నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు


నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు

నిర్వాసితుల‌ను

మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులను పరామర్శించడానికి వెళ్ళిన పౌర హక్కుల సంఘం నాయకులను అరెస్టు చేసిన ప్ర‌భుత్వం మ‌రోమారు త‌న నియంతృత్వ స్వ‌భావాన్ని బ‌య‌ట‌పెట్టుకుంది. సిద్దిపేట జిల్లా తొగుట గ్రామంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటి, హైద్రాబాద్ జిల్లా కమిటీ, ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీల ఆధ్వ‌ర్యంలో 10 మంది బృందం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల‌ను క‌లిసేందుకు వెళ్లింది.

తొగుట గ్రామం 200 మంది రైతులతో మాట్లాడిన బృందం ఇతర గ్రామాలలో ప్రభుత్వం ఇస్తున్న భూముల నష్టపరిహారం మరియు 2013 భూసేకరణ అమలుజరగపోవడం లాంటి విషయాలు తెలుసుకోవాల‌నుకుంది. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులను పరామర్శించడానికి వెళ్ళిన బృందంలో హైదరాబాద్ హైకోర్టు లో ఈ నిర్వాసిత రైతులకు నష్ట పరిహారం అమలు విషయమై పిటిషనర్ గా ఉన్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తో పాటు, పౌర హక్కుల సంఘం రాష్ట్రఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ (హైకోర్టు అడ్వకేటు), రాష్ట్రప్రధాన కార్యదర్శి N నారాయణ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్రా పురుషోత్తం, మెదక్ జిల్లా అధ్యక్షులు భూపతి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా ప్రదాన కార్యదర్శి ఇస్మాయిల్, ఇంజినీర్ దొంతుల లక్ష్మీనారాయణ ఉన్నారు.

మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలోసిద్దిపేట జిల్లా పోలీసులు, ఈ ప్రాంతంలో 30 ఆక్ట్ ఉన్నదంటు, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంకా గ్రామాల్లో పౌర హక్కుల సంఘం నిజానిర్దారణ చేయకుండా, తెలంగాణ ప్రభుత్వం రైతులను బెదిరించి, బలవంతంగా చేస్తున్నా భూసేకరణ విషయం హైకోర్టు లో ఆర్గుమెంట్స్ చేయకుండా ఉండడానికి, గత కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మీడియాలో రైతులకు మంచి నష్ట పరిహారం ఇస్తున్నామంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం బయట సమాజానికి స్పష్టంగా తెలువకుండా ఉండడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు పౌరహక్కుల సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి దౌలతాబాదు పోలీసు స్టేషన్లో సాయంత్రం 4 గంటల వరకు నిర్బంధించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను, భావ ప్రకటన స్వేచ్ఛను, పౌర ప్రజాస్వామిక హక్కులను హక్కులను కెసిఆర్ ప్రభుత్వం పోలీసులతో తీవ్రంగా అణచి వేస్తుంది. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను మానుకోవాలని చట్టబద్ధ పాలనను, రాజ్యాంగంలో పొందుపరచిన చట్టాలను గౌరవించి పరిపాలన సాగించాలని పౌర, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ దిశలో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంది.

ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షులు పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం.
ఎన్. నారాయణ రావు ప్రధాన కార్యదర్శి పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం
మాదన కుమారస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం.

Keywords : clc, mallanna sagar
(2019-05-22 02:22:19)No. of visitors : 194

Suggested Posts


ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

గడ్చిరోలి,తూతుకుడి మారణకాండ కు వ్యతిరేకంగా 9న సభ‌

ఆదివాసులను,ఉద్యమకారులను పేసా చట్టం,అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని ఉద్యమిస్తున్న వారిని మహారాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది.బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయ్యి వేదాంత స్టెరిలైట్ కంపెనీ స్థాపించి రెండు దశాబ్దాలుగా అక్కడి ప్రజల జీవించే హక్కును

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం

కోరాపుట్ కు 24 కిలోమీటర్ల దూరంలో సునాబేడ వద్ద మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లతో దాదాపు వంద మంది రోడ్డుకు అడ్డుగా నిలబడ్డారు. వారితోపాటు డ్రస్సులో కొందరు , సివిల్ డ్రస్సులో కొందరు పోలీసులు నిలబడి ఉన్నారు.

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
more..


నిర్వాసితుల‌ను