బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....


బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....

బీజేపీ

(మితాలీ అగ్రవాల్ రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక మే 2019 సంచికలో ప్రచురించబడినది)

ప్రస్తుత లోకసభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారానికి రావచ్చునేమో అనే అనుమానమే భారత ప్రజానీకంలో అత్యధికులలో భయోత్పాతాన్ని కలిగిస్తున్నది. గత ఐదు సంవత్సరాల పాలనలో ముస్లింల మీద, దళితుల మీద పెచ్చరిల్లిన హింస, భిన్నాభిప్రాయాల మీద, పౌర హక్కుల మీద ఉక్కుపాదం, పెరిగిపోయిన నిరుద్యోగం, అతి తక్కువ ఆర్థికాభివృద్ధి, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు వగైరా పరిణామాలే ఈ భయానికి కారణం.

ఈ భయాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు రానున్న పాలనా కాలంలో తమ పార్టీ విధానాలు భారత ప్రజాస్వామ్యాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇటీవల కొన్ని సూచనలు వదులుతున్నారు. ఆ సూచనల ఆధారంగా, వారు తిరిగి అధికారంలోకి వస్తే ఏమి జరగనున్నదో ప్రధానమైన ఆరు పరిణామాలను ఇక్కడ పరిశీలిస్తున్నాం.

ఇక ఎన్నికలంటూ ఉండవు

మమ్మల్ని ముందుగా హెచ్చరించలేదు అని మీరు అనకుండా ఉండడానికి ఉన్నావ్‌ కు చెందిన భాజపా పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్‌ గత నెలలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి మోడీ తిరిగి ఎన్నికైతే భారత ప్రజాస్వామ్యంలో 2019 ఎన్నికలే ఆఖరి ఎన్నికలవుతాయని సగర్వంగా ప్రకటించాడు. తనను తాను సన్యాసిగా చెప్పుకునే ఆ కాషాయ దుస్తుల రాజకీయ నాయకుడు దేశంలో హిందువులలో జాగరణ వచ్చిందని అన్నాడు. ʹʹహిందూ జాగ్‌ గయా హై (హిందువులు మేల్కొన్నారు)ʹʹ అంటూ ʹʹఈ 2019 ఎన్నికల తర్వాత 2024లో ఎన్నికలనేవి ఉండవుʹʹ అని జోడించాడు.

ఇవేవో బుర్ర లేని వాగుడుకాయ మాటలు అని కొట్టేస్తారో ఏమో అని స్వయంగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా నే రంగంలోకి దిగి, వచ్చే యాబై ఏళ్ళ వరకూ భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంటుందని ప్రకటించాడు. ʹʹమేం ఐదేళ్ల కొరకో, పదేళ్ల కొరకో అధికారం లోకి రాలేదు. కనీసం యాబై ఏళ్ల కొరకు అధికారం లోకి వచ్చాం. అధికారం అనే సాధనం ద్వారా రానున్న 40-50 ఏళ్లలో దేశంలో ప్రధానమైన మార్పులు తీసుకురావాలనే నిబద్ధతతో మేం ముందుకు పోతున్నాంʹʹ అన్నాడు.

రాజ్యాంగానికి వీడ్కోలు

భారతీయ జనతా పార్టీకి చెందిన మహారాష్ట్ర మంత్రి, బీడ్‌ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి పంకజ్‌ ముండే ఈ వారం ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, ʹʹఇది జిల్లా పరిషత్‌ ఎన్నిక కాదు, లోకసభ ఎన్నిక. మహానుభావుడు డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారు. మనమిప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చవలసి ఉంది. కొన్ని కొత్త బిల్లులు తేవలసి ఉంది, కొన్ని మార్పులు తేవలసి ఉందిʹʹ అన్నారు.

