శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం


శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

శ్రీకాకుళం

(దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు రాసిన ఈ వ్యాసం వీక్షణం జనవరి సంచికలో ప్రచురించబడినది)

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా జైలు రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జైలని, ఖైదీల సంక్షేమానికి అనేక మౌలిక సదుపాయాలు కల్పించామని, పరిశుభ్రతకు మారుపేరని జైలు అధికారులు గొప్పగా చెప్పుకుంటారు. దీని వెనుక రిమాండ్‌ ఖైదీల కోసం ʹవంశధారʹ, ʹపూర్యʹ, ʹచంద్రʹ బ్లాక్‌లే గాక అన్నపూర్ణ బ్లాక్‌, వాటర్‌ ప్లాంట్‌, వీటిని మించి హిందుత్వాన్ని ఖైదీల్లో చొప్పించడానికి శ్రీకృష్ణుడి ఆలయం. పచ్చని చెట్లు, కాయగూరలు, కొబ్బరి, మామిడి జామ, దానిమ్మ, సపోట చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం మరోవైపు కనిపిస్తుంది. ఈ పండ్ల సంపదంతా జైలు అధికారులకే. పొరపాటున చిన్నకాయని ఖైదీలు తెంపినా వాళ్లని కొట్టి అదే చెట్టుకు కట్టేస్తారు.

శ్రీకాకుళం జిల్లా జైళ్లో 9 నెలల పాటు ఎటువంటి విచారణ లేకుండా మగ్గుతున్న ఆదివాసులు బిడిగి సురేష్‌ సన్నాఫ్‌ సుక్కు - ఒరిస్సా, ఆరికె రాజారావు సన్నాఫ్‌ బుడ్డయ్య - శ్రీకాకుళం జిల్లా, కెడ్రిక శివమాధవ్‌ సన్నాఫ్‌ సుక్కు - విజయనగర్‌ జిల్లా, బిడిగి సింగన్న సన్నాఫ్‌ సుంద్రో - శ్రీకాకుళం జిల్లా వివిధ జిల్లాలకు చెందిన ఆదివాసి యువకులపై అనేక రకాల కేసులు బనాయించి శ్రీకాకుళం జిల్లా జైళ్లో నిర్బంధించారు. కేసు వాయిదాలకు గాని కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఏమని ప్రశ్నించినా కేసు ఫైల్‌ కనిపించడం లేదని మాట దాటేస్తున్నారు. అమాయక ఆదివాసుల కేసులు విచారణ జరపకపోగా జైళ్లలో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఈ విధంగా దేశ వ్యాప్తంగా ఆదివాసులను అక్రమంగా అరెస్టులు చేసి సంవత్సరాల పాటు జైళ్లో నిర్బంధిస్తున్నారు. ఆదివాసులు ఏళ్ల తరబడి జైళ్లలోనే దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 2018 నవంబర్‌ 11న తిత్తిలీ తుఫాన్‌ బాధితులకు బియ్యం, బట్టలు పంచడానికి వచ్చిన ప్రజా సంఘాల నాయకుల్ని, మమ్మల్ని అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించడం జరిగింది. నవంబర్‌ 23 వరకు ఖైదీల మధ్య పడపడంతో అనేక విషయాలు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చాయి. ఇందులో వెట్టిచాకిరి, దౌర్జన్యం, బూతులే గాక అనేక మంది ఖైదీలపై అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలిసింది. పురుగులు పడ్డ అన్నం, నీళ్లతో మజ్జిగ, కూరలు ఖైదీలకు పెట్టడం జైలు అధికారులు ఒక విధానంగా పెట్టుకున్నారు. ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమతి లేదు. కాని అధికారులు మాత్రం దర్జాగా బూట్లు, ఖరీదైన సెట్టర్లు వేసుకొని జైళ్లో తిరగవచ్చు. ఖైదీలు ఉండే రూములు (బ్లాక్‌), లెట్రిన్‌, బాత్‌రూములు డెటాల్‌తో ప్రతిరోజు శుభ్రం చేసి, నీళ్లతో రూములు పరిశుభ్రం చేసి అంటువ్యాధులు, దోమలు రాకుండా చేసి తమ శ్రమతో రిమాండ్‌ ఖైదీలు జైలును శుభ్రంగా ఉంచుతున్నారు.

