సర్జికల్ దాడుల రాజకీయాలు


సర్జికల్ దాడుల రాజకీయాలు

సర్జికల్

(బైరెడ్డి సతీష్ రాసిన ఈ వ్యాసం మే 2019 వీక్షణం సంచికలో ప్రచురించబడినది)

అవును అంతా అనుకున్నట్టే, అనుమానించినట్టే అరుుంది. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎక్కడో అమాయకుల నెత్తుటి కుంపట్లతో ఓట్ల చలి కాచుకుంటారేమో అని అనుకున్నట్టే అయ్యింది. ఫిబ్రవరి14 ఆత్మాహుతి దాడిలో దేశంలోని బడుగుజీవుల బిడ్డలు బతుకు దెరువు కోసం బందూకులు పట్టుకొని ఎముకలు కొరికే చలిలో సరిహద్దుల్లో సంచరిస్తున్న వేళ నెత్తుటి ముద్దలై నెలరాలి పోయారు. ఈ సంఘటన దేశంలో ఏదో మూలన జరిగి ఉంటే శత్రు బూచి చూపించ డానికి, మార్కెట్‌లోకి దేశభక్తి సరుకును పారించడానికి వీలయ్యేది కాదు. చీమ చిటుక్కుమన్న తుపాకులు గర్జించే కశ్మీర్‌లో క్వింటాళ్ల కొద్దీ ఆర్‌డిఎక్స్‌ను వాహనంలో తీసుకెళ్లి సైనిక వాహనాలను ఢీకొట్టే దాకా ఓట్ల కలలు కంటూ కళ్లు మూసుకుంది మోడీ ప్రభుత్వం. తునాతునకలైన జవాన్ల దేహాలను పదే పదే ప్రదర్శించి నెత్తుటి మరకలైనా ఆరకముందే ఓట్ల వేటకు ఉపక్రమించింది దేశభక్తుల పరివార్‌ ప్రభుత్వం. దేశం దేశమంతా వీథుల్లోకి వచ్చి తమ దేశభక్తిని బహిరంగంగా చాటుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అని పలకని వాళ్ల దేశభక్తి శంకించడం మొదలర్యుుంది. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే దేశమంతటా ఉన్న సాధారణ కశ్మీరీల పైన ఉగ్రవాద ముద్ర వేసి భౌతిక దాడులకు తెగబడింది సంఘ పరివార్‌. అనేక విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై భయానక దాడులతో యూనివర్సిటీ హాస్టళ్ల నుండి గెంటి వేసింది. కశ్మీర్‌ నుండి ఇతర రాష్ట్రాలకు పర్యటనకు వెళ్లిన వారిపై, వ్యాపారస్తులపై ఈ దాడులు కొనసాగినవి. కశ్మీరీల వస్తూత్పత్తులను బహిష్కరించి ఆర్థిక దిగ్భందనానికి గురిచేయాలని కూడా పిలుపునిచ్చారు.

మరోవైపు కశ్మీర్‌ భారత దేశంలో అంతర్భాగం అంటూ అనునిత్యం రొమ్ము విరుచుకొనే జాతీయవాదులకు మరి కశ్మీరీలు ʹభారతీయులుʹగా ఎందుకు కనిపించలేదో? బహుశా వారు ప్రచారం చేస్తున్నట్టు వారంతా పరారుువాళ్లు కావడం వల్లనేమో! అక్కడి వారంతా ఓ మతం వారని వారందరిని ఉగ్రవాదులంటే తప్ప, వారి నుండి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నదని పచ్ఛిగా ప్రచారం చేస్తే తప్ప మెజార్టీ మత ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టలేం. ఓట్లను కొల్లగొట్టలేం! దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా ప్రజల జీవితాల్లో భద్రతను పెంచడం కంటే పొరుగు, శత్రు దేశం బూచి చూపెట్టి అభద్రతను రగిలించి నేనుంటే తప్ప భద్రత లేదని మోడీ దేశమంతా తిరుగుతున్నాడు.

సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల పై దాడి జరిగిన నేపథ్యంలో అఖిల పక్ష రాజకీయ పార్టీల మీటింగ్‌కి రాకుండానే తన పార్టీ మీటింగ్‌తో ఎన్నికలకు సమాయత్తమయ్యే పనిలో పడ్డాడు. దేశమంతా ఓ భయానక వాతావరణం సృష్టించి, భావోద్వేగాలను తారా స్థారుుకి తీసుకెళ్లి 15 రోజుల తర్వాత పాక్‌ భూభాగంలోకి చొచ్ఛుకెళ్లి సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించామని ప్రకటించారు. 300 మంది ʹటెర్రరిస్టుʹలను హతమార్చి, శత్రువుకు వణుకు పుట్టించాం అని తనకు వంతపాడే ʹదేశభక్తిʹ మీడియా ద్వారా మొత్తం దేశమంతా ప్రచార హోరెత్తించారు. మన వాయుసేన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చిందని, టెర్రరిస్టు శిక్షణా స్థావరాలన్ని నేలమట్టం అరుునాయని జబ్బ చరుచుకొని ప్రకటించారు మోడీ.

అసలే ఓట్ల సీజన్‌ కదా అన్ని పార్టీలు పోటీపడి మరీ దేశభక్తిని చాటుకోవడానికి అనేక రూపాల్లో దేశమంతా ప్రదర్శనలిచ్చాయి. దీంట్లో మోడీ గొప్పతనం ఏమి లేదని ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి వాయు సేనలు వీరోచితంగా శత్రుదేశ శక్తులతో పోరాటం చేశారని ప్రశంసల జడి వానను కురిపించారు పాలకులు. దేశ ప్రయోజనాలతో రాజకీయం చేయొద్దంటూనే అన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాకులాడినయి. మొత్తంగా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి దేశభక్తి ముసుగులో రాజకీయ లబ్ధి పొందే వికృత క్రీడలో మొదట బిజెపి ఉంటే ఆ వెనకాలే అన్ని పార్టీలు క్యూ కట్టినరుు.

ప్రధాని నోటివెంట ప్రతీకార భాష, దేశమంతా ఆయన అనుయాయు లది అదే మాట. శాంతి చర్చలు, సయోధ్య, సుహృద్భావ చర్యలు వంటి పదాలు పలకడమే నేరమైంది. ఓ రకంగా అవన్నీ నిషిద్ధ విషయాలు! భారత్‌ మాతాకి జై అనకుండా, పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అనకుండా మౌనంగా కూర్చున్నా దేశభక్తులు సహించని స్థితి. ఘటన గురించి తప్ప దాని చారిత్రక నేపథ్యం, అటువంటి అనివార్య స్థితికి నెట్టబడుతున్న కశ్మీర్‌ యువతరం గురించి మాట్లాడడం అంటే యుద్ద నేరం కన్నా ఘోరమైనది.

నిజంగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయా? వాళ్లు గొప్పగా ప్రకటించు కున్నట్టు 300 మంది టెర్రరిస్టులు బాలాకోట్‌ పర్వత ప్రాంతాల్లో ఉన్న శిక్షణా శిబిరాలపై జరిగిన దాడిలో హతమయ్యారా అనే ప్రశ్నలు బయటకు చెప్పడం కాదు కదా మన మదిలో అవి మెదులుతున్నా యంటేనే దేశ ద్రోహ ముద్రలు ముఖాన చెక్కబడుతారుు! ʹశతృʹ దేశం సైనికులు చిక్కినా ఏవో యుద్ధ సూత్రాల ప్రకారం వదిలి వేస్తారేమో కానీ ఇలాంటి ప్రశ్నలు వేస్తే నడి వీధుల్లో ʹదేశభక్తులుʹ శిక్షను అమలు చేస్తారు. ఇక్కడ లాజిక్‌లు, రీజనింగులకు చోటుండదు.

నిజానికి ఆ ప్రాంతాలన్నీ పర్వత ప్రాంతాలని, జన సంచారం పెద్దగా లేదని విమానాలు కురిపించిన బాంబుల చప్పుళ్లు వినిపించాయని అయితే పెద్దమొత్తంలో చనిపోరుున ఆనవాళ్లు కానీ, విధ్వంసపు గుర్తులు ఏవి లేవని అంతర్జాతీయ వార్తా సంస్థలు రారుుటర్‌, అల్‌ జజీరా, న్యూయార్క్‌ టైమ్స్‌ పరిశోధనాత్మక కథనాలను వెలువరించారుు. వాటిలో విశ్వసనీయత ఎంత ఉన్నప్పటికీ ఆ కథనాలను ఉటంకించే సాహసం కూడా చేయలేని గంభీర వాతావరణాన్ని దేశమంతా సృష్టించారు.

