కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ


కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ

కేసీఆర్‌కు

బీమా కోరేగావ్ కేసులో అక్రమంగా పూణేలోని ఎరవాడ జైలులో నిర్బంధంలో ఉన్న విప్లవ రచయిత వరవరరావును విడుదల చేయాలంటు ఇప్పటికే మేధావులు, సినీ దర్శకులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు బహిరంగ లేఖలు రాశాయి. వరవరరావు సహచరి హేమలత గత వారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖకు మద్దతుగా అనేక మంది సంతకాలు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు హేమలత ఒక బహిరంగ లేఖ రాశారు. మోడీ, సంఘ్ పరివార్‌ల కుట్రపన్ని వరవరరావును కేసులో ఎలా అక్రమంగా నిర్బంధించాలో వివరించారు. గతంలో కేసీఆర్ వీవీని జైల్లో కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూనే.. ఈ విషయంలో ఒక రాష్ట్ర అధినేతగా స్పందించాలని కోరారు. ఆ లేఖ యధాతథంగా..

--------------------------------------------------------------------------------------------

హైదరాబాద్, ఏప్రిల్ 9, 2019.

గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారికి,

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అబద్ధాల మీద, అక్రమాల మీద గత కొద్ది రోజుల ఎన్నికల ప్రచారంలో మీరు చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఈ లేఖ రాస్తున్నాను. మోడీ ప్రభుత్వం, ఆయన పార్టీకే చెందిన మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర పోలీసులు ఆడుతున్న అబద్ధాలను, బనాయిస్తున్న అబద్ధపు కేసులను మీ దృష్టికి తీసుకు రావడం కోసం ఈ లేఖ. ఈ విషయాలలో కూడ మీ అభిప్రాయం, వైఖరి ఏమిటో బహిరంగంగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను.
కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, సంఘ్ పరివార్ పన్నిన భారీ కుట్రలో భాగంగా ʹబీమా కోరేగాం హింసాకాండ కేసుʹ అనే అబద్ధపు కేసు బనాయించి పుణె పోలీసులు నా భర్త వరవరరావుతో సహా పది మంది మేధావులను నిర్బంధించారు. తప్పుడు ఆరోపణలపై అక్రమంగా బనాయించిన ఈ కేసులో నిందితులుగా వరవరరావు గత ఐదు నెలలుగా పుణెలోని యరవాడ జైలులో నిర్బంధంలో ఉన్నారు.

గతంలో విప్లవ రచయితల సంఘంపై నిషేధం విధించి, వరవరరావును ఇదే విధంగా అక్రమ నిర్బంధంలో ఉంచినప్పుడు మీరు కేంద్ర మంత్రిగా ఉండి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రొటోకాల్ నిబంధనలను కూడ పక్కనపెట్టి, చంచల్‌గూడ జైలులో వరవరరావును 2005 సెప్టెంబర్ 3న కలిసిన ఉదంతాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేయదలచాను. విరసంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని న్యాయమూర్తుల బృందం ఆ తర్వాత మూడు నెలలకు కొట్టివేసింది గాని, మీరు కలిసే నాటికి నిషేధం అమలులో ఉంది. అప్పుడు కేంద్ర మంత్రిగా ప్రొటోకాల్ నిబంధనలను పక్కన పెట్టి, ఆయనను జైలులో కలిసిన మీరు, ప్రస్తుత స్థితిలో ఆయన అనుభవిస్తున్న దారుణ నిర్బంధం విషయంలో కూడ అటువంటి వైఖరే తీసుకుంటారని ఆశిస్తున్నాను.

వరవరరావు తెలంగాణ బిడ్డ. 1968 నుంచీ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను వ్యక్తీకరిస్తున్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసమే ఆయన ఈ యాబై సంవత్సరాలుగా తన కలాన్నీ గళాన్నీ వినియోగిస్తున్నారు. 1969 జై తెలంగాణ ఉద్యమానికి కారణమైన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సదస్సు నిర్వాహకులలో ఆయన ఒకరు. 1969 ఉద్యమానికి, 1972 ఉద్యమానికి కవిగా, పత్రికా సంపాదకుడుగా, ఉపన్యాసకుడిగా ఆయన చేసిన దోహదం చరిత్రకెక్కింది. ఆయన తెలంగాణ విమోచనోద్యమ నవల మీద పిహెచ్‌డి పరిశోధనతో పాటు తెలంగాణ సమస్యల మీద వందలాది రచనలు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడ 1997 వరంగల్ డిక్లరేషన్ నాటి నుంచి ఇప్పటిదాకా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అనుకూలంగా ఎంతో కవిత్వం రాశారు, వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు.

