మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు


మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

మే

(చైనాలో జరిగిన‌ మే 4 మహత్తర విద్యార్థి ఉద్యమం గురించి వీక్షణం మాసపత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసి తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై పోస్ట్ చేసిన ఈ వ్యాసం మీకోసం...)

మిత్రులారా, గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా చైనా గురించీ, చైనా పరిణామాల గురించీ నిరాసక్తత పెరిగింది గాని, అంతకు ముందు కనీసం ఇరవై ఏళ్లు చైనాను తలవని రోజు ఉండేది కాదు. ఈ నిరాసక్తతా అతివాదమే, అప్పటి మితిమీరిన ఆసక్తీ అతివాదమే. 1990ల మొదట్లో చేతికందిన విలియం హింటన్ ʹగ్రేట్ రివర్సల్ʹ చదివిన తర్వాత నుంచీ చైనా గురించి సీరియస్ గా పట్టించుకోవడం మానేశాను. కాని అంతకు ముందు పదిహేను ఏళ్లు చైనా రచనలు, చైనా చరిత్ర, చైనా విప్లవోద్యమ చరిత్ర, చైనా రాజకీయార్థిక సాంస్కృతిక పరిణామాలు చాల ఆసక్తిని రేకెత్తించేవి. అలా చైనాతో చైతన్యాన్నీ ప్రేరణనూ పొందిన మా తరం విద్యార్థులకు ఇవాళ్టిరోజు – మే 4 – ఒక చరిత్రాత్మకమైన రోజు. సరిగ్గా వంద సంవత్సరాల కింద, 1919 మే 4 న చైనా చరిత్రను గుణాత్మకమైన మలుపు తిప్పిన మహత్తర విద్యార్థి ఉద్యమం జరిగింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో, చైనాలో జర్మనీ అధీనంలో ఉన్న ప్రాంతాలను జపాన్ కు అప్పగించాలని వర్సెయిల్స్ సంధి తీర్మానించింది. అంతకుముందు తమ భూభాగాలను తమకు అప్పగిస్తేనే యుద్ధంలో పాల్గొంటామని షరతు పెట్టి మరీ మిత్రరాజ్యాల తరఫున యుద్ధంలో పాల్గొన్న చైనా ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు, యువకులు ఈ విద్రోహాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే 1911 విప్లవం జరిగి రాచరికం కూలిపోయింది. కొన్ని ప్రాంతాలలో నామమాత్రపు ప్రజాస్వామ్యం, కొన్ని ప్రాంతాలలో స్థానిక యుద్ధ ప్రభువుల పాలన సాగుతున్నది. ఆ పీడనకు వ్యతిరేకంగా సంఘటితమవుతూ నవచైనాను నిర్మించాలని ఆలోచిస్తున్న యువతరాన్ని ఈ కొత్త జపనీస్ సామ్రాజ్యవాద ఆక్రమణ మరింత రెచ్చగొట్టింది. బోల్షివిక్ విప్లవ ప్రభావం, కొద్ది నెలల ముందే కొరియాలో జపాన్ పాలనపై సాగిన ప్రతిఘటన ఉద్యమ ప్రభావం కూడ మే 4 ఉద్యమానికి తక్షణ ప్రేరణను అందించాయి.

