ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !


ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !

ఈ

ఒడిస్సా-కోరాఫుట్‌లో జరిగిన ʹఎన్‌కౌంటర్‌ʹ లో మృతిచెందిన మావోయిస్టు కామేశ్వరి అలియాన్‌ స్వరూప అంత్యక్రియలు రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌లో విప్లవ జేజేల నడుమ శనివారం జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన కామేశ్వరి మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె తండ్రి తహశీల్దార్‌గా పనిచేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లికి శ్రీకాకుళంలో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో కామేశ్వరి విద్యాభ్యాసం శ్రీకాకుళంలో జరిగింది. విద్యపరంగా ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ అయ్యిన కామేశ్వరి పదో తరగతిలో మంచి ఉత్తీర్ణతతో పాసయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆర్టీసీలో రావులపాలెం డిపోలో తన ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఉద్యోగంలో పనిచేస్తూ కార్మికుల సమస్యలపై తన గళాన్ని విప్పింది. యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌లో కీలకమైన నాయకురాలుగా ఆమె ఎదిగారు. అప్పటికే యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌లో కీలకమైన నాయకుడుగా పనిచేస్తూ కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని సాగిస్తున్న దువ్వూరి శ్రీనివాస్‌ అలియాస్‌ రవితో కలిసి ఆర్టీసి కార్మికుల సమస్యలపై పోరాటం సాగించారు. ఈ పోరాటంలో కామేశ్వరి ఆయనకు తోడుగా ఉండేవారు. కార్మికుల హక్కుల కోసం పోరాడే క్రమంలోనే ఆమె విప్లవ భావజాలానికి ఆకర్షితులైయ్యారు. 1999 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకూ రావులపాలెం, రాజమండ్రి, గోకవరం డిపోల్లో ఆమె ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ పదంలో ఒక్కటై పనిచేస్తున్న దువ్వూరి శ్రీనివాస్‌ మావోయిస్టు పార్టీలో చేరిపోయారు. 2009లో ఆమె తన ఉద్యోగాన్ని వదిలి మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై ఆదివాసీ హక్కుల కోసం, రాజ్యహింసకు వ్యతిరేకంగా దండకారణ్యంలో జరుగుతున్న పోరాటంలో ఆమె భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అనేక కీలక సంఘటనల్లో ఆమె ముఖ్య భూమిక పోషించారు. అజ్ఞాతంలో ఉండగానే దువ్వూరి శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. 2011 జనవరి 9వ తేదీన రాజ్యం చేసిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో తన కళ్లెదుటే జీవిత సహచరుడు దువ్వూరి శ్రీనివాస్‌ను హత్య గావించబడ్డారు. దువ్వూరి శ్రీనివాస్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినా తను నమ్మిన ఆశయం కోసం కామేశ్వరి మాత్రం మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. విశాఖ జిల్లాలో ఇటీవల జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకేసులో ఆమె నిందితురాలని పోలీసులు ప్రకటించారు. ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్‌ (ఎఓబి) కమిటీలో ఉంటూ పలు సంఘటనల్లో పాల్గొన్నారు. ఉద్యమంలో కొనసాగుతూనే ఒరియా బాషను నేర్చుకున్నారు. ఒరియా బాషను తెలుగులోకి అనువదించే స్థాయికి ఆమె చేరుకున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో పాడువా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కుంట-బంకి గ్రామాల మధ్య పోలీసులు చెబుతున్నట్లుగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హత్యగావించబడ్డారు. ఆ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కామేశ్వరిని పోలీసులు కోరాఫుట్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో అంత్యక్రియలు
కోరాఫుట్‌ ప్రభుత్వాసుపత్రి నుంచి కామేశ్వరి భౌతికకాయాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం(ఎపిసిఎల్‌సి) రాష్ట్ర అధ్యక్షులు వేళంగి చిట్టిబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు రఘురాంతోపాటు, అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు కోదండరాం, లక్ష్మణ్‌, ఆమె కుమార్తె సుమాంజిలికి అప్పగించారు. కోరాఫుట్‌ నుంచి వాహనంలో ఆమె భౌతికకాయాన్ని శుక్రవారం అర్ధరాత్రి మూడు గంటల సమయానికి రాజమహేంద్రవరానికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో కోటిలింగాల ఘాట్‌లోని స్మశాన వాటికలో విప్లవ జేజేలు పలుకుతూ ఆమెకు విప్లవ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కుటుంబీకులు కన్నీటి వీడ్కోలు పలికారు.
అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం
ఆదివాసీ హక్కుల కోసం, రాజ్యం చేస్తున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలను అర్పించిన అమర వీరుల ఆశయాలను కొనసాగిస్తామంటూ పలువురు విప్లవ ప్రజా సంఘాల నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కోటిలింగాల ఘాట్‌ వద్ద అంత్యక్రియల సందర్భంగా జరిగిన సంతాప సభకు బంధుమిత్రుల అమరుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అధ్యక్షత వహించారు. ఈ సంతాప సభలో ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు, రాజకీయ ఖైదీల కమిటీ రాష్ట్ర కార్యదర్శి బళ్లా రవీంద్ర, శోభ, జ్యోతి, కార్మిక సంఘాల నాయకులు ఎస్‌కె మస్తాన్‌, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, కార్యదర్శి ఎ.బాబూరావు, యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కెఎస్‌వి రావు, జి.శ్రీనివాసరావు, సత్తిబాబు, న్యూడెమోక్రసీ నాయకులు రమణ, ప్రదీప్‌, ఎపిసిఎల్‌సి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ, కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కోనాల లాజర్‌, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకురాలు అన్నపూర్ణ తదితరులు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్య హింసలో భాగంగానే పోలీసులు చేస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లలో ప్రజా ఉద్యమ నాయకులు అమరులు అవుతున్నారని పేర్కొన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా ఉద్యమకారులను ఎన్‌కౌంటర్ల పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. నాడు దువ్వూరి శ్రీనివాస్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌లోనే పోలీసులు హత్య చేశారని, నేడు ఆయన సహచరణి కామేశ్వరిని కూడా బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హత్య చేశారని పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తున్న రాజ్య హింసకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, ఏ ఆశయం కోసమైతే తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే వారికి నిజమైన నివాళులర్పించిన వారం అవతామని, ఆ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
త్వరలోనే నిజనిర్ధారణకు క్షేత్ర స్థాయి పరిశీలన
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమకారులను, సానుభూతిపరులను రాజ్యం చేస్తున్న హత్యకాండను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారత పౌర హక్కుల సమాఖ్య ద్వారా నిజనిర్ధారణ కమిటీ ద్వారా క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నట్లు ఎపిసిఎల్‌సి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ అన్నారు. ఒడిస్సా రాష్ట్రంలోని పాడువా పోలీసు స్టేషన్‌ పరిధిలో పోలీసులు చెబుతున్న ఎన్‌కౌంటర్‌పై నిజ నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు త్వరలోనే తమ కమిటీ ఆధ్వర్యంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఎన్‌కౌంటర్లు బూటకమైనవేనని ఇప్పటికే తేటతెల్లం అయ్యిందన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ యొక్క తీరుతెన్నులపై నిజనిర్ధారణ చేసి త్వరలోనే వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.

Keywords : svarupa, maoist, rtc worker, aob, rajamahendravaram, andhrapradesh
(2019-07-14 17:35:54)No. of visitors : 1004

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం
తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
పోడు భూముల సమస్య శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు...టీడీఎఫ్
ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత
more..


ఈ