ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

ఒక

(పవన రాసిన ఈ వ్యాసం మహిళామార్గం నవంబర్ - డిసెంబర్ సంచికలో ప్రచురించబడినది)

దాదాపు పదిహేను, ఇరవై సంవత్సరాల కింద ఒక మొదలు పెట్టబోయే టీవీ ఛానల్ కోసం ట్రైనింగ్లో ఉన్న జర్నలిస్టులకు మహిళా సమస్యలమీద క్లాసు తీసుకొమ్మని మిత్రులు పిలిచిను. అప్పటికి నేను చైతన్య మహిళా సంఘంలో క్రియాశీల కార్యకర్తను. అది క్లాసు కంటే కూడా ఒక చర్చలాగా ప్రశ్నలు జవాబులుగా నడిచింది. అక్కడ ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగిండు - ʹకొద్ది మంది స్త్రీవాదులు కూడా వాళ్ల పేర్ల చివర భర్తల పేర్లు లేదా ఇంటి పేర్లు తగిలించుకుంటారెందుకుʹ అని. వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్లకుండొచ్చు, వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను కాని, నేను ఈ విషయాన్ని ఆలోచించే తీరు మీతో పంచుకుంటాను అని ఇట్ల చెప్పిన - "నా మేరకు నేను భర్త పేరో, ఇంటి పేరో ఎట్టి పరిస్థితుల్లో నా పేరుకు తగిలించుకోను (అప్పటికే నాకు పెళ్ళైంది). ఐతే నాకున్న ఇంటి పేరు, అంటే పుట్టింటి పేరు కూడా పితృస్వామ్య లక్షణాలను కలిగి వున్నదే. అది నా తండ్రి ఇంటి పేరు; తల్లిది కాదు. ఒకవేళ తల్లిది పెట్టుకోవాలన్నా అది ఆమె తండ్రిది (అంటే మా తాతది) తప్ప ఆమె తల్లిది కాదు. అంటే మన సమాజంలో ʹఇంటి పేరు అనేది పితృస్వామ్య ఆనవాలు తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను తప్పని సరైతేతప్ప. అధికారిక అవసరాలు ఉంటే తప్ప ఇంటిపేరు వాడొద్దు అని నిర్ణయించుకున్న నన్ను నేను ʹపవనʹ గానే చెప్పుకుంట. ʹపవనʹగానే రాసుకుంటʹ అని.

నిజానికి నాకీ అవగాహన అకస్మాత్తుగా వచ్చిందేమీ కాదు. నేను పుట్టిన కుటుంబమూ, పెరిగిన సమాజమూ నాకీ భూమిక నిచ్చాయి. నేను విప్లవకవి వరవరరావు బిడ్డను. నా బాల్యమంతా విప్లవ రాజకీయాలను వింటూ, చదువుతూ; రాడికల్ విద్యార్థి, యువజన సంఘాల ఆచరణ చూస్తూ గడిచింది. సృజన పత్రిక నిర్వహణలో భాగంగా ʹసాహితీ మిత్రులుʹ చర్చించుకునే అనేక రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక అంశాలు వింటూ వుండడం మా నెలవారీ కార్యక్రమాల్లో తప్పనిసరి. | నేను హైస్కూలు వయసుకు వచ్చేనాటికి తెలుగు సమాజంలోకి స్త్రీవాద సాహిత్యం, స్త్రీవాద రాజకీయాలు దూసు కొచ్చాయి. తర్వాత సహజంగానే నేను చైతన్య మహిళా సంఘం లో కార్యకర్తనై నా అవగాహనను మరింత మెరుగుపర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే బాపు (నాన్న)గాని, మామయ్యలు గాని వుత్తరాలు రాస్తే, కవర్ మీద మా పేరు మాత్రమే రాసేటోళ్ళు. ఇంటి పేరు గాని, కేర్ ఆఫ్ అని గాని, డాటర్ ఆఫ్ అని గాని రాసేటోళ్ళు కాదు. కాబట్టి ఇంటి పేరు, ఇంటి యజమానిʹ పేరు అనే అంశాలపై కొంత అవగాహన ఏర్పడింది. | ఆ తర్వాత కాలంలో దళిత సాహిత్యం, దళిత రాజకీయ | ఉద్యమంతో పరిచయం ఏర్పడే క్రమంలో భారతదేశంలో ఇంటిపేరుకు ʹకులంʹ కూడా ఉంటదని అర్థమయినాక ʹఇంటిపేరుʹ మీద ఉన్న ఆ కొంచెం మోజు కూడా పోయింది. చలసాని ప్రసాద్ ఇంటి పేరును బట్టి వ్యక్తుల కులాన్ని దాదాపు కరెక్ట్గా చెప్పేవాడు. మన సమాజంలో కొన్ని ఇంటిపేర్లు స్పష్టంగా కులాన్ని సూచిస్తాయి (ఊర్ల పేర్లే `ఇంటి పేర్లు అయినపుడు అవి అన్ని కులాల్లో కనిపిస్తయి కానీ.. ), పీడిత కులాల ముఖ్యంగా దళిత కులాల ఇంటి పేర్లలో కొన్ని అవమానకరంగా భావించే పదాలతో ఉంటాయి (ఉదాహ రణకు ʹపెంటకిందిʹ, ʹఎడ్డిʹ లాంటివి). ఇట్ల నేను ఏర్పర్చుకున్న అవగాహనతో తప్పనిసరైతే తప్ప ʹఇంటిపేరు చెప్పడం, రాయడం | ఎన్నో సంవత్సరాలకిందనే మానుకున్న

