షరతులు విధిస్తూ రైతులపై కేసు ఉపసంహరించుకున్న పెప్సికో....ఇక పోరాటం ఆపేద్దామా !


షరతులు విధిస్తూ రైతులపై కేసు ఉపసంహరించుకున్న పెప్సికో....ఇక పోరాటం ఆపేద్దామా !

షరతులు

గుజరాత్ లో కొందరు రైతులు పెప్సికో కంపెనీ. ʹలేస్ చిప్స్ʹ తయారీకి ఉపమోగించే FC5 రకానికి చెందిన బంగాళదుంపలను పండించినందుకు గుజరాత్ రైతులపై 4కోట్ల ఫైన్ కట్టాలని కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు లభించింది. రైతులకు మద్దతుగా అనేక రైతు సంఘాలు, ప్రజాస్వామిక వాదులు రోడ్డెక్కారు. మరో వైపు పెప్సికో ఉత్పత్తులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచార ఉద్యమం జరిగింది. ఈ నేపథ్యంలో పెప్సికో కంపనీ కోర్టు బైట రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. అయితే ఆ రైతులు తాము పండించే ఆలుగడ్డలను పెప్సీ కంపెనీకే అమ్మాలని షరతు. ఇది రైతుల విజయమా పెప్సీ కంపెనీ ఓడిపోయినట్టేనా ? దీనిపై రచయిత నరేష్కుమార్ సూఫీ తన ఫేస్ బుక్ టైమ్ లైన పై పోస్ట్ చేసిన ఆర్టికల్ మీ కోసం....

రైతుల మీద వేసిన దావా విషయంలో #పెప్సీకంపెనీ ఓడిపోయిందా? ఎలా?