ఆమె ఆ మాటలంటున్నప్పుడు ఆమె మనసులో ఉన్న మార్పులు ఏమై ఉంటాయా అని మీరు ఆలోచిస్తున్నట్టయితే, భాజపాకు సైద్ధాంతిక గురువు, మాతృమూర్తి, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌, భారతదేశాన్ని ʹహిందూ రాష్ట్రʹ గా మార్చదలచుకున్నదని గుర్తు ఉంచుకోండి. రాజ్యాంగ విలువల పట్ల వారి లెక్కలేనితనానికీ హిందూ జాతీయవాదం గురించి భాజపా చేసే గంభీర ప్రకటనలకూ పోలిక గుర్తించండి.

కేంద్ర ప్రభుత్వంలో నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే కూడ రాజ్యాంగం నుంచి ʹలౌకికʹ పదం తొలగించడం గురించి ఒక సూచన వదిలాడు. ʹʹరాజ్యాంగం లౌకిక రాజ్యం అంటున్నదనీ, అందువల్ల దాన్ని అంగీకరించక తప్పదనీ కొందరు అంటున్నారు. మేం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కాని రాజ్యాంగాన్ని ఇప్పటికే ఎన్నో సార్లు మార్చారు. భవిష్యత్తులో కూడ మారుస్తారు. మేం రాజ్యాంగాన్ని మార్చ డానికే ఉన్నాం. మేం తప్పనిసరిగా మారుస్తాంʹʹ అని ఆయన అన్నాడు.

మరొకసారి పెద్దనోట్ల రద్దు

ప్రధానమంత్రి మోడీ 2016 నవంబర్‌ 8న రు. 500, రు. 1000 నోట్లను రద్దు చేశాడు. ఆ చర్య వల్ల జరిగిన భయానక దుష్పరిణామాలలో ఒకానొకటిగా భారత ప్రజానీకం గంటలకొద్దీ బ్యాంకుల ముందరా, ఎటిఎంల ముందరా పడిగాపులు పడవలసి వచ్చింది. ఆ చర్య భారత దేశపు అసంఘటిత రంగ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందనీ, లక్షలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందనీ, దాదాపు 100 మంది మరణాలకు ప్రత్యక్షంగా దారి తీసిందనీ ఎన్నో నివేదికలు చెపుతున్నాయి.

నల్లధనం నిర్మూలించడానికి ఆ చర్య ఉపయోగపడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ చర్య తీసుకోవాలనే నిర్ణయం జరిగింది. నిజంగానే, రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పినట్టుగానే రద్దు చేసిన పెద్ద నోట్లలో 99.3 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయి.

అయినా ఆ విధానం విఫలమయిందని అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భాజపా అధినేత అమిత్‌ షా పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారం సాగించాడని, కమిషన్‌ మీద నల్లధనాన్ని మార్పిడి చేశారని, అందులో అత్యున్నత ప్రభుత్వాధికారులకు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

అసలు పెద్దనోట్ల రద్దు ఉద్దేశం ఏమిటి? ఎవరికీ తెలియదు. దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడానికే ఆ చర్య తీసుకున్నామని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు గత నెలలో మరొకసారి ప్రకటించాడు. ʹʹఈ పెద్దనోట్ల రద్దు అనేది నల్లధనాన్ని అదుపులో పెట్టడానికి తీసుకున్న చర్యల్లో ఒకటి. అటువంటి చర్య మరొకటి అవసరమా అనేది మీకు చెప్పదలచుకోలేదుʹʹ అని ఆయన అన్నాడు.

భారతీయ జనతా పార్టీ గనుక మళ్లీ అధికారానికి వచ్చి ఈ విధానాన్ని మరొకసారి అమలు జరిపితే, అది ఉత్పాతానికి దారి తీస్తుంది తప్ప ఆశ్చర్యమేమీ కాదు.

మళ్లీ బాల్య వివాహాలు

భారత సమాజంలోని దురాచారాలను పునరుద్ధరించాలనే తన కోరికను భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు వ్యక్తీకరించింది.