అయితే ఇదంతా నేనిప్పుడు ఎందుకు రాస్తున్నా అని మీకు అనిపించొచ్చు. ఆగస్టు 28న దేశవ్యాప్తంగా కొన్ని ఇండ్ల మీద జరిగిన పోలీసు దాడులు, అరెస్టులు ఈ చర్చను, ఆలోచనలను మళ్లా నా ముందుకు తెచ్చినయి. ఆ రోజు దాడి జరిగిన ఇళ్లలో మా ఇల్లు కూడా ఉంది. ఆ రోజు నాతోని, నా సహచరుడితోని మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు మాట్లాడిన విషయాలు రాజ్యం, ఆధిపత్య శక్తులు ఎంత పితృస్వామ్య స్వభావాన్ని కలిగి ఉంటాయో స్పష్టం చేసినయి. ఆతర్వాత పత్రికలు వార్తలను రాసే తీరు మీడియాలోని పితృస్వామ్య భావజాలాన్ని చూపించింది. గత నెల రోజులుగా అంటే బాపు అరెస్టు అయి పూనే జైలుకు పోయిన తర్వాత ఇంటి పేరుʹ మళ్ళొక్కసారి ముందు కొచ్చింది. ఆ అనుభవాలను మీతో పంచుకుందామనే ఈ ప్రయత్నం.

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. నేను ʹపవనʹను. ఒక మహిళను, ఒక మనిషిని, చైతన్య మహిళా సంఘం సభ్యురాలిని, ఒక అధ్యాపకురాలిని, ఇంకా ఇంకా చాలా... కాని ʹపవనʹను అని గట్టిగా చెప్తామని.

ఆగస్టు 28 నాడు మా ఇంటి మీద (నేను, సత్యనారాయణ, మా పాప కలిసి ఉండే ఇల్లు) పోలీసు దాడి జరిగింది. వరవరరావు కేరాఫ్ సత్యనారాయణ పేరు మీద సెర్చ్ వారంట్ మహారాష్ట్ర పోలీసులు మా కర్ధం కాని భాషలో చూపించిన్రు. పొద్దున 8.30 నించి సాయంత్రం 5.30 వరకు పదిమంది మహారాష్ట్ర పోలీసులు, దాదాపు 10 మంది తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు మా ఇంట్లో ఉన్నరు. బైట ఇంకొక 30 నించి 50మంది దాక తెలంగాణ పోలీసులు ఉన్నరు. దాడి వివరాలు మీడియాలో వచ్చినయి కాని, నేనిక్కడ పితృస్వామ్య స్వభావం కలిగిన అంశాలనే ప్రస్తావించ దలుచుకున్న వాళ్లు మామూలుగా నాతో, నా సహచరుడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ వాళ్ల బ్రాహ్మణీయ, భూస్వామ్య భావజాలాన్ని బాగానే చూపించుకున్నరు. నన్ను నగలు, పెళ్ళైన గుర్తులు ఎందుకు వేసుకోలేదని, దేవుడి పటాలు ఎందుకు లేవని అడుగుతూ మీ నాన్నకంటే ఏ నమ్మకాలు లేవు. మీరు కూడా పాటిస్తే ఎట్లా అని ఆశ్చర్యపోయిన్రు. అంటే మతమూ, సాంప్ర దాయాలు పాటించడం స్త్రీల బాధ్యత అని గుర్తు చేసిన్రు. ʹమీ ఆయన వాళ్లకైతే ఏ పద్దతులు ఉండవు కాని, బ్రాహ్మలై వుండి మీరు కూడా ఇట్ల ఎట్ల ఉన్నరని ఆశ్చర్యపోయిన్రు. దాంట్ల విచిత్రమైన విషయమేందంటే ఒకవైపు నన్ను వరవరరావు బిడ్డగా, సత్యనారాయణ భార్యగా మాత్రమే గుర్తిస్తరు. ఇంకోవైపు తండ్రి నాస్తికుడయినా బిడ్డ మతాన్ని, ఆచారాలను ముందుకు తీసుక పోవాలె; భర్త దళితుడు, ఒకవేళ క్రిస్టియను అయినా ఆయన భార్య బ్రాహ్మణ కులానికి చెంది వుంటే ఆ ʹఉన్నతʹ కులాన్ని నిలబెట్టాలె! -

