బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ


బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ

బ్రెహ్ట్

( పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ , చరిత్ర, రాజనీతి శాస్త్రాలలో ప్రఖ్యాత ఆచార్యులు గోపాలక్రిష్ణ గాంధి సెప్టెంబర్‌ 21, 2018, హిందూ పత్రికలో రాసిన వ్యాసానికి సిఎస్ ఆర్ ప్రసాద్ అనువాదం.. అరుణతార పత్రిక జనవరి సంచికలో ప్రచురించబడినది )

పోలీసులు మతిలేని యంత్రాలు కారు. వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళే. వాళ్ళల్లో చాలామంది ఉన్నత విద్యను అభ్యసించినవాళ్ళే. కొందరు పి.హెచ్‌.డి.లు కూడా. సివిల్‌ దుస్తుల్లో వున్న అందరిలాగే వాళ్ళకి కూడా కుటుంబాలు వున్నాయి, స్నేహితులున్నారు. విధులు ముగించుకొని

ఇంటికి చేరాక వాళ్ళు యూనిఫారాలు వదిలిపెట్టి, ఇంటి దుస్తులు వేసుకుని, అలసిపోయిన ఆ సాయంకాలాన్ని గడపడానికి సిద్ధమవుతారు. ఇతరులలాగే వాళ్ళుకూడా ఆ రోజంతా వాళ్ళుచేసిన పనులలో మంచిగురించీ చెడుగురించీ, నిజాయితీ గురించీ, దుష్టత్వం గురించీ, పై నుంచి వచ్చిన రాజకీయ ఆదేశాలకు వాళ్ళు ఎలా తలవొగ్గి వుండటం గురించీ, ʹఉన్నతʹ ఒత్తిళ్ళకి, కిందిస్థాయి కుట్రలకి వాళ్ళెలా ప్రతిస్పందించిందీ .. ఇలాంటి విషయాల గురించి మాట్లాడతారు. తాము భాగస్వాములుగా వున్న ఈ మోసపూరితమైన ప్రపంచపు పోకడల గురించి వాళ్ళు నవ్వుకుంటారు. తాము చేసిన పనులకుగాను వాళ్ళు కొన్ని సందర్భాలలో గర్వపడతారు.

ఆ తరవాత వాళ్ళు టెలివిజన్‌ చూడడం ప్రారంభిస్తారు. అది వార్తలకోసం కాదు. ఎందుకంటే అప్పటికే వార్తల గురించి వాళ్ళకి అవసరమైనంతగానో అంతకంటే ఎక్కువగానో తెలుసుకాబట్టి. తమ మనస్సుల్ని తేలిక చేసుకోవడానికి పాతవో, కొత్తవో సినిమాలు చూస్తారు. లేదా మీనాకుమారి పెదవుల కదలికలకు అనుగుణంగా లతామంగేష్కర్‌, మధుబాల పెదవుల కదలికలకు అనుగుణంగా ఆశాభోంస్లే పాడిన పాటలు వింటారు. నాటకాలు, సంగీత కచేరీలు సంస్కృతిలో భాగమైపోయిన పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో వాళ్ళు ʹతమ కుటుంబాలతోʹ నాటకాలు చూడ్డానికి వెళతారు. అవి పాత పురాణాలమీద ఆధారపడ్డ నాటకాలయి వుండవచ్చు. లేదా ధైర్యవంతులైన నూతన నాటక రచయితలు రాసిన నాటకాలను చూడ్డానికి ఠాగూర్‌ పేరుమీద లేదా ఛత్రపతి శివాజీ పేరుమీద వున్న నాటకశాలలకు వెళతారు.

