లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా


లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా

లైన్

ఇండియన్ మీడియాకు ప్రశ్నించడం రాదా..? పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపదా.. వైఫల్యాలను ఎండగట్టదా అంతే నిజమే అని అంటోంది అంతర్జాతీయ సమాజం. ఈ విషయంపై ʹది రీడర్ʹ అనే అమెరికన్ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. దాని సారాంశాన్ని Rama Sundari తన వాల్‌పై పోస్టు చేశారు. ఆ వ్యాసం యధాతథంగా..

The Reader పత్రిక అమెరికాలో ప్రజాపక్ష జర్నలిస్టిక్ పత్రిక. దానికి మెయిల్ ద్వారా 390000 చందాలు ఉన్నాయి. ఆ పత్రిక సంపాదకుడు భారత మీడియా గురించి రాసిన వ్యాసం.

పుల్వామ, వైమానిక దళ దాడుల తరువాత మీడియా ఎలాంటి స్పష్టమైన ప్రశ్నలు కూడా అడగలేదు. కల్లోల పరిస్థితుల్లో, కనీసం యుద్ధమప్పుడైనా ప్రశ్నలు అడిగిన జర్నలిశ్టులు దేశద్రోహులు అవుతారా? వారు ప్రశ్నలు అడగక పోతే వారి ప్రొఫెషలిజంను అనుమానిస్తామా? ఈ పక్షం రోజులు అసాధారణంగా గడిచిన తరువాత ఈ ప్రశ్నలను నేను అడుగుతున్నాను. ఈ పక్షం రోజులు దక్షిణ ఆసియాలోని రెండు న్యూక్లియర్ శక్తులు యుద్ధపు అంచుల్లో పడేటట్లు గడిచిపోయాయి.

ఫిబ్రవరి 14న పుల్వమాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు ఆత్మహత్యా బాంబర్ చేతిలో హత్యకు గురి అయ్యాక ప్రధాన స్రవంతి భారత మీడియా; అందులోనూ టెలివిజన్ మీడియా హిస్టీరియాలోనూ, అతిశయంలోనూ కొత్త అంచులు తాకింది. ప్రమాదకరం కాకపోతే ఈ విషయాన్ని సరదాగా తీసిపారవేయవచ్చు. కానీ ఇది ఇక్కడి ఎన్నికల సమయంలో వీర దేశభక్త రాజకీయ కథనానికి ఇంధనం పోసింది. వెంటనే జరిగిన పరిణామం ఏమిటంటే కాశ్మీరీ ప్రజల మీద దాడులు. విద్యార్ధులు, కార్మికులు, వ్యాపారస్తులు- హిందూ పరివార సంస్థలైన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివ సేన, ఇంకా ఇతరుల చేతుల్లో దాడికి గురి అయ్యారు. దీర్ఘకాలికంగా ఇది రాబోయే ఎన్నికలకు కీలక విషయం అవబోయే అవకాశం ఉంది. బీజేపీ నేత అమిత్ షా, ఇంకా ఇతరుల ప్రకటనల ద్వారా ఇప్పటికే స్పష్టమైన విషయం ఏమిటంటే పుల్వామ తదనంతర పరిణామాలు ఎన్నికల ప్రయోజనం కోసం వాడుకోబోతున్నారని.

ఫిబ్రవరి 26 తరువాత, భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని పక్స్తున్ ఖ్వా లోని బాలకోటే ఉందని అనుమానిస్తున్న జైష్ ఇ మహమ్మద్ పై దాడి చేశామని చెప్పాక; తొందరపాటు మీడియా కథనాల నుండి మొదలై వార్తా బులెటెన్లు వెలువరించేటపుడు టీవీ రూముల్లో యాంకర్లు మిలటరీ ఆయాసాన్ని పూనిన దాకా చూస్తే, కనీసం రెండు వేరే విషయాలు జాగ్రత్తగా పరిశీలించాల్సినవి ఉన్నాయి. ఒకటి మీడియాకు సంబంధించినది. ఇంకోటి ప్రభుత్వం ముఖ్యమైన సమాచారాన్ని ఎలా హాండిల్ చేస్తుందనేది.