మహారాష్ట్ర పోలీసులు జప్తు చేసుకున్న నా పుస్తకాలు, నాకు సంబంధించిన మహిళామార్గం మెటీరియల్ రాతప్రతుల మీద నా సంతకం కాకుండా సత్యనారాయణ సంతకం తీసు కున్నరు. ʹఅది నా మెటీరియల్, దాంట్ల ఏమన్నా చట్ట వ్యతిరేక సమాచారం ఉంటే దాని బాధ్యత నాదే అయితది కాబట్టి నేను సంతకం పెడుతʹ అంటే ʹకుదరదు. ఇంటి యజమానిʹ మాత్రమే సంతకం చేయాలని వాళ్ల జవాబు. ఇక తెలంగాణ పోలీసులు మా ఇద్దరి పెళ్లి ఎట్ల సాధ్యమయిందని చాలానే ఆశ్చర్యపోయిన్రు. నా సహచరుడి పుట్టుపూర్వోత్తరాలూ, కుటుంబ నేపథ్యమూ రకరకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేసిన్రు. మీ బంధువులు ఎవరన్నా దళాల్లో ఉన్నరా? మీ అన్నగాని, తమ్ముడుగాని, ఎవరన్నా దగ్గరి బంధువులు గాని మావోయిస్టు పార్టీలో పైస్థాయిలో వున్నరాʹ అని మళ్లీ మళ్లీ అడిగిన్రు. చివరికి వాళ్ల ఆశ్చర్యమంతా ఏందంటే ʹమావోయిస్టు పార్టీలో ఏదో ఒక పైస్థాయి నేపథ్యం లేకపోతే, వరవరరావు తన బిడ్డను మీకెట్ల ఇస్తడు?ʹ అని. అంటే అంబానీలు, పిరమల్లు వియ్యమందినట్టు అన్నమాట! వాళ్లకు అర్థమయ్యేది ఏందంటే ఇద్దరు యువతీ యువకుల పెళ్లి అంటే కులం, స్థాయి, ఆస్తిపాస్తులు బేరీజు వేసుకొని తండ్రులు చేసుకొనే ఒప్పందాలు మాత్రమే. వాళ్లకు వరవరరావు తన బిడ్డను ఒకరికి ʹఇయ్యడంʹ మాత్రమే అర్థమయితది తప్ప ఒక మహిళ తన జీవిత సహచరుణ్ణి తానే చూసుకోవడం అనేది ఊహకందని విషయం.
ఇక మీడియా విషయానికొస్తే దాదాపుగా అన్ని ఛానళ్ళు, పత్రికలు చూపించిన, రాసిన అనేక వార్తల్లో దాడి జరిగింది. వరవరరావు అల్లుడు సత్యనారాయణ ఇంటి మీదనే. బిడ్డ అయిన ʹపవనʹది కూడా ఆ ఇల్లు అనే సృహ కలగాలంటే ఇంకెంత భావజాలపరమైన యుద్ధం చేయాలో మనం. ఇంకా బాధాకరమైన విషయమేందంటే కొన్ని అభ్యుదయ, ప్రగతిశీల,విప్లవ పత్రికలది కూడా ఇదే ధోరణి. కొన్ని ప్రజాసంఘాల పత్రికా | ప్రకటనలలో కూడా ఇదే పద్ధతి. కొన్ని ఇంగ్లీషు పత్రికలైతే నన్ను ʹకె. పవనʹను చేసినయి!

