అప్పుడు టీఆరెస్..ఇప్పుడు బీజేపీ...రైతులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడంలోఒకరికి మించి మరొకరు


అప్పుడు టీఆరెస్..ఇప్పుడు బీజేపీ...రైతులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడంలోఒకరికి మించి మరొకరు

అప్పుడు


నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత పై రైతులు పోటీ చేసినప్పుడు వారిని పోటీ చేయకుండా ఆపడానికి టీఆరెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో...ఎన్ని రకాల బెధిరింపులకు పాల్పడ్డారో...పోలీసుల సహాయంతో అడ్డుకోవడానికి ఎలా అయితే దుర్మార్గంగా ప్రవర్తించారో...ఇప్పుడు సేమ్ టూ సేమ్ ఆ పాత్రను బీజేపీ పోషిస్తోంది. నిజామాబాద్ లో నామినేషన్లు వేయడానికి రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలందించిన బీజేపీ వార‌ణాసిలో మోడీ పైపోటీ చేస్తున్న రైతులపై దుర్మార్గ దాడులకు దిగింది.

పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర అనే డిమాండ్లతో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వారణాసిలో నిజామాబాద్ రైతులు పోటీకి సిద్ధమయ్యారు. ఐతే.. వారంతా నామినేషన్లు వేయకూడదనేదే మోదీ సర్కారు లక్ష్యం. వారణాసిలో మోదీ సేన వారికి అడుగడుగునా చుక్కలు చూపిస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పసుపు రైతులను అడ్డుకుంటున్నారు. నామినేషన్లు వేసేందుకు వారికి ప్రతిపాదకులు లేకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఏకంగా రైతన్నలపై ఇంటెలీజెన్స్‌ బ్యూరో(ఐబీ)ని దింపింది. ఐబీ అధికారులు ఉదయం రైతులు బస చేసిన సిల్క్‌ సిటీ లాడ్జిపై దాడి చేశారు.

గదుల్లో దిగినవారి అడ్రస్‌ ప్రూఫ్‌లు ఇవ్వాలని లాడ్జి యజమానిపై ఒత్తిడి తెచ్చారు. గమనించిన రైతులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు.తాము అద్దెకు తీసుకున్న బస్సులో అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించగా.. ʹమీరు బస్సెక్కితే.. బస్సుతోపాటు మిమ్మల్ని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్తాం..ʹ అని పోలీసులు బెదిరించారు. దీంతో వారంతా పోలీసులకు చిక్కకుండా గ్రూపులుగా విడిపోయి.. ఆటోల్లో సిటీ దాటారు. చివరికి స్థానిక మీడియా, లాయర్ల సాయంతో అదే లాడ్జికి తిరిగి వచ్చారు. ఇన్ని రోజులు స్థానిక బీజేపీ నేతలతో బెదిరింపులకు గురిచేసినా..మాట వినడం లేదనే అక్కసుతోనే ఆదివారం ఐబీని రంగంలోకి దింపారని రైతులు ఆరోపిస్తున్నారు. మీడియా, లాయర్ల సహకారంతో సోమవారం నామినేషన్లు వేసితీరుతామని రైతులు ప్రకటించారు.

మరో వైపు తమిళనాడు రైతులు కూడా మోడీపై పోటీ చేయడానికి సిద్దమై వారణాసి చేరుకున్నారు. వారిని కూడా పోలీసుల సహాయంతో బీజేపీ అడ్డుకుంది. దీంతో నిజామాబాద్‌, తమిళనాడుకు చెందిన రైతుల ఆందోళన చేపట్టారు. తమను నామినేషన్‌ వేయకుండా ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంటూ వారు ఆందోళనకు దిగారు. ఈసీ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మద్దతిచ్చిన స్థానికులను కూడా బెదిరించారని రైతులు ఆరోపించారు.

Keywords : nizamabad, farmers, kalvakuntla kavitha, bjp, trs, modi
(2020-02-13 06:02:27)No. of visitors : 414

Suggested Posts


0 results

Search Engine

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు..
నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా
దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
CAAకు వ్యతిరేకంగా సియాటెల్‌ నగర కౌన్సిల్‌ తీర్మానం
పంజాబ్: CAAకు వ్యతిరేకంగా 20వేలమంది రైతులు, మహిళల ర్యాలీ
దేశమంతటా ʹషాహీన్ బాగ్ʹ లు పుట్టుకురావాలి..!!
రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు
మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్
మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు
CAA, NRC నిరసనల్లో హిందూ చైర్మన్ ఎన్.రామ్
more..


అప్పుడు