నూతన సాంస్కృతిక ఉద్యమం అనీ, చైనా జాతీయవాద వికాసం అనీ పేరు పొందిన మే 4 ఉద్యమం కాలం చెల్లిన కన్ ఫ్యూషియస్ భావాలను కూలదోసి శాస్త్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టాలని నినదించింది. పాత విద్యా విధానాన్ని నిరసించింది. స్త్రీపురుష సమానత్వాన్ని కోరింది. రాజధాని నగరం పెకింగ్ లోని పదమూడు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉమ్మడిగా తలపెట్టిన ఈ ఉద్యమపు తొలి అడుగు మే 4 మధ్యాహ్నం యెన్ చింగ్ విశ్వవిద్యాలయ, పెకింగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నాలుగు వేల మంది తియానాన్మెన్ ప్రాంగణానికి ఊరేగింపుగా సాగడంతో ప్రారంభమయింది. సామ్రాజ్యవాద కుట్రలకు దేశాన్ని బలిపెడుతూ వెన్నెముక లేనట్టు ప్రవర్తిస్తున్న దేశ పాలకులను వ్యతిరేకిస్తూ, వర్సెయిల్స్ సంధిని వ్యతిరేకిస్తూ, జపనీస్ వస్తువులను బహిష్కరించమని పిలుపునిస్తూ మొదలయిన ఈ ఉద్యమం నిప్పురవ్వ దావానలమయినట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలకూ, అన్ని వర్గాలకూ విస్తరించింది. విద్యార్థి ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం ఆంక్షలతో, నిర్బంధాలతో, చిత్రహింసలతో, దమనకాండతో అణచివేసింది.

కాని ఆ అణచివేతే మరింత ప్రతిఘటనకు దారి తీసింది. నల్లమందు భాయిలుగా పేరుపడిన చైనా ప్రజలు లేచి నిలవడానికి సిద్ధంగా ఉన్నారనీ, సరైన నాయకత్వం, దిశానిర్దేశం ఉంటే దేశీయ, భూస్వామ్య, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా విస్తృత ప్రజాపోరాటం సాధ్యమేనని మే 4 ఉద్యమం చూపింది. దేశమంతా ఎండుగడ్డి మేటలు వేసి ఉందనీ, దానికి నిప్పురవ్వ అంటించగల నాయకత్వం వస్తే చాలుననీ మే 4 ఉద్యమం చూపింది. ఆ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నవారు, నాయకత్వం వహించినవారు రెండు సంవత్సరాల తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు.

అప్పటికి పెకింగ్ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో పనిచేస్తూ మే 4 ఉద్యమంలో పాల్గొన్న మావో సే టుంగ్, కమ్యూనిస్టు పార్టీ స్థాపకులలో ఒకరై ఆ విప్లవోద్యమాన్ని అనేక సమస్యల మధ్య, ఊచకోతల మధ్య, ఒడిదుడుకుల మధ్య విజయం వైపు నడిపించాడు. ఆ తర్వాత ఎప్పుడో మే 4 ఉద్యమం గురించి స్మరిస్తూ, ʹఅది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమంʹ అన్నాడు మావో. తెలుగునాట రాడికల్ విద్యార్థి ఉద్యమం మే 4 ఉద్యమం గురించీ ప్రచారమూ చేసింది, అటువంటి ఉద్యమాలనే నిర్వహించింది.

మే 4 ఉద్యమం తర్వాత ఇరవై సంవత్సరాలకు, మళ్లీ మరొక జపాన్ దురాక్రమణ సందర్భంగా దాన్ని ప్రతిఘటిస్తూ విద్యార్థులు ఉవ్వెత్తున లేచారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకత్వంలో ఎగసిన విద్యార్థి ఉద్యమ గాథ గురించి యాంగ్ మో రాసిన నవల ʹది సాంగ్ ఆఫ్ యూత్ʹ గా ఇంగ్లిష్ లోకి వస్తే, దాన్ని ʹఉదయగీతికʹగా (రాడికల్ ప్రచురణ జూలై 1985, పర్ స్పెక్టివ్స్ ప్రచురణగా పునర్ముద్రణ నవంబర్ 2003, విరసం ప్రచురణగా పునర్సంతోషం.జనవరి 2018) తెలుగు పాఠకులకు అందించగలగడం నాకెంతో సంతోషం.
- ఎన్.వేణుగోపాల్

Keywords : china, may4, mao, japan
(2021-12-04 18:24:24)No. of visitors : 2096

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

Search Engine

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌
more..


మే