జైళ్లో పాఠశాల ఖైదీలకు చదువు చెప్పడం కాక మొక్కుబడిగా ఉంది. దాని వలన ఎవరికి ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు. జైళ్లో ఉన్న లైబ్రరీ పేరుకే గాని చదువుకోవడానికి ఎటువంటి పుస్తకాలుండవు. దినపత్రికలు అందించరు. బయటి మిత్రుల ద్వారా పుస్తకాలు తెప్పించు కోవడానికి అనుమతించరు. లీగల్‌ సెల్‌ సర్వీస్‌ అథారిటీ, మరికొందరు అధికారులు వచ్చినా ఖైదీలు తమ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛలేదు. అధికారులకి వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేదు. ఇదంతా మొక్కుబడిగా జరిగే తంతు అని ఖైదీలు వాపోతున్నారు. చిన్న చిన్న నేర ఆరోపణలు చేయబడ్డ వాళ్లు, పేదలు ఎక్కువ సంఖ్యలో ఈ జైళ్లో మగ్గుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

నవంబర్‌ 23న తిత్తిలీ తుఫాన్‌ కుట్ర కేసులో కొందరు విడుదల కాగా, అప్పటికే వారం రోజులుగా మరో తిత్తిలీ తుఫాన్‌ కుట్ర కేసులో రిమాండ్‌ ఖైదుగా ఉన్న పి. దుర్యోధన, (పికెఎస్‌)తో పాటు ఎన్‌. వీరస్వామి (పిడిఎం), కె. వెంకటేష్‌ (పిడిఎం), కె. నీలకంఠు (పికెఎం) లను ఇరికించి పలాస కోర్టుకి వాయిదాకి తీసుకెళ్తూ ఇద్దరు, ఇద్దరు చొప్పున సంకెళ్లువేసి బంధించారు. ఖైదీలను స్పెషల్‌ బస్సులో కోర్టు వద్దకు గొలుసులతో తీసుకెళ్లి పరిసర ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. నిత్యం ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ ఉండే ప్రజా సంఘాల కార్యకర్తలకు ఈ విధంగా బేడీలువేసి వాయిదాలకు తీసుకురావడం అప్రజాస్వామికం. న్యాయ స్థానాల అనుమతి లేకుండా ఎవరికి బేడీలు వేయకూడదని సుప్రీంకోర్టు 1980 లోనే స్పష్టంగా తీర్పు ఇచ్చినా పోలీసులు దీనిని పరిగణలోనికి తీసుకోవడం లేదు. వ్యక్తికి సంకెళ్లు వేయడం, గొలుసులతో బంధించడం అంటే జంతుసమానంగా ప్రవర్తించడమేనని సుప్రీంకోర్టు గతంలోనే పేర్కొన్నది.

జైళ్లు అనేవి సంస్కరణ దిశగా కాకుండా శిక్షలకు నిలయాలుగా మారాయి. ఈ విధంగా జైళ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. జైళ్లలో ఎక్కడా జైల్‌ మ్యానువల్‌ అనుసరించి విచారణలో ఉన్న ఖైదులు అవసరాలు తీర్చడంలేదు. కొన్ని జైళ్లలో కెపాసిటీని మించి 3-4 రెట్లు ఎక్కువమంది ఖైదీలను ఉంచడం సర్వసాధారణం అయింది. రాజకీయ కనీసం డైరెక్ట్‌ ఇంటర్వ్యు శ్రీకాకుళం జిల్లా జైళ్లోలేవు. జైళ్లలో అక్రమ నిర్బంధాలు, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రజాస్వామివాదులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
- వై.వెంకటేశ్వర్లు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ ప్రధాన కార్యదర్శి

Keywords : srikakulam, jail, prison, police, adivasi, tribal
(2019-03-19 09:09:56)No. of visitors : 209

Suggested Posts


రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే

సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


శ్రీకాకుళం