ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

ఇంద్రవెల్లి

(ఈ కరపత్రం సీనియర్ జర్నలిస్టు, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ ఫేస్ బుక్ వాల్ నుండి తీసుకున్నాము )

ʹరగల్ జెండా ఇంత ఎరుపేమిటని అడుగ గిరిజనుల రక్తంతో తడిసెనని చెప్పాలి.ʹ

పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న‌ గిరిజన ప్రజానీకం ఈ దోపిడీకి పీడనకూ వ్యతిరేకంగా ఎన్నో దశాబ్దాలుగా వీరోచిత పోరాటాలు సాగిస్తున్నారు. చివరికి ఈ ʹచెదురు మదురు పోరాటాలన్నీ నక్సల్బ‌రీ ప్రజాయుద్ద రూపం తీసుకున్నాయి. ప్రభుత్వం అంతటా అనుసరిస్తున్న అణచివేతా పద్దతులనే ఈ గిరిజన పోరాటాల మీద కూడా ప్రయోగిస్తోంది. ఈ నెల 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామంలో పోలీసులు కాల్పులు జరిపి దాదాస 50 మంది గిరిజనులను బలిగొన్నారు.

ఇంద్రవెల్లిలో ఏం జరిగింది! ఆదిలాబాద్ లో ఏం జరుగుతోంది? ప్రభుత్వ అబద్ధ ప్ర‌దారం వెనుక వున్న నిజాన్ని ఈ సందర్భంగా మీకు తెలియ జేయ దల్చుకున్నాం

40% అడవీ ప్రాంతంగా వున్న ఆదిలాబాద్ జిల్లాలో గోండు, గట్టుమన్నె, వరధాను, మచ్చలీర్, టోటల్, వోజల్ తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నాడు వీరిలో గోండులు రెండు లక్షల జనాభాతో అధిక సంఖ్యాకులుగా వున్నారు. త‌ర తరాలుగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న‌ఈ గిరిజనుల భూములను మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన‌ దొరలు, షావుకార్లు ఆక్రమించడంతో గిరిజనులకూ భూస్వాములకూ, మధ్య ఘర్షణ ప్రారంభమైంది.గిరిజ‌నుల భూములు, గిరి జ‌నేతరులు కొనడానికి గానీ, ఆక్రమించడానికి గానీ వీల్లేదనీ చేసిన ప్రభుత్వ శాసనాలు గాలికి కొట్టుక పోయాయ, గిరిజనుల ప్రయోజ‌నాల పరిరక్షణకు చేసిన చట్టాలన్నీ నీటి మీద రాతలయ్యాయి. అడవి సంపదను, గిరిజనుల నుంచి కొనడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంఘాలు, గిరిజనాభివృద్ధి ఏజెన్సీలు దోపిడీకి మారు పేర్లయ్యాయి. గిరిజనుల మీద పోలీసుల దమన నీతి పెరిగింది. దీనితో గిరిజనులు భూస్వాములకూ, ఫారెస్టు అధికారులకూ, పోలీసులకూ వ్యతిరేకంగా తిరగబడ‌వలసి వచ్చింది. ఇలాంటి తిరుగుబాట్లన్నిటినీ ప్రభుత్వం గిరిజనులకూ గిరిజనేతరులకూ మధ్య జరిగిన ఘర్షణలుగాʹ వక్రీకరించింది. కాని గిరిజనుల పోరాటాలలో ఎన్నోసార్లు గిరిజనేతరులు కూడా పాల్గొన్నారు. ఈ పోరాటలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలుగా తేలాయి.

ఇట్లా తమ న్యాయమైన హక్కుల కోసం, తమ మనుగడకోసం గిరిజనులు చేస్తున్న పోరాటాలను సీ పి ఐ ఎం ఎల్ (పీపుల్స్ వార్) వ్యవసాయ విప్లవం కింద సమీకరించింది. గిరిజ‌న రైతుకూలీ సంఘం నాయకత్వాన గిరిజనులు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని తీవ్రతరం చేశారు. చంద్రవంకతో వుండే గిరిజనుల, సాంప్రదాయక మైన ఎర్రజెండా (రగల్ జెండా) స్థానంలో సుత్తి కొడవలి ఎర్రజెండా ఆదిలాబాద్ గిరిజన జనపదాల్లో ఎగిరింది. భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకొని ఉన్న‌ తమ భూములను గిరిజనులు స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా దొరల షాపుకార్ల బంధ నాల నుంచి వేల ఎకరాల భూమి విముక్తమయింది. తమ‌ భూములను గుంజుకొని ఫారెస్టు అధికారులు వేసిన ప్లాంటేషన్లను నరికి భూములను దున్నుకున్నారు. అడవులను నరికి సాగు చేసారు. ఇట్లా కొత్తగా సాగులోనికి వచ్చిన భూమి 80 వేల ఎకరాలు, ఈ క్రమంలో వచ్చిన పోలీసు జులుంను కూడా ప్రజలు (గిరిజనులు, గిరిజ‌నేతరులు కలిసి) ధైర్యంగా తిప్పికొట్టారు.