భీమా కోరెగావ్‌లో బ్రెహ్ట్‌ :

అయితే, 2018 జనవరి 1న మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో విధి నిర్వహణలో వున్న పోలీసులందరికీ బెర్టోల్ట్‌ బ్రెహ్ట్‌ పేరు తెలిసి వుండదు. ప్రఖ్యాతి చెందిన ఆ జర్మన్‌ నాటక రచయిత విషాదంగా డ్రాయింగ్‌ రూమ్‌ అలంకరణ వస్తువుగా మారిపోయాడు. అది విషాదం ఎందుకంటే ఆయన ఇటు పామరులలో, అటు పండితులలో కూడా ఆసక్తిని కలిగించగలిగేవాడు. ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించేవాడు. బ్రెహ్ట్‌ నిజం మాట్లాడతాడు. తాను చెప్పిన నిజాన్ని ఇతరులందరూ నిజంగా అంగీకరించారా లేదా అనేదాన్ని అతను పట్టించుకోడు.

బ్రెహ్ట్‌ నిజాలు నిజంలాగే సార్వజనీనమైనవీ, సార్వకాలికమైనవీ. ఎన్నో సంవత్సరాలుగా ప్రసిద్ధిపొందిన ఆయన నాటకం సెజువాన్‌కు చెందిన మంచిమనిషిʹ మరాఠి అనువాదం, ఉత్సవం జరుగుతున్న ఆ గ్రామంలో ప్రదర్శించబడినప్పుడు అక్కడున్న పోలీసు బలగాలు దాని గురించి పట్టించుకుని వుండేవి కాదు. దశాబ్దాలుగా అలా జరుగుతూనే వున్నది. దళితుల పట్ల కర్కశంగా వ్యవహరించడానికి పేరుమోసిన పీష్వాల శక్తివంతమైన సైన్యాన్ని, దళిత్‌ మహర్లతో కూడిన సైన్యం ఓడించడం ఆ రోజు ప్రత్యేకత. ఈ వాస్తవంపట్ల కొందరికి భిన్నాభిప్రాయం వుంది. 1818లో సాధించిన ఆ విజయానికి 2018నాటికి రెండువందల సంవత్సరాలు.

ఆ కారణంతో ఈ సంవత్సరం ఆ ఉత్సవాలకి మరింత ప్రాధాన్యత వున్నది. ఒక బృందం సాధించిన విజయం మరొక బృందానికి దు:ఖదాయకంగా కనపడడంతో ʹశాంతి భద్రతలʹ సమస్య తలెత్తింది. హింస, ప్రతి హింసల కారణంగా ʹచట్టంʹ రంగంలోకి దిగింది. ʹభద్రతʹ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నది. నెలలు గడిచిపోయిన తరవాత కూడా అరెస్టులు సాగుతూనే వున్నాయి. ఇదంతా ʹనిస్పక్షపాతంగాʹ జరిగిందేనా. ఈ విషయాన్ని నిస్సందేహంగా కోర్టులు తెలియచేస్తాయి.

బ్రెహ్ట్‌ నాటకం తెలిసినవాళ్ళు అందులో వున్న ఇలాంటి వాక్యాలని చూచి నవ్వుకుంటారు. ʹʹబలవంతుల్ని శత్రువులుగా చేసుకోవడం అంటే నాకు భయం. అందులోనూ ప్రత్యేకించి ఎవరో ఒకరిపట్ల అనుకూలంగా వుండడమంటే మరింత భయం. మనకి సహాయంచేసేవాళ్ళు కొద్దిమందే వుంటారు. కాని దాదాపు ప్రతిఒక్కరూ మనల్ని బాధించేవాళ్ళే.ʹʹ ʹʹచక్రవర్తిగారి పుట్టిన రోజు కూడా కడుపులు ఖాళీగానే వుంటాయి.ʹʹʹʹమొదటి దేవుడు : ఇక్కడ ప్రజలకి కష్టాలేమైనా వున్నాయా? నీళ్ళు అమ్ముకునే వాంగ్‌ ఇలా అన్నాడు... ʹʹమంచివాళ్ళకి కష్టాలే.ʹʹవ్యభిచారిణి షెన్‌-తె తో మొదటి దేవుడు : షెన్‌-తె ఏదేమైనా మంచిగా వుండు. వీడ్కోలు!షెన్‌-తె : మహాపురుషులారా! నేనలా వుంటానని నమ్మకం లేదు. ప్రతిదీ ఇంత ఖరీదు అయిపోయినచోట నేనెలా మంచిగా వుండగలను?రెండవ దేవుడు : దాని గురించి మేమేమీ చేయలేం. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో మేం జోక్యం చేసుకోకూడదు!ʹʹʹʹమంచితనానికిక విలువే లేనప్పుడు ఎవరూ సుదీర్ఘ కాలంపాటు మంచివాళ్ళుగా వుండలేరుʹʹ వాళ్ళు ఈ వాక్యాన్ని ఒక నిట్టూర్పుతో అర్థం చేసుకునే వుంటారు.ఆలోచనాత్మకమైన, మనసుని అల్లకల్లోలం చేసే వ్యంగ్యాత్మకంగా వుండే నాటకాలలో ఒకటైన ఈ