ఉదాహరణకు, పుల్వామా దాడి జరిగాక, మీడియాకు ఆ ప్రాంతాన్ని దర్శించే అవకాశం మామూలుగానే ఉండదు. కొన్ని అస్పష్టమైన ఫోటోలు దొరికాయి. సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వారి ప్రకటనల మీద మీడియా ఆధారపడక తప్పదు. ఇంకా ఆ ప్రకటనలు రాక ముందే, కొన్ని వర్గాల మీడియాలో ఎంత పరిణామంలో బాబులు ఉపయోగించారో వార్తలు వచ్చాయి. 350 కేజీ, 80 కేజీ, 35 కేజీ ఇంకా తక్కువ వరకూ కూడా ఈ బాంబుల గురించి చెప్పారు. సూసైడ్ బాబు కోసం ఉపయోగించిన వాహనం రంగు, తయారీ గురించి కూడా చెప్పారు. ఫోరెన్సిక్ పరీక్షలు అవకుండా ఈ సమాచారం ఎలా వచ్చింది? ఎవరైనా అడిగారా? ఎట్టి పరిస్తితుల్లో ఈ సమాచారానికి విశ్వసనీయత ఉన్నట్లు కాదు. కాబట్టి రుజువులు సేకరించకుండా, పరీక్షించకుండా రిపోర్ట్ చేయకూడదు. కానీ ఇంతకు ముందు లాగానే భారత మీడియా అనుమానాన్ని పక్కన పెట్టి, కావాలని వైరుధ్యభరితమైన, నిరూపణ కానీ, నిరాధారమైన సమాచారాన్ని ఇప్పటి ప్రభుత్వానికి సరిపోయేలా పుట్టించింది. ప్రపంచ వ్యప్తంగా ఉన్న విశ్వనీయత కలిగిన మీడియా సంస్థలు ఇలాంటి ఆధారం లేని వివరాలు ప్రచురించే ముందు కాస్త ఆలోచిస్తాయి.

అనుకొన్నట్లుగానే , ఫిబ్రవరి 25న ఫోరెన్సిక్ పరీక్షలు అయ్యాక ఆ వాహనం స్పొర్ట్స్ యుటిలిటీ వాహనం కాదనీ, అది ఒక చిన్న మారుతీ ఎక్కో వాన్ అనీ, అందులో 30 కేజీల కంటే ఎక్కువ పేలుడు పదార్ధాలు లేవనీ అధికారికంగా నిర్ధారించారు. ఇంకా ఇంటెలిజెన్స్ విఫలం అయ్యిందనే పుకారు వచ్చాక కూడా జర్నలిశ్టులు అది నిజమా కాదా అని ప్రశ్నించలేదు. దేశ ద్రోహులని అంటారనీ ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నించలేదు. కాబట్టి, పుల్వామ సంఘటన తరువాత జరిగిన శవయాత్రలు, వాటి తరువాత శవపేటికల నాటకీయ ఫోటోలతో ముగిసిపోయింది. ఎందుకు కుటుంబాలు వారి ప్రియతముల అంతిమ యాత్రల కోసం వేచి ఉండాల్సి వచ్చింది అనే ప్రశ్నలు కూడా మీడియా కనీసం వేయలేదు.

ఐ ఏ ఎఫ్ స్ట్రైక్: ఎలాంటి ప్రశ్నలు అడగలేదు

తరువాత ఫిబ్రవరి 26, తెల్లవారి ఝామున ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పర్వత శిఖరంలో ఉన్న జెట్ జైష్ ఇ మహమ్మద్ ఒక ట్రైనింగ్ స్థావరం మీద 1000కేజీల బాంబులు పడవేసిన వార్త. ఆ రోజే ఇండియా ఒక అధికారిక పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ విదేశ సెక్రెటరీ విజయ్ గోఖలే చేసిన ఆ ప్రకటన చాలా జాగ్రత్తతో కూర్చిన మాటలతో ఉంది. అది చదవటం పూర్తి అయ్యాక ఎలాంటి ప్రశ్నలకు అనుమతి ఇవ్వలేదు. వాళ్లు చెబుతున్న బాల్కోట్ పాకిస్తాన్ లోని ఖై బర్ లోని పఖ్తుఙ్ఖ్వ ప్రాంతంలోనిదా లేక జమ్మూ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ కు దగ్గరగా ఉన్న బాల కోటె నా అనే ఒక స్పష్టమైన ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఆ రోజు పొద్దుటి నుండి ప్రారంభం అయిన నిరాధార ప్రచారం కొనసాగటానికి అవకాశం ఇవ్వటానికే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

అధికారిక ప్రకటన ఎంత మంది మనుషులు ఆ దాడిలో చనిపోయారో చెప్పలేదు. కానీ గంటల్లో మీడియా 300, 350, ఇంకా 600 మంది కూడా చనిపోయారని రిపోర్ట్ చేసింది. అంత మంది చనిపోతే పాకిస్తాన్ మౌనంగా ఎందుకు ఉంది అని ఎవరైనా ప్రశ్నించారా? వైమానిక దాడులు జరిగాక కొన్ని గంటల లోపే సరిగ్గా అంతమంది చనిపోయారని ఇండియాకు ఎలా తెలుస్తుంది? అది నిజంగా జైష్ ఇ మహమ్మద్ స్థావరం అయితే అక్కడ పని చేసే ఉద్యోగులు కూడా టెర్రరిస్టులేనా? అక్కడ స్థానిక పౌరులు ఎవరూ పని చేయరా? స్థానికులు చనిపోయి ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో, బాల్కోటే పట్టణంలో అలజడి ఉండదా? ఇలాంటి చాలా స్పష్టమైన ప్రశ్నలు ఉన్నాయి.

