డేటా చౌర్యంలో దోషులెవరు ?

డేటా

(వీక్షణం పత్రిక ఏప్రెల్ సంచికలో ప్రచురించబడిన ఈ వ్యాసం న్యాయవాది, ఒపిడిఆర్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెమ్మె జాన్ బర్నబాస్ రాసినది)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్‌ (6) ద్వారా ఎన్నికల
నోటిఫికేషన్‌ (మార్చ్‌ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 59.18 లక్షల దొంగ ఓట్లు నమోదై ఉన్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే అదే వైకాపా ఓట్ల తొలగింపునకు లక్షల సంఖ్యలో ధరఖాస్తులు పెట్టడం, తప్పుడు పేర్లతో ఎన్నికల సంఘాన్నే తప్పుదోవపట్టించాలని చూడడం, వారి అక్రమ కార్యకలాపాలకు అద్దం పడుతోంది. ఓట్ల తొలగింపుపై దాదాపు 8.72 లక్షల ధరఖాస్తులు వస్తే అందులో దాదాపు అన్నీ కూడా వైకాపా వారు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశారని బయటపడింది. అది కేవలం ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికి, వారికి వ్యతిరేకంగా ఓట్లు వేసేవారి ఓట్లను గల్లంతు చేశారనేదానికి ఇదొక మచ్చుతునక.
అయితే బోగస్‌ ఓట్ల తొలగింపునకు క్షేత్రస్థాయి పరిశీలనకు ఎన్నికల సంఘం దగ్గర సరియైన సిబ్బందిలేక దిక్కుతోచని పరిస్థితి నెలకొని ఉంది. గత సంవత్సరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ఇదే పద్ధతి అధికార పార్టీవారు అవలంభించారని, వారి సలహాతోనే ఇక్కడ వైకాపా కూడా ఇదే పద్ధతి అవలంభించడానికి ప్రయత్నిస్తున్నదని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అయితే తెలుగుదేశం పార్టీ ఒక ఆకు ఎక్కువ తిన్నట్లు ముందే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రజల సమాచారాన్ని అనగా తెల్ల రేషన్‌కార్డు దారులు, ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులు, చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు తదితర కార్యక్రమాలలో లబ్ధిదారుల జాబితా నొకదానిని ఒక ʹగ్రిడ్‌ʹ సంస్థకు బదిలీ చేసి, అవి కాకుండా మిగతా వారి ఓటర్ల జాబితాను అనగా తమకు ʹఓటు వేయరేమో?ʹ అనే అనుమానమున్నవారి సంఖ్యను, జాబితాను తయారు చేయడానికి అశోక్‌ అనేవ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంస్థకు బదలాయించడం జరిగింది.

ఒక రాష్ట్ర ప్రజల జాబితాను ప్రభుత్వం ఒక ప్రైవేట్‌ సంస్థకు బదలాయించడం జరిగింది. అది తప్పా? కాదా? అనేది ఇంకో అంశం. అయితే, ఆ డాటాను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, టిఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో వైకాపా వారు తమ పార్టీవారి ఓట్లను తొలగిస్తున్నారనే నెపంతో దీనిపై ఒక ఫిర్యాదును ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ద్వారా పోలీసులకు ఇప్పించారు. స్థానిక స్టేషన్‌లో లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుదారునిగా ఉన్నారు.

దీని ద్వారా ఆ సంస్థలో పనిచేసే నలుగురు యువకులపై కేసు నమోదు చేసి నిర్బంధించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, నలుగురు యువకులను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిందని హైకోర్టు (హైదరాబాద్‌) ను ఆశ్రయించగా, (హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు) ఆ నలుగురు సిబ్బందిని హైకోర్టు ఎదుట హాజరు పరిచారు.
అయితే అప్పటికే వారు తమను ఎవరూ నిర్బంధించలేదని, తాము క్షేమంగా ఉన్నామని, వారితో ఒక ప్రమాణ పత్రాన్ని తెలంగాణ పోలీసులు తెలంగాణ హైకోర్టు ఎదుట రాతమూలకంగా ఇచ్చారు. అంతే కాకుండా ఈ కేసులో ఈ నలుగురిని కూడా సాక్షులుగా తీసుకున్నామంటూ మాట మార్చేశారు. అంతేకాకుండా ఈ నలుగురి నివాసాలకు సంబంధించిన 4 గ్రామ పరిపాలనాధికారుల (విఆర్‌ఒ) సంతకాలను ఖాళీ తెల్ల కాగితాలపై తీసుకొని వాటిని కూడా హైకోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.

