ఇప్పుడు కావాల్సింది అర్బన్ మావోయిస్టులే


ఇప్పుడు కావాల్సింది అర్బన్ మావోయిస్టులే

ఇప్పుడు

ʹఇప్పుడు కావల్సింది అర్బన్ మావోయిస్టులే ʹ పుస్తకాన్ని పరిచయం చేస్తూ రచయిత్రి రమా సుందరి గారు తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై పెట్టిన పోస్టు మీ కోసం...

ఈ పుస్తకం చదివి, ఈ నాలుగు ముక్కలు రాయకుండా ఉండలేక పోయాను.

అర్బన్ మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా జరిగిన అరెస్టులు, నిర్బంధాలు ఎన్నో ప్రశ్నలు లేపాయి. ఫాసిజానికి నిర్వచనాన్ని మళ్లీ మననం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు భారతదేశంలో ఉన్నది ఫాసిష్టు ప్రభుత్వమా, ఫాసిస్టు పోకడలు ఉన్న ప్రభుత్వామా అనే చర్చలు కూడా జరిగాయి. నిజానికి ఇప్పటి వరకూ అర్బన్ నక్సలైట్ల పేరుతో అరెష్టు అయిన పదిమందిలో (సాయిబాబాతో కలుపుకొని) ఎక్కువ మందికి మావోయిస్టు రాజకీయాలతో కొన్ని అభిప్రాయ బేధాలు కూడా ఉన్నాయి. వాళ్లందరూ ఆదివాసీల నిర్వాసిత హక్కుల కోసం పని చేస్తున్నవాళ్లు. దళితుల సమీకరణ కోసం పని చేస్తున్నవాళ్లు. ఆ చర్యలు ఎలా నేరం అయ్యాయో ఈ పుస్తకం కూలంకుషంగా చర్చించింది.

నిజానికి విప్లవ రాజకీయాలే నేరం అయ్యే సమకాలీన సందర్భం ఇప్పుడు నడుస్తోంది. ఈ పుస్తకం రాసిన రచయితలు ఇద్దరూ ముందు మాటలో అదే విషయాన్ని ప్రస్తావించారు. ʹవిప్లవ రాజకీయాలు మొట్టమొదటి రాజీలేనితనాన్ని నేర్పిస్తాయి. పోరాట చేవను పెంచుతాయి. రాడికల్ స్వభావాన్ని అందిస్తాయి. ... దీనివల్ల వర్గ పోరాట ఆవరణలోకి వచ్చే సామాజిక, ప్రజాస్వామిక శక్తులన్నీ పీడితవర్గంగా తమ చారిత్రిక పాత్ర నిర్వహించేలా రూపొందుతాయిʹ అంటారు. సమాజపు విలువలు తల్లకిందులుగా వేలాడుతున్నప్పుడు సరైన రాజకీయాలు నేర రాజకీయాలు అవుతాయి. నేర రాజకీయాలు ప్రధాన స్రవంతి రాజకీయాలుగా చలాయిస్తూ ఉంటాయి. అర్బన్ నక్సలైట్ల పేరుతో అరెస్టులకు సరిగ్గా ఇక్కడే ప్రాతిపాదిక ఉంది. ʹఇప్పుడు కావాల్సింది అర్బన్ మావోయిశ్టులేʹ అనే టైటిల్ కు కూడా ఇక్కడే పునాది పడి ఉండాలి.

అత్యంత మానవీయమైన విప్లవ రాజకీయాలను ప్రమాదకరమైనవిగా వర్ణిస్తూ, రాజ్య ప్రయోజనాలకు భిన్నంగా ఆచరణలో ఉన్నవారికి అర్బన్ నక్సలైట్లనే పేరును కాయిన్ చేసింది హిందూ ఫాసిష్టు ప్రభుత్వం. మొదట విప్లవ రాజకీయాలను నేర రాజకీయాలుగా ముద్ర వేయటం అనే పని జరిగిపోయాక, తమకు నచ్చని రాజకీయ ఆచరణలో ఉన్న వాళ్లకు ఆ పేరు తగిలిస్తే పని అయిపోతుంది. ఆ పేరుతో ఎన్ని రకాల నిర్భంధాలు అయినా ముందుకు తీసుకొని రావచ్చు. అదే పనిని వేగవంతంగా చేసేసి చేతులు దులుపుకొన్నది. కల్బుర్గి, పన్సారే, గౌరి లంకేష్ హత్యల తరువాత వచ్చిన నిరసనల నుండి తమ పెయిడ్ మీడియా కూడా రక్షించలేక పోయాక, పంథాను మార్చుకొని ఈ కొత్త మార్గాన్ని కనిపెట్టిందనేది వేరే విషయం.