ఈ విషయం కూడా మరుసటి రోజు జరిగిన సంఘటనలతో దాటివేయబడింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్, ఇండియా జెట్ ల మధ్య జరిగిన స్వల్ప యుద్ధంలో ఇండియన్ ఫైటర్ జెట్ కాల్చివేయబడి దాని పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ కు దొరికిపోయాడు. చివరకు తాత్కాలికంగానైనా వీర దేశభక్త టెలివిజన్ యాంకర్ల యుద్ధ సంభాషణ ఆగిపోయింది. ఆ దొరికిపోయిన సమాచారం కూడా మొదట పాకిస్తాన్ నుండే వచ్చింది. అనుకొన్నట్లుగానే ఇండియా అధికారులు ఆ సమాచారాన్ని ముందు ఒప్పుకోలేదు. తరువాత విదేశ మినిస్ట్రీ అధికారి రవీశ్ కుమార్ ఇచ్చిన క్లుప్త ప్రకటనలో ఒప్పుకొన్నారు. ఆశ్చర్యకరంగా ఆ ప్రకటన చేసేటపుడు వైమానిక మార్షల్ ఆర్జికే కపూర్, రవీశ్ కుమార్ పక్కన కూర్చొని ఉన్నాడు. అతడిని మాట్లాడటానికి పిలవలేదు. నిన్నటి ప్రెస్ మీట్ లాగానే ఎలాంటి ప్రశ్నలకు తావు ఇవ్వలేదు. అంతే కాకుండా భారత్ దాడి, పాకిస్తాన్ ఎదురు దాడిల వార్త వచ్చి 48 గంటలు అయినా ప్రధానమంత్రితో సహా ప్రభుత్వంలోని ఒక్క సీనియర్ అధికారి ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. దానికి విరుద్ధంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శాంతి, సంభాషణలను ఆర్ధిస్తూ టెలివిజన్ లో మాట్లాడాడు.

కావాలని అధికారిక సమాచారాన్ని తక్కువగా చెబుతూ, అనధికార సమాచారాన్ని తనమాట వినే మీడియా చేత ఎక్కువ చెప్పిస్తూ భారత ప్రభుత్వం డజన్ల ప్రశ్నలను సమాధానం చెప్పకుండా వదిలివేసింది. నకిలీ వార్తలు తిరగాడుతుండగా ప్రభుత్వం బాధ్యత నుండి తప్పించుకొంటూ సగం ఉడికిన సమాచారాన్ని ʹసోర్సెస్ʹ ద్వారా మీడియాకు వదిలటం క్షమించరానిది.

మళ్లీ ఈ వ్యాసం మొదటి ప్రశ్నకు వస్తే; కల్లోల కాలంలో ప్రశ్నలు అడిగితే జర్నలిశ్టులు దేశద్రోహులు అవుతారా? దానికి సమాధానం ఏమిటంటే అసలు ఎందుకు జర్నలిశ్టులు వారి దేశభక్త విశ్వసనీయత కోసం పాకులాడాలి? జర్నలిష్టు అతని రాజకీయ నమ్మకాలకతీతంగా స్వతంత్రంగా, ఆసక్తిగా, విమర్శనాత్మకంగా, కఠినంగా ఉండాలి. ఈ విషయానికి; వాళ్లు ʹదేశానికీʹ, సాయుధ బలగాలకీ మద్దతునివ్వటానికి సంబంధం లేదు.

అవును. వీర దేశభక్తతత్వం మీడియాను కలుషితం చేసింది. ఎంత చేసిందంటే ముఖ్యమైన టెలివిజన్ లో పని చేస్తున్న యాంకర్లు సోషల్ మీడియాలో భారత సాయుధ బలగాలకు వారి మద్దతు దృవపరుస్తున్నారు. అలా చేయటం వలన వారిపట్ల నమ్మకాన్ని స్థాపించుకో చూస్తున్నారు. స్వేచ్ఛాపూరితమైన ప్రెస్ ఉన్న ఏ ప్రజాస్వామిక దేశంలోనూ జర్నలిష్టులు సాయుధదళాలను పొగుడుతూ పాటలు పాడరు. వారి జర్నలిష్టిక్ వృత్తిలో భాగంగా ʹశత్రువుʹ రక్తం కోసం అర్రులు చాచరు. ఇండియన్ మీడియా కొత్త ʹలైన్ ఆఫ్ నో కంట్రోల్ʹ ను కచ్చితంగా దాటింది.

- రమా సుందరి

(https://www.facebook.com/photo.php?fbid=2346819532268983&set=a.1411294165821529&type=1&theater)

Keywords : భారత మీడియా, యుద్దం, ఇండో పాక్, ప్రభుత్వం, పాలకులు, ది రీడర్, the reader, indian media, line of no control,
(2019-03-18 22:46:52)No. of visitors : 259

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


లైన్