మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం


మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం

మానవ

అధికారంలో లేకపోతే ప్రతిపక్షం కూడా ఉద్యమ సంస్థలాగ ప్రవర్తిస్తుంది. అధికారం కోసం ఎన్ని అబద్దపు మాటలైనా చెప్తుంది. తీరా అధికారం గుప్పిట్లోకి వచ్చాక.. గతంలో మాట్లాడిన మాటలు.. చేసిన వాగ్దానాలు అన్నీ మరచిపోవడమే రాజకీయ పార్టీల సహజలక్షణం.

తాజాగా చత్తీస్‌గడ్‌లో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర సీఎం ఎన్నికల ముందు, ఆ తర్వాత చెప్పిన మాటల్నీ నీటి మూటలే అన్ని తెలిసిపోయే సంఘటన జరిగింది. ఇకపై మావోయిస్టులపై ఎలాంటి ఎన్‌కౌంటర్లు ఉండవని చెప్పిన సీఎం భూపేష్ ఆ తర్వాత భద్రతా బలగాలను వెనుకకు తీసుకోం అని కూడా చెప్పారు. ఇక తాజాగా బస్తర్ ప్రాంతంలో అరాచకం సృష్టించి.. ఎందరో స్థానికులు, ఆదివాసీల మరణానికి కారణమైన బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్‌పీ కల్లూరికి చత్తీస్‌గడ్ కొత్త ప్రభుత్వం ఉద్యోగోన్నతి ఇచ్చింది.

ఎన్నికల ముందు మావోయిస్టుల చర్యలను సమర్థించిన సీఎం భూపేష్ తాజాగా బస్తర్ నుంచి కల్లూరీని రాజధాని రాయ్‌పూర్‌నకు ప్రమోషన్‌పై తీసుకొని వచ్చి కీలకమైన శాఖ అప్పగించడం విశేషం. ప్రస్తుతం సమాచారం మేరకు కల్లూరీని ఏసీబీ అధినేతగా నియమించారు. ఏసీబీతో పాటు ఆర్థిక నేరాల శాఖకు కూడా ఆయననే అధిపతిగా చేశారు.

కల్లూరిపై గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడటంతో ఆయనను బస్తర్ ప్రాంతం నుంచి బదిలీ చేశారు. మానవ హక్కుల కార్యకర్త, ఉద్యమకారురాలు అయిన బేలా భాటియాపై జరిగిన సామూహిక దాడికి బాధ్యత వహిస్తూ ఆయనను బస్తర్ నుంచి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ చేశారు.

దంతెవాడ జిల్లాలో 2011 ఏడాదిలో ఆదివాసీ గ్రామాలపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా.. అల్లర్లు సృష్టించి దాదాపు 300 ఇండ్లను తగులబెట్టారు. ఆ సమయంలో దంతెవాడ ఎస్పీగా ఉన్నది కల్లూరీనే. గ్రామాల్లోని ఇండ్లను తగలబెట్టడమే కాకుండా ముగ్గురు మహిళలపై అత్యాచారం కూడా చేశారు. తడిమెట్ల, మోరపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో పోలీసులు చేసిన అరాచకం మీడియా కూడా బయట పెట్టింది.

అయితే.. ఆనాడు జరిగిన ఈ అరాచకాలపై దర్యాప్తు సంస్థలు ప్రస్తావించకపోవడే కాక.. కల్లూరికి మద్దతుగా రిపోర్ట్ అందించడం అత్యంత దారుణం. కాగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ కల్లూరి చేసిన హక్కుల ఉల్లంఘనపై నోటీసులు కూడా జారీ చేసింది. కాని ఇవేమీ పట్టించుకోకుండా చత్తీస్‌గడ్ సీఎం భూపేష్ భగేల్ తమ రాష్ట్రంలో కీలకమైన పోస్టును కల్లూరికి ఇవ్వడంపై ప్రజా సంఘాలు, హక్కుల కార్యకర్తలు, ఆదివాసీ ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు.

సోర్స్ : స్క్రోల్.ఇన్

URL : https://scroll.in/latest/908005/controversial-former-bastar-inspector-general-srp-kalluri-gets-key-posts-in-chhattisgarh

Keywords : maoist, chattisgarh, bhupesh, cm, srp kalluri, bastar ig, బస్తర్, ఐజీ, కల్లూరి, ప్రమోషన్, సీఎం భూపేష్, మావోయిస్టులు
(2019-03-18 00:50:08)No. of visitors : 262

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


మానవ