వర్గ రాజకీయాలు తెలియక పోయినా, అంగీకరించక పోయినా కూడా సంఘ్ రాజకీయాలకు వ్యతిరేక దిశలో నడుస్తున్న రాజకీయాలే ప్రగతిశీల రాజకీయాలని అంగీకరించే వాళ్లు ఉన్నారు. వాటికి ఎదురోడ్డుతున్న వాళ్లు ఏ పేరుతో పిలిచినా వాళ్లే సమాజానికి కావాల్సిన వాళ్లు. ʹనక్సలైట్లే దేశభక్తులుʹ అని ఆరోజు ఎన్టీయార్ నోటి నుండి ఏ ఉద్దేశ్యంతో వచ్చినా అదే వందశాతం నిజం అని నమ్మే వాళ్లు కూడా ఉన్నారు. అలా నమ్మే వాళ్లు కూడా వాళ్ల రంగాల్లో వారికి తగ్గ ప్రగతిశీల కృష్టి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారాన్నితిప్పి కొట్టటానికి ʹమేము మావోయిశ్టులం కాదుʹ అనే కన్నా ʹఅవును మేమే ఆ అర్బన్ మావోయిశ్టులమిʹ అని ఎదురు తిరగవచ్చు. అంతే కాదు, ʹఅసలిప్పుడు కావాల్సింది అర్బన్ మావోయిశ్టులేʹ అని కూడా ధిక్కరించవచ్చు. ఆ ధిక్కారమే వాడికి గుండె దడ కలిగిస్తుంది. అందుకే ఈ సందర్భంలో ʹఇప్పుడు కావాల్సింది అర్బన్ మావోయిశ్టులే.ʹ అనే ప్రకటనకి సమకాలీనత, సందర్భం ఉన్నాయి.

చరిత్రను సరైన కోణంలో చూడటానికి చారిత్రిక భౌతికవాదం ఉపకరిస్తుంది. మార్కిస్టు చారిత్రిక భౌతికవాద కోణం నుండి భీమా కోరేగావ్ యుద్ధాన్ని, తదనంతర పరిణామాలను పరిశీలిస్తూ పోతే నేటి అర్బన్ నక్సలైట్ల పేరుతో అరెస్టులను సరైన పద్దతితో అర్థం చేస్కోవటానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడింది.

ఆనాటి యుద్ధం పీష్వాల ఫ్యూడలిజానికి, మూడో ప్రపంచదేశాల్లో ఆనాడు ముందుకు వస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి మధ్య జరిగింది. ఏ యుద్ధం జరిగినా అందులో పాల్గొనే సమూహం, దానికి బలి అయ్యే సమూహం ప్రజలే. ఆ ప్రజల్లో దళితులు కూడా ఉంటారనే వాస్తవాన్ని ఏ చరిత్ర మనకు చెప్పదు. దళితుల వీరోచిత ప్రతాపాల సంగతి పక్కన పెట్టినా, వారి ఉనికిని చెప్పే చరిత్ర లభ్యం అవటం అరుదు. అలాంటి దళితుల యుద్ధ చరిత్రను పుణె సమీపంలోని భీమా నది ఒడ్డున ఉన్న కోరేగావ్ గ్రామంలోని స్తూపం చెబుతుంది. ఆ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పొరాడి మరణించిన దళిత వీరుల స్మారక స్తూపం అది. అలాంటి స్థూపాలు భారతదేశంలో ఇంకెక్కడా లేవు. వంద అడుగుల ఎత్తులో నిట్ట నిలువున నిల్చోన్న ఆ స్తూపం దళితుల ఆత్మవిశ్వాసానికి, వారి ప్రతాపానికి చిహ్నంగా నిలిచిపోయింది. దళితులు మృత్యుమయమైన యుద్ధంలో చేరటానికి ఆనాటి వారి సాంఘీక కారణాలు; బ్రిటిష్ యుద్ధోన్మాదం, కులపట్టింపులేని వారి ఉదారవాద కారణాలు – ఏమైనా కావచ్చు, ఆ స్తూపం అంబేడ్కర్ మొదలు పెట్టిన కుల నిర్మూలనా పోరాటానికి ప్రేరకం అయ్యింది.

