మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి


మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి

పోలీసులకు మానవత్వం అనే మాటకు అర్థం తెలియదనే విషయం మరో సారి రుజువైంది. అంబులెన్స్‌ వస్తోందంటే దానికి దారి వదలాలని సామాన్య మానవునికి కూడా తెలుసు. ఎందుకంటే మనిషిగా మనం చూపే ఆ కనీస బాధ్యత ఓ మనిషి ప్రాణాన్ని కాపాడుతుందనే ఆశ. కానీ నేటి ఉరుకులపరుగుల జీవితాల్లో ఈ విషయం గురించి పట్టించుకునేంత తీరిక ఎవరికి ఉండటం లేదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడమే పెద్ద బాధ్యతారాహిత్యం అనుకుంటే.. క్షతగాత్రులను తీసుకెళ్లే అంబులెన్స్‌ మీద దాడి చేయడం మరీ దారుణం. ఇక్కడ ఇంతకంటే బాధకరమైన విషయం ఏంటంటే అలా దాడి చేసిన వారు పోలీసులు కావడం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌​ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల ఎనిమిదిన త్రిపురలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జనాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ʹత్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌ టీమ్‌ʹను రంగంలోకి దింపింది. ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. దాంతో సిబ్బంది.. ఆందోళనకారుల మీద దాడి చేయడమే కాక కాల్పులు కూడా జరిపారు. ఈ దాడుల్లో గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులను అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తీరుపట్ల పలువైపుల నుంచి నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యలైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మీడియా వివరణ కోరగా ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ నిరాకరించారు. తన దృష్టికి ఇంకా పూర్తి వివరాలు రాలేదని సమాధానం దాటవేశారు.

Video Courtesy : NDTV (Youtube Channel)

Keywords : పోలీసులు, త్రిపుర, ఆంబులెన్సు, అడ్డగింత, దాడి, త్రిపుర రైఫిల్స్, tripura, ambulance, attacked, police
(2019-08-19 08:26:29)No. of visitors : 240

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


మానవత్వం