ఈ పోరాట ఫలితాలను సమీక్షించుకోవడానికి గిరిజన రైతుకూలీ సంఘం ఉట్నూరు తాలూకా ఇద్రవెల్లి గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతుకూలీ మహాసభ జరపాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20 తేదీ సాయంకాలం నాలుగు గంట లకు గిరిజన ప్రదర్శన, ఆరు గంటలకు బహిరంగసభ ఉంటాయని ఆదిలాబాద్ జిల్లా అంతటా గోండు, కొలామ్ తెలుగు భాషల్లో పోస్ట‌ర్లు పడ్డాయి. కరపత్రాలు పంచ‌ బడ్డాయి. ఈ ప్రదర్శనకు ముప్పైవేల మంది పైగా గిరిజనులు హాజరవుతారని అంచనా వేయబడింది. గంగవెర్రు లెత్తిన ప్రభుత్వ యంత్రాంగం ఈ సభను భగ్నం చేయరు దలచింది, ʹగిరిజ‌నేతర రైతు సంరక్షణ సంఘంʹ సభ కూడా ఆనాడే వుండడం వల్ల ఇంద్రవెల్లిలో గొడవ జరుగుతుందనే ఆనుమానంతో 144 సెక్షన్ పెడుతున్నా నని ప్రకటించింది. కాని నిజానికి అలాంటి సంఘ మేదీ. ఇంద్ర‌వెల్లిలో ఆనాడు సభ నిర్వహించడమే లేదు,

ఏప్రిల్ 18 నాటికి జిల్లా పోలీసు యంత్రాంగమంతా ఇంద్రవెల్లి చేరు కుంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ (ఎ పి ఎస్ పి) బెటాలియన్ ఒకటి కూడా ఇంద్రవెల్లి చేరుకుంది. స్థానిక అప్పర్ ప్రైమరీ స్కూల్లో పోలీస్ క్యాంపు ఏర్పాటు చేసి ఇంద్రవెల్లి గ్రామానికి చుట్టూ 8 కి మీ దూరం పోలీసు వలయం ప‌న్నారు, దుర్గ‌ మారణ్యాల మధ్య‌ ఇంద్రవెల్లి ఆ రెండు రోజులూ ఖాకీ వనంగా మారిపోయింది. 19, 20 తేదీలు రెండు రోజులూ ఇంద్రవెల్లిలో అప్రకటిత కర్ఫ్యూ అమ‌ల్లో వున్నది. 20 వ తేదీన ఆ ఊళ్లో కనబడిన తెల్లబట్టల మనుషులు ఇద్దరే ఇద్దరు ఒకరు ఆర్. డి, ఒ., ఇంకొకరు స్థానిక ఎం. ఎల్ ఎ. 20వ తేదీ ఉదయం నుంచీ మహా సభకు తరలి వస్తున్న జనాన్ని ఇంద్రవెల్లికి ఎనిమిది కిలో మీటర్ల అవతలి నుంచే తరిమి కొట్టడం ప్రారంభించారు. అట్లా ఆనాడంతా ఇంద్ర వెల్లిలోకి ఎవ్వరినీ ప్రవేశించనివ్వలేదు. లాఠీ చార్జీలూ, బాష్పవాయు ప్రయోగాలూ ఆనాడంతా గిరిజన ప్రజానీకాన్ని ఇంద్రవెల్లి రాకుండా అడ్డుకున్నాయి. సాయంత్రం 5 గంతల‌కు ఇంద్రవెల్లి మహాసభకు వస్తున్న జనం మీద పోలీసులు ఏ హెచ్చరి కలూ లేకుండా కాల్పులు సాగించారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయో లెక్క లేదు. ఎన్ని వందల మంది గాయ‌ పడ్డారొ లెక్క లేదు. దాదాపు వందమంది గాయ పడ్డారనీ, 50 మంది మరణి చారని తెలుస్తున్నది..

మరణించిన తమ కుటుంబ సభ్యులకోసం ఏడిస్తే గుర్తు పడతారని ఎంతోమంది దుఖాన్ని లోలోపల దిగమింగారని ఒక పత్రిక రాసింది. 24 శవాలను పోలీసు వ్యాన్లో ఎక్కిస్తుండగా చూసానని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడని ఇంకో ప‌త్రిక రాసింది.