మధ్య ప్రదేశ్‌ లో 2018 ఎన్నికలకు ముందు శాసనసభ్యుడుగా ఉండిన భాజపా నాయకుడు గోపాల్‌ పర్మార్‌ బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి మాట్లాడుతూ అది ʹʹపద్దెనిమిదేళ్ల రోగంʹʹ అన్నాడు. అది లవ్‌ జిహాద్‌ కు దారి తీస్తుందన్నాడు. మతాచారాల కోసం బాలికల వ్యక్తిత్వాన్నీ ఆరోగ్యాన్నీ పణంగా పెట్టవచ్చునన్నాడు.

ʹʹపాతరోజుల్లో, కుటుంబ పెద్దలు తమ పిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్లు కుదిర్చేవారు. ఆ సంబంధాలు చిరకాలం స్థిరంగా ఉండేవిʹʹ అంటూ ఆయన, ʹʹఇప్పుడిక ప్రభుత్వం పద్దెనిమిదేళ్లు నిండాలనే రోగం మొదలు పెట్టింది గదా, ఎంతో మంది అమ్మాయిలు లవ్‌ జిహాద్‌ ప్రేమ మైకంలో పడి లేచిపోవడం మొదలుపెట్టారుʹʹ అని కలిపాడు.

ఆయన ఇప్పుడు శాసన నిర్మాణ అధికారంలో లేడు గాని, మరొక ఎన్నికైన భాజపా శాసన సభ్యురాలు, బాల్య వివాహాల మీద పోలీసులు ఏ చర్యా తీసుకోకుండా చూస్తాననే హామీ మీదనే గెలిచింది.

రాజస్తాన్‌ లోని పాలి నియోజకవర్గంలో పోటీ చేస్తూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా శోభా చౌహాన్‌, ʹʹమీ ప్రాంతంలో బాలికల వివాహాలు జరుగుతున్నప్పుడు పోలీసులు వస్తారు. పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు మన అదృష్టం కొద్దీ రాజకీయ, నిర్మాణ పరమైన అధికారం మన చేతుల్లోనే ఉంది. పోలీసుల అడ్డంకుల సంగతి నేను చూసుకుంటాను. ఒకవేళ అది నా పరిధికి మించిన పని అయితే పై వాళ్లతో కూడ మాట్లాడి ఏమీ జరగకుండా చూస్తాను. ఇక ముందు, బాల్య వివాహాలు జరిగితే మీ ఇంటికి పోలీసులు రారు. నా హామీ,ʹʹ అని అంది.

ఎన్నికల్లో ఆమె గెలిచింది. స్త్రీలూ, చిన్నారి ఆడపిల్లలూ ఓడిపోయారు.

పౌరులను బృందాలుగా విడగొట్టడం

భారత రాజ్యాంగం గురించి అద్భుతమైన విషయాలలో ఒకటేమిటంటే అది లింగ, భాష, కుల, మతాలకు అతీతంగా సమానత్వ హక్కుకు హామీ ఇస్తుంది. ఈ విభేదాల ఆధారంగా మనుషుల మధ్య వివక్ష చూపగూడదని రాజ్యంపై ఆంక్ష విధిస్తుంది. అయితే, ఈ రాజ్యాంగ లక్షణం భారతీయ జనతా పార్టీకి రుచిస్తున్నట్టు లేదు.

పిలిభిత్‌ లో ఒక సభలో ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి మనేకా గాంధీ, ముస్లింలు తనకు వోటు వేసినా వేయకపోయినా తాను గెలవబోతున్నానని ప్రకటించింది. ఒకవేళ వాళ్లు తనకు వోటు వేయకపోతే తాను వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వబోనని కూడ ఆమె కలిపింది. మోడీ ప్రభుత్వంలో ఏదో మిగిలినవాళ్లందరికీ ఉద్యోగాలు వచ్చినట్టు!!

