ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు


ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు

ʹపాకిస్తాన్

జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కన్హయ్య కుమార్ పాల్గొన్న ఒక ర్యాలీలో పాకిస్తాన్‌కు మద్దతుగా ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని నినాదాలు చేశాడని పేర్కొంటూ పోలీసులులు ఇటీవల 1200 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. కన్హయ్యకుమార్ దేశద్రోహానికి పాల్పడ్డాడంటూ అప్పట్లో ఏబీవీపీ విద్యార్థులు ఆరోపించారు. నినాదాలు చేసినట్లుగా ఉన్న వీడియోను ఒక ప్రముఖ జాతీయ ఛానల్ పదే పదే ప్రసారం కూడా చేసింది. అయితే ఇదంటూ కట్టుకథ అని కన్హయ్య కుమార్ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయలేదంటూ ఏకంగా అప్పటి ఏబీవీపీ నాయకులు మీడియాకు వివరించడం సంచలనం సృష్టిస్తోంది. 9 ఫిబ్రవరి 2016లో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను ఏబీవీపీ జేఎన్‌యూ శాఖ మాజీ ఉపాధ్యక్షుడు జతిన్ గోరయ్య, మాజీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ నర్వాల్ ఇవాళ మీడియాకు వెల్లడించారు.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరిద్దరూ మాట్లాడుతూ.. ఆ రోజు వీడియోలో చూపిన విద్యార్థులు ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అంటూ నినాదాలు చేసిన మాట వాస్తవమే కాని వారు కన్హయ్య వెంట వచ్చిన వాళ్లు కాదని.. ఏబీవీపీ సభ్యులు, సానుభూతిపరులని వారు ధృవీకరిస్తున్నారు. కన్హయ్యకుమార్ మరియు అతని స్నేహితులు ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అంటూ నినాదాలు చేశారని ʹజీ న్యూస్ʹ ఛానల్ వీడియోలు వెలువరించింది. అయితే వాళ్లు ఏబీవీపీ సభ్యులని తాము నిరూపిస్తామని, అవసరం అయితే ʹజీ న్యూస్ʹ ఛానల్‌లోనే చర్చకు సిద్దమని జతిన్, ప్రదీప్‌లు సవాల్ విసిరారు.

ఇంకా ఏం చెప్పారంటే...

హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యను ఖండిస్తూ జేఎన్‌యూలో విద్యార్థులు సంఘీభావ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో కన్హయ్యకుమార్ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు ʹజీ న్యూస్ʹ నాలుగు వీడియోలు ప్రసారం చేసింది. అందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు ఉన్న వీడియో ఎడిట్ చేసి ప్రసారం చేశారని.. అది నకిలీ వీడియో అని వీరు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా అక్కడ ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అంటూ అరిచింది ఏబీవీపీ సభ్యులని.. వారిని మేం గుర్తు పడతామని అన్నారు.

ఏబీవీపీ సభ్యులు కావాలనే నినాదాలు చేసి దానిని కన్హయ్యకుమార్ మీద వేసేలా ప్రణాళిక రచించారని వారు స్పష్టం చేస్తున్నారు. మేమిద్దరం (జతిన్, ప్రదీప్) దళితులం కావడం వల్ల ఏబీవీపీ తమను పదే పదే టీవీ డిబేట్లకు పంపేదని వారు చెబుతున్నారు. కాని మేం వారి ఆలోచనలను తిరస్కరించేవాళ్లమని అన్నారు. కన్హయ్యకుమార్, రోహిత్ వేములను ఏబీవీపీ టెర్రరిస్టులుగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని జతిన్, ప్రదీప్‌లు స్పష్టం చేశారు.

Source : Janata Ka Reporter

(http://www.jantakareporter.com/india/ex-abvp-office-bearers-drop-bombshell-say-members-of-bjps-student-wing-chanted-pakistan-zindabad-slogans-on-jnu-campus/227873/?fbclid=IwAR2zFkm1vcgul6X4kg02_wrOgeyOeZ-ea0bJfkWsbREUkZeSfghIKbY05VQ)

Keywords : పాకిస్తాన్ జిందాబాద్, కన్హయ్యకుమార్, జేఎన్‌యూ, ఏబీవీపీ, దేశద్రోహం, రోహిత్ వేముల, pakistan zindabad, pro pakistan, kanhiya kumar, jnusu, abvp, jnu, jatin , pradeep
(2019-07-14 20:49:43)No. of visitors : 1502

Suggested Posts


0 results

Search Engine

తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
పోడు భూముల సమస్య శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు...టీడీఎఫ్
ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత
మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్
more..


ʹపాకిస్తాన్