మృతుల శవాలను సాంప్రదాయం ప్రకారం పాతి పెట్ట వలసి వుండగా పాత్ పెడ్తే మళ్ళీ ఎన్నడైన విచారణలో తవ్వి తీస్తారనే భయంతో, సంఖ్యను మరుగు పరచే ఉద్దేశ్యంతో కలెక్టర్ శవాల‌ను దహనం చేయించాడు.

గిరిజన సాంప్రదాయాన్ని పాటించకుండా శవ దహనం చేసినందుకు కలెక్టర్ పై చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తు న్నాం.

వీరోచితంగా నైజాం వ్యతిరేక పోరాటం సాగించిన గోండు నాయకుడు కొమురం భీము వారసత్వాన్నీ, శ్రీకాకుళ ప్రథమ అమరవీరులు కోరన్న, మంగన్న, రెంజింల‌ వారసత్వాన్నీ అందుకున్న ఈ 50 మంది గిరిజన కామ్రేడ్స్ కు వర్గ కసితో పదును పెట్టిన లాల్ సలామ్ తెలుపుతున్నాం.

ఈ 50 మంది గిరిజన కామ్రేడ్స్ పెట్టిన నెత్తుటి అప్పును చివరి వెత్తుటి బొట్టును ధార పోసైనా తీరుస్తామనీ, ఈ దుర్మార్గ వ్యవస్థను కూలదోస్తామనీ మాతృభూమి ముందు శపథం చేస్తున్నాం..

ఈ సంఘటనపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాల్సిందిగా, దోషుల‌ను కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని ప్రజ‌లకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ సంఘటనపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయ విచారణను తలకిందులు చేసే ప్రమాదం ఉంది గనుక విచారణ జరిగినన్ని రోజులూ ఈ హత్యాకాండకు బాధ్యులయిన జిల్లా ఎస్ పి, ఎఎస్ పి లతో సహా పోలీసు అధికారులందరినీ సస్పెండ్ చేయ వలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం,

ఒక‌వై పు గిరిజనుల‌ శవాలు పీక్కుతింటూ మరోవైపు గిరిజన సంక్షేమ పధకాల పేరిట కోట్ల రూపాయల‌ని ప్రకటిస్తున్న ప్రభుత్వ కపట నీతిని త్రీవంగా ఖండిస్తున్నాం.

* ఇంద్రవెల్లి కాల్పులపై ఉన్నత స్థాయి న్యాయ విచారణజరిపించాలి..
* కాల్పులకు బాధ్యులయిన ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధికారులను వెంటనే స‌స్పెండ్ చేయాలి. • *గిరిజన మృతవీరులకు జోహార్లు

* న్యాయమైన హక్కులకోసం గిరిజనులు సాగిస్తున్న పోరాటాలు వర్ధిల్లాలి

* లాఠీలతో తూటాలతో విప్లవాన్ని ఆపలేరు !
* విప్లవం వర్ధిల్లాలి
* గిరిజన రైతుకూలీ సంఘం వర్ధిల్లాలి
* సి. పి. ఐ. (ఎం. ఎల్) (పీపుల్స్ వార్) జిందాబాద్

- రాడికల్ విద్యార్థి సంఘం
‍- రాడికల్ యువజన సంఘం

వరంగల్ జిల్లా

23-4 - 81




Keywords : indravelli, telangana, anjayya, firing, adivasi
(2024-04-17 04:36:10)



No. of visitors : 2260

Suggested Posts


ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడు రోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న‌ గిరిజన ప్రజానీకం

ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

ఏప్రెల్ 20, 1981 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పాలక వర్గాలు నెత్తురు పారించిన రోజు. గిరిజన రైతు కూలీ సంఘం మహా సభ జరుపుకునేందుకు వస్తున్న వేలాది ఆదివాసులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది.

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

ʹరగల్ జెండా ఇంత ఎరుపేమిటని అడుగ గిరిజనుల రక్తంతో తడిసెనని చెప్పాలి.ʹ పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న‌ గిరిజన ప్రజానీకం

పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి

ఇంద్రవెల్లి నెత్తుటి మడుగై 38 ఏండ్లయ్యింది. ఇప్పటికీ ఆ గాయం సలుపుతూనే ఉన్నది. వందమందికి పైగా ఆదివాసులను కాల్చి చంపిన నయా డయ్యర్లు నేటికీ రాజ్యమేలుతూనే ఉన్నారు. తమతో కలిసి జీవించి తమ హక్కులకోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ యోధులకు నివాళులు అర్పించడానికి కూడా

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇంద్రవెల్లి