సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం


సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం

సంఘ్

దేశంలో ముస్లింలపై, దళితులపై, ఆదివాసులపై, స్త్రీలపై చెడ్డీ గ్యాంగ్ చేస్తున్న దాడులను ప్రశ్నించేవాళ్ళు ఇక్కడ‌ దేశద్రోహులు. మరీ ముఖ్యంగా ఈ వారంరోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాశ్మీరీలపై చెడ్డీ గ్యాంగ్ చేస్తున్న దాడులను ఖండించిన ప్రతి ఒక్కరినీ దేశద్రోహులుగా చిత్రీకరించడం, పాకిస్తాన్ వెళ్ళిపోవాలని హుకుం జారీ చేయడం, భౌతిక దాడులు చేస్తామని బెదిరించడం ముమ్మరమయ్యింది. అయితే ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ చేస్తున్న పనికి తమ మద్దతు కూడా ఉంటుందని సీపీఎం కూడా తేల్చేసింది. కాశ్మీరీలపై జరుగుతున్న దాడులను ఖండించినందుకు కేరళ సీపీఎం ప్రభుత్వంఏడుగురు విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసింది.

వివరాల్లోకి వెళితే.. పుల్వామా దాడి తర్వాత కశ్మీరీలపై సంఘ్ పరివార్ చేస్తున్న దాడులను ఖండిస్తూ కేరళలోని మలప్పురం ప్రభుత్వ కళాశాలకు చెందిన RSF ( రాడికల్ స్టూడెంట్స్ ఫోరం) విద్యార్థులు ʹకశ్మీరీలపై సంఘ్‌ పరివార్ దాడులను ఖండించండిʹ అనే నినాదాలు రాసిన‌ పోస్టర్లు అతికించారు. ఇది సీపీఎం పోలీసులకు కోపం తెప్పించింది. హుటాహుటిన ఏడుగురు విద్యార్థులపై 124(A) సెడిషన్ కేసును బనాయించారు.

కేసు నమోదైన ఏడుగురిలో రిన్షద్, ఫరీస్ అనే ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు తెలుపకుండా.. ఎలాంటి అరెస్టు వారెంటు లేకుండా వారిని బంధించి లాక్కెళ్లారు.

ఆ ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసిన సీపీఎం పాలిత కేరళ పోలీసులు వారి ఆచూకీ గురించి చెప్పడానికి తొలుత నిరాకరించారు. కాని విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో గురువారం ఉదయం వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.

తన దారి, లక్ష్యం ఏంటో అప్పుడప్పుడు సీపీఎం ఇలా బయట పెడుతూ ఉంటుంది నిజాయితీగా కమ్యూనిజాన్ని ప్రేమిస్తున్న వాళ్ళ కార్యకర్తలే పాపం అర్దం చేసుకోరు.

Keywords : మలప్పురం, పుల్వామా, ఉగ్రదాడి, సంఘ్ పరివార్, కేరళ, సీపీఎం ప్రభుత్వం, cpm government, RSS, posters, malappuram, posters, save kashmiris
(2019-03-19 05:07:25)No. of visitors : 271

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


సంఘ్