మరొక సభలో ఆమె మరింత వివరంగా మాట్లాడుతూ, తాము భాజపాకు ఎంతమంది వోటు వేశారనే ప్రాతిపదికన గ్రామాలను ఎలా విభజించబోతున్నామో కూడ చెప్పింది. ఒక గ్రామంలో భాజపాకు 80 శాతం కన్న ఎక్కువ వోట్లు పడితే అది ఎ గ్రేడ్‌ గ్రామం. అరవై శాతం పడితే బి గ్రేడ్‌, యాబై శాతం పడితే సి గ్రేడ్‌, మిగిలినవన్నీ డి గ్రేడ్‌ గ్రామాలు.

ఈ లెక్క ప్రకారమే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేస్తామని కూడ ఆమె అన్నారు.

జాతిపర ప్రక్షాళన లేదా జాతి హననం

ఇదేదో ఊరికే చూపుతున్న బూచి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో పౌరసత్వ (సవరణ) బిల్లు 2016 ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అది ప్రాథమికంగా ముస్లింల పట్ల, ఇతర మతాల వారి పట్ల వివక్ష చూపే చట్టం. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చిన ʹʹచట్టవ్యతిరేక వలసదారులకుʹʹ వారు హిందూ, సిఖ్‌, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతస్తులైతే పౌరసత్వం కట్టబెట్టడానికి ఉద్దేశించిన చట్టం అది. అదృష్టవశాత్తూ ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న పౌరసత్వ చట్టం 1955 లోని ʹʹచట్టవ్యతిరేక వలసదారులుʹʹ అనే మాటకు నిర్వచనం, కొత్తగా భాజపా తేదలచుకున్న చట్టం లాగ ముస్లింలను మినహాయించలేదు.

అస్సాంలో అమలులోకి తెచ్చిన నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (ఎన్‌ ఆర్‌ సి) రూపొందిన తీరులోనే భాషా పరమైన, మత పరమైన, నరజాతి పరమైన వివక్ష చూపడానికి అవకాశం ఉందని ఇప్పటికే ఎందరో చూపారు. మొట్టమొదటి ఎన్‌ ఆర్‌ సి ముసాయిదాలో దాదాపు నలబై లక్షల మంది ప్రజల పేర్లు నమోదు చేయకుండా మినహాయించారు. వీరిలో అత్యధికులు అస్సాంలో తరతరాలుగా జీవిస్తున్నారు. కాని వారు 1971కి ముందు నుంచే అక్కడ నివసిస్తున్నారని రుజువు చేసుకునే అధికారిక పత్రాలు వారిదగ్గర లేవు.

ఇటువంటి నరజాతి పరమైన, మత పరమైన, భాషా పరమైన అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ఈ ప్రజల గురించి అమిత్‌ షా ʹʹచొరబాటుదారులుʹʹ, ʹʹచెదపురుగులుʹʹ అని వ్యాఖ్యానించాడు. ఈ మాటలు సరిగ్గా యూదుల గురించి అడాల్ఫ్‌ హిట్లర్‌ అన్న ʹʹబొద్దింకలుʹʹ అన్న మాటతో సమానంగా ఉండడం వల్ల అమిత్‌ షా హిట్లర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నాడని స్పష్టమవుతున్నది. ఇక హిట్లర్‌ మరొక అడుగు ముందుకు వేసి కనీసం అరవై లక్షల మంది యూదులను ఊచకోత కోసి, మరెంతో మందిని చంపిన యుద్ధం మొదలుపెట్టాడు.

తాము అధికారంలోకి తిరిగిరాగానే మొత్తం దేశంలో ఎన్‌ ఆర్‌ సి ని అమలులోకి తెస్తామని, తద్వారా మొత్తం దేశంలోనే బౌద్ధులు, హిందువులు, సిక్ఖులు తప్ప మిగిలిన ʹʹప్రతి ఒక్క వలసదారుʹʹనూ తొలగిస్తామని అమిత్‌ షా ఇటీవల అన్నాడు.

భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక కూడ దేశవ్యాప్త ఎన్‌ ఆర్‌ సి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అమిత్‌ షా మాటల్లో ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మత అల్ప సంఖ్యాక వర్గాలు అనే మాటలు వాడకుండా జాగ్రత్త పడ్డాడు. కాని ఆ మాటల అసలు అర్థం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మత ప్రాతిపదిక మీద వివక్ష పాటిస్తుందనే. రాజ్యాంగంలో లౌకిక వాదం ఉంది గనుక ఇటువంటి చర్యను రాజ్యాంగం ఆమోదించదని మీరనుకుంటే పైన చెప్పిన రాజ్యాంగాన్నే రద్దు చేసే ఆలోచన చూడండి. ఒకవేళ ఆ ప్రభుత్వం అలా చేస్తే దాన్ని తర్వాతి ఎన్నికల్లో ఓడించగలమని మీరు భ్రమ పడుతున్నట్టయితే, అసలు ఎన్నికలే ఉండవనే ఆలోచన చూడండి.

మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా విద్వేష పూరిత హింసా ఘటనలు ఈ పాలనలో విపరీతంగా పెరిగిపోయాయి. మత మైనారిటీల వీ ుద హింస అమలు చేసినవారిని, వేధించినవారిని ఈ రాజ్యం సత్కరించింది కూడ. ఈ ప్రభుత్వం హంతకులను ఎలా రక్షించిందో హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక విస్పష్టంగా తెలియజేసింది.

భారతీయ జనతా పార్టీ తన ఉద్దేశాలను చాల స్పష్టంగానే బయట పెట్టింది. మైనారిటీల హక్కులు రద్దు చేస్తామనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామనీ బెదిరించడం, వారి మీద హింస ప్రయోగించడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. మయన్మార్‌ లో రోహింగ్యాలు, జర్మనీలో, యూరప్‌ లోని ఇతర ప్రాంతాల్లో యూదులు, బోస్నియాలో ముస్లింలు, క్రోట్‌ లు, క్రోయేషియాలో సెర్బ్‌ లు, రువాండాలో టుట్సిలు మానవజాతి చరిత్రలోకెల్లా దారుణమైన హింసలు అనుభవించినవారే. ప్రపంచ పటం కూడ చూడనక్కరలేదు, మన దేశంలోనే ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నో మత కల్లోలాలను గుర్తు తెచ్చుకోవచ్చు.

భారత దేశపు మత మైనారిటీలకు ఎటువంటి బీభత్స ప్రమాదం రానున్నదో మీకింకా అర్థం కానట్టయితే, ఒక్క నిమిషం కోసం మీరు వారైనట్టుగా ఊహించుకోండి. మీ మొత్తం జీవితం, మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు అంతా కూడ కేవలం ఎప్పుడో యాబై అరవై ఏళ్ల కిందటి అధికారిక పత్రాలు చూపడం అనే సన్నని ఆధారం మీద ఆధారపడి ఉంటే, మీ వెన్నులో చలి పాకదా?
మితాలీ అగ్రవాల్
(రచయిత వెబ్‌ పత్రికలలో వార్తాకథనాలు, వ్యాసాలు రాస్తారు)
(newscentral24x7 సౌజన్యంతో)

Keywords : bjp, narendra modi, rss, sakshi maharaj, hindutva
(2020-01-15 04:18:29)No. of visitors : 344

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

ఈ అనంతపు గగ్గోలు ఎవరికోసం?

దారుణాన్ని దారుణం అన్నవాడిపైననే అన్యాయాన్ని అన్యాయం అన్నవాడిపైనన ఈయనగారి వ్యంగం. పావులాకు, బేడాకు ఆడవాళ్ల శరీరాలపై పచ్చబొట్ల పాటలు రాసేవారి నుండి శాంతిని, మానవతావాద స్పందనను ఆశించడం మన బుద్దితక్కువతనమే అవుతుందనకుంటా

రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ ....

Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?

Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....

మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్ మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్‌ స్ట్రోక్‌ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు.

A Close Encounter With A Modi-Bhakt

Yesterday I ran into an old classmate from school at our club, where I sought refuge from the traffic lockdown for the First Citizen. He is from a certain part of the country and is quite religious. And hence doubly supportive of Modi.

Search Engine

నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
more..


బీజేపీ