ఈ దేశం మరోసారి మోసపోకూడదు - చెరబండరాజు


ఈ దేశం మరోసారి మోసపోకూడదు - చెరబండరాజు

ఈ

భ్రమల ఎండమావుల్లో ప్రయాణించి
ఆకలిదప్పులతో మాడి చావకండని
మాటమాత్రం చెప్పకపోతే
చరిత్రకు ద్రోహం చేసిన వాణ్ణవుతానని
భయంతో బాధ్యతతో
కుండబద్దలు కొట్టేస్తున్నాను.

జనం పేరు జపిస్తూ వొచ్చిన వాళ్ళగుట్టు
ఇప్పుడు రహస్యం కాదు
ప్రజాతంత్రం వారికొక మంత్రం
వాగ్దానం ఎన్నికల నినాదం
పెనం మీంచి పొయ్యిలోకి
తొయ్యబడతారు ప్రజలు
కళ్ళలోంచి కారేది ఏ బీరో పన్నీరో కాదు
కన్నీరే అవుతుంది
వర్తమాన చరిత్ర వాస్తవాన్ని
పాలకులింకా మభ్యపెట్టలేరు.
చెట్టుకు పట్టిన చీడ
ఏ గాలికీ పారిపోదు

ఈ చెట్టు నీడన నాగుల పుట్టలున్నాయ్
ఆ చల్లదనంలో తుపాకుల గుట్టలున్నాయ్
అక్కడున్న మనుషుల మనసుల్లో
మినీ మిసాలున్నాయ్
ఒద్దు భ్రమలు
వొదిలేద్దాం ఆ నీడ
ఆ చెట్టే వొద్దు
దాన్ని కూల్చందే అక్కడ
జెండా ప్రతిష్టించలేం.

ఈ దేశం మరోసారి మోసపోకూడదు!

- చెరబండరాజు

Keywords : చెరబండరాజు, ఎన్నికలు, ప్రజాస్వామ్యం, మోసం, Cherabanda Raju, Elections, Democracy
(2020-05-25 19:07:16)No. of visitors : 442

Suggested Posts


0 results

Search Engine

వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
more..


ఈ