సామూహిక గాయానికి 29 ఏండ్లు...


సామూహిక గాయానికి 29 ఏండ్లు...

సామూహిక

ʹకునన్‌ - పుష్పోరాʹ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన మారుమూల జంట గ్రామాలు. 1991 వరకు ఈ గ్రామాలు ఉన్నాయనే విషయం కూడా దేశంలో చాలా మందికి తెలియదు. కాని ఒక్కసారిగా ప్రపంచవార్తల్లోకి ఎక్కాయి ఈ రెండు గ్రామాల పేర్లు. కారణం ఆ రెండు గ్రామాలపై తోడేళ్లలా విరుచుకుపడిన ఆర్మీ జవాన్లు ఆ గ్రామంలోని మహిళలపై చేసిన సామూహిక అత్యాచారం.

సరిగ్గా 28 ఏండ్ల క్రితం ఫిబ్రవరి 22వ తేదీన దేశాన్ని రక్షించాల్సిన ఆర్మీ, తమ బాధ్యతను మరిచి మృగాలుగా మారి ప్రజలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి సమయంలో వందలాది మంది ఒకేసారి వారి ఇళ్లలోకి చొరబడి పిల్లలు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా వందలాది మంది మహిళలపై పడి అత్యాచారం చేశారు. వాళ్ల బారి నుండి తప్పించుకొని పారిపోతున్న మహిళల్ని కూడా వెంటాడి, వేటాడి మరీ అత్యాచారం చేశారు. ఈ అత్యాచారంలో 8 ఏండ్ల పసిపాపతో సహా 80 పండు ముసలిని కూడా ఆ సైన్యం వదలలేదంటే ఎంత పాశవికంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు.

మూడు రోజుల్లో డెలివరీ కావాల్సిన మహిళ, నెల రోజుల ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళ. అంతకు ముందు రోజు పెళ్లి చేసుకున్న యువతి ఇలా ఒక్కరేమిటి అందరూ ఈ మారణ మృగాల బాధితులే. మూడు రోజుల్లో డెలివరీ కాబోతున్న మహిళలను మానవ మృగాలు రేప్‌ చేస్తే అతి కష్టం మీద డాక్టర్లు ఆమెకు ఆపరేషన్‌ చేసి ప్రాణాలు నిలబెట్టాల్సి వచ్చింది. ఇంత కర్కశంగా జంతువులు కూడా వ్యవహరించవు. ఆ ఇంట్లోకి చొరబడ్డ సైనికులు ఇంట్లో ఉన్న పురుషుల్ని ఇళ్లముందే కట్టేసి, తమ తల్లులను, భార్యలను, పిల్లలను అత్యాచారం చేశారు. ఆ సమయంలో వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండి ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘోర కృత్యం జరిగాక మరుసటి రోజు బాధితులంతా చుట్టుపక్కల గ్రామస్తుల సహాయంతో ఆందోళనకు దిగారు. అండగా ఉండాల్సిన నాటి ప్రభుత్వ పెద్దలు మాత్రం బాధితులది నిరాధారారోపణ, వాస్తవం కాదు అంటూ తన వైఖరిని ప్రకటించుకుంది.

గ్రామస్తుల ఒత్తిడి, దేశంలో ఉన్న హక్కుల సంఘాలు, ప్రపంచ వాప్తంగా ఉన్న సంస్థలు, అంతర్జాతీయ మానవ హాక్కుల సంస్థలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. అనివార్య పరిస్థితిలో ప్రభుత్వం ఎంక్వయిరీని నియమించి చేతులు దులిపేసుకుంది. బాధితులను కలవడానికి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్‌ ఎస్‌. ఎం. యాసిన్‌ ʹమిలిటరీ చర్య హింసాత్మక జంతువులలా ఉందిʹ అన్నాడంటే ఆ దాడి ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తూ తూ మంత్రంగా విచారణ జరిపి సైనికుల చేతిలో 53 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని తేల్చినప్పటికీ నేటికి ఆ బాధితులకు న్యాయం దక్కలేదు, బాధ్యులకు శిక్ష పడలేదు. ఆ ఘటన జరిగి నేటికి 28 ఏండ్లు గడిచిపోయాయి. అత్యాచారానికి గురైన బాలికలలో అత్యధికమందిని పెళ్ళి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇప్పటికీ అవివాహితులుగా మిగిలిపోయి అంగవైకల్యంతో, మానసిన ఒత్తిడికి లోనై సజీవ శవాలుగా బతుకులను వేలాడ దీస్తున్నారు.

తన కళ్ళ ముందే ఎనిమిది మంది సైనికులు తన తల్లిని అత్యాచారం చేస్తుంటే చూసిన పసి హృదయం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. కళ్ల ముందే నిత్యం జరుగుతున్న ఆకృత్యాలను మౌనంగా చూస్తూ భరించిన కొంతమంది కాశ్మీరి అమ్మాయిలు (పరిశోధక విద్యార్థినులు) పెరిగి పెద్దయ్యాక ఒక బృందంగా ఏర్పడ్డారు. వందలాది సార్లు ఆ రెండు గ్రామాలను సందర్శించి, బాధితులతో పదే పదే మాట్లాడి, అనేక రిపోర్టులను, పిటీషన్స్‌ని స్టడీ చేసి పరిశోధనాత్మకంగా "Do you Remember kunan poshpora?" అనే ఒక పుస్తకాన్ని సమాజం ముందుకు తీసుకువచ్చారు.

వేర్పాటువాదాన్ని అణచివేసే పేర ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న ఆర్మీ కాశ్మీరీ ప్రజల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఈ పుస్తకం మరోసారి కళ్లముందు ఉంచింది. నిర్భయ ఘటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన జస్ట్టిస్‌ వర్మ కమిషన్‌ కూడా సైనికుల పట్ల ఇదే వైఖరితో ఉన్నట్లు ఆ నివేదిక ద్వారా తెలుస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో వేర్పాటు వాదాన్ని అరికట్టేందుకు నాటి ప్రభుత్వాలు సైన్యానికి అప్పజెప్పిన ʹప్రత్యేక సైనిక అధికారాల చట్టం (ఆస్ప)ʹ ఫలితమే ఇదంతా. సైన్యం నిత్యం చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగానే మణిపూర్‌ వేదికగా ఇరోం షర్మిళ ఏండ్లకు ఏండ్లు నిరసనను ప్రకటించింది. దీన్ని రద్దు చేస్తే తప్ప దీనికి ఒక పరిష్కారం దొరకదు. లేదంటే ఇలాంటి ఘోర కృత్యాలు నిత్యం జరుగుతూనే వుంటాయి.

- ఎస్ఏ డేవిడ్

(For Original Post : https://www.facebook.com/sa.david.908/posts/390417901769637)

Keywords : kunan, poshpora, army, rape, కునన్, పుష్ఫోరా, అత్యాచారం, కశ్మీర్
(2019-11-13 06:02:08)No. of visitors : 435

Suggested Posts


0 results

Search Engine

Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
more..


సామూహిక