ఏప్రిల్ నెల మొదటి వారంలో గుజరాత్ క్యాపిటల్ అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో. పెప్సీ ఇండియా కంపెనీ వేసిన ఓ వ్యాజ్యం ఫలితంగా సాబర్ కాంఠా జిల్లాలో రైతులైన బిపిన్ పటేల్,ఛాబిల్ పటేల్, వినోద్ పటేల్, హరిభాయ్ పటేల్ లాంటి అనేక మంది రైతులు ఈ ఆలూ ని పండించినందుకు దోషులయ్యారు, వీళ్ళతో సహా మరికొన్ని వందల మంది రైతులు అసలు ఆ పంట పండించే హక్కుని కోల్పోయారు. గుజరాత్‌లో Fళ్-2027 రకమైన దుంపల సాగు, అమ్మకం జరిపేందుకు అనుమతి రద్దైంది. కానీ ఆ దుంపలని వాళ్ళు ఆ నేలల్లో కొన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ హక్కుని కోల్పోయారు. తమ ఆహారాన్ని తాము పండించటం ఇప్పుడు నేరం అయిపోయింది. బేవరేజెస్,జంక్ ఫుడ్ తయారీలో పేరుపొందిన "పెప్సీ ఇండియా"కంపెనీ (పేరులోనే ఇండియా ఉంటుంది పెప్సీ ఎక్కడి కంపెనీనో మనకు తెలుసు) తాము ఉత్పత్తి చేస్తున్న "లేస్ చిప్స్" తయారీలో ఆ దుంపలనే రిజిస్టర్ (FL-2027) చేసుకున్నామనీ. కాబట్టి ఆ దుంప జాతిని చుట్టుపక్కల రైతులెవరూ ఇప్పుడు పండించకూడదని ఆ వ్యాజ్యంలో పేర్కొంది. అలా ఆ బంగాళాదుంపలని పండిస్తున్న రైతులపై కోర్టులో కేసు వేసింది. ఇప్పుడు వారిలో ఒక్కో రైతు తమకు కోటీ ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని పెప్సీ కంపనీ డిమాండ్ చేసింది.
వెంటనే దేశవ్యాప్త నిరసనలు, సోషల్ మీడియా లో పెప్సీకో కి వ్యతిరేకంగా లక్షలమంది హ్యాష్టాగ్లతో తెలిపిన నిరసన. ఆ కార్పోరేట్ కళ్ళకి కాస్త భయం చూపించాయి. అయితే మాత్రం మనలని ఎలా మాయ చేయొచ్చో వాళ్ళకి బాగా తెలుసు. మన ఆహార అలవాట్లని మార్చినంత సులభంగా వాళ్ళు మన నిరసనని మనమే మర్చిపోయేలాగా చేస్తారు. రైతులమీద మీద వేసిన నష్ట పరిహారం ఒక్కొక్కరి మీదా ఒక కోటేఏ అయిదు లక్షలు. అంటే మొత్తం కలిపినా మహా అయితే మరీ మరీ ఎక్కువ వేసుకున్నా ఆరేడు కోట్లకు మించని ధనం. దాదాపు ఆ కంపెనీ దేశవ్యాప్తంగా సాగించే ఒక్క రోజు అమ్మకాలు అయి ఉండవచ్చు.
పెప్సికో ఈ రకమైన పంటను దేశవ్యాప్తంగా 24వేల మంది రైతులతో సాగు చేయించి.. లేస్ తయారు చేస్తోంది. అయితే 2001 రైతుల హక్కు రక్షణ చట్ట ప్రకారం.. రైతులు ఏ రకం పంటనైనా సాగు చేసుకోవచ్చు. ఎలాంటి విత్తనాలనైనా అమ్ముకోవచ్చు అని అంటున్నారు. నిజానికి జూన్ 12 వరకూ ఈ కేసు వాయిదా వేయాలని రైతుల తరపు లాయర్ కోరినా. పెప్సీ కో మాత్రం ముందె ఆరకం పంట పండించినందుకు ఆ రైతుల మీద వేసిన కేసును వాపస్ తీసుకునేందుకు సిద్దపడింది. కానీ...! పంతమీద దాని ఆధిపత్యాన్ని? అది మాత్రం వదులుకోవటం లేదు. పైగా ఆ రైతులు ఇప్పుడు పండించిన పంటని కూడా తమకే అమ్మాలనీ, 50 కిలోల బంగాళదుంపలకు రూ.1350 చొప్పున మాత్రమె చెల్లించి తీసుకుంటామనీ అంటోంది.
అంటే ఇక ముందు కూడా ఆ రైతులకు ఆ పంట పండించే అవకాశం లేదు, ఇప్పుడు కూడా పండించిన పంట తమది కాదు ఇక ఏ రకంగా వారు గెలిచినట్టు?? కోటీ అయిదు లక్షల పరిహారం చెల్లించకుండా ఊరట లభించటమేనా వాళ్ళకు జరిగిన న్యాయం. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి. కోటికి పైగా పరిహారం చెల్లించగలిగే స్తోమత ఆ బక్క రైతులకు లేదని అంత పెద్ద కంపెనీ న్యాయ విభాగానికి తెలియదా?? తెలుసు....!
అంటే కేవలం మొత్తం బంగాళా దుంపలు పండించే అన్ని రాష్ట్రాల రైతులకూ ఆ రకం దుంపలను సాగు చేయకూడదూ అన్న సమాచారం ఖచ్చితంగా చేరేందుకే ఈ వ్యాజ్యం వేసి మరీ ఇంత గొడవ అయ్యేలా చేసింది. మహా అయితే నాలుగు రోజులు దాని అమ్మకాలలో చిన్న మార్పు వచ్చిందేమో (నిజానికి అది కూడా వచ్చి ఉండదు) బిర్యాని, ఆవకాయ పచ్చడి, చోలే బతూరే, హలీం, చపాతీ ఆహారం ఏదైనా దానికి కాంబో డ్రింక్ గా పిల్లలనుంచీ పెద్దలవరకూ అలవాటైపోయిందీ విషరసాయన పానియం. వదలటం కష్టమే. కాబట్టి ఆ నాలుగు నాళ్ళు కూదా పెప్సీకో అమ్మకాలు తగ్గుతాయనుకోను.
ఇక ఇప్పుడు రైతులనుంచి కేసు వాపస్ తీసుకోవటం ద్వారా మళ్ళీ యథాతదంగా తన అమ్మకాలు కొనసాగితే? ఎలా రైతులు గెలిచినట్టు?? ఎలా మనం ఆ కార్పోరేట్ కంపెనీని భయపెట్టినట్టు? రాబోయే కాలాన మన భూములమీదా, మన పంటల మీదా, మన భూగర్భ జలాల మీదా ఆఖరికి మనం ఎలా, ఏది తినాలి అనే విషయం మీదా ఆ కంపెనీ ఆధిపత్యాన్ని ఆపగలగాలా వద్దా? అంటే బ్యాన్ పెప్సీ, బ్యాన్ లేస్ అనేది తాత్కాలిక నినాదంగా ఆగిపోకూడదు. దేశభక్తి అంటే మతాన్ని నిలబెట్టేది కాదు నీ నివాస భూమినీ, దాని మీద ఆధార పడ్డ జీవజాలాన్ని కాపాడుకోవటమే. ఈ బహుల జాతి కంపెనీలలో ఆహారం, మందులు ఈ రెండు రంగాలలోనూ మనకు తెలియకుండానే మనలని దోపిడీకి సహకరించే ఎలిమెంట్స్ గా మార్చేసుకునే కుట్ర ఉంది.... ఇక ఏం చేయాలో చెప్పక్కర లేదు కదా #no_lays #no_Pepsi కంటిన్యూ చేయటమే
-నరేష్కుమార్ సూఫీ

Keywords : pepsico, lays, farmers, gujarat, ban pepsi, ban lays
(2020-02-25 21:00:39)



No. of visitors : 558

Suggested Posts


After JNU,HCU & DU, ABVP Loses Gujarat Central University Polls

Akhil Bharatiya Vidhyarthi Parishad (ABVP) has lost the student body election held in Gujarat Central University by a big margin, reports National Herald. This loss comes ahead of a hotly-contested Assembly elections in Gujarat....

