మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన


మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన

మోడీ,

ఇన్నాళ్లూ ప్రజలకు వినోదాన్ని అందించడానికి వాళ్లు సినిమాలు తీశారు. కాని ఇప్పుడు ఈ దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వచ్చారు. 124 మంది ఫిల్మ్ మేకర్స్ కలసి ప్రజలకు ఒక అభ్యర్థన చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయండి అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఇది.

భారత దేశ ప్రజలకు ఒక అభ్యర్థన

భిన్న సంస్కృతులు, భౌగోళికంగా విభిన్నమైన మన భారత దేశంలోని ప్రజలు ఎప్పుడూ ఐక్యమత్యంగానే ఉన్నారు. ఇలాంటి దేశంలో పుట్టినందుకు ఒక భారతీయుడిగా ఎప్పుడూ గర్విస్తూనే ఉన్నాము. కాని ప్రస్తుతం పరిస్థిలులు అలా లేవు. దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతోంది. ఇది దేశ ప్రజలకు పరీక్షా సమయం.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మనం చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంది. ఏ మాత్రం అజాగ్రత వహించినా మనం ఫాసిస్టుల చేతుల్లోకి మళ్లీ వెళ్లిపోవాల్సి ఉంటుంది.

2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోనికి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అవి అత్యంత ప్రమాదకరమైన మార్పులు. ఈ దేశం మతం అనే భావన వైపు పూర్తిగా మళ్లించబడింది. మనం గతంలో చూసిన ఇండియా కాదు ఇది. బీజేపీ ఇలాంటి భావనను పెంచడంలో సక్సెస్ అయ్యింది. కాని అదే సమయంలో తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మాత్రం అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది. సామూహిక దాడులు, హత్యలు, గోసంరక్షణ పేరిట జరిగిన హింస దేశాన్ని వర్గాలుగా విడగొట్టింది. దళితులు, ముస్లిములే ఇలాంటి దాడుల్లో ఎక్కువగా బలయ్యింది. ఇక బీజేపీ తమ ద్వేషపూరిత భావజాలాన్ని ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా బలంగా వ్యాపింప చేసింది. దేశభక్తే వారి ప్రధాన ఆయుధం. ఏ వ్యక్తిగానీ సంస్థ గానీ వీరికి వ్యతిరేకంగా చిన్న మాట అన్నా వారిపై దేశద్రోహులు అనే ముద్ర వేసేస్తుంది. దేశభక్తిని వాళ్లు తమ ఓటు బ్యాంకుగా ఎలా మలచుకుంటున్నారో ఈ ఐదేళ్లలో మనం చూశాం. ఎంతో మంది గొప్ప రచయితలు, జర్నలిస్టులు వీరిని ఎదిరించి నిజాలను నిర్భయంగా వెల్లడించినందుకు తమ ప్రాణాలనే కోల్పోయారనే నిజాన్ని మాత్రం మనం మరచి పోవద్దు.

బీజేపీ ప్రభుత్వం సాయుధ దళాలను తమ ప్రచారం కోసం వాడుకోవడం ఇవాళ కొత్తేమీ కాదు. దేశం అనవసరమైన యుద్ద పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతోందని తెలిసినా తమ పద్దతి మాత్రం వీళ్లు మార్చుకోరు. ఇక మన దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా, శాస్త్రసాంకేతిక సంస్థలు ఉన్నాయి. వీటిని భ్రష్టుపట్టించడంలో బీజేపీ ముందుంది. అసలు ఎలాంటి అర్హతలు, అనుభవం లేని వ్యక్తులను ఆయా సంస్థలకు అధిపతులుగా నియమించి వాటి మనుగడనే ప్రశ్నార్థకరంగా మార్చారు. ఇక ఆశాస్త్రీయమైన వాటిని, మూఢనమ్మకాలను ఏకంగా అంతర్జాతీయ సెమినార్లలోనే ప్రచారం చేస్తున్నారంటే మన దేశానికి ఎంత సిగ్గు చేటు. వీళ్ల తీరు వల్ల మన దేశాన్ని చూసి ప్రపంచమే నవ్వుతోంది. కళలను ముఖ్యంగా సినిమా, పుస్తకాలు తమకు అనుకూలంగా లేకపోతే వాటిపై నిషేధం విధించడమో లేదా సెన్సార్ చేయడమో పనిగా పెట్టుకున్నారు. దేశ ప్రజలకు నిజాలు తెలియజేయడం వీళ్లకు సుతారమూ ఇష్టం లేదు.

బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతులు అనబడే వాళ్లు పూర్తిగా విస్మరించబడ్డారు. ఈ దేశాన్ని వ్యాపారవేత్తల ఆస్తిగా మార్చేశారు. అసంబద్దమైన ఆర్థిక విధానాల వల్ల దేశం ఎంతో నష్టపోయింది. కాని దాన్ని కూడా ఒక విజయంగా చూపించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం సఫలీకృతం కావడం దురదృష్టకరం. తమ మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారా అపజయాలను కూడా విజయాలుగా ప్రచారం చేసుకున్నారు. గణాంకాలను కూడా మర్చేసి ప్రకటించుకోవడం బీజేపీకే చెల్లింది. ఇలాంటి వారికి మరో సారి అధికారం ఇవ్వడమంటే మన సమాధిని మనమే తవ్వుకోవడం లాంటిదే.

అందుకే మేం ముందుకు వచ్చాం. ఇలాంటి ప్రమాదకర శక్తులు తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకునే బాధ్యత మనపై ఉంది. మన దేశ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందాం. భావప్రకటనా స్వేచ్ఛను కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం.

సంతకాలు చేసిన వారు.

1. Aashiq Abu

2. Aarti Patel

3. Abhijnan Sarkar

4. Abhro Banerjee

5. Ajayan Bala

6. Ambika Rao

7. Amitabha Chatterjee

8. Amshan Kumar

9. Amudhan R

10. Anand Patwardhan

11. Aneez K Mappila

12. Anirudda Sharma

13. Anjali Monteiro

14. Anupama Bose

15. Arun Karthick

16. Arun M

17. Arun N Sivan

18. Asha Achy Joseph

19. Asha Unnithan

20. B. Ajithkumar

21. Babu Easwar Prasad

22. Baburaj V G

23. Baburaj Pandavath

24. Bina Paul

25. C S Venkateswaran

26. Dar Ghai

27. Devashish Makhija

28. Debjani Banerjee

29. Debalina

30. Deepa Dhanraj

31. Deepesh T

32. Dileep Daz

33. Divya Bharathi

34. Gobi Nayanar

35. Goutham Soorya

36. Gurvinder Singh

37. Indrasis Acharya

38. Indraneel Lahiri

39. Jayan Cheriyan

40. Jeeva K J

41. Jeeva Ponnuchamy

42. Jiju Antony

43. Jisha

44. Jhelum Roy

45. Jubith Namradath

46. Kabir Singh Chowdhry

47. K B Venu

48. K P Jayashankar

49. Kombai S Anwar

50. Kamal K M

51. Kesari Haravoo

52. Leela Santhosh

53. Leena Manimekalai

54. Lijo Jose Pellissery

55. Madhupal

56. Maheen Mirza

57. Malini Jeevarathnam

58. Manisha Korde

59. Manoj Kana

60. M G Sasi

61. Miransha Naik

62. Maulik Raj

63. Muhsin Parari

64. Nishtha Jain

65. P F Mathews

66. Padmakumar Narasimhamurthy

67. Pa. Ranjith

68. Pradeep Nair

69. Pradeep Dipu

70. Pradipta Bhattacharyya

71. Prakash Bare

72. Pramod Payyannur

73. Prasanna S Kumar

74. Prasant Vijay

75. Pratap Jospeh

76. Prateek Vats

77. Praveen Morchhale

78. Prem Chand

79. Prema Revathi

80. Priyanandanan

81. Pushpendra Singh

82. Q

83. Rahul Roy

84. Rafeeq Ellias

85. Rajani Mani

86. Rajeev Ravi

87. Rakesh Sharma

88. Ranjith Sankaran

89. Reena Mohan

90. Renu Savant

91. Rinchin

92. Ritesh Sil

93. R.R. Sreenivasan

94. Sajeevan Anthikkad

95. Saji Palamel

96. Sajin Baabu

97. sajitha madathil

98. Sanalkumar Sasidharan

99. Sandhya Goghale

100. Sanjay Wadhwa

101. Sanju Surendran

102. Santosh Babusenan

103. Sapna Bhavnani

104. Sarvnik Kaur

105. Satish Babusenan

106. Shaji Mathew

107. Sharad Raj

108. Sherief Easa

109. Sherry Govindan

110. Sreebala K Menon

111. Subhash KR

112. Sudevan

113. Sukhpreet Kahlon

114. Suman Mukhopadhyay

115. Sunny Joseph

116. Suresh Achoos

117. Unni Vijayan

118. Vani Subramanian

119. Vetri Maaran

120. Venu ISC

121. Vidhu Vincent

122. Viju Varma

123. Vinu Kolichal

124. Vinod Raja

Keywords : ఫిల్మ్ మేకర్స్, అభ్యర్థన, బీజేపీ, ఫాసిస్టు ప్రభుత్వం, లేఖ, film makers, save democracy, bjp, facist government, loksabha, elections
(2019-11-12 23:26:13)No. of visitors : 405

Suggested Posts


0 results

Search Engine

Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
more..


మోడీ,