మావోయిస్టు అంటూ ఎన్‌జీఆర్ఐ అధికారి వెంకట్రావు అరెస్టు.. వెనుక ఎన్నో అనుమానాలు..!


మావోయిస్టు అంటూ ఎన్‌జీఆర్ఐ అధికారి వెంకట్రావు అరెస్టు.. వెనుక ఎన్నో అనుమానాలు..!

మావోయిస్టు

బీమా కోరేగావ్ అనే ఒక సాకును చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో మంది హక్కుల కార్యకర్తలు, రచయితలు, ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేస్తోంది. తాము అరెస్టు చేసిన వాళ్లందరూ మావోయిస్టులే అని ఆరోపిస్తూ బూటకపు చార్జిషీట్లు వేస్తూ అరాచకం సృష్టిస్తోంది. వరవరరావు, సుధా భరద్వాజ్ వంటి వారిని పూణే పోలీసులు అరెస్టు చేసిన ఘటన మరవక ముందే.. ఎన్‌జీఆర్ఐలో పని చేసే ఒక అధికారిని చత్తీస్‌గడ్‌లో అరెస్టు చేశామంటూ ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్ఐలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్. వెంకట్ రావు అనే అధికారిని డిసెంబర్ 23న రాజ్‌నంద్‌గావ్ అనే ఊరిలో అరెస్టు చేసినట్లు చత్తీస్‌గడ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్ నక్సల్స్ నెట్‌వర్క్‌కు వెంకట్రావ్ అనుసంధానకర్తగా ఉన్నారని.. మావోయిస్టు పార్టీలోని టాప్ లీడర్స్‌తో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆ ప్రకటనలో ఆరోపించారు. తమ విచారణలో పలు విషయాలు తెలిశాయని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, వెంకట్రావు అరెస్టు విషయమై ʹన్యూస్ లాండ్రీʹ అనే వెబ్‌సైట్ ప్రతినిధులు ఆయన కుటుంబాన్ని, స్నేహితులను, సహుద్యోగులను సంప్రదించగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వీరందరూ పోలీసులు చెప్పే విషయాలను తోసిపుచ్చడమే కాకుండా పలు ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నారు.

చత్తీస్‌గడ్ పోలీసులు వెంకట్రావును 23 డిసెంబర్ రోజు రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని బాగ్‌నది పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశామని చెబుతున్నారు. ఆయన మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చత్తీస్‌గడ్ జోన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ ఆనంద్‌ తేల్తుంబ్డే కలవడానికి వస్తుండగా అరెస్టు చేశామని పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా మావోయిస్టు పార్టీలో ʹమూర్తిʹ అనే పేరుతో వెంకట్రావును పిలుస్తారని కూడా అంటున్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ వెంకట్రావు కుటుంబం తీవ్రంగా ఖండిస్తోంది.

వెంకట్రావు డిసెంబర్ 18న హైదరాబాద్ నుంచి బయలుదేరి నాగ్‌పూర్ వెళ్లారని.. అక్కడ ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్లి నాగ్‌పూర్‌లోని ఎన్‌జీఆర్ఐ గెస్ట్ హౌస్‌లోనే బస చేశారని ఆయన భార్య హేమ అంటున్నారు. 19వ తేదీన ఆయన చివరి సారిగా కాల్ చేశారని.. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి కాల్ రాలేదని ఆమె స్పష్టం చేశారు.

మానవ హక్కుల న్యాయవాదిగా సుపరిచితమైన హేమ తన భర్త అరెస్టుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన భర్త వామపక్ష భావాలు ఉన్న వ్యక్తేనని.. ఎన్‌జీఆర్ఐలో చేరక మునుపు పలు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాని ఏనాడూ ఏ ఉద్యమ సంస్థలతోనూ ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు. కేవలం స్నేహితులన కలుసుకోవడానికి ఆయన నాగ్‌పూర్ వెళ్లారని.. 19నాడే ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన అరెస్టును మాత్రం 23న చూపించారని ఆమె ఆరోపిస్తున్నారు.

నాగ్‌పూర్‌లోని ఎన్‌జీఆర్ఐ గెస్ట్ హౌస్ నుంచి తన భర్త లగేజీని పోలీసులే తీసుకెళ్లారని.. నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాలు తిప్పుతూ ఆ తర్వాత అరెస్టు చూపించారని ఆమె చెబుతున్నారు. తనకు 22న ఒక కాల్ వచ్చింది కాని అది స్పష్టంగా లేదని.. కాల్ కట్ అవుతూ ఉండటంతో తనకు ఏమీ వినపించలేదని.. కాని పోలీసులు డిసెంబర్ 23న పోలీసులు కాల్ చేసి తన భర్తను అరెస్టు చేసినట్లు చెప్పారని ఆమె అన్నారు. ఆ తర్వాత రోజే తాను రాజ్‌నంద‌గావ్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడానని.. తన భర్తపై ʹథర్డ్ డిగ్రీʹ ప్రయోగించడానికి వీళ్లేదని చెప్పినట్లు హేమ తెలిపారు.

మానవ హక్కుల న్యాయవాదిగా తాను పలు కేసులు వాదించానని... అలాగే పలు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నానని హేమ చెప్పారు. తన గురించి పోలీసులు తెలుసుకొని.. ఆ ఉద్యమాలన్నింటిలో తన భర్తే పాల్గొన్నట్లు రిపోర్టు రాశారని ఆమె ఆరోపించారు. చత్తీస్‌గడ్ పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తన భర్త రైతుల నిరసన, దళితులు ఉద్యమాలు, నర్మదా బచావ్ ఆందోళన, మాండ్లా చుట్కా అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, బీమా కోరేగావ్ వంటి ఉద్యమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారని.. కాని అవన్నీ సత్య దూరాలని హేమ చెబుతున్నారు. తన భర్త పేరును కావాలనే ఇరికించారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

తన భర్త ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొన లేదని.. పోలీసులు పేర్కొన్న ఏ సంఘటనలతోనూ సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మండ్లా చుట్కా అణువిద్యుత్ కేంద్రానికి మేధా పాట్కర్ మద్దతు కూడా ఉన్నప్పుడు వెంకట్రావ్ ఎలా వ్యతిరేకిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. తన భర్తపై చత్తీస్‌గడ్‌లో కేసు నమోదు అయితే.. మహారాష్ట్రలో ఎందుకు అదుపులో తీసుకున్నారని.. మూడు రోజుల పాటు తన అరెస్టును ఎందుకు చూపలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. తన భర్త అరెస్టుపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు పిర్యాదు చేస్తానని.. అక్కడ పూర్తి నిజాలు చెబుతానని ఆమె స్పష్టం చేశారు.

ఇదే విషయంపై ఎన్‌జీఆర్ఐ డైరెక్టర్ వీరేంద్ర తివారీని సంప్రదించగా.. వెంకట్రావ్ గత 30 ఏండ్లుగా ఉత్తమ అధికారిగా సేవలు అందించారని... ఆయనపై వచ్చిన ఆరోపణలు తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ఆయన సాధారణ సెలవుపై ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Source : Newslaundry.com

Keywords : maoist, nagpur, chattisgarh, ngri, n venkatrao, urban naxal, hema, lawey, police, మావోయిస్టు, అర్బన్ నక్సల్, ఎన్ వెంకట్రావు, చత్తీస్‌గడ్ పోలీసు
(2019-01-16 05:45:14)No. of visitors : 645

Suggested Posts


0 results

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
more..


మావోయిస్టు