ఈ దేశం దళితులకేమిచ్చింది ?


ఈ దేశం దళితులకేమిచ్చింది ?

ఈ

రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఏప్రిల్ 26న ఓ దళిత ʹజంట మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ఆ దంపతులను ఐదుగురు వ్యక్తులు అటకాయించారు. నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. భర్త సమక్షంలోనే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను విచక్షణా రహితంగా కొట్టారు. మహిళను అత్యాచారం చేస్తూ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే వీడియోను బయటపెడతామని నిందితులు హెచ్చరించారు. ఆ దుర్మార్గులు డబ్బుల కోసమూ బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను బైట్ అపెడతామని హిచ్చరించారు. చివరికి వీడియోను బయటపెట్టారు.
వాళ్ళకు భయపడ్డ ఆ దంపతులు కొన్ని రోజులు మౌనం వహించారు. అయినా ఈ దంపతులపై ఆ దుర్మార్గుల ఆగడాలు ఆగలేదు చివరకు ఆ దంపతులు ధైర్యం తెచ్చుకొని మే2న పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసు నమోదు చేసుకున్నా, ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎన్నికలు జరుగుతున్నాయనే సాకు చూపించారు.
ఈ స‍ంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ థానాగాజీ పట్టణంలో దళిత సంఘాలు మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. స్థానికంగా ఉన్న జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నాయి. అనేక చోట్ల దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. సోషల్ మీడియాలో ఆ దంపతులకు మద్దతుగా పోస్ట్ లు వెల్లువెత్తాయి. అప్పటికిగానీ పోలీసులు కదలలేదు. చివరకు ఆ దుర్మార్గుల్లో ఒకణ్ణి అరెస్టు చేశారు.

ఈ సంఘటన పై ప్రతిపక్ష బీజేపీ కూడా స్పంధించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. చివరకు రాజస్థాన్ డీజీపీ కపిల్ గార్గ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అత్యాచార ఘటనలో ఐదుగురు పాల్గొన్నారని, నిందితులను వెతికిపట్టుకునేందుకు 14 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

రాజస్తాన్ లో దళిత మహిళపై అత్యాచారం జరిగిన రోజే (ఏప్రెల్ 26) ఉత్తరాఖండ్‌లోని టెహరీలోని శ్రీకోట్ లో జరిగిన ఒక పెళ్ళి విందుకు జితేంద్ర అనే దళిత యువకుడు హాజరయ్యాడు. తమతోపాటు భోజనం చేస్తున్న జితేంద్రపై కొంతమంది అగ్రవర్ణ దురహంకారులు దాడిచేశారు. తమ ఎదురుగా కూర్చొని భోజనం చేస్తావా అని చావ చితక్కొట్టారు. డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో గత 9 రోజులుగా చికిత్స పొందుతూ జితేంద్ర మరణించాడని టెహరీ డీఎస్పీ ఉత్తమ్‌సింగ్ చెప్పారు. జితేంద్ర సోదరి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మే1వతేదీన మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామంలో మరో దుర్మార్గం జరిగింది. రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిని వ్యతిరేకించిన రుక్మిణి కుటుంభం పెళ్ళి అయిన రోజు నుండి వీరిని అనేక రకాలుగా బెధిరించారు. అయినా ఈ యువజంట భయపడకుండా ధైర్యంగా జీవిస్తున్నారు. భార్యా భర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో రుక్మిణి పుట్టింటికి వెళ్ళింది. ఆమెను తీసుకరావడానికి మంగేష్ కూడా వెళ్ళాడు. మంగేష్ ను అడ్డుకున్న రుక్మిణి తండ్రి రామ భారతీయ, చిన్నాన్నలు సురేంద్ర భారతీయ, ఘన్ శ్యాం భారతీయలు ఆయనపై దాడి చేశారు అడ్డు వచ్చిన రుక్మిణిపై కూడా దాడి చేశారు. ఒకవైపు దాడి చేస్తూనే పెట్రోల్ తీసుకొచ్చి ఇద్దరిపై పోసి నిప్పంటించారు. యువజంట హాహాకారాలు చేస్తున్నా వాళ్ళను వదలలేదు రూంలోకి తోసి తలుపులు వేసేశారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు పరుగున వచ్చి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం నాడు రుక్మిణి కన్ను మూసింది. మంగేష్ ఇంకా ఆస్పత్రిలో మరణంతో పోరాడుతున్నాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుక్మిణి చిన్నాన్నలు సురేంద్ర భారతీయ, ఘన్ శ్యాం భారతీయలను అరెస్టు చేశారు రుక్మిణి తండ్రి రామ భారతీయ పరారీలో ఉన్నాడని పర్మార్ తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ భాత్రే మీడియాకు తెలిపారు.

