ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?


ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?

ఉన్మాదుల

ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రికతలు చోటు చేసుకున్న నేపథ్యంలో దేశభక్తి పేరుతో ఉన్మాదాన్నిరెచ్చగొడుతూ దేశంలోని అన్ని రంగాలపై బీజేపీ తన ప్రతాపం చూపడం మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలోనే ముంబైలోని సీసీఐ తమ కార్యాలయంలో ఉన్న మాజీ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోను తొలగించింది. ఇతర పాకిస్తానీ క్రీడాకారుల ఫొటోలను తమ గ్యాలరీల నుంచి తొలగించి ఇదే దేశభక్తి అంటూ చాటుకున్నారు. సీసీఐ బాటనే పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు అనుసరించాయి.

అయితే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియం నుంచి ఇమ్రాన్ ఖాన్ ఫొటో తొలగించడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంగీకరించలేదు. దీంతో ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన శత్రు దేశ క్రీడాకారుల ఫొటోలు తొలగించాల్సిందే అంటూ ఆందోళనకు దిగారు.

అయినా సరే గంగూలీ ఫొటోలు తొలగించే ప్రసక్తే లేదని.. రాజకీయ ఉద్రిక్తలకు క్రీడలకు ఏం సంబంధం అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఫొటో తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని.. గంగూలీ కచ్చితంగా తొలగించాల్సిందే అని అంటున్నారు.

మరోవైపు ఈ వివాదం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య యుద్దంగా మారింది. మమత బెనర్జీ చొరవతోనే గంగూలీ క్యాబ్ అధ్యక్షుడు అయ్యాడని.. ఇప్పుడు ఆమె ఆదేశాల మేరకే ఫొటోలు తొలగించట్లేదని బీజేపీ ఆరోపిస్తోంది. గత కొంత కాలంగా బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్ నడుస్తోంది. ఇది చివరకు క్రీడాకారుల ఫొటోలను కూడా వివాదం చేసేదాకా వెళ్లిందంటే దేశభక్తి రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థమవుతోంది.

Keywords : దేశ ద్రోహి, గంగూలీ, కోల్‌కత, బీజేపీ, ఇమ్రాన్ ఖాన్, ఫొటోలు, తొలగింపు, ఈడెన్ గార్డెన్, Ganguly, Kolkata, BJP, Imran Khan, Photos
(2019-03-19 06:33:10)No. of visitors : 206

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


ఉన్మాదుల