అప్పుడు బ్రాహ్మణ పీష్వాలు చేసిన యుద్ధం ఆనాటి జాతీయవాద దృష్టితో చూస్తే దేశభక్త యుద్దం అవుతుంది. సమాజంలో దారుణ వివక్షకూ, అంటరానితనానికి గురి అయిన దళితుల కళ్లతో చూస్తే అది దళితుల పరాక్రమ యుద్ధమే అవుతుంది అంటారు రచయితలు. అవును. ఇక్కడే వినోదిని రాసిన ʹఒక విలన్ ఆత్మహత్యʹ కథ గుర్తుకు వచ్చింది. వ్యవసాయం గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకొన్న ఒక రైతు, అతని చేతిలో లైంగిక దోపిడీకి గురి అయిన మహిళ దృష్టిలో విలన్ అవుతాడు.

ఏది ఏమైనా భీమా కోరేగావ్ స్తూపం అక్కడ స్థిరంగా నిలిచి చాలా కాలం దళితుల పండగ అయ్యింది. వర్తమాన బ్రాహ్మణ రాజ్యంలో దళితుల రాజకీయ కేంద్రం అయ్యింది. దళిత, మైనారిటీ, లౌకికవాద వ్యతిరేక రాష్ట్రంలో ఇప్పుడు అక్కడ, అదే స్తూపం దగ్గర దళితుల సమీకరణ జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రధానంగా దళితులపై జరిగిన దాడులు, సామూహిక బహిరంగ సంహారాల తరువాత ఆ స్తూపం నీడ వారికి తిరిగి ఊపిరి పోస్తుంది. ఇప్పడది హిందూ ఫాసిజానికి సవాలుగా నిల్చోని ఉంది. అందుకే ఎల్గార్ పరిషత్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు అటు మరాఠాలకు; ఇటు ఆ బ్రాహ్మణ రాజకీయాలలో నాని వాటి ఊతంతో రాజ్యాధికారం తెచ్చుకొన్న బీజేపీ ప్రభుత్వానికీ కంటిలో నలుసు అయ్యింది.

అప్పటికే మతోన్మాద బీజేపీని యిబ్బంది పెడుతున్న ఉద్యమాలు, వ్యక్తులు ఉన్నారు. నకిలీ జాతీయవాదం రంగు వెలిసి పోయి, దాని అసలు కార్పొరేట్ అనుకూల వర్ణం బయటపెడుతున్న సమయంలో అది భీమాకోరేగావ్ ఉత్సవాన్ని చక్కగా ఉపయోగించుకొంది.

అపారమైన వనరులు ఉన్న అడవి కార్పొరేట్ల పరం చేయటానికి ఆదివాసులు అడ్డం వచ్చారు. వారి కోసం పోరాడుతున్న హక్కుల కార్యకర్తలు, లాయర్లు అడ్డం పడుతున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం ఆదివాసులు దళితులు ఉద్యమించటానికి పూనుకొంటున్నారు. ʹప్రజాస్వామ్యం అనేది ఒక విలువ అనుకొంటే, దాని వెలుగు రేఖ కూడా ప్రసరించని జీవన సముదాయాలు తమ న్యాయమైన ఆకాంక్షలను ఈ ఉద్యమాలలో వెల్లడి చేసుకొన్నాయిʹ అంటారు ఈ పుస్తక రచయితలు. అంతే కాదు, ʹ... మన ప్రజాస్వామ్యానికి ఏమైనా అర్థం ఉన్నదంటే అది అలాంటి ప్రజల పోరాటాల నుండి సంక్రమించిందేʹ అని కూడా అంటారు. అలాంటి ఉద్యమాలకు ఊతంగా, ఊపిరిగా ఉన్నవారిలో ఇప్పటికీ పది మందిని భీమా కోరేగావ్ సాకుగా చెప్పి నిర్భంధించింది ఈ ప్రభుత్వం. పుణె లో సెషన్స్ కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదే పదే వల్లించిన దళితుల సమీకరణ, ఆదివాసీ సమీకరణ పదాల వాడకం యాదృచ్ఛికం కాదు. అది వారి భయం.

ఈ నిజాలను నిర్భయంగా, లోతుగా పదునైన బాషలో వెల్లడి చేసిన పుస్తక రచయితలు వరలక్ష్మి, పాణీలను అభినంధించానని అనటం యాంత్రికమైన మాట. ʹఆత్మీయ ఆలింగనంʹ భావోద్వేక ప్రకటన అవుతుందేమో. ʹవిప్లవ సెల్యూట్ʹ సరైన గౌరవం అవుతుందేమో.

Keywords : maoists, urban maoists, Varavararao, saibaba, sdhabharadvaj
(2019-07-15 17:47:24)No. of visitors : 503

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

Search Engine

ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ
TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం
తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
more..


ఇప్పుడు