దళితులపై అత్యాచారాలు, హత్యలు, దాడులు ఈ దేశంలో కొత్త కాదు.ఈ మూడు సంఘటన‌లు మొదటివి కావు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మూలంగా, దళితులు, ప్రజాస్వామిక వాదులు చేసిన అనేక పోరాటాల మూలంగా రాజ్యాంగం దళితులకు కొంత రక్షణ కల్పించినప్పటికీ ఆచరణలో ఆ రక్షణలు ఎందుకూ పనికిరావడం లేదు. దళితులపై దాడులు చేస్తున్న అగ్రవాదులకే పాలకుల మద్దతు లభిస్తోంది.
ఈ దేశంలోని వ్యవస్థలన్నీ అగ్రకులాల చెప్పుచేతల్లో ఉండటం వల్ల ఏ వ్యవస్థ కూడా దళితులకు న్యాయం చేయడంలేదు. చుండూరులో దళితులపై హత్యాకాండకు పాల్పడ్డ వాళ్ళంతా నిర్దోషులుగా బయటపడటం ఇందుకు మంచి ఉదహరణ.

మరీ దూరం పోకుండా మనకు తెలిసిన కిల్వెన్మణి దళితుల హత్యాకాండ మొదలుకుంటే ఇప్పటిదాకా మూకుమ్మడిగా దళితులను నరికి చంపిన ఘట్నల్లో, దళిత మహిళ‌పై అత్యాచారం చేసిన , హత్య చేసిన ఘటనల్లో, గొడ్డు మాంసం తిన్నారన్న పేరుతో హత్యలు, దాడులు...ప్రతి రోజూ ఈ దేశం ఏదో ఓ మూలల్లో దళితులపై జరుగుతున్నదుర్మార్గాలు...ఏ ఘటన‌లో కూడా బాధితులకు న్యాయం జరగలేదు. లేదా పూర్తి న్యాయం జరగలేదు. పైగా అనేక చోట్ల బాధితులనే దోషులగా చేసింది సమాజం.

పైగా మతకలహాలు జరిగినప్పుడు అగ్రకులాలు దళితులనే రెచ్చగొట్టి తమ సైన్యంగా ఉపయోగించుకోవడం కూడా మనం గుజరాత్ మారణహోమంలో చూశాం. మైనార్టీలమీద దాడులకోసం దళితులూ హిందువులే అని చెప్పే మతోన్మాదులు ఏనాడూ దళితులను తమతో సమానమైన వ్యక్తులుగా చూడలేదు.
అంబేడ్కర్ ఏనాడో చెప్పినప్పటికీ తమకు అసలైన శత్రువులెవరో ఇపుడిప్పుడే అర్దం చేసుకుంటోంది దళిత సమాజం. అయితే ఓ సంఘటన‌ జరిగినప్పుడు ఓ ధర్నా..ఓ ర్యాలీ...మరో ఆందోళన....ఇవి జరగాల్సిందే కానీ ఇవే సమస్యకు పరిష్కారంకాదు. అంతేకాదు ఎవరో నలుగురు దళిత నాయకులు ఎన్నికల్లో గెల్చి అధికారంలోకి వచ్చినా ఈ సమస్య‌కు పరిష్కారం దొరకదు. ఈ దేశ పాలక వర్గాలుగా అగ్రకుల, దోపిడి వర్గాలున్నంత కాలం దళితులు ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా దళితులపరిస్థితి మారదు. దళితులు గ్రామ స్థాయి నుండి ఢిల్లీ దాకా రాజ్యాధికారంలోకి రావాలి. దానికోసం దళితులు ఒంటరిగా కాకుండా.. ఈ దేశంలో అణిచివేతకు, దోపిడికి గురవుతున్న‌ మత మైనార్టీలను, ఆదివాసులను, మహిళలను, ఇతర బలహీనవర్గాలను, కలిసి వచ్చే అన్ని వర్గాలను, శక్తులను కలుపుకొని మహత్తరపోరాటానికి సిద్దం కావాలి. లేదా అట్లా జరుగుతున్న పోరాటాలతో చేతులు కలపాలి.

‍- ఎస్.నిర్మల‌

Keywords : rajastan, dalit women, rape, upper cast,
(2019-11-13 05:25:21)No. of visitors : 361

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
more..


ఈ