వరవరరావు గురించి తెలంగాణ వైతాళికులు కాళోజీ, ప్రొ. కె జయశంకర్ అన్న మాటలను, వారిద్దరితో ఆయన అనుబంధాన్ని కూడ ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలచాను. ʹబాధలకు గురైన వారినందరినీ తనవారిగా, మనవారిగా గుర్తించి స్పందించేవాడు తప్పకుండా అందరివాడు.... అందరివాడైన వరవర్ మనవాడు కావడం విశేషం. నా వాడు కావడం నాకు మరీ మరీ విశేషంʹ అన్నారు కాళోజీ. ʹవరవరరావు నాకు ఎంతోకాలంగా స్నేహితుడు. సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ నేను చాల గౌరవించే వ్యక్తులలో వరవరరావు ముఖ్యుడుʹ అన్నారు జయశంకర్. ఇవాళ ఆ ఇద్దరూ సజీవంగా ఉంటే వరవరరావు అక్రమ నిర్బంధాన్ని ఖండించడంలో అందరికన్న ముందు ఉండేవారు.

తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం, పెద్ద ఎత్తున కృషి చేసిన కవి, రచయిత, వక్త ఒక పొరుగు రాష్ట్రపు పోలీసుల దుష్ట పన్నాగానికి గురి అయి నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయనకు సంఘీభావం తెల్పడం తెలంగాణ సమాజం బాధ్యత. తెలంగాణ ప్రభుత్వాధినేతగా అది మీ బాధ్యత కూడ. మోడీ – సంఘ్ పరివార్ అబద్ధాలను వ్యతిరేకిస్తున్న వ్యక్తిగా మీ బాధ్యత మరింత పెరుగుతున్నది.

వరవరరావు గారికి నిర్బంధాలు, ఆంక్షలు కొత్త కాదు. గత 45 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన మీద 25 అబద్ధపు కేసులు బనాయించారు. గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ పోలీసులు కూడ ఆయనను మూడు సార్లు అక్రమ నిర్బంధానికి గురి చేశారు. ఆయన మీద గత కేసులలో పోలీసులు అనేక తీవ్రమైన నేరారోపణలు చేశారు. కాని ప్రాసిక్యూషన్ ఒక్క కేసులో ఒక్క ఆరోపణనైనా రుజువు చేయలేకపోయింది. 25 కేసుల్లో 13 కేసులను న్యాయస్థానాలు కొట్టివేసి వరవరరావును నిర్దోషిగా విడుదల చేశాయి. మూడు కేసులను న్యాయస్థానాలు విచారణ అవసరం కూడ లేదని క్వాష్ చేశాయి. మరొక తొమ్మిది కేసులను విచారణ స్థాయికి రాకముందే పోలీసులే ఉపసంహరించుకున్నారు. ఈ కొట్టివేతకు గురైన కేసులలో విచారణలో ఉన్న నిందితుడిగా ఆయన ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది.

ఇవాళ పుణె పోలీసులు పెట్టిన కేసు, జైలులో ఉండగానే అహెరిలో బనాయించిన మరొక కేసు కూడ అటువంటి అబద్ధపు కేసులే. రేపు ఎలాగూ న్యాయస్థానాలలో నిలవవు. కాని ఈలోగా ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుట్ర పన్నింది. అనారోగ్య పీడితుడిగా, 79 సంవత్సరాల వృద్ధుడిగా ఉన్న ఆయనను ఇలా వేధించడం అమానవీయం, చట్టవ్యతిరేకం. గతంలో అన్ని కేసుల విచారణకు హాజరైనట్టే ఈ విచారణకు కూడ హాజరవుతారు గనుక ఆయనను బెయిల్ మీద వెంటనే విడుదల చేయవచ్చు.

ఆయన తెలంగాణ ప్రజలకు చేసిన సేవలు, ఆరోగ్య స్థితి, వయసు దృష్టిలో పెట్టుకుని, మహారాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ అక్రమ నిర్బంధం మీద మీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరుతున్నాను. నరేంద్ర మోడీ పట్ల మీరు ప్రకటిస్తున్న వ్యతిరేకత నిజమైనదేనని, చిత్తశుద్ధి కలిగినదేనని చూపుకోవాలంటే వరవరరావు అక్రమ నిర్బంధం మీద మీ నిర్ద్వంద్వమైన వైఖరి ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాను.

- పి. హేమలత,
వరవరరావు సహచరి

Keywords : నరేంద్ర మోడీ, బీమా కోరేగావ్ కేసు, పూణే పోలీసులు, వరవరరావు, కేసీఆర్, హేమలత, బహిరంగ లేఖ, Narendra Modi, RSS, Bima Koregaon Case, KCR, Varavararao, Letter
(2019-04-18 07:41:38)No. of visitors : 509

Suggested Posts


సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
more..


కేసీఆర్‌కు