పెప్సీని, లేస్ ను బ‌హిష్కరిద్దాం... రైతులను కాపాడదాం !

ఏప్రిల్ మొదట్లో అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో... పెప్సీ కంపెనీ ఓ లా సూట్ ఫైల్ చేసింది. ఫలితంగా సబర్‌కాంతా జిల్లాలో... రైతులైన బిపిన్ పటేల్,ఛాబిల్ పటేల్, వినోద్ పటేల్, హరిభాయ్ పటేల్ లాంటి అనేక మంది రైతులు బంగాళా దుంపల పెంపకం, అమ్మకాలు జరిపేందుకు వీలు లేకుండా పోయింది.

సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !

గోద్రా ఘటన జరిగిన రోజు హిందువులు ఆగ్రహావేశాలతో ఉన్నారని ఆ ఆగ్రహాలు బయటకు వెళ్లగక్కనీయండని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముస్లింలకు గుణపాఠం చెప్పాల్సిందేననే అర్థంలో స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి తన నివాసంలో జరిగిన పోలీసు ఉన్నత అధికారుల సమావేశంలో చెప్పాడని సంజీవ్‌ భట్‌ అనే సీనియర్‌ పోలీసు అధికారి సుప్రీంకోర్టుకు తెలియచేశాడు. ఆ సమావేశంలో తాను కూడా ఉ

ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రావడం పేదల ప్రాణాలమీదికొచ్చింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఆయన పర్యటించనున్నారు. ఆయన తిరిగే ప్రాంతంలో పేదలెవ్వరూ ఆయనకు కనపడవద్దని భావించిన

ముస్లిం మహిళ వేళ్ళు నరికేసి ఆమె కొడుకు చేతులు విరగ్గొట్టిన భజరంగ్ దళ్ మూకలు !

గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఓ వృద్ధ ముస్లిం మహిళ, ఆమె కొడుకుపై భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దుర్మార్గంగా దాడి చేశారు. మహిళ చేతి వేళ్ళను నరికేసిన భజరంగ్ దళ్ ముష్కరులు ఆమె కొడుకు చేతులను విరగొట్టారు.

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం

ప్రపంచ పోలీసుగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం వస్తున్న సందర్భంగా మోడీ చేస్తున్న పని విమర్షలకు తావిస్తోంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు ట్రంప్ వస్తున్నాడు.

ʹNot Joining Congress, But Aim To Bring BJP Down,ʹ Says Gujarat Dalit Leader Jignesh Mevani

The 36-year-old lawyer and activist, who has led protests in Gujarat against attacks on Dalits after four men were stripped and brutally thrashed with iron rods by cow vigilantes in the stateʹs Una last year, declined an invitation to meet Congress president Rahul Gandhi in Ahmedabad today....

ఓ ఆదివాసీని కొట్టి చంపారు..ప్రశ్నించిన వారిపై కాల్పులు జరిపి మరొకరిని చంపేశారు

గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా జేసావాడా పట్టణ పోలీసు స్టేషన్ లో కమేశ్ గమారా అనే ఆదివాసీని పోలీసులు కొట్టి చంపారు. దీనిని ప్రశ్నించడానికి వచ్చిన 500 మంది ఆదివాసులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామాసు మొహానియా అనే అదివాసీ ప్రాణాలు కోల్పోయాడు.

కులాంతర పెండ్లిళ్ళు, సెల్ ఫోన్లు బ్యాన్... స్త్రీలపై 12 గ్రామాల తీర్మానం, మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్లు ఈ నెల (జూలై, 2019) 14 న సమావేశమయ్యారు. ఠాకూర్లు అంటే ఆ కులపు స్త్రీ పురుషులందరూ కాదు మగోళ్ళు మాత్రమే అన్ని గ్రామాల్లోని 800 మంది మగోళ్ళు సమావేశమయ్యారు. సమాజం మనువు చెప్పినట్టు నడవ‌డం లేదని గుండెలు బాదుకున్నారు. పిల్లలు మన చేతుల్లో లేకుండా పోతున్నారని, మగ పిల్లలు ఎలా ఉన్నా పర్వా

Search Engine

మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.
ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం
ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ దాడులు: ఈ తల్లిని సజీవదహనం చేశారు
ఢిల్లీ : బీజేపీ నేతలపై కేసులకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి అర్దరాత్రి బదిలీ
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతల‌పై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
మసీదును మేమే కాల్చాం... మా దేశంలో నిరసన తెలపడానికి వాళ్ళకు ఎంత ధైర్యం ? కెమెరా ముందు హిందుత్వ సభ్యులు
ఎన్డీటీవీ జర్నలిస్టులపై మతోన్మాద మూక దాడి - ఆపై హిందువులని తెలిసి వదిలేసిన దుండగులు
వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు
CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు
నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
more..


షరతులు