ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ


ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ

ʹవీరన్న

ఉదయించిన సూర్యుడు అస్తమించకమానడు.. మరణించిన వీరుడు ఏదో ఒక రూపంలో తన ఉషోదయ వెలుగుల్ని ప్రసరించక మానడు అనే అక్షర సత్య ప్రతిరూపం మారోజు వీరన్న... ఇవాళ (మే 16) వీరన్న అమరుడైన రోజు.

నేడు జరుగుతున్న దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటంలో, దోపిడీ, పీడన, అసమానతల రద్దుకై జరుగుతున్న విప్లవ సాయుధ మార్గంలో, ప్రజాస్వామిక పోరులో, విద్యార్థి ఉద్యమాల పోరాటపథంలో మారోజు నిత్య ఉషోదయ క్రాంతి.

సాయుధ పోరాట కుటుంబంలో సూరమ్మ, రామలింగం ఆశల ప్రతిరూపంగా మారోజు వీరన్న నల్గొండ జిల్లా తుంగతుర్తి తాలూకు కర్విరాల కొత్తగూడెంలో 1962 జనవరి 01న జన్మించాడు. సూరమ్మ రామలింగంలది కులాంతర ఆదర్శ వివాహం. విప్లవ భావాలు గల కుటుంబంలో జన్మించినందున వీరన్నలో శాస్త్రీయ దృక్పథం, దృక్కోణం చిన్నప్పటి నుంచే అలవాటు అయ్యింది. తన స్కూల్ విద్య సమయంలో వేసిన చిరుతల రామాయణం నాటికలో పరాక్రమంతో వాలిని చంపిన రాముడు దేవుడా ? అనుమానంతో సీతని అడవికి పంపిన రాముడు దేవుడేలా అయ్యాడు అని ప్రశ్నించేవాడు

తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న వివక్షత, దోపిడీ, అసమానతలు మెల్లగా మెల్లగా అర్డంచేసుకుంటు అన్వేషిస్తూ తన 14వ ఏటానే "ఊరు తిరగబడింది "అనే కథను రాసాడు. కథ వాస్తవికతకు అద్దంపట్టింది. ప్రజలంత దాన్ని ఆదరించారు. స్కూల్ విద్య మొత్తం తుంగతుర్తిలో చదువుకొని ఇంటర్ ఫస్టియర్ సూర్యాపేటలో చదివి ద్వితీయ.. సెకెండ్ ఇయర్‌కి హైదరాబాద్‌కి చేరాడు. ఇంటర్ విద్య తరువాత ఇంజనీరింగ్ సీట్ కోసం పరీక్ష రాసినా.. ఆ సీట్ రాకపోవడంతో BSc కోసం సైఫాబాద్ కాలేజ్‌లో చేరాడు.

అక్కడి విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న PDSU సంఘంలో చేరి క్రియాశీలక భూమిక పోషిస్తూ అనతికాలంలోనే PDSU అగ్రనేతగా ఎదిగాడు. ఆ క్రమంలోనే విద్యార్థి నాయకుడిగా ఉంటూ చంద్రపుల్లారెడ్డి గ్రూప్ రాజకీయలను విశ్లేషించేవాడు. సమాజ సమకాలీన భౌతిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై సమావేశలు, సదస్సులు, సెమినార్లు విస్తృతంగా నిర్వహించేవాడు. తద్వారా సైన్స్ విద్యార్థులకి అవగాహన ఆసక్తి కల్గించేవాడు.

ఆ తర్వాత PDSU రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మండల్ కమిషన్‌కి విధానాలను ప్రోత్సహిస్తూ ఉద్యమాన్ని నడిపారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ విద్యార్థుల హాస్టల్ సమస్యలపై పోరాటం చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 12 డెంటల్, 8 మెడికల్ కాలేజీలు 5లక్షల వరకు క్యాపిటెయిన్ ఫిజు పేరుతో వసూలు చేసుకోడానికి అనుమతిఇచ్చాడు. ఈ అనుమతి రద్దు జరిగేంత వరకు పోరాడి విజయం సాధించాడు.

మరో వైపు జాతీయ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాలను నిశితంగా పరిశీలిస్తూ అధ్యయనం చేయసాగాడు. ఇంకా విప్లవ విజయవంతంకై నూతన మార్గాలు అన్వేషించేవాడు. ఇంకో వైపు తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరి పోరాటం వీరన్నపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఉద్యామాల ప్రభావంతో తనదైన పొరుబాటను నిర్మించుకున్నాడు.

విద్యార్థులు రాజకీయలకు దూరంగా ఉంటే ప్రమాదమని భావించి సంఘం పూర్తికాల కార్యకర్తగా మారాడు. ఆ కాలంలోనే జరిగిన కారంచేడు, చుండూరు సంఘటనలతో చలించిపోయాడు.. రగిలిపోయాడు. అప్పటి నుంచి వీరన్నలో సామాజిక జ్వాలలు కొత్త తీరాలు చేరింది సాటి దళితులపై దౌర్జన్యం రాక్షసత్వమని అన్నాడు. దళిత మహాసభ ఉద్యమాల్లో భాగస్వామి అయ్యాడు. PDSUని కూడా బాగస్వామిగా చేసాడు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు బలపరచాలని అంబేత్కర్ రచనలను పాఠ్యాంశంలో చేర్చాలని PDSU తరపున నినదించాడు.

ప్రతిభ ఆధారంగా ఉత్తీర్ణత కావాలనే అగ్రకుల డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలోనే "ప్రతిభ యాడ పుట్టిందిరో - ప్రతిభ ఎవడి సొత్తురోʹʹ .. ఉత్పత్తి కులాల పని ప్రావీణ్యంలో ప్రతిభ కనబడలేదరో అంటూ గానం చేసాడు

1992 బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన తరువాత వీరన్న ఆలోచనలో స్పష్టత వచ్చింది. దళితులపై, అణగారిన వర్గాలపై దాడులు అగ్రవర్ణ ఆధిపత్య ఫ్యూడల్ సంస్కృతి ఆలోచన విధానమే అని వీరన్న భావించాడు. పీడిత వర్గ కులాలు ఐక్యం కాకుండా భారతదేశంలో నిచ్చెన మెట్ల ఆధిపత్య కుల వ్యవస్థను మాపలేమని.. అలా జరగకపోతే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఆశించలేమంటూ నినదించాడు. ప్రతీ కులానికి ఒక కుల సంఘం ఏర్పడి అందరూ ఏకమవ్వాలని.. కుల సంఘాల ద్వారా ఆత్మగౌరవ, అస్థిత్వ పోరాటాలు చెయ్యాలంటూ అనేక సంఘాలు ఏర్పాటు చేశాడు. మాదిగ దండోరా, లంబాడీ నగారా భేరి, ఆదివాసీ తుడుందెబ్బ , గొల్ల కురుమ డొలుదెబ్బ, కమ్మరోళ్ల సుత్తిదెబ్బ అంటూ కులసంఘాలు ఏర్పాటు చేశాడు.

భారతదేశంలో విప్లవం విజయవంతం కాకపోవడానికి కారణం ప్రపంచ దేశాలల్లో ఎక్కడా లేని కులమని వీరన్న నిర్దారించాడు. కులవర్గ జమిలి పోరాటాలు చెయ్యకుండా.. కులేతర ఒంటరి వర్గ పోరాటాలు ఒంటిచేతి చప్పట్లేనని.. కులవర్గ జంట పోరాటాలు జంటచేతి చప్పట్లని ఆనాడే అన్నాడు.

కులవర్గ జమిలి పోరుబాటే ఇండియా విప్లవ బాట అన్నాడు. కులవర్గ వ్యవస్థలున్న భారతదేశంలో వర్గ పోరాటాలతో పాటు కుల పోరాటాలు చేపట్టాలనే డిమాండ్‌ను పార్టీలో చేర్చాడు. దానిపై లోతైన విశ్లేషణ జరుగుతున్న సమయంలోనే డఫోడం(దళిత మైనారిటీ ప్రజాస్వామిక వేదిక - డఫోడం) ఏర్పాడు చేశాడు. అదే జనశక్తి పార్టీలో చీలిక కు కారణమైంది. కులంపై పార్టీలో చర్చలు జరగాలని ఆశించాడు. కాని ఎలాంటి ఫలవంతమైన చర్చ జరగకపోవడంతో నిరాశ చెందాడు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకై తెలంగాణ మహాసభను ఏర్పాటు చేశాడు. పల్లెపల్లెన తిరిగి మహాసభ సమావేశలు నిర్వహించి కమిటీలను ఏర్పాటు చేశాడు. మరోవైపు దళిత, ఆదివాసీ, మైనార్టీలతో డఫోడం ఏర్పాటు చేశాడు. మార్క్స్‌కి అంబెడ్కర్, పూలేని జోడించి దళిత కార్మిక సంఘం ఏర్పాటు చేశాడు.

భారతదేశంలో విప్లవ ఆకాంక్ష కావాలంటే ఏం చెయ్యాలంటూ.. అస్తిత్వ ఉద్యమలకి దీక్షుచిగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సాయుధ ఆధ్యుడుగా.. మొట్ట మొదటిసారిగా కులవర్గ జమిలి పోరాటాల సిద్ధాంతకర్తగా ఉన్నాడు. మార్క్స్, పూలే-అంబేత్కర్‌ల అధ్యయనశీలిగా, నూతన మార్గ అన్వేషణశీలిగా.. ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేఖ నిర్ణయలను తిప్పికొల్టి ఆధిపత్య అగ్రవర్ణ వ్యవస్థలపై సబ్బండ వర్గాలను ఐక్యం చేసిన పోరాట ధీశాలి మారోజు వీరన్న.

ఆధిపత్యం ధిక్కారాన్ని అస్సలు సహించదు.
ప్రశ్నించే గొంతులను నొక్కడం రాజ్య స్వభావం.
బిగిసిన పిడికిళ్లును పాలక వర్గాలు అణచివేస్తూనే ఉంటాయి.

అందుకే ఆధిపత్యాన్ని ప్రశ్నించి.. పిడికిలి ఎత్తిన మారోజును చంద్రబాబు ప్రభుత్వం అత్యంత కిరాతకంగా హత్య చేసింది. 16 మే 1999న హైదరాబాద్ ఆటోలో ప్రయాణిస్తున్న అతడిని చంద్రబాబు కిరాయి గూండాలు ఎత్తుకొని పోయి హత్య చేశారు. దాన్నే ఆనాటి ప్రభుత్వం కరీంనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడనే అబద్దపు, బూటకపు కథను అల్లారు.

భౌతికంగా వీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడు.

మారోజు వీరన్న వర్థంతి (మే 16)

- జీవీఎం. విఠల్

Keywords : మారోజు వీరన్న, దళితుడు, పీడీఎస్‌యూ, చంద్రబాబు, Maroju Veeranna,PDSU, Death anniversary
(2019-05-22 00:27:58)No. of visitors : 478

Suggested Posts


0 results

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
more..


ʹవీరన్న