ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు


ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు

దేశ రాజధాని సమీపంలో ఓ ముస్లిం కుంటుంబంపై మూకదాడి జరిగింది. గురుగ్రామ్‌లోని ధమ్సాపూర్‌ గ్రామంలో నివసిస్తున్న మహ్మద్‌ సాజిద్‌ నివాసంలోకి చొరబడిన సుమారు 20 మంది యువకులు శుక్రవారం దాడి చేసి పిల్లలు, స్త్రీలు అనే తేడా లేకుండా దుర్మార్గంగా కొట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ సాజిద్‌ గత మూడేళ్లుగా ధమ్సాపూర్లో భార్య సమీనా, ఆరుగురు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. సాజిద్‌ ఇంటికి వచ్చిన బంధువులు.. ఫ్లాట్‌ ఆవరణలో క్రికెట్‌ ఆడుతున్నారు. అదే సమయంలో అక్కడికి బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు వారిపట్ల అమానుషంగా వ్యవహరించారు. ʹమీరు పాకిస్థాన్‌ వెళ్లి ఆడుకోండి. ఇక్కడ ఆటలాడొద్దుʹ అని బెదించారు. అక్కడితో ఆగకుండా వారిపై దాడి చేసి చితకబాదారు.
సాజిద్‌ మేనల్లుడు దిల్ఫాద్ మాట్లాడుతూ...ʹమమ్మల్ని కొడుతున్నప్పుడు మామయ్య అడ్డుకునేందుకు యత్నించడంతో.. ఆయనను కూడా కొట్టారు. కొద్దిపేపటి తర్వాత మరికొంతమంది వచ్చి రెండోసారి దాడి చేశారు. వాళ్లకు భయపడి మేం ఇంట్లోకి పారిపోయాం. బయటికి రాకపోతే చంపేస్తామని బెదిరించారు. మేం ఎంతకూ బయటకు రాకపోయేసరికి మా ఇంట్లోకి బలవంతంగా దూసుకొచ్చి మళ్లీ కొట్టారుʹ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కర్రలు, ఇనుప రాడ్లతో సాజిద్‌ కుంటుంబంపై మూకదాడి జరిగినట్టు తెలుస్తోంది.

దాడి సమయంలో తాను వంటగదిలో ఉన్నానని, అరుపులు వినిపించడంతో బయటికొచ్చానని సాజిద్‌ భార్య సమీనా తెలిపారు. ʹకొట్టొద్దని ఎంత బ్రతిమిలాడినా వాళ్లు కనికరించలేదు. మాపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని బంగారు గొలుసు, చెవి దుద్దుల్లాంటి ఖరీదైన వస్తువులను తీసుకెళ్లారు. కారు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారుʹ అని ఆమె వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు దుండగులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో కొంతమంది ఆచూకి దొరికిందని వారిని పట్టుకుంటామని, పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానిక భోండ్సీ పోలీసు అధికారి సురేందర్‌ కుమార్‌ తెలిపారు.

Keywords : gurgav, mob attack, muslims,
(2020-04-01 06:40:17)



No. of visitors : 777

Suggested Posts


గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !

ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు....

బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రంగు

ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది....

బీఫ్‌ తినడం నేరం కాదు - మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

గో మాంసంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్‌ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది...

HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మ‌తోన్మాద గుండాల అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కార‌ణ‌మైన సుశీల్ కుమార్, బీజేపీ నాయ‌కుడైనా అత‌ని సోద‌రుడు మ‌రో ముప్పై మందితో క‌లిసి నిన్నరాత్రి యూనివ‌ర్సిటీలో విద్యార్థుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త వారం ప‌ది రోజులుగా

హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావు

ఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు....

ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్త‌మ్ రెడ్డి

నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి!

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ బాకీ హై

22 రాష్ట్రాలు, 44 ప‌ట్ట‌ణాలు, 50 ప్ర‌ద‌ర్శ‌న‌లు... ఇది బాహుబ‌లి సినిమా కాదు... మ‌తోన్మాద రాజ‌కీయాల్నిన‌గ్నంగా నిల‌బెట్టిన డాక్యుమెంట‌రీ చిత్రం. వ‌ర్త‌మాన చ‌రిత్ర‌కు సాక్ష్యం.....

ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?

వ‌ర్త‌మాన సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రైన అవ‌గాహ‌నను అందిస్తూ, ప్ర‌జ‌ల ప‌క్షాన గొంతును వినిపించే లామ‌కాన్, ముగ్గురు ప్ర‌ముఖ ఉద్య‌కారుల‌ను ఒకే వేదిక‌మీదికి తీసుకువ‌స్తోంది. ఆగ‌స్టు 15 సాయంత్రం 7 గంట‌ల‌కు లామ‌కాన్‌లో నిర్వ‌హించే.....

మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !

మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు.....

BJP may lose Gujarat if polls are held today: RSS internal survey

BJP may not do well and lose Gujarat if elections are held in state in the present circumstances, a fresh internal survey conducted by partyʹs ideological mentor RSS has concluded...

Search Engine

లాక్ డౌన్ ముగిసిన తర్వాత మన వ్యూహం ఏంటి?: కేంద్రానికి 800 మంది శాస్త్రవేత్తల సూటి ప్రశ్న
నిజాలు మాట్లాడినందుకు సీనియర్ జర్నలిస్టుపై కేసు !
లాక్ డౌన్ కారణంగా దేశంలో పెరిగిన గృహ హింస‌
ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
more..


ముస్లిం