అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ


అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ

అన్నీ

త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ పిలపునిచ్చింది. ఈ బూటకపు పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో పీడిత ప్రజల మౌళిక సమస్యలు పరిష్కారం కాలేదని.. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించి నిజమైన ప్రజల రాజకీయాధికారాన్ని స్థాపించుకోవాలని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలన్నీ సామ్రాజ్యవాద తొత్తులేనని.. ప్రజావ్యతిరేకమైన దోపిడీ దొంగ పార్టీలని మావోయిస్టు పార్టీ పేర్కొంది. 1947 నాటి స్వతంత్ర ప్రకటన ఒట్టి బూటకమైనదని.. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష వలస, అర్థ భూస్వామ్య స్థానంలో అర్థ భూస్వామ్య, అర్థ వలస వ్యవస్థ ఏర్పడిందని పార్టీ స్పష్టం చేసింది.

2014 ఎన్నికల్లో ఆనాటి యూపీఏ - 2 ప్రభుత్వంపై ఉన్న ప్రజా అసంతృప్తిని, ఆక్రోశాన్ని, వ్యతిరేకతను ఉపయోగించుకొని.. సామ్రాజ్యవాదుల, కార్పొరేట్ల అండదో.. వాగాడంబరంతో ప్రజలకు అనేక వాగ్దానాలు కురిపించి మోడీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే అధికారంలోని వచ్చిందన్నారు. అయితే ఈ 5 ఏండ్లలో అది ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలపై దోపడీ పీడనలను తీవ్రతరం చేసిందని విమర్శించింది. అమెరికా సామ్రాజ్యవాదంతో మిలాఖత్ అయి.. వారి దోపిడీ ప్రభుత్వ విధానాల వల్ల రూపాయి విలువ దిగజారిపోయిందని.. తద్వారా డాలరుకు 73 రూపాయలకు చేరుకుందని పార్టీ దుయ్యబట్టింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరల పెంపు, వ్యవసాయ సంక్షోభం కారణంగా ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. విదేశాల నుంచి అక్రమ ధనం తేకపోగా 2 కోట్ల మందికి ఉద్యోగాలే లేకుండా చేశారని మావోయిస్టు పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి సామ్రాజ్యవాద తొత్తు పార్టీలు జరిపే బూటకపు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించి ప్రజలకు నూతన ప్రజాస్వామ్యాన్ని అందించే విప్లవాన్ని విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

పూర్తి లేఖ కోసం కింద చూడండి.

Keywords : maoist party, jagan, telangana spoke person, elections, boycott, narendra modi, nda, bjp, మావోయిస్టు పార్టీ, తెలంగాణ అధికార ప్రతినిధి, ఎన్నికలు, బహిష్కరణ, నరేంద్ర మోడీ
(2019-04-18 04:46:30)No. of visitors : 838

Suggested Posts


0 results

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
more..


అన్నీ