సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ


సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ

సాయిబాబా,వరవరరావులని

అక్రమ కేసులతో జైళ్లలో మగ్గుతున్న ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావులతోపాటు 9 మంది ప్రజామేధావుల విడుదల, పౌర ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు అన్ని పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్‌తో విప్లవ రచయితల సంఘం ఆదివారం బహిరంగ లేఖను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వచ్చే నేతలను నిలదీయాలని, జైళ్లలో మగ్గుతున్న ప్రజా మేధావులను విడుదల చేసేంత వరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేపట్టాలని విరసం పిలుపునిచ్చింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విరసం బహిరంగ లేఖను కవులు, రచయితలు మేధావుల సమక్షంలో ఆవిష్కరించారు. లేఖ పూర్తి పాఠం మీకోసం ...

కవులు, కళాకారులు, పాత్రికేయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకుల విజ్ఞప్తి

దేశంలో రోజురోజుకూ క్షీణిస్తున్న ప్రజాస్వామిక వాతావరణం మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, మేధావి, సామాజిక కార్యకర్త జి.ఎన్. సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైల్లో 19 రకాల జబ్బులతో, 90 శాతం అంగవైకల్యంతో, మృత్యువుతో పోరాడుతున్న స్థితిలో తాజాగా ఆయన మెడికల్ బెయిల్ తిరస్కరణ గురయ్యింది. దేశవ్యాప్తంగా, వివిధ జైళ్ళలో మగ్గుతూ ఏ న్యాయ సహాయం అందని ఆదివాసీల గురించి, వారి న్యాయమైన పోరాటాలపై జరుగుతున్న అణచివేత గురించి మాట్లాడే సాయిబాబాను అరెస్టు చేసి మావోయిస్టు కేసు పెట్టి జీవిత ఖైదు విధించారు. ఏడాది క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిస్తే, హైకోర్టులో చేసిన అపీల్ ఇప్పటికి కూడా విచారణకు రాలేదు. ఆయనను విడుదల చేయాలని దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, మేధావులు, రచయితలు, ప్రజాసంఘాలు మాత్రమే కాక, యునైటెడ్ నేషన్స్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ దగ్గరి నుండి వివిధ దేశాల హక్కుల సంఘాలు, మేధావులు పదే పదే చేసిన వినతులకు ప్రభుత్వం నుండి స్పందన లేదు. అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్న సాయిబాబాకు కనీస వైద్యం చేయించకపోగా, ఆయనకు ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ లేదని, పూర్తి స్థాయిలో వైద్యం అందుతోందని న్యాయస్థానం అమానుషమైన తీర్పు చెప్పింది.

ఇదిలా ఉండగా గత ఆగస్టు 28న ప్రధానమంత్రి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో విప్లవ రచయిత వరవరరావును అరెస్టు చేసి పూణే జైలుకు తరలించడం మమ్మల్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. సుమారు యాభై ఏళ్ళుగా ఆయన పాత్ర లేకుండా తెలుగు సాహిత్య మేధోరంగాలు, వివిధ ప్రజాఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు లేవన్నది వాస్తవం. గతంలో సాయిబాబా విడుదల కోరుతూ స్వయంగా అన్ని రాజకీయ పార్టీలను కలిసిన వరవరరావు ఇప్పుడు జైల్లో ఉండాల్సి రావడం మన కాలపు విషాదం.

వరవరరావుతోపాటు సాయిబాబా కేసు వాదిస్తున్న సురేంద్ర గార్లింగ్ ను కూడా అరెస్టు చేసారు. ఆయన విడుదల కోసం పోరాడుతున్న మరో ఏడుగురు ప్రసిద్ధ మేధావులను కూడా అరెస్టు చేయడం చూస్తుంటే న్యాయం పక్షాన నిలబడ్డ గొంతులన్నిటినీ నొక్కివేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.

వీళ్ళందరి మీదా మొదట భీమా కోరేగాం అల్లర్లతో సంబంధం ఉందని కేసు పెట్టి, తర్వాత ఏకంగా ప్రధాన మంత్రి హత్యకు కుట్ర పన్నుతున్నారని హాస్యాస్పదమైన ఆరోపణలు చేసారు. అందుకోసం తప్పుడు లేఖలను సృష్టించారు. అవి కల్పిత లేఖలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆనాడే ఖండించారు. నిజానికి సాయిబాబా కేసు మొదలు మహారాష్ట్ర పోలీసులు మేధావులందరి మీద చేస్తున్న ఏ ఒక్క ఆరోపణకు గట్టిగా నిలబడే ఒక్క సాక్ష్యం లేదు. అయినా యు.ఎ.పి.ఎ. వంటి అమానుష చట్టాలను ప్రయోగించి సుదీర్ఘకాలం వీళ్ళను జైళ్ళలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

అట్లా నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న తొమ్మిది మంది తమ స్వలాభం కోసం కాక నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్న బుద్ధిజీవులు. పీడిత సమూహాలైన ఆదివాసీలు, ముస్లింలు, దళితులు, స్త్రీల పక్షాన వినిపిస్తున్న స్వరాలు వీళ్ళు. వీళ్ళను అణిచేయడం అంటే పీడిత ప్రజల కనీస హక్కులను వినపడనీయకుండా చేయడమే. అది మొత్తంగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశం.