ఇక సంఘ పరివార్‌ అంతర్జాల శక్తులు సామాజిక మాధ్యమాల్లో చనిపోరుున టెర్రరిస్టుల మృతదేహాల కుప్పలంటూ గల్ఫ్‌ యుద్ధంలో చనిపోరుున వారి ఫొటోలను గుప్పించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌లో పాల్గొన్న యుద్ధ విమానాలకు దాడి జరిగి తిరుగు ప్రయాణం చేసే క్రమంలో అక్కడ జరిగిన దాడులకు సంబంధించిన ఫొటోలు కూడా తీయగల్గె సాంకేతిక పారిజ్ఞానం కూడా ఉన్న ప్రభుత్వం మాత్రం అలాంటి ఊసే ఎత్త లేదు, అడిగే సాహసం ఏ పార్టీ చేయలేదనుకోండి.

అడగడం మన సైనిక దళాల యుద్ధ పాటవాన్ని ప్రశ్నించినట్టు, శంకించినట్టు అవుతుంది కదా మరీ! యుద్ధ సమయంలోనే కాదు, యుద్ధ వాతావరణాన్ని సృష్టించే క్రమంలో మొట్ట మొదట సంహరించ బడేది సత్యమే. వీథుల్లో రాజకీయ వేదికలపైన దేశభక్తి ప్రదర్శనా పరీక్షలు పెద్ద ఎత్తున జరుతున్నారుు. దిక్కుమొక్కులేని జనానికి ఏనాడు ఏమీ చేయని ʹసెలబ్రిటీʹలంతా పోటీపడి చనిపోరుున జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని, పిల్లల్ని చదివిస్తామని ప్రకటిస్తున్నారు. దేశభక్తి ప్రదర్శన కదా!

మరోవైపు మీడియా సంస్థలన్నీ తమ దేశభక్తి ప్రదర్శన అన్నట్టు స్టూడియోలలో ʹప్రతీకార యుద్ధానిʹకి ప్రజల్ని సన్నద్ధం చేసినవి. ʹశతృʹ దేశాన్ని పదే పదే చూపెడుతూ ప్రజల మెదళ్లలో పాకిస్తాన్‌ పట్ల ద్వేష భావనని నింపివేసినవి. సత్యానికి, న్యాయానికి సంబంధం లేకుండా దేశభక్తికి, జాతీయ భావనకి మాత్రమే కట్టుబడి వీథుల్లో వీరంగం ఆడుతున్న వీర దేశభక్తులుగా తమకు తాము చెప్పుకునే మతోన్మాదుల వికృత చేష్టలను టిఆర్‌పి కోసం పోటీపడీ మరీ చూపించారుు. ప్రభుత్వంలో ఉన్న పార్టీపెద్దలు చెప్పిన ప్రతిదాన్ని, తీసుకునే ప్రతిచర్య దేశ ప్రయోజనాల కోసమే, భద్రత కోసమే అన్నట్టు అత్యుత్సాహం ప్రదర్శించారుు. రిటైర్డ్‌ ఆర్మీ అధికారులు, పోటీలు పడే పార్టీల ప్రతినిధులు, మధ్యలో సోకాల్డ్‌ సెలబ్రిటీలు, భద్రతా విశ్లేషకులు, వేడెక్కించే కామెంట్స్‌ చేసే మత పీఠాల పెద్దల్ని తప్ప మరెవర్ని ఈ చానెల్స్‌ చర్చలకు పిలిచిన దాఖలాలు లేవు.

ప్రతీకార భాష మాట్లాడుతున్న పాలకుల నిర్ణయాలు సాహసోపేత మైనవని, వారి చర్యలన్నింటికి సమ్మతి తెచ్చే పనికి పత్రికలు చానెళ్లు పూనుకున్నారుు. అదేకాలంలో దేశంలో అంతర్గతంగా అనేక జీవన్మరణ సమస్యలు ఉన్నా అశేష ప్రజానీకపు గుండె చప్పుళ్లను వినే మూడ్‌లో లేవు మీడియా సంస్థలు. ఘటన చుట్టూ చర్చలను తిప్పుతూ ఇన్‌స్టంట్‌ న్యాయం కావాలన్నట్టు పాకులాడారుు. పాలక వర్గాలు ప్రతీకారం అన్నప్పుడల్లా అంతకు రెండింతలు గొంతుతో మీడియా మొత్తుకుంటది. సమస్య ఏదో పాలకవర్గాలు వైరుధ్యం కాదన్నట్టుగా మొత్తం రెండు దేశాల మధ్య వైషమ్యంగా చిత్రీకరించే, బయటికి ప్రదర్శించే వైఖరినే తీసుకున్నది మీడియా.