దీనిని చూసి హైకోర్టు ʹఖాళీ కాగితాలపై విఆర్‌ఒల సంతకాలు తీసుకోవడం ఎందుకు?ʹ అంటూ పోలీసులను చివాట్లు పెట్టింది. ఈ మొత్తం కేసుపై సైబరాబాద్‌ కమిషనర్‌ వి.కె. సజ్జన్నార్‌ మీడియా సమావేశం నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలపై కూడా అవసరమైతే నోటీసులిస్తూ, విచారిస్తామని కొంత ఘాటుగానే స్పందించారు. మొత్తం ఒక పథకం ప్రకారం ఈ వ్యవహారం అంతా నడిచినట్లు అనిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు సంబంధించిన ʹసేవా మిత్రʹ యాప్‌ను తయారు చేస్తున్న ఐటి గ్రిడ్స్‌ʹ సంస్థపై దాడిచేసి తెలంగాణ పోలీసులు డిస్క్‌లు, డేటా అపహరించుకుపోయారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు గుంటూరు రూరల్‌ ఎస్‌.పి. ఎదుట ఫిర్యాదు చేశారు. అసలు పాలనను గాలికొదిలేసి ఒక వారం రోజుల పాటు ప్రజలంతా సిగ్గుపడేటట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంతా దీనిపైననే దృష్టి పెట్టింది.

కొంతమంది మంత్రుల పేర్లు కూడా ఓటర్ల లిస్టులో లేవని, తొలగించారని, దీనికంతటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (టిఆర్‌ఎస్‌ పార్టీ), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బాధ్యులంటూ తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోసింది. రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఓట్లు ఉన్నాయో లేవో అంటూ ఆందోళన చెందారు. భారత ఎన్నికల సంఘాన్ని కలిసి వైకాపా అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి, తదితరులు ఫిర్యాదు కూడా చేశారు.

ఎన్నికల సంఘం కేవలం ప్రేక్షక పాత్ర తప్ప, ఏమీ చేయలేకపోయింది. అంతే కాకుండా తమ ఓట్లు ఉన్నాయో లేవో ప్రజలు చూసుకోవాలని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఇది పూర్తిగా అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం. హైదరాబాద్‌లో నివసిస్తున్న, వ్యాపారాలున్న వ్యాపార వేత్తలను, పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని తెలుగుదేశం పార్టీని వీడేటట్లు చేస్తూ వైకాపాకు సహకరించాలని లేదా వైకాపాలో చేరాలని టిఆర్‌ఎస్‌ బలవంత పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు.

టిఆర్‌ఎస్‌ పార్టీ వైకాపాకు వేయి కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు ఇచ్చినట్లు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించాడు ఎపి ముఖ్యమంత్రి. 2019లో జరుగుతున్న ఎపి శాసన సభ ఎన్నికలు, దేశవ్యాప్త లోక్‌సభ ఎన్నికలు ఒక పెద్ద ప్రహసనం లాగా తయారయింది. ఎపి డేటాతో మేమేం చేసుకుంటామని, ʹఓటుకు నోటు కేసుʹ తరహాలో చంద్రబాబును అవహేళన చేస్తూ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ నాయకత్వం మాట్లాడుతున్నది.

వాస్తవానికి ʹసాధికార మిత్రʹ అనే ప్రభుత్వ సహాయ పొదుపు మహిళల డేటా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల మొత్తం సమాచారం చౌర్యం కాలేదని, క్షేమంగానే ఉన్నదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ విజయానంద్‌ ప్రకటించాడు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ఆందోళనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీవారు డబ్బులిస్తే తీసుకోవాలి కానీ ఓటు మాత్రం ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించినందుకు, జగన్‌ మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ లీగల్‌సెల్‌ మరో ఫిర్యాదు దాఖలు చేసింది.

దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు టిడిపి చేర్పించిందని వైకాపా ఆరోపించింది. దీనిపైన కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ (తాత్కాలిక) సంస్థ బ్లూఫ్రాగ్‌ విశాఖపట్టణం కేంద్రంగా ఉన్నది. టిడిపి ఐటి ప్రొవైడర్‌ ʹఐటి గ్రిడ్స్‌ʹ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్నది. మార్చి 3 అర్ధరాత్రి హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీలోని ఐటి గ్రిడ్స్‌ కంపెనీలో తెలంగాణ (హైదరాబాద్‌) పోలీసులు ప్రవేశించి, అక్కడ పనిచేసే నలుగురు ఉద్యోగులను విచారణ పేరుతో అరెస్ట్‌ చేయడంతో ఈ సమస్య జటిలమైంది.

మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల, ఓటర్ల వివరాలన్నీ దొంగిలించ బడుతున్నాయనే పెద్ద ప్రచారం జరిగి, దేశ వ్యాప్త చర్చకు దారితీసింది. ఇది వైకాపా, తెలుగుదేశం పార్టీల సమస్య కాదు. ఇది ఈ దేశ పౌరుల రాజ్యాంగ హక్కులకు సంబంధించిన విషయం. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా రాజ్యాంగ హక్కులను కాపాడవలసిన బాధ్యత ఆయా ప్రభుత్వాల పైన ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో స్వతంత్ర సంస్థలైన ఎన్నికల సంఘం, ఆర్‌బిఐ, కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సిఎజి), సిబిఐ అన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే. వీటిని భారతీయ జనతా పార్టీ తమ ప్రత్యర్థులపై ప్రయోగిస్తూ, బెదిరించడం పరిపాటిగా మారింది.

ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్ర సంస్థ, రాజ్యాంగం సర్వ హక్కులూ దానికి కల్పించింది. భారతదేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన కోటీ 60 లక్షల మందితో కలిపి ఏకా ఏకీన 90 కోట్లకు విస్తరించిన ఓటర్ల సంఖ్య రీత్యా దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఒక పెద్ద అద్భుతంగా మారింది. ఓటర్ల జాబితానే సరిగా రూపొందించుకోలేని బలహీనతలతో భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నది. ఇది ʹమేడి పండుచూడ మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడ పురుగులుండుʹ మాదిరే. దేశంలో ఓటర్ల జాబితాలో ఎనిమిదిన్నర కోట్ల బోగస్‌ ఓట్లు నమోదయి ఉన్నాయని గతంలోని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు.

మొత్తం ఓటర్లలో 12 శాతం ఓట్లు బోగస్‌గానే ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. దక్షిణాది రాష్ట్రాలలోని ఒక ప్రధాన నగరంలో 40 శాతం ఓట్లు బోగస్‌ అనేది 2015 లోనే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తెలియజేశాడు. దీనిని నివారించడానికి ఓటర్ల పేర్లను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానిస్తే సరియైన ఓట్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంటుదనేది నగ్నసత్యం. ఈ లక్ష్య సాధన కోసం జాతీయ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభించిన రెండు నెలలకే 32 కోట్ల మంది ఓటర్లను ఆధార్‌తో అనుసంధానించారు. అదే సమయంలో అన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించడం అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో మధ్యలోనే ఆపివేయడం జరిగింది. అయితే ఇటీవల మద్రాస్‌ హైకోర్టు తీర్పు ఆధారంగా, (ఒక ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలయినది) ఎన్నికల సంఘం ఆధార్‌

అనుసంధానానికి తాము అనుకూలమేనంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల తెలంగాణలో దాదాపుగా 23 లక్షల ఓట్లు గల్లంతు కావడం జరిగింది. కేవలం ʹనిర్ణీత సమయానికి ఎన్నికలు జరపడం మాత్రమే తమ విధిʹ అంటూ ఎన్నికల సంఘం భావించడం తర్వాత జరిగే ఓటర్ల నమోదు ప్రక్రియ, సరియైన ఓటర్లు నమోదు కావడం అనేది రాజకీయ పార్టీలు చూసుకుంటాయనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రతిష్టపాలు చేయడమే అవుతుంది. 2014 ఎన్నికలలో సొంత ఊర్లలో నివాసం లేని కారణంగా దాదాపు 28 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారనేది ఒక సర్వే చెపుతున్నది. అనగా జీవనం కోసం వలస వెళ్లే ప్రజలకు ఓటు హక్కు నిరాకరించబడుతున్నదనేది అర్థమవుతున్నది. దీనిపై

ఎన్నికలం సంఘం ఏ విధమైన చర్యలు భవిష్యత్తులో తీసుకుంటుందో ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక ఉండాలి. భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరిగిన సందర్భాలు ఎప్పుడూ లేవు. డబ్బు - మద్యం నీళ్లవలే ఖర్చు అవుతున్నది. దీనిని పూర్తిగా నివారించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితిని రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి. దీనిని ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ʹఎన్నికలుʹ అనేవి ఒక సాధనంగా వాడుకుంటున్నారు కానీ అది వాస్తవం కాదు.

(రచయిత న్యాయవాది, ఒపిడిఆర్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు)

Keywords : data chori, andhrapradesh,
(2024-04-23 12:45:56)



No. of visitors : 847

Suggested Posts


లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపు

విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల

తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?

ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో

మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్‌ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు.

గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట‌...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట‌ !

గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు.

నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...

సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే

విశాఖ‌ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు

12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై

రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌

ప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది

రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ‌

కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది.

Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల‌ పోరాటం

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


డేటా