తెలంగాణొస్తే ఏమొచ్చింది? అణచివేత, అబద్ధాలు, అక్రమ నిర్బంధాలు...


తెలంగాణొస్తే ఏమొచ్చింది? అణచివేత, అబద్ధాలు, అక్రమ నిర్బంధాలు...

తెలంగాణొస్తే

సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై పోస్ట్ చేసిన ఈ వ్యాసం మీ కోసం...

మిత్రులారా, గ్లోబరీనా అవకతవకలకు బలిఅయి నిస్సహాయంగా ఆందోళన పడుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద వారం పది రోజులుగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో పోలీసుల దౌర్జన్యాల గురించి, అధికారుల నిర్లక్ష్య, దాటవేత వైఖరి గురించి, అసలు నేరస్తులను తప్పించడం గురించి చదువుతూనే, వింటూనే ఉన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుముందు నిరసనకు అఖిల పక్షం పిలుపు ఇస్తే, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వందలాది మందిని ముందస్తు అరెస్టులు చేశారు.

బంగారు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసులు సాగిస్తున్న ఈ మహత్తర పాలనలో మరొక ఘట్టం నిన్న జరిగింది. అబద్ధపు భీమా కోరేగాం హింసాకాండ కేసులో అరెస్టు చేసిన నిందితులను (వీరిలో ఐదుగురు పదినెలలుగా, నలుగురు ఆరు నెలలుగా యరవాడ జైలులో మగ్గుతున్నారు), ఒక తప్పుడు కేసులో అన్యాయంగా యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్ జైలులో రెండు సంవత్సరాలుగా నిర్బంధించిన ప్రొ. జి ఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, కర్నూలులలో, తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండల్లో ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలతో ధర్నాలు జరపాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించింది.

ఎన్నో దుర్మార్గాలకు చిహ్నమైన చంద్రబాబు పాలనలో విజయవాడలో, కర్నూలులో మూడు రోజుల ధర్నాకు పోలీసులు అనుమతించారు. ధర్నాలు జరుగుతున్నాయి. ఉద్యమ ఫలితంగా ఏర్పడిన మహా ఘనత వహించిన తెలంగాణలో మాత్రం హైదరాబాద్ లో ధర్నాచౌక్ లో, హనుమకొండలో ఏకశిల పార్క్ దగ్గర ధర్నాకు అనుమతి నిరాకరించారు. ʹవిప్లవ రచయితల సంఘం నిషిద్ధ సంస్థ కాబట్టి అనుమతి ఇవ్వడం లేదʹని హైదరాబాద్ లో బాజాప్తా కాగితమే రాసి ఇచ్చారు. ఇంత అబద్ధాలతో, వాక్సభాస్వాతంత్ర్యాలను అడ్డుకోవడం తెలంగాణలోనే సాధ్యం. తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే ఇదీ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ 1992 కింద విప్లవ రచయితల సంఘంపై నిషేధం విధిస్తున్నట్టు 2005 ఆగస్ట్ 17న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ 373 అనే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ చట్ట ప్రకారమే ఇటువంటి నిషేధం విధించినప్పుడు, ముగ్గురు న్యాయమూర్తుల బృందాన్ని నియమించి ఈ నిషేధం చెల్లుతుందా లేదా పరిశీలించమని కోరాలి. ఆ న్యాయమూర్తుల బృందం దగ్గర నిషిద్ధ సంస్థ తన వాదనలు వినిపించుకోవచ్చు. అలా జస్టిస్ టి ఎల్ ఎన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన న్యాయమూర్తుల బృందం విచారణ జరిపి ఆ నిషేధం చెల్లదని తీర్పునిచ్చింది. అందువల్ల అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005 నవంబర్ 11 న జి ఓ ఎం ఎస్ 503 ద్వారా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత పద్నాలుగు సంవత్సరాలుగా ఆ సంస్థ బహిరంగంగా కార్యకలాపాలు జరుపుతున్నది.

కాని మహా ఘనత వహించిన తెలంగాణ పోలీసులకు చట్టంతో, న్యాయమూర్తుల ఆదేశాలతో, నిజాలతో పని ఏముంది?

తెలంగాణొస్తే ఏమొచ్చింది?

ధర్నాకు అనుమతి నిరాకరిస్తే హైదరాబాద్ లో, హనుమకొండలో హాళ్లలో జరిగిన నిరసన సభల ఫొటోలు, విజయవాడ, కర్నూలుల్లో బహిరంగంగా రోడ్డు పక్కన జరుగుతున్న ధర్నాల ఫోటోలు చూడండి. అలాగే విరసం మీద నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జివో చూడండి
- ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, intermediate, varavararao, gn saibaba
(2019-06-17 11:32:41)No. of visitors : 292

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం

. అప్పటికే మన మిత్రుల బెయిల్ దరఖాస్తుల మీద మన న్యాయవాదుల వాదనలు, ప్రాసిక్యూషన్ ప్రతివాదనలు అన్నీ ఆయన విని ఉన్నారు. మే చివరి వారంలో బెయిల్ మీద ఆయన తీర్పు చెపుతారని అందరూ ఎదురుచూశారు. కానీ ఆ సమయంలో ఆయన సెలవు మీద వెళ్లడంతో ఆయన తిరిగి రాగానే తీర్పు చెపుతారని ఆశించారు.

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
more..


తెలంగాణొస్తే