వీరేగాక దేశవ్యాప్తంగా అనేక జైళ్లలో వేలాదిగా ఆదివాసులు, దళితులు, ముస్లింలు ఏండ్ల తరబడి అక్రమ నిర్బంధంలో ఉన్నారు. వీళ్లలో అనేక మంది రాజకీయ ఖైదీలు కూడా ఉన్నారు.

వరవరరావు, సాయిబాబా ఇద్దరూ తెలుగు సమాజానికి చెందిన మేధావులు. 79 ఏళ్ళ వయసులో వరవరరావు కనీస సౌకర్యాలు లేని పూణే జైల్లో ఉండాల్సి రావడం, అంతకన్నా దుర్భర స్థితిలో సాయిబాబా నాగపూర్ అండాసెల్లో రోజులు లెక్కపెడుతుండడం ప్రజాస్వామికవాదులందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత నాలుగైదేళ్ళుగా మేధావుల హత్యలు, రచయితలకు బెదిరింపులు, ప్రశ్నించేవారిపై మూకదాడులు, మైనార్టీలు, దళితులపై పెరిగిన హింస పౌర ప్రజాస్వామిక హక్కులను తీవ్ర సంక్షోభంలో పడేసింది.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే రాజ్యాంగం ప్రకారం ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులను ఎన్నుకోవడమే. కనుక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులుగా మీరు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన జీవించే హక్కు సహా అన్ని ప్రాథమిక హక్కులకు హామీ పడాల్సి ఉంటుంది. భిన్న రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండేందుకు, వాటిని ప్రకటించుకునే స్వేచ్ఛకు మీరు రక్షణ కల్పించాలి. ఇవి కొరబడ్డప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు.

రాజకీయ పార్టీలుగా మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ రేప్పొద్దున మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన ఇచ్చేదీ మీ మేనిఫెస్టోల్లో ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చింది. అదొక్కటే కాదు, చట్టవ్యతిరేక కార్యకలాపా నిరోధక చట్టం (ఊపా) సహా అనేక అప్రజాస్వామిక చట్టాలు దేశంలో, రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. అవి హక్కుల ఉల్లంఘనకు, అణచివేతకు కారణం అవుతున్నాయి. ఇదంతా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పదల్చుకున్నాం. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సంక్షేమం, అభివృద్ధి ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వలేవు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలుగా ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ గురించి మీ విధానాన్ని ప్రజల ముందు పెట్టి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నాం

ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావు తదితర ప్రజా మేధావుల మీద పెట్టిన కేసుల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతూ తక్షణం బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం

1. కె.శివారెడ్డి, కవి
2. వసంతలక్ష్మి, రచయిత్రి, జర్నలిస్టు
3. ఆర్. భరద్వాజ, రచయిత
4. విమల, రచయిత్రి
5. వాసిరెడ్డి నవీన్, రచయిత
6. కుప్పిలి పద్మ, రచయిత్రి
7. ఎన్. వేణుగోపాల్, రచయిత, సంపాదకుడు
8. దేవకీదేవి, రచయిత్రి
9. కాత్యాయని, రచయిత్రి
10. కొండేపూడి నిర్మల, రచయిత్రి
11. శివలక్ష్మి, రచయిత్రి
12. బండారు విజయ, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
13. శిఖామణి, కవి, సంపాదకుడు, కవిసంధ్య పత్రిక
14. ఉషా. ఎస్. డానీ, రచయిత, ముస్లిం థింకర్స్ ఫోరం
15. వి.రమేశ్ బాబు, కవి, జర్నలిస్టు
16. బమ్మిడి జగదీశ్వరరావు, రచయిత
17. వై. కరుణాకర్, రచయిత, చిత్రకారుడు
18. కృపాకర్ మదిగ, కవి
19. కె.వై.రత్నం, ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
20. ప్రొ.హరగోపాల్, పౌరహక్కుల సంఘం
21. కె.సజయ, సామాజిక కార్యకర్త
22. పద్మజా షా, రిటైర్డ్ ప్రొఫెసర్
23. కాకరాల, సినిమా ఆర్టిస్ట్
24. డా. సమున్నత, అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ
25. భూపతి వెంకటేశ్వర్లు, ఎడిటర్, మోదుగుపూలు
26. సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్
27. వేనేపల్లి పాండురంగారావు, మాజీ సర్పంచ్
28. మళ్లీశ్వరి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
29. ప్రతిమ, రచయిత్రి
30. జి.లక్ష్మినరసయ్య, రచయిత
31. డా.కాసుల లింగారెడ్డి, కవి
32. ఇంద్రవెల్లి రమేశ్, కవి
33. సాబిర్ హుస్సేన్ సయ్యద్, కవి
34. రవీందర్ మెట్టు, రచయిత
35. ఆవునూరి సమ్మయ్య, జనసాహితి, హుజూరాబాద్ కన్వీనర్
36. డి.సుబ్రమణ్యం, థియేటర్ అండ్ సివిల్ లిబర్టీస్ యాక్టివిస్ట్
37. సిద్దార్థ కట్టా, కవి, జర్నలిస్టు
38. ఎస్. నరేశ్ కుమార్ సూఫీ, కవి
39. కళ్యాణి ఎస్.జె., రచయిత్రి
40. ఎ.కె. ప్రభాకర్, రచయిత
41. ఎం.ప్రగతి, రచయిత్రి
42. కవిని ఆలూరి, రచయిత్రి
43. జుగాష్ఐలి, కవి, ఆర్టిస్ట్
44. ఆర్.కె, పబ్లిషర్.
45. మోషే డయన్, ఆర్టిస్ట్
46. వి.పద్మ, జర్నలిస్టు
47. కె.రవి, రైతు స్వరాజ్య వేదిక
48. వై. అశోక్ కుమార్, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్
49. బి.రామకృష్ణ, డెట్రిక్ టీచర్స్ ఫెడరేషన్
50. ఎన్.రవి, హిందుత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక
51. బి.సంజీవ
52. డి. బాలమునిరెడ్డి, ప్రజాస్వామ్యవాది
53. బండి దుర్గాప్రసాద్, తెలంగాణ డెమాక్రెటిక్ ఫోరం
54. దండెం జాన్, ప్రజాకళా మండలి
55. చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ డెమాక్రెటిక్ ఫోరం
56. ఇక్బాల్ పాషా, విరసం
57. వీ.విజయరామ రాజు, డెమాక్రెటిక్ టీచర్స్ ఫెడరేషన్
58. రామచంద్రం, విరసం
59. దేవదాసు, ప్రజాకళా మండలి
60. బాలసాని రాజయ్య, విరసం
61. యం.రత్నమాల, విరసం
62. చంద్రమౌళి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం
63. యం.వెంకన్న, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్
64. పి. శ్యామల రావు, పౌరహక్కుల సంఘం
65. వి.పరశురాజ్, ఎస్.సి., ఎస్.టి. స్టూడెంట్స్ యూనియన్
66. పి.విష్ణువర్ధన్ రావు, జర్నలిస్టు
67. పి.మంజుల, విరసం
68. కె.రవి చందర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్
69. ఎ.నాగేశ్వరరావు, ఉస్మానియా యూనివర్సిటీ
70. హరీశ్ ఆజాద్, ఎఐఎస్ఎఫ్, ఉస్మానియా యూనివర్సిటీ
71. డేవిడ్, ఓయు రీసర్చ్ స్కాలర్స్
72. అనిల్, తెలంగాణ విద్యార్థి వేదిక
73. ఆలూరి లలిత, వీరసం
74. బి.ఎస్.రాజు, విస్తాపన్ విరోధి జనవికాస్ ఆందోళన్
75. కూర్మనాథ్, విరసం
76. డా. రామ్దేవ్, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం
77. సి. రామ్మోహన్, పాలమూరు అధ్యయన వేదిక
78. ఎ.రాజేంద్ర బాబు, పాలమూరు అధ్యయన వేదిక
79. సంధ్య, విరసం
80. భవాని, అమరుల బంధు మిత్రుల సంఘం
81. సంధ్యారాణి, చైతన్య మహిళా సంఘం
82. అనురాధ, రచయిత్రి, సామాజిక కార్యకర్త
83. ఉషాజ్యోతి, స్కాలర్
84. రంగారావు, నెల్లూరు
85. యాదగిరి గుండోజు
86. బి.నరసింహ, ఒపీడిఆర్ కార్యదర్శి, తెలంగాణ
87. సతీశ్ సీ. ఎచ్.
88. ఎన్. భీమార్జున రెడ్డి, నల్లగొండ ప్రజావేదిక
89. కె.బాల్ రెడ్డి, మలుపు ప్రచురణలు
90. హరీష్
91. పి.చిన్నయ్య, రచయిత
92. రాంకి, సంపాదకుడు, అరుణతార
93. పి.వరలక్ష్మి, విరసం
94. నందిగం కృష్ణారావు, రచయిత, న్యాయవాది
95. కె.జగన్, వీరసం
96. ఎం.అరవింద్, విరసం
97. క్రాంతి, రచయిత, జర్నలిస్టు
98. సి.ఎచ్.లక్ష్మయ్య, రిటైర్డ్ ఉద్యోగి
99. పాడి, విరసం
100. కాశీం, విరసం

Keywords : virasam, varavararao, saibaba
(2020-05-30 08:00:24)No. of visitors : 579

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
more..


సాయిబాబా,వరవరరావులని