అరుుతే దేశంలో సృష్టించబడిన యుద్ద వాతావరణాన్ని తన వ్యాపార ప్రయోజనాలకనుగుణంగా మార్చుకునే ఒక వర్గం మీడియా కూడా ఉన్నది. ఎంతోకొంత నిజారుుతీగా ఉండే మరో వర్గం మీడియాను తమ గొంతునే దేశం గొంతుగా వినిపించకపోతే అధికార బలంతో తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాన్ని బలంగా చేస్తున్నది. ఇటువంటి భావోద్వేగాలు తారాస్థారుుకి తీసుకెళ్లిన సందర్భంలో అరుుతే బ్లాక్‌ మెరుుల్‌ చేసి మరీ తమ ʹదారిʹకి తెచ్చుకుంటున్నారుు.

మొత్తంగా మీడియా అర్థవంతమైన, ప్రయోజనకరమైన, వాస్తవమైన ప్రశ్నల్ని పాలకుల్ని అడగడం మామూలుగానే మరిచిపోరుుంది మరీ ఇటువంటి సమయంలో మరింతగా పక్కన పెడుతుంది. కార్పొరేట్‌ కనుసన్నల్లో, కార్పొరేట్‌ గుప్పిట్లో ఉన్నపుడు ఇంతకంటే భిన్నంగా ఎలా ఉండగలదు?

దేశమంతా అభినందన్‌ ʹసాహసాʹనికి అభినందనలు తెలుపుతుంది, పాలకులు ప్రతీకారం అన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ మోతలో పాకిస్తాన్‌ వెన్ను విరిచామని గెలుపు నినాదాల హోరులో కశ్మీర్‌ లోయలోని గాయపడిన హృదయాల ఘోషను ఆలకించేదెవరు? ప్రపంచంలో పాలస్తీనా తరువాత అత్యంత నిర్బంధాన్ని చవిచూస్తున్నది కశ్మీరీలే! అత్యంత సైనికీకరణకు గురైనది కూడా కశ్మీరే!

సంఘ పరివార్‌ పాలకులకు ఇజ్రారుుల్‌ మోసాద్‌ సంస్థ ఆదర్శం. పచ్చి అరబ్బు విద్వేషి అరుున బెంజిమెన్‌ నెతన్యాహు మోడీకి అనుసరనీయుడు ఫలితంగానే నిత్యం నెత్తురోడుతున్నది కశ్మీర్‌. పదిలక్షల మంది సైనికులతో ప్రతి వీథిన తుపాకుల పహారాలో, అడుగడుగునా అనుమానపు కళ్లతో సంచరించే సైనిక బెటాలియన్‌ నీడలో కశ్మీరీలు కాలం వెల్లదీస్తున్నారు. కశ్మీర్‌ భారత మాత నుదుటి తిలకం అని ఛాతి విరుచుకునే సంఘ పరివార్‌ బిజెపి పాలనలో గతంలో ఎన్నడూ లేని హింసను కశ్మీర్‌ అనుభవిస్తున్నది. ఏదో ఒక మూలన ఎన్‌కౌంటర్‌ పేరుతోనో, కస్టోడీయల్‌ డెత్‌ పేరుతోనే నిత్య చావుల మధ్య కశ్మీరీలు కాలం గడుపుతున్నారు. పరారుు దేశం నుండీ వచ్చి కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడుతున్నారని నిత్యం వాదించే బిజెపికి గడచిన ఐదు సంవత్సరాల కాలంలో స్థానిక కశ్మీర్‌ యువత అన్ని హక్కులనీ కోల్పోరుు, నిత్యం అమలవుతున్న హింస, అణచివేతలను భరించలేక మిలిటెంట్‌ ఉద్యమాల్లోకి వెళ్లడాన్ని బయటకు రానివ్వడం లేదు. సైనిక దళాలు ప్రత్యేక అధికారాల పేరుతో ఏం చేసినా చెల్లుబాటయ్యేలా, సైన్యం ఎంత వికృత చర్యలకు పాల్పడినా విచ్చలవిడి హింసకు తెగబడ్డా పాలకులు స్వేచ్ఛా హస్తాన్నే అందించారు. ఓటు రాజకీయాలు మాత్రమే నడిపే పాలక పార్టీలకు కశ్మీరీల స్వయం నిర్ణయాధికార ఉద్యమం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, రాజకీయ హక్కులు, జీవించే హక్కులపై చారిత్రక, ప్రజాస్వామిక దృష్టి లేకుండా కశ్మీర్‌ కేంద్రంగా పాకిస్తాన్‌ని తీవ్రంగా నిందించడం, ʹశతృʹ దేశంగా చూడడం ప్రాతిపాదికనే దేశభక్తిని నిర్వచించుకుంటున్నారు.

