వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం


వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం

వరంగల్

వరంగల్లులో టీవీవీ, టీపీఎఫ్, సీఎమ్మెస్, విరసం తదితర నిరసనకారుల అరెస్ట్ రాజ్యాంగ వ్యతిరేకం!
- విప్లవ రచయితల సంఘం ఖండన ప్రకటన

వరంగల్ పోలీసులు టీవీవీ ఆధ్వర్యంలో కాళోజీ విగ్రహం దగ్గర జరిగిన నిరసన పదర్శనను అడ్డుకొని, నిరసన కారులను అరెస్టు చేయడం రాజ్యాంగం కల్పించిన కనీస మానవ హక్కులను తొక్కి వేయడమే.

భీమా కోరేగాంవ్ నేపథ్యంలో అన్యాయంగా అరెస్టై, ఆరేడు నెలలుగా పూణేలో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ప్రజాకవులు, రచయితలు, మేధావులైన వరవరరావు, ప్రొ.సాయిబాబా తదితరుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ హనుమకొండ కాళోజీ విగ్రహం దగ్గర పదర్శనలో టీవీవీతో పాటు పాల్గొన్న సీఎమ్మెస్, టీపీఎఫ్, విరసం, హెచ్చారెఫ్, పీడీఎం తదితర ప్రజాసంఘాలకు చెందిన కార్యకర్తలను బెదిరించి, చెల్లాచెదురు చేసి, వాళ్ల చేతుల్లోంచి ప్లకార్డులను లాక్కొని వాళ్లను పోలీసు వాహనాల్లో కుక్కి సుబేదారి సీఐ సదయ్య, ఎస్సై దుర్గం మహేందర్ లు భీతావహ పరిస్థితిని సృష్టించడం అమానుషం. ప్రజాస్వామిక వ్యక్తీకరణయైన భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు తొక్కి వేయడం రాజ్యాంగ వ్యతిరేకం!

ప్రశ్నించే గొంతులైన వివి, సాయిబాబా తదితర మేధావులు, ప్రజాస్వామిక వాదుల అక్రమ నిర్బంధం నేపథ్యంలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్న దశలో పోలీసులు తమ నిరంకుశ చర్యలను మానుకోవాల్సింది పోయి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నెపంతో నిరసనకారులను నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘనే.

అరెస్టైన వారిలో టీవీవీ రాష్ట్ర కార్యదర్శి సందీప్, జిల్లా అధ్యక్షుడు గణేశ్, టీపీఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదావత్ రాజు, విరసం వరంగల్ జిల్లా కన్వీనర్ వీరబ్రహ్మాచారి, సీఎమ్మెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమ్య, ఉపాధ్యక్షురాలు జె.కళ, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అధ్యక్షుడు క్రాంతి, కార్యదర్శి సాయి తదితరులు ఉన్నారు.

అరెస్టైన నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని,

ప్రొ. సాయిబాబాతో పాటు భీమా కోరేగాంవ్ కేసులో అక్రమంగా నిర్బందించిన రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తున్నది.

--పాణి,
రాష్ట్ర కార్యదర్శి,
--బాసిత్,
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,
విప్లవ రచయితల సంఘం.

Keywords : varavararao, saibaba, maoists, tvv, virasam
(2019-05-22 02:54:26)No. of visitors : 158

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
more..


వరంగల్