ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం


ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం

ప్రొ.సుజాత

ఫాసిస్టు మూకలు ప్రగతిశీల విద్యార్థి రాజకీయాలపై, ప్రొఫెసర్లపై దాడి చేయడం కొత్త కాదు. ప్రొఫెసర్ సాయిబాబాపై కుట్ర చేసి, తప్పుడు కేసులు మీద జీవితఖైదు విధించి నాగపూర్ జైల్లో చిత్రహింసలపాలు జేస్తూ, ఆయన్ని నిశ్శబ్దంగా హత్య చేస్తున్నారు. హెచ్.సి.యూ. నుండి జె.ఎన్.యూ. దాకా విశ్వవిద్యాలయాల్లో సంఘపరివార్ కు చెందిన వి.సి.లను నియమిస్తూ, విద్యార్థి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి వాటిని పోలీసు క్యాంపులుగా మార్చి ఆరోగ్యకరమైన చర్చ, భావ సంఘర్షణ లేని అజ్ఞాన కేంద్రాలుగా తయారుచేస్తున్నారు. ఫాసిస్టులకు జ్ఞానం అంటే భయం. ప్రశ్న అంటే భయం. ఎంత మూర్ఖత్వం వ్యాపింపజేస్తే వాళ్ళ రాజకీయాలకు అంత భరోసా. అందుకు వాళ్ళు యూనివర్సిటీలను లక్ష్యం చేసుకున్నారు.
శాతావాహనా యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై, తెలంగాణ విద్యార్థి వేదికపై ఎబివిపి ప్రచారం ఈ కుట్రలో భాగం. ఇందులో పోలీసులు, ఫాసిస్టు మోడీకి తొత్తు కేసీఆర్ కూడా భాగమే. ఉంటే ఎబివిపి వంటి పాలకవర్గ ఏజెంట్లు, ఆర్.ఎస్.ఎస్. భావజాలాన్ని నెత్తిన మోస్తున్న ప్రొఫెసర్లు మాత్రమే యూనివర్సిటీల్లో ఉండాలి. వేరే ఏ భావాలూ వికసించకూడదు. ఏ ప్రశ్నలూ తలెత్తకూడదు. ఇట్లా ఉంటేనే ఉన్నత విద్యను సులభంగా కార్పొరేట్లకు అమ్ముకోవచ్చు. వెన్నెముక లేని మేధావులను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇదీ వాళ్ళ ఆలోచన. ఈ దుర్మార్గమైన కుట్రను నిరసిస్తున్నాం. ప్రొ.సుజాత గారికి, తెలంగాణ విద్యార్థి వేదికకు సంఘీభావం ప్రకటిస్తున్నాం.
-విప్లవ రచయితల సంఘం

Keywords : virasam, TVV, sujatha surepally, rss, abvp
(2019-07-15 23:17:36)



No. of visitors : 633

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
పోడు భూముల సమస్య శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు...టీడీఎఫ్
ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత
మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్
more..


ప్రొ.సుజాత