంది. రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండేందుకు, వాటిని ప్రచారం చేసుకునేందుకు స్వేచ్ఛ లేకపోతే ఇది దేశమూ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థా కాదు. మావోయిస్టులు చెప్పినట్లు ఇది దొంగ ప్రజాస్వామ్యమవుతుంది. తాజాగా ఈ విషయాన్ని రుజువు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బ్యాన్డ్ థాట్పై నిషేధం విధించింది. దేశంలో కొన్ని రాజకీయాలకే ప్రచారం చేసుకునే హక్కు ఉండి, కొన్ని రాజకీయాలకు లేనప్పుడు దీన్ని ప్రజాస్వామ్యమని చెప్పుకొనే నైతిక అర్హత పాలకులకు లేదు. రాజకీయంగా, నైతికంగా మన పాలకులు ఆ అర్హతను ఎన్నడో కోల్పోయారు. అందులో భాగమే బ్యాన్డ్ థాట్ లింక్ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయడం.

బీజేపీ, కాంగ్రెస్ దగ్గరి నుంచి ఓట్ల కోసం ఎగబడుతున్న చిన్న చితక పార్టీలన్నీ తమ రాజకీయ విధానాలను ప్రచారం చేసుకోడానికి ఎన్నో పద్ధతులు పాటిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తన విధానాలేమిటో ప్రజలకు చెప్పుకోకుండా ఎలా ఉంటుంది? ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలే రాజకీయ పార్టీలని, వాటివే రాజకీయాలను, వాటికే ప్రచారం చేసుకునే హక్కు ఉందనే అథమ స్థాయి నిర్వచనం మన ప్రభుత్వాలు ఇచ్చాయి. కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఈ దేశం పగ్గాలు ఇచ్చి, వాళ్ల ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకునే హక్కు అధికారంలో ఉన్న బీజేపీకి, నరేంద్రమోదీకి ఉన్నట్లే స్వావలంబన, కింది నుంచి అభివృద్ధి, దోపిడీ లేకపోవడమే నిజమైన అభివృద్ధి అని చెప్పుకోడానికి మావోయిస్టులకు కూడా అంతే హక్కు ఉంది. దాని కోసం వాళ్లు పత్రికలు నడుపుకోవచ్చు. పుస్తకాలు అచ్చేసుకోవచ్చు. సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. పాలకపార్టీల దోపిడీ విధానాలు, వాటిని కప్పిపెట్టడానికి చెబుతున్న అబద్ధాలు, అనైతిక వాదనలు, వంచనలు, మోసాలను విప్లవ రాజకీయాలు బట్టబయలు చేస్తాయి. సారాంశంలో ఈ దిక్కుమాలిన ప్రజాస్వామ్యం బూటకత్వం చాటి చెబుతాయి.. ప్రజలను ఆలోచింపచేస్తాయి.. అంతిమంగా నియంతృత్వంగా సాగుతున్న ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు ప్రజల్ని పురికొల్పుతాయి. పార్లమెంటరీ విధానంలో అధికారం పొందిన, పొందాలని వెంపర్లాడుతున్న అన్ని రాజకీయ పార్టీలకు ఇలాంటి విప్లవరాజకీయ ప్రచారమంటే భయం. అది నిరంతరం వాళ్లను వెంటాడుతోంది. అందుకే అధికారంలో ఉన్న పార్టీ చేసే బ్యాన్డ్ థాట్ పత్రికను బ్లాక్ చేయడంలాంటి ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుంది. మిగతా పార్లమెంటరీ పార్టీలు వాటిపట్ల మౌనం పాటిస్తాయి.

మళ్లీ ఈ పార్టీలన్నిటికీ అధికార, అనధికార పత్రికలు ఉన్నాయి. రాజకీయ నాయకుల పెట్టుబళ్లు, వాటాలు వీటిలో ఉంటాయి. కొన్ని పార్టీలు నేరుగా పత్రికలను నడుపుతూ ఉన్నాయి. అనుబంధ టీవీ చానళ్లు ఉన్నాయి. వాటిలో తమ రాజకీయాలు ప్రచారం చేసుకుంటుంటాయి. నిస్సిగ్గుగా ప్రతి పత్రిక మరో పత్రిక మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బంది కలిగినప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద దాడి అని వీధుల్లోకి వస్తుంటాయి. నిజమైన భావ ప్రకటన అంటే నిర్వచనం తెలియని కూడా పాలకవర్గ పత్రికలు తాము ఏ పార్టీకి తోకగా ఉన్నాయో ఆ పార్టీ రాజకీయాల కోసమే అన్ని పేజీలు కేటాయిస్తుంటాయి. ఈ విషయంలో సంఘ్పరివార్ ఊడల మర్రిలా విస్తరించింది. మీడియా సంస్థలన్నిటినీ తన గొడుగు కిందికి తీసుకొని వచ్చింది. చివరికి సోషల్ మీడియాలో తమ బ్రాహ్మణీయ భావజాల ప్రచారానికి, ప్రగతిశీల రాజకీయాలపై దాడులు చేయడానికి సంఘ్ ప్రభుత్వం నేరుగా వేలాది మంది ఉద్యోగులను అనధికారికంగా ఏర్పాటు చేసుకుంది. తాము చేసే హత్యలను, అత్యాచారాలను, హింసను, మతోన్మాద భావజాలాన్ని సమర్థించుకుంటూ ప్రచారం చేసుకుంటోంది.

తాము ఇంత విషపూరిత, అనైతిక రాజకీయ ప్రచారం చేసుకుంటూ ఈ దేశ పీడిత ప్రజల విముక్తికి దారి చూపే విప్లవ రాజకీయ సమాచారం అందించే బ్యాన్డ్ ను బ్లాక్ చేయడానికి విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛను, భిన్నాభిప్రాయ ప్రచారాన్ని ఒక విలువగా గౌరవించే వాళ్లందరూ బ్యాన్డ్ థాట్ పునరుద్ధరణకు కృషి చేయాలని విరసం పిలుపు ఇస్తోంది
.
పాణి
విరసం కార్యదర్శి

Keywords : banned thought, maoists, usa, virasam, indian government
(2019-06-24 08:58:29)No. of visitors : 287

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


బ్యాన్డ్