బిజెపి అరుుతే రాజ్యాంగం కల్పించిన రక్షణలు అరుున 35ఎ, 370 ఆర్టికల్లని రద్దు చేస్తామని అధికారంలోకి రాకముందు నుండే బెదిరిస్తున్నది. కశ్మీర్‌ మాదన్నంతగా కశ్మీరీలను అక్కున చేర్చుకోలేక పోవడం హిందూ సాంస్కృతిక జాతీయవాద దక్పథం తప్ప మరొకటి లేదు. కశ్మీర్‌ ప్రజలకి మెజార్టీ మత ఆధిపత్యాన్ని, అప్రజాస్వామిక ధోరణిని నిరసించే మైనార్టీ వర్గ విశ్వాసాలు ఉన్నారుు కాబట్టి వారి పైన మరింతగా బుల్లెట్లు, పెల్లెట్లు కురుస్తున్నారుు. పాకిస్థాన్‌ లోనో, బంగ్లాదేశ్‌ లోనో మైనారిటీలుగా ఉన్న హిందువుల, సంక్షేమం, భద్రతపై గొంతు చించుకునే సంఘ పరివార్‌ కశ్మీరీల కన్నీటి గాథల గురించి వేలాదిగా చంపబడిన వారి గురించి, పెల్లెట్లతో కళ్లు పోగొట్టుకుని చీకట్లో బతుకులీడుస్తున్న యువత గురించి కూడా మాట్లాడితే బాగుండేది.

కానీ జరుగుతున్నదేమిటి పుల్వామా తరువాత రక్తానికి రక్తం అంటూ పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి మరింత మారణహోమానికి తెరలేపింది. 1990ల నుండి కశ్మీరీల తిరుగుబాటును అణచే పేరుతో ఆర్మీ సాగించిన నరమేధం, ప్రత్యేకించి 1991 ఫిబ్రవరి 23న కోనన్‌ పొషార ప్రాంతంలో 150 మంది కశ్మీర్‌ స్త్రీలపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌, 200 మందిని తీవ్రంగా హింసించిన సంఘటనలో ఒక్క సైనికున్ని కూడా శిక్షించలేదు. అసలు సైన్యం చేసే వికృతమైన ఏ పనినైనా ప్రశ్నించినా అది దేశ ద్రోహమే అవుతున్నది. వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని, దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారని, జాతి ప్రయోజనాలు దెబ్బ తింటాయని బ్లాక్‌ మెరుుల్‌ చేస్తున్నారు పాలకులు. ఎవరికీ జవాబుదారీతనం లేని సైనిక రాజ్యం నడుస్తున్నది కశ్మీర్‌లో.

నిజానికి ఫిబ్రవరి14న ఆత్మాహుతి దాడికి పాల్పడిన కశ్మీరీ యువకుడు సైనికుల అకృత్యాల బాధితుడే! ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆర్మీ అతన్ని పట్టుకుని ముక్కు నేలకు రారుుంచిందట. కశ్మీరీలతో సైన్యం కబడ్డీ, క్రికెట్‌, గిల్లి దండ ఆడితే వారి హృదయాలను గెలుచుకుంటున్న సైనికులు అని ప్రచారం చేసే మీడియాకు అమాయకులైన ప్రజలపై కాల్పులు జరిపి చంపేసినా, కస్టడీలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినా, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడినా, యువతను అదృశ్యం చేసినా, పెల్లెట్స్‌తో కళ్లు పోగొట్టినా ఏమీ మాట్లాడదు. దేశ భక్తి, భద్రత కదా! జాతి ప్రయోజనాలు, దేశ సమైక్యత పేరుతో జవాబుదారీతనం లేని వికృత వ్యవస్థ ఒకటి కశ్మీర్‌లో మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాల నిండా ఇదే స్థితి కొనసాగుతున్నది.

