సత్యం సారుకు జోహార్లు - ‍ఎన్.వేణుగోపాల్


సత్యం సారుకు జోహార్లు - ‍ఎన్.వేణుగోపాల్

సత్యం

మిత్రులారా, నోముల సత్యనారాయణ సారు (1940-2018) మరణించారనే విషాదవార్త మీతో పంచుకోవడానికి విచారిస్తున్నాను. ʹఒక కంట స్నేహం మరో కంట సాహిత్యం. సామ్యవాద దృష్టి ప్రాణాధికం – ఇది డాక్టర్ నోముల సత్యనారాయణ గారి వ్యక్తిత్వం. విద్యుత్తూ విద్వత్తూ ప్రవహించే నల్లగొండ వాసిʹ అని ఆయన సాహిత్య విమర్శ వ్యాసాల పుస్తకం ఆయనను పరిచయం చేసింది.

కొంతకాలం పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉండి, తర్వాత ఇంగ్లిష్ లెక్చరర్ అయి, ʹభారతీయాంగ్ల నవలలో నూతన నైతికతʹ అనే అంశం మీద సిద్ధాంతవ్యాసంతో డాక్టరేట్ పట్టా పొందిన సత్యనారాయణ గారు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలలో, సాహిత్యాలలో ఒకదాని నుంచి మరొకదానికి అతి సులభంగా సంచరించగల అపార ప్రజ్ఞావంతులు. తక్కువగానే అయినప్పటికీ ఆయన తెలుగు సాహిత్య విమర్శలో మౌలిక కృషి సాగించారు. మొత్తంగా ఆయన రాసిన సాహిత్య విమర్శ పది పన్నెండు వ్యాసాలకు మించకపోవచ్చు, వాటిలో తొమ్మిది ʹసామ్యవాద వాస్తవికత – మరికొన్ని వ్యాసాలుʹ పేరుతో 1998లో వెలువడింది. టావ్ చెంగ్ రాసిన చైనీస్ నవల ʹనా కుటుంబంʹ ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువదించారు. అయన నిరంతర అధ్యయనశీలి, నడిచే గ్రంథాలయం, విజ్ఞాన సర్వస్వం. ఆయనతో మాట్లాడడమే ఎడ్యుకేషన్ అనిపించే వ్యక్తిత్వం. అద్భుత మేధావి అయి ఉండి కూడ ఎక్కడో నిచ్చెన ఎక్కి కూచోకుండా కలిసిన ప్రతి ఒక్కరి తోనూ స్నేహంతో ప్రేమాదరాలతో సరదాగా కలుపుగోలుగా సంభాషించడం ఆయన నైజం. ఆయన ఒక అరుదైన వ్యక్తి.

సత్యం సారు 1957-58లో బిఎ లో వరవరరావు గారికి ఒక సంవత్సరం సహాధ్యాయి. అభిప్రాయాలలో భిన్నత్వం ఉన్నప్పటికీ ప్రాణమిత్రులయ్యారు. ఈ అరవై సంవత్సరాలుగా ఆ స్నేహం చెక్కుచెదరలేదు. దివాకరుని కృష్ణ మోహన్ శర్మ, కొంపెల్లి వెంకట్ గౌడ్ లు 2010లో సత్యం సారు అనుభవాలూ జ్ఞాపకాలూ ʹనోముల సార్ – అన్ టోల్డ్ లెటర్స్ʹ అనే పేరుతో తెచ్చిన విలువైన పుస్తకంలో ʹఆయన ఏనాడు ఎక్కడున్నాగని ఆయన ఎనకనే నోముల సత్యనారాయణ వుంటడు. మీకు 150 సంవత్సరాలొచ్చినాగాని వరవరరావు ఎనకనే నోముల సత్యనారాయణ వుంటడుగాని అందుకు భిన్నంగా వుండడు. కరెక్ట్ అనేది రిలేటివ్ టర్మ్. యీయన ఎట్ల దోస్తయితడు? ఏ రాజకీయ వ్యవహారాలు వున్నాగని, పరిస్థితులు ఎట్ల వున్నా వరవరరావు ఆలోచనా ధోరణిలోనే సత్యనారాయణ వున్నడుʹ అని స్పష్టంగా అన్నారు.

