జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ


జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ

జమ్మూ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని మైనారిటీ వర్గమైన పండితులది ఒక మానవీయ సమస్య.. తమ నేల నుండి అకారణంగా తరిమివేయబడిన సమస్య..కారణాలు ఏమైనా, ఎవరైనా మెజారిటీ ప్రజల ʹధర్మాగ్రాహానికిʹ బలైన ఒక విచిత్ర సమస్య.

మతపరమైన విశ్వాసాలరీత్యా ʹపండితులుʹ గా పిలువబడుతున్నప్పటికీ జాతిపరంగా చాలా కాలం వరకూ ʹకాశ్మీరీʹలుగానే భావించుకున్న చరిత్ర వీళ్ళది..కానీ తమ సమూహంలోని కొంతమంది పెద్దలు, అధికారులు చరిత్ర పొడువుతా చేసిన చారిత్రక తప్పులు తమ ఉనికినే ప్రశ్నర్థకం చేశాయి.

ముస్లిమేతర పాలకుల కాలంలో అధికారానికి దగ్గరగా ఉండి, వాళ్ళతో అంటకాగిన ఈ పండిత వర్గం మెజారిటీ ముస్లింను విస్మరించడం, వారి హక్కులను కాలరాయడం, వారికి వ్యతిరేకంగా ఉండటంతో వారిమధ్య వైరం పెరిగింది.

పైగా భారత్ - పాక్ ల విభజన సందర్భంలో భారత్ అండ చూసుకొని హిందువులు మెజారిటీగా ఉన్న జమ్మూ తదితర ప్రాంతాల్లో ముస్లింలపై దాడులకు ఊచకోతలకు పాల్పడటంతో దాదాపు ʹనాలుగు లక్షలమందిʹ ముస్లింలు నిరాశ్రుయులుగా పాకిస్తాన్ బాట పట్టారు.

ఇవన్నీ ఒకటైతే కాశ్మీరీ ముస్లింలు తమ ప్రాంత ʹ స్వయం నిర్ణయాధికారంʹ కోసం ఇండియా - పాక్ లతో పోరాడుతుంటే పండితులు మాత్రం భారత్ అనుకూల వైఖరి తీసుకోవడంతో ముస్లింలు వీళ్ళను అనుమానించేలా, శత్రువు శిబిరంలోని వ్యక్తులు అని భావించేలా చేసింది.

అప్పటి వరకూ మెజారిటీ ప్రజల్లో ʹపండితుʹలంటే నివురుగప్పిన నిప్పులా ఉన్న కోపం,ద్వేషం, పగలకు నాటి భౌతిక పరిస్థితులు తోడవ్వడంతో ఒక్కసారిగా వాళ్ళ ఆగ్రహ జ్వాలలు బహిరంగ వ్యక్తమయ్యాయి..భారత పాలక వర్గాల రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ʹకాశ్మీర్ స్వయం నిర్ణయాధికారాన్ని కాంక్షిస్తూʹ 1980 చివరి దశకంలో లక్షలాదిమంది కాశ్మీరీలు వీధుల్లోకొచ్చి భారత్ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ స్వయం నిర్ణయాధికార కాంక్షలో పండితులు ఎక్కడ కూడా పాల్గొనపోగా భారత్ అనుకూల వైఖరి మెజారిటీ ప్రజలను బాధించింది.

ఇదే అవకాశంగా భావించిన పాకిస్తాన్ ప్రేరేపిత సాయుధ ముఠాలు మత విద్వేశాలను రెచ్చగొట్టారు. 72 గంటల్లో జమ్మూ కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్లిపోవాలని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. పండితుల కుంటుంబాలపై దాడులకు, దోపిడీలకు, గృహదాహనాలకు, హత్యాచారాలకు, హత్యలకు పాల్పడ్డారు..కొన్ని సందర్భాల్లో హిందూ ముస్లిం గౌరవంగా భావించే వ్యక్తులను కూడా ఉద్దేశ్య పూర్వకంగా హత్య చేశారు...వీళ్ళకు స్థానిక అల్లరి మూకలు కూడా తొడవ్వడంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు.

గడిచిన ఇరవై ఏళ్ళ కాలంలో వెయ్యి మంది చనిపోయారని, 60 వేల మందికి పైగా వలస పోయారని ప్రభుత్వం చెబుతుంది..కానీ జమ్మూలో పండితుల హక్కులకోసం పనిచేస్తున్న కాశ్మీర్ పండిట్ సంఘర్స్ సమితి (KPSS) అధ్యక్షుడు సంజయ్ టిక్కూ మాత్రం మూడు వేలమంది వరకు చనిపోయి ఉంటారని చెబుతున్నాడు..

ఏది ఏమైనా వీళ్ళది జీవన్మరణ సమస్యే..వీళ్ళ గురించి కూడా మాట్లాడాలి...

మరీ పరిష్కారం ఎక్కడ ఉంది..!?

బహుశా పరిష్కారం కూడా కశ్మీర్లోనే ఉందేమో...తమ పూర్వికుల్లా కాకుండా యువతరమైన ఆ నేలమీదే నిలబడి..కశ్మీర్ అస్తిత్వం కోసం తోటి ముస్లింలతో కలిసి భుజం భుజం కలిపి పోరాడితే దొరుకుతుందేమో...!!

- ఎస్ఏ డేవిడ్.

Keywords : కశ్మీరీలు, పండితులు, కశ్మీరీ పండిట్స్, అస్థిత్వం, ఇండియా, పాకిస్తాన్, Kashmiri pandits, India, Pakistan
(2019-05-18 21:07:46)No. of visitors : 252

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


జమ్మూ