ఎవరైతేనేం ......? ఎప్పుడైతేనేం ..?. ఎక్కడైతేనేం.....?


ఎవరైతేనేం ......? ఎప్పుడైతేనేం ..?. ఎక్కడైతేనేం.....?

ఎవరైతేనేం

(మోహన సుందరం తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై పోస్ట్ చేసిన‌ ఈ వ్యాసం మీ కోసం...)

నేనింకా మొండిగా చావడానికి ససేమిరా అన్నాను
విషాదమేమిటంటే
నేను చనిపోయేలా ఏం చేయాలో
వాళ్ళకు తెలియడం లేదు
ఎందుకంటే
నాకు మొలకెత్తే గడ్డి సవ్వడులు
చాలా ఇష్టం

గత అయిదేళ్లుగా నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండాసెల్ లోంచి ఈ రాజ్యం వికలాంగత్వంమీదకు "నేను చావును నిరాకరిస్తున్నాను "అంటూ ప్రొఫెసర్ సాయిబాబా ఎక్కుపెట్టిన ధిక్కారమిది. అనువదించింది పూణే జైలులోని సహ ఖైదీ వరవరరావు గారు. వరవరరావు గారి జైలు రచన "సహచరులు " గూగీ ని తెలుగు నేలకు పరిచయం చేస్తే , సాయిబాబా జైలు కవిత్వం అమెరికా చట్టాలు, జైళ్ళు కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన బ్లాక్ పాంథర్ రచయిత జార్జ్ జాక్సన్ ని గుర్తుచేస్తోంది.

" నా జీవితంలో తిరుగుబాటు చేయని రోజు లేదు. ఈ ఘెట్టోల్లో పుట్టి పెరుగుతోన్న నల్లజాతి యువకులకు తొట్టతొలి నేరమే వాళ్ళతొలి తిరుగుబాటు " అని చెప్పే జార్జ్ జాక్సన్ జీవితమంతా తిరుగుబాటే. తెల్లజాతి వివక్షకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన ప్రతిఘటనే. అందుకే తన పద్నాలుగో యేట నుంచే నేరస్థుడిగా ముద్ర వేయబడి అమానుషంగా వేటాడబడ్డాడు. 1961 లో తన 17 వ యేట పెట్రోల్ బంక్ లో 70 డాలర్లు దొంగతనం చేశాడనే ఆరోపణ పై అరెస్ట్ చేయబడ్డాడు . ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెల్ల లాయర్ నేరం ఒప్పేసుకో మైనర్ వి కదా చిన్న శిక్షే పడుతుందని చెప్పడంతో చేయని నేరాన్ని ఒప్పుకున్నాడు. అనూహ్యంగా కోర్ట్ రెండేళ్ల నుంచి యావజ్జీవితం అంటూ అస్పష్ట తీర్పు నిచ్చేసింది. మైనర్ కావడంతో సాన్ క్వెంటిన్ జైలు లోని బోస్టన్ విభాగం లో నిర్భంధించారు. " తొలిసారి నేను జైల్లో అడుగుపెట్టినప్పుడే చచ్చిపోయినట్టనిపించింది. బంధించబడటం కన్నా పెద్ద బానిసత్వం ఏముంటుంది? తరతరాల నా నల్లజాతి బానిస వారసత్వం నన్ను వెంటాడుతుందనిపించింది." అని రాసుకున్న జాక్సన్ కు తొలినాళ్లలో చదువుకునే అవకాశం దొరికింది. ఏమి చదవాలో చెప్పే గురువులు దొరికారు.మార్క్స్,ఎంగెల్స్,లెనిన్,ట్రాట్స్కీ,మావో లను విస్తృతంగా చదివాడు. రాజకీయ అర్ధశాస్త్రాన్ని , గెరిల్లా యుద్ధపద్ధతుల్ని అధ్యయనం చేశాడు. జార్జ్ లూయిస్, జేమ్స్ కార్, బిల్ క్రిస్మిస్, డబ్ల్యూ.సి.నోలెన్ లాంటి బ్లాక్ గెరిల్లా ల గురించి తెలుసుకున్నాడు. ఆ అధ్యయనం వెలుగులో తనను తాను మార్క్సిస్ట్ విప్లవకారుడిగా ప్రకటించుకున్నాడు. అంతే ప్రమాదకరమైన ఖైదీగా గుర్తించి జైల్లోని అత్యంత హేయమైన ʹ సాలిటరీసెల్ ʹ కు తరలించ బడ్డాడు.