నాటకంలో ఆ వ్యభిచారిణి నోటి వెంబడి ఈ పదాలు తూటాల్లా పేలాయి. ʹʹసంతోషంలేని మగవాళ్ళలారా! నీ సోదరుడిపై దాడిచేశారు. అయినా నువు కళ్ళుమూసుకున్నావు! అతడిని గాయపరిచారు. అయినా నువు నిశ్శబ్దంగా వుండిపోయావు!... ఎలాంటి నగరం ఇదీ? ఎలాంటి ప్రజలు మీరు? అన్యాయం జరిగినప్పుడు నగరంలో తిరుగుబాటు రావాలి. అలాంటి తిరుగుబాటే జరగకపోతే రాత్రి గడిచేలోగా ఈ నగరం నాశనం కావడం మంచిది...ʹʹ

అంబేద్కర్‌ మాటల్లో :

బ్రెహ్ట్‌ చెప్పిన ఈ మాటల్ని శక్తివంతంగా ప్రతిధ్వనిస్తూ, మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగసభలో ఇలా అన్నారు... ʹʹవైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని మనం ఎంతకాలం కొనసాగించాలి. మన సాంఘిక, ఆర్థిక జీవితంలో సమానత్వాన్ని నిరాకరిస్తూ ఇంకెంతకాలం కొనసాగాలి? ఈ సమానత్వాన్ని దీర్ఘకాలంపాటు మనం నిరాకరిస్తూ పోతే మన రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.

ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరలో తొలగించాలి. అలా చేయని పక్షంలో, అసమానత్వాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, ఈ రాజ్యాంగసభ కష్టపడి నిర్మాణంచేసిన ఈ రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని పేల్చివేస్తారు.ʹʹమన సమకాలీనుడైన, బహుశా అత్యంత గొప్పవాడైన ఈ జర్మన్‌ రచయిత, మానవ పరిస్థితుల గురించి, మానవులకు సహజ ప్రవృత్తి అయిన ఆధిపత్యం గురించి, స్వేచ్ఛ న్యాయాల కోసం మానవుల బలమైన ఆకాంక్షల గురించిన వాస్తవాన్ని ఒక చైనా జానపద కథ ఆధారంగా మనకు చెప్పారు.

జనవరి 1, 2018న భీమా కోరెగావ్‌ సభలో సార్వకాలికమైన, సర్వసమాజాలకు సంబంధించిన ఈ వాక్యాలని మరారి Äభాషలో చెప్పినప్పుడు, అది ʹʹహింసను రెచ్చగొట్టినట్టుగాʹʹ కనపడింది. ఒకవేళ ఆ వాక్యాలని పలికిన వ్యక్తి బ్రెహ్ట్‌ పదాలనుకాక, బాబాసాహెబ్‌ పదాలను పేర్కొని వుంటే అప్పుడు కూడా అతనిపై హింసను రెచ్చగొట్టిన నేరం ఆపాదించి వుండేవారా? అలా జరగదని ఈ రోజుల్లో ఎవరనగలరు?తన ʹయంగ్‌ ఇండియాʹ పత్రికలో రాసిన వ్యాసాలకుగాను 1922 వసంతకాలంలో మోహన్‌దాస్‌ గాంధీపై ఇలానే, ʹʹఘనత వహించిన చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిధేయతను రెచ్చగొట్టినʹʹ కేసు నమోదు అయింది.