ప్రస్తుతం నడుస్తున్న అంశం ఇంటి పేరుకు సంబంధిం చినది. బాపును నవంబరు 17న పూనా పోలీసులు అరెస్టు చేసి తీసుకపోయిన్రు. నవంబరు 26 వరకు పోలీసు కస్టడీ తీసుకోని తర్వాత జైలుకు పంపిన్రు. పూనా ఎరవాడ జైలులో ఉన్న బాపుకు ములాఖత్ పెట్టడానికి అమ్మ, పెద్దక్క బిడ్డ ʹఉదయʹ పోయిన్రు. | అమ్మ ఆధార్ కార్డులో ʹపెండ్యాల హేమలతʹ వైఫ్ ఆఫ్ ʹపెండ్యాల వరవరరావుʹ అని ఉన్నది. కాబట్టి అమ్మకు ములాఖత్ ఇచ్చిన్రు. ఉదయ ఇంటి పేరు పెండ్యాల కాదు కాబట్టి ఇయ్యలేదు. అంతే కాదు ʹబేటే కే బచ్చే మిల్ సక్తే, బేటీ కీ బచ్చే నహీʹ (కొడుకు పిల్లలు కలవచ్చు, బిడ్డ పిల్లలు కుదరదు) అని తేల్చేసిన్రు. మేము ముగ్గురం ఆడపిల్లలమే అయినందుకు, అన్నదమ్ములు లేనందుకు ʹహమ్మయ్య! సమ న్యాయంʹ అని మా పిల్లలు సంతోషపడాల్నేమో!! అదే రోజు అరుణ్ ఫెరేరాను కలవడానికి భార్య, తల్లి, కొడుకు వస్తే తల్లికి, కొడుకుకు ములాఖత్ ఇచ్చి భార్యను కలవనియ్యలేదు. ఎందుకంటే, ఆమె తన ఇంటి పేరును ʹఫెరేరాʹగా మార్చుకోలేదు కాబట్టి. కోర్టులో పిటిషన్ వేసి, అరుణ్ భార్యగా ఆధారాలు చూపిస్తే తప్ప ఆమెకు భర్తను జైలులో కలిసే అవకాశంలేదు. ఇప్పటికి అరుణ్ జైలుకు పోయి దాదాపు రెండునెలలు కావొస్తున్నది.

మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళం డిసెంబర్ 18న బాపును జైలులో కలిసినం. మేం ముగ్గురం పెళ్లి తర్వాత మా ఇంటి పేరు మార్చుకోలేదు కాబట్టి, మా ఆధార్, పాన్ కార్డుల్లో ʹపెండ్యాల అనే ఉన్నది కాబట్టి మేం కలవగలిగినం. 1960లలో పెళ్లి అయిన అమ్మ ఇంటి పేరు మార్చుకున్నది కాబట్టి కలవగలిగింది (ʹసృజనʹ పత్రిక రిజిస్ట్రేషన్ కోసం ఇంటి పేరు మార్చుకున్న అని అమ్మ తర్వాత చెప్పింది). 90లలో తర్వాత మేము మార్చుకోలేదు కాబట్టి కలవగలిగినం. అదే 90ల చైతన్యంతో జెన్నీఫర్ ఫెరేరాʹగా మారలేదు కాబట్టి కలవలేకపోయింది.

మొత్తంగా భీమాకోరేగావ్ కేసులోని అనేక అసంబద్ధ విషయాలలో ఇదీ ఒకటేమో!!! మహిళా ఉద్యమం మొదటి నించీ కూడా ప్రత్యక్ష హింసకు, అణచివేతకు వ్యతిరేకంగా ఎంత పోరాటం చేస్తున్నదో, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా కూడా అంత యుద్ధమే చేస్తున్నది. అయినా ఇప్పటికీ ఇంత లోతుల్లో, నరనరాల ఈ బ్రాహ్మణీయ, పితృస్వామ్య భావజాలం సమాజంలో ఇంకిపోయి ఉన్నదంటే మన పోరాటాన్ని మనం ఇంకా పదునెక్కించాల్సే ఉన్నదని అర్థం. మన యుద్ధాన్ని మనం, మన మీద, ʹమనవాళ్ల మీద, సమాజం మీద చేస్తూనే ఉండాలె. ఈ యుద్ధం మరింత లోతుగా, నిర్దాక్షిణ్యంగా, శషభిషలు లేకుండా మన-పర భేదాలు లేకుండా స్పష్టంగా జరగాల్సిందే.
- పవన‌

Keywords : varavararao, surname, women , Patriarchy
(2024-04-18 18:31:08)



No. of visitors : 3864

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఒక