సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్


సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్

సాయిబాబా

ʹ I want to become a Maoistʹ అని స్టేట్ మెంట్ ఇచ్చాడు ఈ దేశ మాజీ ప్రధాని వి.పి.సింగ్ గారు..! ఒరిస్సా లోని కళింగా నగర్ లో భూసేకరణ కు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న పోరాటాన్ని చూసి, ప్రస్తుత ఈ పరిస్థితి చూస్తుంటే నక్సలైట్ కావాలని ఉంది అని అన్నాడు...

ఈ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి !నందమూరి తారకరామారావు కూడా నక్సలైట్లే దేశ భక్తులు అని మాట్లాడిండు. (తర్వాత ఆయన నక్సలైట్లని అణచివేసిండనుకొండి అది వేరే విషయం).

మేము అధికారంలోకి వస్తే నక్సలైట్ ఏజండానే అమలు చేస్తామని చెప్పాడు ఈ రాష్టాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు.

పై ముగ్గురూ నక్సలైట్లకు అనుకూలంగా లేదా వారికి భావజాలానికి మద్దతుగా మాట్లాడినప్పుడు ఏ సంఘం కానీ, ఏ వ్యక్తి కానీ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.

కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి, దళితుల గురించి, ఆదివాసుల గురించి, అడవి గురించి మాట్లాడుతున్నందుకు ఈ దేశంలోని మేధావులు, కవులు, రచయితలపై ʹ అర్బన్ నక్సలైట్ʹ అనే ముద్రవేసి కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధిస్తున్నారు.

పై వర్గాల కోసం మాట్లాడినందుకు నిన్నా మొన్న సాయిబాబా, రోనా విల్సన్, సుధా భరద్వాజ్, వరవరరావు తదితరులను అక్రమంగా అరెస్టు చేసిన పాలక వర్గం ఇవాళ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి పై దాడిచేయడానికి కాచుకొని కూచుంది.

అయితే రాజ్యం తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను తన బలమైన అంగాలను ఉపయోగించి డైరెక్టుగా నిర్భందంలోకి తీసుకుంటే, కొంతమంది మేధావులను, ప్రజల్లో నిత్య సంబంధాలు ఉన్న వ్యక్తులను మాత్రం ఎవరో ఇచ్చిన ఆరోపణలను, కల్పిత కథలను ఆధారం చేసుకుని వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది.

మొన్న సాయిబాబా విషయంలో, ఆ తర్వాత JNU విషయంలో, నిన్నటి భీమా కోరేగావ్ విషయంలో నేటి శాతవాహన యూనివర్సిటీ విషయంలో జరుగుతున్నది ఒకటే కథ.. అదే స్క్రీన్ ప్లే..అదే దర్శకత్వం. అందులో పాత్రాదారులు మారుతున్నారేమో కానీ కథలన్నీ హక్కుల కార్యకర్తల చుట్టే తిరుగుతున్నాయి..!

అయితే ఏ హక్కుల కార్యకర్తల నిర్బంధం వెనుకైనా ఉండేది ముగ్గురే ముగ్గురు. ఒకటి పోలీసు వ్యవస్థ. రెండవది మీడియా.. మూడవది ఏబీవీపీ లాంటి ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు మాత్రమే (మన రాష్ట్ర అనుభవం కాస్త భిన్నం ఇక్కడ నయీం ముఠాలు, కోబ్రాలు అంటూ కొన్ని ప్రత్యేక ముఠాలు ఉన్నాయి)..

మీరు గమనించారో లేదో ఈ మధ్య అర్బన్ మావోయిస్టులు లేదా యాంటీ నేషనల్స్ పేరిట మేధావులు, హక్కుల కార్యకర్తలు, రచయితలు అరెస్ట్ కావడానికి పథ‌క రచన చేసింది.. అసత్య ఆరోపణలు చేసి పోలీసులకు కావాల్సిన భూమికను క్రియేట్ చేసింది మీడియా, ఏబీవీపీ లు మాత్రమే.

JNU లో దేశ ద్రోహం ఆరోపణల వెనుక ఏబీవీపీ ఉంటే బీమాకోరేగావ్ అరెస్టుల వెనుక ఆర్నాబ్ గోస్వామి నడుపుతున్న రిపబ్లికన్ ఛానల్ కీలకంగా పనిచేసింది...

ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడుగా ఉంటూ అదే యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో నివసిస్తున్న ప్రొ.సాయిబాబా ఇంటిపై రాళ్లతో దాడి చేసి యూనివర్సిటీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఇల్లు కాళీ చేసేలా చేసింది కూడా ఏబీవీపీ విద్యార్థి సంఘమే. ఇప్పుడు ఆ సంఘం ప్రొ. సూరేపల్లి సుజాత పై దృష్టి సారించినట్లు గత కొంతకాలంగా తెలుస్తూనే ఉంది.

కారణం లేకపోలేదు.. ప్రొ. సూరేపల్లి సుజాత గారు గత కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గాలకు, మతోన్మాదులకు కంటిమీద నిద్రపోకుండా చేస్తుంది కాబట్టి. అభివృద్ధి పేరిట ఆదివాసులని నిర్వాసితులను చేస్తున్నా, ఓపెన్ కాస్ట్ పేరిట గుట్టలను తొలగిస్తున్నా, కుల గౌరవం పేరిట దళితులపై దాడులు చేస్తున్నా, మత ఉన్మాదం పేరిట మైనారిటీలను ఊచకోత కోస్తున్నా బాధితులకు అండగా నిలబడే వ్యక్తుల్లో ముందువరుసల్లో ఉండే వ్యక్తి ప్రొ. సూరేపల్లి సుజాత గారు. నాకు తెలిసి, బాలగోపాల్ మరణం తర్వాత బాధితుల పట్ల ఇంతలా కన్సర్న్ ఉండే వ్యక్తి ఈ తరంలో సుజాత గారే కనిపిస్తారు..అందుకే కాబోలు గద్దర్ గారు ఆమెకు ʹగుట్టలక్కʹఅని పేరు పెట్టారు.

చాలా సార్లు అనుకునే వాళ్ళం అసలు ఈమెకు అలుపన్నది రాదా..ఉదయం కాలేజీలో కనిపిస్తే సాయంత్రం అయ్యే సరికి ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో బాధితుల కుటుంబాల దగ్గర కనిపిస్తుందని..అలా కనిపించడమే కాదు అవకాశం దొరికినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలెక్కి పీడిత వర్గాల తరపున తన గొంతును వినిపిస్తుంది.! అందుకే ఆమె అంటే అటు పాలక వర్గాలకు, ఇటు మతోన్మాద విద్యార్థులకు వ్యతిరేకత.

పై రెండు వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న ఆమెను అడ్డు తొలగించు కునేందుకే, అసత్య ప్రచారాలు చేస్తూ యూనివర్సిటీ లో తెలంగాణ విద్యార్థి వేదిక (TVV) లాంటి సంఘాలను ప్రోత్సహిస్తూ, నక్సలైట్లలో క్యాడర్ ను నింపే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.. దీని ద్వారా ఆ వర్గాలకు రెండు లాభాలున్నాయి ఒకటి ఆమె అడ్డును తొలగించుకోవడం అయితే రెండవది విద్యార్థుల్లో ఆ సంఘం పట్ల వ్యతిరేక భావాజాలాన్ని నింపడం. అందుకే ʹఒక రాయికి రెండు పిట్టలు అన్నట్లుʹ ఒక అసత్య ఆరోపణకు తెర లేపారు.

దేశ చరిత్రలో ఏబీవీపీ దాని మాతృ సంస్థఅయిన అరెస్సెస్ వంటివి ఎంతో మంది మీదా ఇలాంటి ఆరోపణలు చేసి భౌతిక దాడులకు దిగినా అసత్యాన్ని సత్యంగా నిరూపించలేకపోయారు కానీ సమాజంలో గందరగోళం సృష్టించడంలో, ఒక వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవడంలో మాత్రం విజయం సాధించారు.

ప్రజాస్వామిక వాదులుగా మనం ముందే ఈ కుట్రలను పసిగట్టగలిగితే మన కళ్లముందున్న పిడికెడు మంది బుద్ధిజీవులను రక్షించుకోవచ్చు.

-ఎస్.ఏ. డేవిడ్

Keywords : surepally sujatha, gn saibaba, maoists, naxals, TVV, abvp
(2019-07-15 00:20:33)No. of visitors : 568

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
పోడు భూముల సమస్య శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు...టీడీఎఫ్
ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత
మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్
more..


సాయిబాబా