ఒక చారిత్రక క్రమంలో జరుగుతున్న విషాదాలను పాలక వర్గాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మార్చుకుని కశ్మీర్‌ లోయ గుండె చప్పుడును శాంతి భద్రతల సమస్యగా చూస్తూ మరిన్ని విషాదాలను పురిగొల్పే దుర్మార్గానికి ఒడిగడుతున్నారు తప్ప ములాల్లోకి వెళ్ల నిరాకరిస్తున్నారు. పాలక వర్గాల ప్రయోజనాల కోసం పాక్‌ ప్రజలందరినీ మొత్తంగా దేశాన్నే శతృ దేశంగా చిత్రీకరిస్తున్నారు. కశ్మీరీల రాజకీయ పోరాటంలో వారికి మద్దతు ఇచ్చే శక్తుల మద్దతు తీసుకునే హక్కు వారికుంటుంది. టిబెట్‌ పోరాటానికి, తూర్పు పాకిస్థాన్‌గా పిలవబడిన బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు భారత్‌ మద్దతు ఇచ్చిందనేది ఒక చారిత్రక సత్యం. అరుుతే కశ్మీర్‌ ప్రజా పోరాటంలో రాజకీయ హక్కులు, స్వయం నిర్ణయాధికార ఆకాంక్షను వెల్లడించడంలో మతోన్మాదుల పాత్ర ఎక్కువ అవడం ఫలితంగా దేశంలో హిందూ మతోన్మాద శక్తుల అణచివేత చర్యలకు సాధికారత పొందే ప్రయత్నం జరుగుతున్నది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి పౌరుని అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు, అవినీతిలేని పాలన, ఆత్మహత్యలు లేని వ్యవసాయం అని ప్రగల్బాలు పలికిన మోడీ పాలన పెద్ద నోట్ల రద్దుతో ధ్వంసమైంది ఆర్థిక వ్యవస్థ. ప్రత్యేకించి అసంఘటిత రంగంలో, చిన్న, కుటీర పరిశ్రమల్లో కోటికి పైగా కోల్పోరుున ఉద్యోగాలు, రెండు కోట్లు కాదు కదా రెండు లక్షలు కూడా ఉద్యోగాలు కల్పించలేని ఉత్త వాగాడంభరమే మిగిలింది.

ఆత్మహత్యలను నివారించలేని అసమర్థ పాలనలో, విదేశీ పర్యటనలు, ఆడంబరపు ప్రచార హోరు మాత్రమే మిగిలింది. ఎన్నికల సందర్భంలో ʹదేశ భద్రతʹ బాగా పనికి వస్తుందని అది ఓట్లు కురిపించే మంత్రం అవుతుందని, దేశం అభద్రతలో ఉంటే సర్జికల్‌ స్ట్రైక్స్‌తో చేయగలిగే మొనగాడొక్క మోడీ మాత్రమే అని జీవన్మరణ సమస్యల కంటే ఉద్యోగం, ఉపాధి లేక కోట్లాది మంది అభద్రతలో ఉంటే అసలు భద్రత అంతా శతృ దేశం పైన దాడి చేయడం అని ఓట్ల వేటలో పడ్డారు మోడీ-షాలు. ఇంతా చేస్తే గడిచిన మూడు విడతల ఎన్నికల్లో కశ్మీర్‌లో ఓటింగ్‌ శాతం 10 కూడా దాటలేదు!
- బైరెడ్డి సతీష్, ఆంగ్ల ఉపన్యాసకులు

Keywords : narendra modi, bjp, congress, surgical strikes, terrorists, pulwama
(2020-05-28 05:15:26)No. of visitors : 295

Suggested Posts


0 results

Search Engine

వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
more..


సర్జికల్