ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ


ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ

ʹప్రొఫెసర్

మావోయిస్టులతో సంబంధాలు్నాయనే ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రొఫెసర్‌ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని పౌర సంఘాలు డిమాండ్‌ చేశాయి. బుధవారం ఈ మేరకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు విద్యావేత్తలు, ఢిల్లీ యూనివర్సిటీ ఉపాధ్యాయులు, పౌర సంఘాల నేతలు మనోరంజన్‌ మహంతి, నందిత సరైన్‌, వికాస్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సాయిబాబా సతీమణి వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ...

ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.... మానవత దృక్పథంతో స్పందించి ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాగపూర్‌లో డాక్టర్స్‌ కూడా సాయిబాబాను చూశారని...అక్కడ కూడా సరైన వసతులు లేవని వివరించారు. 19 విషయాల్లో ఆరోగ్యపరంగా సాయిబాబా బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేధింపులకు గురిచేయడం సబబు కాదన్నారు. ఒక వికలాంగ అధ్యాపకుడిపై ప్రభుత్వం ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్యపరంగా కనీసం ఇంటి దగ్గర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయనకు తక్షణమే బెయిల్‌ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు.

బీమా కోరేగామ్ కేసులో అక్రమంగా నిర్బంధించబడి పూణే జైల్లో ఉన్న వరవరరావు కూడా విలువలతో జీవితాన్ని కొనసాగిస్తున్న వారని...అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం ప్రజస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్యానించారు. సాయిబాబా సతీమణి వసంత మాట్లాడుతూ.. దివ్యాంగుడైన తన భర్త జైల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. జైలు డాక్టర్లే కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని ఆరోపించారు.

Keywords : ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ సాయిబాబా, అరెస్టు, జైలు శిక్ష, విడుదల. Prof DN Saibaba, Haragopal,
(2019-08-17 18:45:59)No. of visitors : 250

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


ʹప్రొఫెసర్