ఆరు ఇంటు ఎనిమిది అడుగుల ఎండా,వాన,చలి,మంచు నుండి ఏమాత్రం రక్షణ లేని ,గాలీ వెలుతురు లేని ఆ మురికి చీకటి గదిలో రోజులో,నెలలో కాదు ఏకంగా ఎనిమిదేళ్లు నిర్భంధించ బడ్డాడు. మిగతా ఖైదీల్ని కలవకుండా అతని సెల్ తలుపుల్ని వెల్డింగ్ చేసేశారు. అయిదు రోజులకొకసారి ఇచ్చే కొద్దిపాటి నీళ్ళతో ,ఆహారంతో ,తనలో తానే మాట్లాడుకుంటూ, తనకు తానే పదును పెట్టుకుంటూ ఆ కర్కశ ఏకాంతాన్ని అధిగమించగలిగాడు. 1969 లో సోల్ డాడ్ జైలుకు తరలించబడ్డాడు. అక్కడ ఎన్నో పోరాటాలు చేసి ఓ ప్లాస్టిక్ టైపు మిషన్ మంజూరు చేయించుకొని తన సోలిటరి సెల్ లోనే తన జైలు లేఖలు "సోల్ డాడ్ బ్రదర్ " పూర్తి చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆ పుస్తకం సంచలనం సృష్ఠించింది. 1970 లో ఓ జైలు గార్డుని హత్య చేశాడనే ఆరోపణ తో తీవ్రంగా చిత్రహింసలు పెట్టి విచారణ జరిపేందుకు తిరిగి సాన్ క్వెంటిన్ జైలుకు తరలించారు. విచారణ జరిగుంటే మరణ శిక్ష విధించి వుండేవాళ్లు. కానీ 1971 ఆగస్ట్ 21 న జైలు అధికారులే జార్జ్ జాక్సన్ ని క్రూరంగా జంతువుని కొట్టినట్టు కొట్టి చంపేశారు.చనిపోవడానికి కేవలం ఓ వారం రోజుల ముందు " బ్లడ్ ఇన్ మై ఐ" అనే తన ఆత్మ దర్శనాన్ని రచించాడు. పన్నెండేళ్ళు మృత్యువుతో సహజీవనం చేసిన ,తెల్లజాతి చట్టాలు అమానుషాన్ని, క్రౌర్యం, వివక్షల ను పరిహసించిన జాక్సన్ " ఇది ఫాసిస్ట్ వ్యవస్థ ,పొరాడి తీరాల్సిందే . పోరాటంలో ఒరిగిపోతున్నారా , అయితే చేతిలోని కాగడాని విడవకుండా వేరొకరికి అందించండి." అని పిలుపునిచ్చాడు.

ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు, దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆదివాసులు అక్రమ జైలు నిర్భంధాన్ని అనుభవిస్తున్నారు. నకిలీ ఆరోపణలతో వివి సార్,సుధా భరద్వాజ్,సోమాసేన్, అరుణ్,వెర్నన్... లాంటి మేధావులు అక్రమ నిర్భంధాన్ని అనుభవిస్తున్నారు. ఈ అక్రమ నిర్భంధాల్ని వ్యతిరేకిస్తూ , ఈ రాజ్యం క్రౌర్యాన్ని ప్రశ్నిస్తూ... ఈ నెల 28,29,30, తేదీల్లో హైదారాబాద్ , వరంగల్, విజయవాడ, కర్నూల్ లలో జరుగుతున్ననిరాహార దీక్షల్లో పాల్గొని వాళ్ళని విడిపించుకుందాం. ప్రభుత్వ దమనకాండని తీవ్రంగా వ్యతిరేకిద్దాం.

నిద్ర పట్టని నిరంతర దీర్ఘ రాత్రులలో
కటకటాల వెనుక జీవితం గురించి
శతాధిక గీతాలు రాస్తాను.
ఒక్కొక్క గీతం ముగిసినప్పుడల్లా కలం కింద పెట్టి
కటకటాల నుంచి సుదూర స్వేచ్చాకాశాన్ని చూస్తాను.

.... హోచిమిన్
- మోహన సుందరం

Keywords : varavararao, GN Saibaba, JAIL
(2020-06-30 18:19:32)No. of visitors : 501

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
more..


ఎవరైతేనేం