ఆ వ్యాసాలలో ఒకటైన ʹజూలు విదల్చండిʹ అనే పేరుగల వ్యాసంలో, ఆయన అప్పటి రాజకీయ చర్చలలో భాగంగా వున్న ఒక పదబంధాన్ని వాడితే అది బ్రిటీష్‌ పాలనను ʹʹకుదిపివేసిందిʹʹ. ఆ కేసు విచారణ సందర్భంగా ఆ ముద్దాయి ఇలా అన్నారు. ʹʹఏ ఒక్క అధికారిపట్ల నాకు వ్యక్తిగతంగా చెడు అభిప్రాయం లేదు. వ్యక్తిగా చక్రవర్తి పట్లకూడా నాకు అవిధేయత లేదు. అయితే గతంలోని ఏ వ్యవస్థకన్నా భారతదేశానికి ఎక్కువ నష్టం కలిగించిన ప్రభుత్వంపట్ల అవిధేయతను కలిగివుండడం సుగుణంగా నేను భావిస్తున్నాను.

ʹʹమనకు మన స్వంత బ్రెహ్ట్‌లు వున్నారు.1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం విధించడానికి కొద్దికాలం ముందుగా, ఢిల్లీలో జరిగిన ఒక బ్రహ్మండమైన ఊరేగింపులో జయప్రకాష్‌ నారాయణ్‌ ప్రఖ్యాత హిందీ కవి రామ్‌ధారి సింగ్‌ దినకర్‌ రాసిన ఈ కింది పంక్తుల్ని ఉల్లేఖించారు.ʹʹప్రజలు వచ్చారు. నీ గద్దెను ఖాళీచెయ్యి.ʹʹ ఆ తరవాత జయప్రకాష్‌ నారాయణ్‌కు, భారతదేశానికి ఏం జరిగిందో మనకు తెలుసు. అలానే ఆయనను ఖైదు చేసిన వ్యవస్థకు తదనంతరం ఏమి జరిగిందో కూడా మనకు తెలుసు.

మనం చూద్దాం :

ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ రాసిన ʹʹహమ్‌ దేఖేంగేʹʹ (మనం చూడాలి) అనే కవిత ఇలాంటి కోవకే చెందింది. అణచివేతకు వ్యతిరేకంగా అనేక సందర్భాలలో అనేక సమయాలలో ఈ కవిత ఒక నినాదంగా వ‌ర్థిల్లింది. సాహిత్యం, జానపద కథలు, నాటకాలు, వచనం, కవిత్వం వంటివి రాజకీయ చర్చలో

భాగం కావాలి. దినకర్‌ సంస్మరణ సభలో మన ప్రధానమంత్రి ఇదే వాక్యాన్ని చాలా గర్వంగా ఉల్లేఖించారు. విధి నిర్వహణలో వున్న పోలీసులలాగానే న్యాయవాదులుకూడా నల్లకోటు తొడుక్కున్న మానవులే. మంచి, చెడులు వాళ్ళకు తెలుసు. ఏది వాస్తవమో, ఏది కల్పనో వాళ్ళకు తెలుసు. అతి ప్రాచీన కాలం నుండి వందలాది అన్యాయాలకి, వేలాది అణచివేతలకి రంగస్థలమైన భారతదేశం, లక్షలాది తిరుగుబాట్లకు కూడా రంగస్థలమే. అక్కడే దాని బలం వున్నది. తన స్వేచ్ఛను పోగొట్టుకోవడానికి ఇష్టపడని భారతదేశం గురించి ఇక్బాల్‌ పాడినట్లుగా ʹʹఅక్కడేదో అసలైనది వున్నది.ʹʹ

(గోపాలక్రిష్ణ గాంధి గతంలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా వున్నారు. ఆయన చరిత్ర, రాజనీతి

శాస్త్రాలలో ప్రఖ్యాత ఆచార్యులు.)

(సెప్టెంబర్‌ 21, 2018, ʹది హిందూʹ సౌజన్యంతో)

Keywords : gopala krishna gandhi, ambedkar, police, hindu, Bertolt Brech
(2019-05-17 07:32:14)No. of visitors : 268

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


బ్రెహ్ట్