మోడీపై నామినేషన్ వేసిన మాజీ బీఎస్ ఎఫ్ జవాను పై కేసులు నమోదు

మోడీపై

మోడీ పై పోటీ చేసేందుకు వేసిన నామినేషన్ ను తిరస్కరించడమే కాకుండా ఇప్పుడు ఆ మాజీ బీఎస్ ఎఫ్ జవానుపై కేసులు కూడా నమోదు చేశారు. తేజ్ బహదూర్ యాదవ్ ఈ పేరు కొంత కాలం క్రితం మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగింది. బీఎస్ ఎఫ్ లో అధికారుల అవినీతిపై ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. జవాన్ల ఆహారం కోసం ప్రభుత్వం ఇచ్చే సరుకులను అధికారు అమ్ముకొని జవాన్లకు సరైన తిండి కూడా పెట్టడం లేదని రుజువులతో సహా ఆయన పోస్ట్ చేసిన వీడియో దేశం మొత్తం చర్చకు కారణమయ్యింది. ఆ తర్వాత కొంత కాలం ఆయన మాయమయ్యారు . ఆయనను చంపేస్తారేమో అని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం బీఎస్ ఎఫ్ ఆయనను ఉద్యోగం నుండి తీసివేసింది.

ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎన్నికల్లో ఆయన నరేంద్ర మోడీపై పోటీకి సిద్దపడ్డారు. వార‌ణాసిలో ఇండిపెండెంట్ గా ఏప్రెల్ 24న నామినేషన్ దాఖలు చేశారు. అప్పుడు చర్చ జరిగినప్పటికీ అధికారగణం పెద్దగా పట్టించుకోలేదు. అయితే హఠాత్తుగా సమాజ్ వాదీ పార్టీ ముందుగా తాను ప్రకటించిన అభ్యర్థిని మార్చి తేజ్ బహదూర్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఏప్రెల్ 29 న మళ్ళీ నామినేషన్ దాఖలు చేశాడు. ఇది దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అనంతరం బీఎస్ ఎఫ్ నుండి తొలగించడాన్ని తేజ్ బహదూర్ తన అఫిడవిట్ లో పేర్కొనలేదని చెబుతూ ఎన్నికల కమీషన్ ఆయన నామినేషన్ ను తిరస్కరించింది. దానిని ఆయన తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ʹనేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినప్పుడు కనపడని లోపాలు సమాజ్ వాదీ పార్టీ తరపున నామినేషన్ వేసినప్పుడు ఎలా కనిపించాయిʹ అని తేజ్ బహదూర్ ప్రశ్నించారు. దీనిపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని ఆయన తెలిపారు.

ఇక్కడితో కథ అయిపోలేదు ఇప్పుడు తేజ్ బహదూర్ పై 147, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించాడని, ప్రజలని రెచ్చగొట్టి అల్లర్లు ప్రేరేపించాడని అధికారగణం ఆరోపిస్తోంది.
ʹʹనా తాత సుభాష్ చంద్రభోస్ నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ లో దేశం కోసం పోరాడారు. నా తండ్రి ఈ దేశానికి అన్నం పెట్టే రైతు. నేను ఈ డేశాన్ని కాపాడడానికి జవానుగా పని చేశాను. కానీ ఈ రోజు నన్ను కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయనివ్వడం లేదు. ఇది నియతృత్వ పాలనʹʹ అని తేజ్ బహదూర్ అంటున్నారు.
(సోర్స్: ది క్వింట్ https://www.thequint.com/elections/after-nomination-scrapped-fir-against-tej-bahadur-for-rioting?fbclid=IwAR2yceNlhD1XksWqf8f0vIbYUU3Xb3cpbhzG1I-b6y70ZBxdJGGhLW8wcxg)

Keywords : tej bahadur, bsf jawan, varanasi, modi
(2024-03-30 04:33:02)



No. of visitors : 614

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

ఈ అనంతపు గగ్గోలు ఎవరికోసం?

దారుణాన్ని దారుణం అన్నవాడిపైననే అన్యాయాన్ని అన్యాయం అన్నవాడిపైనన ఈయనగారి వ్యంగం. పావులాకు, బేడాకు ఆడవాళ్ల శరీరాలపై పచ్చబొట్ల పాటలు రాసేవారి నుండి శాంతిని, మానవతావాద స్పందనను ఆశించడం మన బుద్దితక్కువతనమే అవుతుందనకుంటా

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

జైశ్రీరాం పదం కొందరు నేరస్థులకు ఆయుధమైంది...ఇకనైనా మూక దాడులు ఆపండి...మోడీకి లేఖ రాసిన 49 మంది ప్రముఖులు

మీరు పార్లమెంట్‌లో మూకదాడుల్ని ఖండించారు. కానీ అవి ఆగిపోలేదు. అయితే మీరు వాటిపై తీసుకున్న చర్యలేంటి? ఈ దేశంలో ఒక్క పౌరుడు కూడా భయంతో బతకాడినికి వీళ్లేదు. ʹజై శ్రీరామ్ʹ అనే పదం వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడది కొందరు ఆకతాయిలు, నేరస్థులకు ఆయుధమైంది.

రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ ....

ʹప్రతిపక్షాల చేతబడి వల్లే బీజేపీ నేతలు చనిపోతున్నారుʹ

బీజేపీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, అరుణ్ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రఙ్ఞా ఈ విధమైన‌ వ్యాఖ్యలు చేశారు.

మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్ మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మోడీపై