ఆ స్నేహం వల్ల ఆయన మా ఇంట్లో అందరికీ కూడ గౌరవనీయ మిత్రులు అయ్యారు. సత్యం సారు సన్నిహిత బంధువు, లోతైైన సాహిత్య విమర్శకుడు, సృజన సాహితీమిత్రుడు, వరంగల్ ఆర్ట్స్ కాలెజిలో ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేసిన ఎ జగన్మోహనా చారి గారికి నేను బిఎ మూడు సంవత్సరాలూ శిష్యుడిగా ఉన్నందువల్ల కూడ సత్యం సారుతో సాన్నిహిత్యం పెరిగింది.

సత్యం సారు అనువాదం చేసిన చైనీస్ నవల ʹనా కుటుంబంʹ ఒక విశిష్ట రచన. చైనా సమాజానికీ మన సమాజానికీ చాల పోలికలున్నాయని, ఇక్కడి విప్లవం కూడ అక్కడి విప్లవం వంటిదేనని 1948లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నాటికే ఒక అవగాహన వచ్చినప్పటికీ, చైనా సాహిత్యం తెలుగులోకి వచ్చినది చాల తక్కువ. నక్సల్బరీ-శ్రీకాకుళాల ప్రజ్వలనానికి ముందే చిట్టా మహానందీశ్వర శాస్త్రి గారు (మహేశ్ పేరుతో) అనువాదం చేసిన ʹకొడుకులు – కూతుళ్లుʹ ఒకటే నవల తెలుగులోకి వచ్చింది. విప్లవోద్యమం తర్వాత మొట్టమొదటిదిగా, బహుశా తెలుగులో రెండో చైనీస్ నవలగా, ʹనా కుటుంబంʹ సత్యం సారు అనువాదంలో వెలువడింది. విశాఖపట్నం శ్రీశ్రీ షష్టిపూర్తికి వెళ్లినా, విరసం స్థాపక సభ్యులందరితోనూ సన్నిహితంగా ఉన్నా ఆయన విరసంలో చేరలేదు. కాని అప్పుడే శ్రీపతి గారి కోరిక మేరకు టావ్ చెంగ్ రచనకు ఇంగ్లిష్ అనువాదం ʹమై ఫామిలీʹని తెలుగు చేశారు. అది సృజనలో 1972 జూలై సంచిక నుంచి నవంబర్ సంచిక వరకు సీరియల్ గా అచ్చువేసి, వెంటనే సృజన ప్రచురణగా వెలువరించాం. విశేష ప్రజాదరణ పొందిన ఆ నవల సృజన ప్రచురణగానూ, ఇతర ప్రచురణల్లోనూ నాలుగైదు సార్లు పునర్ముద్రణ జరిగింది. అప్పటివరకూ అనువాదకుడి పేరు వేయడానికి అంగీకరించని సత్యం సారు, నాలుగో పునర్ముద్రణకు తన పేరు వేయడానికి ఒప్పుకున్నారు.

ʹసామ్యవాద వాస్తవికత – మరి కొన్ని వ్యాసాలుʹలో సంకలితం చేసిన తొమ్మిది ఆలోచనాత్మక, మౌలిక వ్యాసాల్లో ఎనిమిది సృజనలోనే మొదట వచ్చాయి. ఆయనే చెప్పుకున్నట్టు ʹఈ వ్యాసాల రచనకు మూల ప్రేరకుడు నా సహాధ్యాయి వరవరరావు. నేనేమి రాసినా సృజనలో వేసినాడు. ఒక్క అక్షరమూ మార్చలేదు, మార్చాలని సూచించలేదు.ʹ ఆ రచనల్లో ఎక్కువ భాగం లక్ష్మీపతి పేరుతోనో, సత్యం పేరుతోనో అచ్చయ్యాయి.

సత్యం సారుకు జోహార్లు.

- ‍ఎన్.వేణుగోపాల్

Keywords : nomula satyanarayana, varavara rao
(2019-03-18 10:09:18)No. of visitors : 256

Suggested Posts


సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


సత్యం