పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు


పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు

పోలీసుల

సామాన్యులు, ఆదివాసీలపై మావోయిస్టు అనే ముద్ర వేసి చిత్రహింసలకు గురి చేసే చత్తీస్‌గడ్ పోలీసులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సరైన సమయంలో సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో వెంకట్రావుకు అక్కడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్ఐలో పని చేసే సీనియర్ అధికారి నక్కా వెంకట్రావును గత ఏడాది డిసెంబర్ 23న (వాస్తవానికి 19నే అదుపులోనికి తీసుకున్నారు) రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని బాగ్‌నది పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశామని చెబుతూ చత్తీస్‌గడ్ పోలీసులు చార్జి షీటు దాఖలు చేశారు. నక్కా వెంకట్రావు మావోయిస్టు పార్టీకి జాతీయ కోఆర్డినేటర్ అనీ.. ఆయనకు మావోయిస్టులతో నేరుగా సంబంధాలున్నాయని అభియోగాలు మోపారు.

అంతే కాకుండా మోడీ హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా నక్కా వెంకట్రావు నిందితుడంటూ యూఏపీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలా ఎన్నో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టినా ఏ ఒక్క ఆరోపణను నిరూపించేలా చార్జిషీటు దాఖలు చేయలేదు. యూఏపీఏ కేసు కింద అరెస్టు చేస్తే 90 రోజుల్లోగా చార్జి షీటు దాఖలు చేయాలి.

అయితే, నక్కా వెంకట్రావు విషయంలో చార్జిషీటు దాఖలు చేయడంలో చత్తీస్‌ఘడ్ పోలీసులు విఫలమయ్యారు. ఆయనపై మోపిన అభియోగాలను నిరూపించడంలో పోలీసులు ఎంతో శ్రమపడ్డా అవన్నీ నిరాధారాలు కావడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Source : https://newpowergame.com/?p=55185

Keywords : nakka venkatrao, ngri, officer, maoist, chattisgarh, police, uapa, bima koregoan, నక్కా వెంకట్రావు, బీమా కోరేగావ్, మావోయిస్టులు, చత్తీస్‌గడ్ పోలీసులు, బీమా కోరేగావ్
(2019-08-18 02:45:15)No. of visitors : 460

Suggested Posts


0 results

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


పోలీసుల